కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహించేందుకు పాకిస్థాన్ చేస్తోన్న ప్రయత్నాలను అడ్డుకునేందుకు భారత సైన్యం ఆపరేషన్ సర్వశక్తి
(operation sarvasakthi) ప్రారంభించింది. రాజౌరీ పూంఛ్ సెక్టార్లో ఇటీవల ఉగ్ర కార్యకలాపాలు పెరిగాయి. పాక్ నుంచి అందుతోన్న అండతో ఉగ్రమూకలు రెచ్చిపోతున్నాయి. ఇటీవల సైన్యం జరిపిన దాడుల్లో 20 ఉగ్ర ముఠాలు హతమయ్యాయి.
ఉగ్రమూలాలను పెకిలించేందుకు ఆపరేషన్ సర్వశక్తి ప్రారంభిస్తున్నట్లు కేంద్ర రక్షణ శాఖ ప్రకటించింది. ఇందులో అన్ని భద్రతాదళాలను భాగస్వామ్యం చేస్తారు. సంయుక్తంగా గాలింపు చేపడతారు. జమ్ము కశ్మీర్ పోలీసులతోపాటు, సీఆర్పీఎఫ్, స్పెషల్ ఆపరేషన్ ఫోర్స్, ఇంటెలిజెన్స్ సంస్థల వారి సహకారం కూడా తీసుకుంటారు.
కుప్వారా జిల్లాలోని మాఛిల్ సెక్టారు ప్రాంతాలను ఉత్తర ఆర్మీ కమాండర్ లెప్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది పరిశీలించారు. భద్రతా దళాలకు పలు సూచనలు చేశారు.