తమది
భౌగోళికంగా చిన్న దేశమైనంత మాత్రానా బెదిరించడం
సరికాదని
మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు అన్నారు. తమపై పెత్తనం చెలాయించే హక్కు
ఎవరికీ లేదన్నారు. చైనాలో ఐదురోజుల పర్యటన తర్వాత స్వదేశానికి వెళ్ళిన ముయిజ్జు,
తమది స్వతంత్ర సార్వభౌమ దేశమనే విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలన్నారు. నేరుగా ఏ
దేశం పేరు ప్రస్తావించకుండానే ఆయన వాఖ్యలు చేశారు.
సముద్రంలో
తమకు 9 లక్షల చదరపు కిలోమీటర్ల ప్రత్యేక ఆర్థిక మండలి ఉందన్నారు. మహా సముద్రం దాని
చుట్టూ ఉన్న దేశాలన్నింటిదన్నారు. తాము ఎవరి పెరుడులోనూ ి లేమని స్పష్టం చేశారు.
భారత్
తో వివాదం వేళ మాల్దీవుల రాజధాని మాలె మేయర్ ఎన్నికల్లో ఆయన పార్టీ పరాజయం
పాలైంది. పీపుల్స్ నేషనల్, కాంగ్రెస్ పై
భారత అనుకూల పార్టీ అయిన మాల్దీవిన్ డెమోక్రటికి పార్టీ నెగ్గింది.
లక్షద్వీప్
లో పర్యాటరంగం అభివృద్ధికి ప్రధాని మోదీ చేపట్టిన చర్యలను తక్కువ చేస్తూ ముయిజ్జు
ప్రభుత్వంలోని కొందరు మంత్రులు మాట్లాడారు. అనంతరం వారిని ఆ దేశ ప్రభుత్వం
సస్పెండ్ చేసింది. ప్రధాని మోదీపై మాల్దీవుల మంత్రులు నోరుజారడంపై నెటిజన్లు
ఆగ్రహం వ్యక్తం చేశారు. మాల్దీవుల పర్యటనలు రద్దు చేసుకున్నారు.