కీలక రవాణా మార్గంలో హౌతీలు అడ్డంకులు సృష్టిస్తే దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోతున్నాయిని ఇంగ్లాండ్ విదేశాంగ మంత్రి డేవిడ్ కామెరూన్ ఆందోళన వ్యక్తం చేశారు. హౌతీలను పలుమార్లు (houti rebels) హెచ్చరించినా ఫలితం లేకుండాపోయిందని, అందుకే అమెరికాతో కలసి దాడులు చేయాల్సి వచ్చిందన్నారు. ప్రపంచ స్వేచ్ఛాయుత సముద్రమార్గాన్ని రక్షించేందుకే అమెరికాతో కలసి దాడులు చేసినట్లు కామెరూన్ చెప్పారు.
హౌతీలు ఇప్పటికైనా వారి తీరు మార్చుకోకుంటే మరిన్ని దాడుల చవిచూడాల్సి ఉంటుందని కామెరూన్ హెచ్చరించారు. కేవలం మాటల్లోనే కాదు చేతల్లో కూడా చూపుతామన్నారు. మిత్ర దేశాలతో చర్చలు సాగిస్తున్నామని, రవాణా నౌకలను అడ్డుకుంటే ప్రతిదాడులు తప్పదని హెచ్చరించారు. హమాస్‌కు మద్దతుగా దాడులు చేస్తున్నామని హౌతీలు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సంకీర్ణ దళాలతో కలసి హౌతీల శక్తి సామర్థ్యాలను అణచివేస్తామని కామెరూన్ తెలిపారు.
జగన్‌రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు