A massive fire broke out in forest
జమ్ము-కశ్మీర్
పరిధిలోని అటవీప్రాంతంలో ఎగసిపడిన మంటలను భారత ఆర్మీ చాకచక్యంగా అదుపు చేసింది.
పూంచ్ జిల్లా పరిధిలోని అటవీప్రాంతంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. కొద్ది
సమయంలోనే చుట్టుపక్కల ప్రాంతానికి వ్యాపించాయి.
సమాచారం అందిన వెంటనే సంఘటనా
స్థలానికి చేరుకున్న భద్రతా సిబ్బంది స్థానికులతో కలిసి సహాయ చర్యలు చేపట్టారు.
మంటలు ఇతరప్రాంతాలకు వ్యాప్తి చెందకుండా అదుపు చేశారు. స్థానికులను అక్కడ నుంచి
బయటకు చేరవేసి ప్రాణనష్టం జరగకుండా చూశారు.
పూంచ్
జిల్లా పరిధిలోని డేరా కి గాలి అటవీప్రాంతంలో సంభవించిన అగ్నిప్రమాదాన్ని అదుపు
చేయడంలో భారత రక్షణ సిబ్బంది వేగంగా స్పందించారని, మంటల నుంచి స్థానికులను
కాపాడటంతో పాటు ప్రమాదతీవ్రత పెరగకుండా చేపట్టిన చర్యలు సఫలమైనట్లు ఆర్మీ సోషల్
మీడియా వేదికగా వెల్లడించింది.
గత
ఏడాది డిసెంబర్ లో కూడా హిమాచల్ ప్రదేశ్, పత్లికుహాల్ అటవీప్రాంతంలో కూడా అగ్నిప్రమాదం
సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడటంతో కోట్ల రూపాయల అటవీ సంపద బూడిదపాలు
అయింది. పెద్ద ఎత్తున ఎగసిపడిన అగ్ని జ్వాలలు అటవీప్రాంతాన్ని కాల్చి వేశాయి.