గవర్నర్ నుంచి ముందస్తు అనుమతులు పొందకుండా అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఏ నిబంధన ఉల్లంఘిస్తూ స్కిల్ కేసులో మాజీ సీఎం చంద్రబాబును అరెస్ట్ చేయడంపై సుప్రీంలో దాఖలైన పిటీషన్‌పై తీర్పు సిద్దమైంది. చంద్రబాబు (nara chandrababu naidu skill case) తరపు న్యాయవాదులు వేసిన క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీర్పును సిద్దం చేసింది. జనవరి 16న తీర్పు వెలువడనుంది. విచారణ అక్టోబరు 17న పూర్తైనా తీర్పును రిజర్వు చేశారు.
పైబర్ నెట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్, స్కిల్ కేసులో చంద్రబాబుకు హైకోర్టు బెయిల్ ఇవ్వడంపై హైకోర్టు తీర్పును ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈ కేసు జనవరి 17, 18వ తేదీల్లో విచారణకు రానుంది. అయితే ఆ కేసు విచారణకు ముందే చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై తీర్పు వెలువడనుందనే విషయం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.