British envoy to Islamabad to POK
పాక్
ఆక్రమిత కశ్మీర్ లో పాకిస్తాన్ లోని
బ్రిటన్ హైకమిషనర్ జానె మారియట్ పర్యటించడంపై భారత విదేశాంగశాఖ అభ్యంతరం తెలిపింది.
ఈ చర్య ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదని తేల్చి చెప్పింది.
భారత
సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రతను ఉల్లంఘించే చర్యలు ఏ మాత్రం సరికాదని తెలిపింది.
ఇదే విషయాన్ని
భారత్
లోని బ్రిటీష్ హైకమిషనర్ దృష్టికి తీసుకెళ్ళినట్లు వెల్లడించింది. జమ్ముకశ్మీర్,
లద్దాఖ్ ఎప్పటికీ భారత్ లో అంతర్భాగాలేని మరోమారు ప్రకటించింది.
బ్రిటన్
లో పాక్ సంతతికి చెందిన వారిలో 70 శాతం మంది మీర్పుర్ నుంచే ఉన్నారని, అందుకు ఆమె
పీవోకే పర్యటించారని పాకిస్తాన్ తెలిపింది. గతంలో పాక్ లోని అమెరికా రాయబారి డొనాల్డ్
బ్లోమ్ కూడా పీవోకేలో పర్యటించారు.