పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మరోసారి అరాచకం (crime news) జరిగింది. యూపీకి చెందిన ముగ్గురు సాధువులపై మూక దాడికి దిగింది. పురులియా జిల్లాలో ఈ ఘటన వెలుగుచూసింది. గురువారంనాడు జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.
ఉత్తరప్రదేశ్‌కు చెందిన ముగ్గురు సాధువులు, బెంగాల్‌లోని గంగాసాగర్ మేళాకు బయలుదేరారు. మధ్యలో పురులియా సమీపంలో వాహనం ఆపి, అక్కడి అమ్మాయిలను గంగాసాగర్‌కు ఎటు వెళ్లాలో అడిగాలనుకున్నారు. వారికి చూడగానే అమ్మాయిలు భయపడి పరుగులు పెట్టారు. గమనించిన స్థానికులు సాధువులపై దాడికి దిగారు. వారు అమ్మాయిల కిడ్నాపర్లుగా పొరపడి దాడి చేసినట్లు విచారణలో తేలింది. వారు కిడ్నాపర్లు కాదని పోలీసులు వెల్లడించారు. దాడికి దిగిన 12 మందిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. మూకదాడిలో సాధువులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
జగన్‌రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు