తెలంగాణలోని నాగర్కర్నూల్ జిల్లాల్లో ఘోరం జరిగింది. లింగాల మండలం చెన్నంపల్లిలో ఓ వివాహిత ఆత్మహత్యకు (crime news) పాల్పడింది.పోలీసులు తెలిపిన వివరాల మేరకు…సింధు, నాగార్జున మూడేళ్ల కిందట ప్రేమ వివాహం చేసుకున్నారు. చెన్నంపల్లిలో నివాసం ఉంటున్నారు. వీరిమధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో సంధ్య ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇరుగుపొరుగు గమనించి ఆస్పత్రికి తీసుకువెళ్లిగా ఫలితం దక్కలేదు.
సంధ్య మరణవార్త తెలసి ఆమె బంధువులు పెద్ద ఎత్తున ఆస్పత్రి వద్దకు వచ్చారు. అప్పటికే ఆమె చనిపోయినట్లు డాక్టర్లు నిర్థారించడంతో మృతదేహంతో అచ్చంపేటకు తిరుగుపయనమయ్యారు. సింధు ఆత్మహత్యకు భర్తే కారణమంటూ, ఆమె బంధువులు శుక్రవారం అర్థరాత్రి ఆమనగల్లు వద్ద కనిపించిన నాగార్జునను కొట్టి చంపేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
జగన్రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు