లిక్కర్ స్కాంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రావాల్కు ఈడీ నాలుగోసారి సమన్లు జారీ చేసింది. ఢిల్లీ మద్యం కుంభకోణంలో మనీలాండరింగ్‌కు (delhi licquor scam) సంబందించి విచారణ జరపాలని, జనవరి 18న తమ కార్యాలయంలో హాజరు కావాలంటూ ఈడీ సమన్లలో పేర్కొంది. ఇప్పటికే కేజ్రీవాల్‌కు మూడుసార్లు సమన్లు జారీ చేసినా, ఆయన విచారణకు హాజరు కాలేదు.
రాజకీయ దురుద్దేశంతో, కక్ష సాధింపులో భాగంగా ఈడీ సమన్లు జారీ చేసిందని సీఎం కేజ్రీవాల్ విమర్శించారు. రాబోయే ఎన్నికలకు తనను దూరం పెట్టే కుట్ర జరుగుతోందన్నారు. త్వరలో డిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఎన్నికలు ఎదుర్కోలేక బీజేపీ నేతలు కుట్రలు పన్నుతున్నారని కేజ్రీవాల్ దుయ్యబట్టారు.ఈడీ జారీ చేసిన సమన్లను తక్షణమే ఉపసంహరించుకోవాలని కేజ్రీవాల్ డిమాండ్ చేశారు.
జగన్‌రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు