తిరుమలలో నిఘా వైఫల్యం మరోసారి బయటపడింది. నిబంధనలకు విరుద్ధంగా తిరుమలకు వెళ్లే మార్గంలో 53వ మలుపు వద్ద ఇద్దరు వ్యక్తులు డ్రోన్ ఎగురవేశారు. అటవీ ప్రాంతాలను వీడియో తీసేందుకు ప్రయత్నించారు.ఈ అరాచకానికి పాల్పడినవారు అస్సాం వ్యక్తులుగా పోలీసులు గుర్తించారు.తిరుపతి నుంచి తిరుమలకు (tirumala tirupati sequrity fails) వెళ్లే మొదటి ఘాట్ రోడ్డులో మోకాళ్ల పర్వతం వద్ద డ్రోన్‌తో వీడియోలు తీస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. బస్సుల్లో వెళ్లే కొందరు ప్రయాణీకులు ఈ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు.
తిరుమలలో ఎలాంటి డ్రోన్లు ఎగురవేయడానికి వీల్లేదు. శ్రీవారి ఆలయం, భక్తుల భద్రత దృష్ట్యా కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. అలిపిరి టోల్ వద్దే వాహనాలు తనిఖీ చేసి డ్రోన్లను స్వాధీనం చేసుకుంటుంటారు. అయితే అస్సాంకు చెందిన ఓ వ్యక్తి పోలీసుల కళ్లుగప్పి డ్రోన్ తీసుకుని ఘాట్ రోడ్డులోకి ప్రవేశించడం అనుమానాలకు తావిస్తోంది. విజిలెన్స్ అధికారులు డ్రోన్ ఎగురవేసిన వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. నిఘా వైఫల్యంపై భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
జగన్‌రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు