కీలక ఉగ్రవాది, లష్కర్ ఏ తయ్యబా (LeT) డిప్యూటీ వ్యవస్థాపకుడు అబ్దుల్ సలామ్ భుట్టవి చనిపోయినట్లు ఐక్యరాజ్యసమితి ధ్రువీకరించింది. ముంబై దాడుల సూత్రదారి హఫీజ్ సయీద్ అరెస్ట్ సమయంలో భుట్టవి కీలక బాధ్యతలు చేపట్టాడు. గత ఏడాది మే 29న పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లోని మురిడ్కే నగరంలో భుట్టవి గుండెపోటుతో చనిపోయినట్లు ఐక్యరాజ్యసమితి ధ్రువీకరించింది.
లష్కర్ ఏ తయ్యబాలో భుట్టవి కీలకంగా పనిచేశారు. సయీద్‌ను అరెస్ట్ చేసిన రెండు సందర్భాల్లో భుట్టవి తాత్కాలిక అధినేతగా వ్యవహరించారు. 2008 నవంబరులో ముంబైలో జరిగిన ఉగ్రదాడి తరవాత, భుట్టవి లష్కర్ ఏ తయ్యబా బాధ్యతలు చేపట్టాడు. 2009 వరకు లష్కర్ ఏ తయ్యబా చీఫ్‌గా పనిచేశాడు.
లష్కర్ ఏ తయ్యబా కార్యకలాపాలు కొనసాగించడం, ఫత్వాలు జారీ చేయడం, సంస్థ సభ్యులకు సూచనలు చేయడం వంటి కార్యక్రమాలు నిర్వహించిన భుట్టవి గుండెపోటుతో మరణించిన వార్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ముంబైపై ఉగ్రవాదుల దాడి ప్రణాళికలో కూడా భుట్టవి ఉన్నట్లు తెలుస్తోంది. లష్కర్ ఏ తయ్యబా కార్యక్రమాలతోపాటు మదర్సాలను కూడా పర్యవేక్షించాడని తెలుస్తోంది. 2002లోనే లాహోర్‌లో లష్కర్ ఏ తయ్యబా స్థావరాన్ని స్థాపించడంలో కీలకపాత్ర పోషించాడు.
సయూద్ పాక్ కస్టడీలో ఉన్నాడని ఐరాస ప్రకటించింది. ఉగ్ర సంస్థలకు ఆర్థిక సాయం చేసిన కేసులో దోషిగా తేలడంతో అతనికి 78 ఏళ్ల జైలు శిక్ష విధించారు. ప్రస్తుతం సయీద్ పాక్ జైల్లో ఉన్నాడు.
జగన్‌రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు