యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(UGC) కీలక ప్రకటన చేసింది. ఎంఫిల్ (Mphil)డిగ్రీకి ఎలాంటి గుర్తింపు లేదని, కోర్సులో విద్యార్థులు చేరవద్దని తెలిపింది.
అలాగే 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఎంఫిల్ అడ్మిషన్లు నిలిపివేయాలని
అన్ని విశ్వవిద్యాలయాలను ఆదేశించింది.
ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను యూజీసీ
వెబ్ సైట్ లోనూ అందుబాటులో ఉంచింది. ఎంఫిల్ కోర్సుకు సంబంధించి, వర్సిటీలు దరఖాస్తులు ఆహ్వానిస్తున్న సమయంలో యూజీసీ వాటిని నిలిపి
వేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
ఎంఫిల్ గుర్తింపు పొందిన డిగ్రీ కాదు
అని స్పష్టం చేసిన యూజీసీ, ఈ ప్రొగ్రామ్ ను ఉన్నత విద్యా సంస్థలు అందించరాదని
తేల్చి చెప్పింది.
యూజీసీ నిబంధనలు -2022 రెగ్యులేషన్ నంబర్ 14 ఈ
విషయాన్ని స్పష్టం చేస్తోందని వివరించింది. ఎంఫిల్ అడ్మిషన్ల ప్రక్రియ నిలిపివేతకు
చర్యలకు తీసుకోవాలని వర్సిటీలను ఆదేశించిడంతో విద్యార్థుల కూడా ఈ కోర్సులో
చేరవద్దని సూచించింది.