Parliament Breach Case : లోక్సభలో భద్రతా వైఫల్యం కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది.
విచారణలో భాగంగా బెంగళూరుకు చెందిన సాయికృష్ణ జగాలిని పోలీసులు అదుపులోకి తీసుకుని
ప్రశ్నిస్తున్నారు. సదరు యువకుడు, కర్ణాకటకు చెందిన ఓ మాజీ పోలీస్ ఉన్నతాధికారి
కుమారుడిగా తేలింది.
లోక్సభలో
అలజడి కేసులో నిందితుడిగా ఉన్న మనోరంజన్ చెప్పిన వివరాల మేరకు సాయికృష్ణ(30)ను
విచారణ బృందాలు అదుపులోకి తీసుకున్నాయి. మనోరంజన్, సాయికృష్ణలు బెంగళూరులోని ఓ
ఇంజినీరింగ్ కాలేజీలో బ్యాచ్మెట్స్. బాగల్కోట్ లో అతడిని అదుపులోకి తీసుకుని
దిల్లీకి తరలించారు.
సాయికృష్ణ
అరెస్టుకు సంబంధించి అతడి సోదరి మీడియాకు వివరాలు తెలిపారు. తన తమ్ముడు ఎలాంటి
తప్పు చేయలేదని, మనోరంజన్, సాయికృష్ణలు ఇంజినీరింగ్ చదివే సమయంలో రూమ్ మేట్స్ గా
ఉండేవారు అని తెలిపారు. ప్రస్తుతం సాయికృష్ణ ఓ అంతర్జాతీయ కంపెనీ లో ఉద్యోగం
చేస్తూ ఇంటి దగ్గర నుంచే పనిచేస్తున్నాడన్నారు.
పార్లమెంటులో
పొగబాంబులతో అలజడి సృష్టించిన కేసులో ఇప్పటి వరకు పోలీసులు ఆరుగురిని అదుపులోకి
తీసుకుని ప్రశ్నిస్తున్నారు. రైతుల సమస్యలు, నిరుద్యోగం, మణిపూర్ హింస విషయాలపై
నిరసన తెలిపేందుకే దాడికి తెగబడినట్లు నిరసనకారులు పోలీసు విచారణ చెప్పారు.
మనోరంజన్,
సాగర్ శర్మలు లోక్ సభలోకి చొరబడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయగా అమోల్
షిండే, నీలం ఆజాద్ లు లోక్సభ బయబ పొగబాంబులో అలజడి సృష్టించి నినాదాలు చేశారు.
ఈ
మొత్తం ఘటనను వీడియోతీసి వైరల్ చేయడంతో పాటు కుట్రకు సూత్రధారిగా ఉన్న లలిత్ ఝా
కూడా పోలీసుల ఎదుట లొంగిపోయాడు. అతడికి సహకరించిన మహేశ్ ను కూడా విచారణ బృందాలు
అదుపులోకి తీసుకున్నాయి.
పోలీసు
విచారణలో మనోరంజన్ చెప్పిన వివరాల మేరకే
సాయికృష్ణను విచారణ బృందాలు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.