సినిమా హీరోయిన్ రష్మిక మందన్న
డీప్‌ఫేక్ వీడియో కేసులో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో వ్యక్తి
పరారీలో ఉండగా అతడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు దిల్లీ పోలీసులు
తెలిపారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)
సాయంతో ప్రముఖుల డీప్‌ఫేక్ వీడియోలు సృష్టించి సోషల్ మీడియా వైరల్ చేస్తున్న ఘటనలు
ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి.
ఇదే తరహాలో ఓ అసభ్యకరమైన వీడియో
క్లిపింగ్ కు రష్మిక ముఖాన్ని జోడించి వీడియో క్రియేట్ చేశారు. దానిని యూట్యూట్ లో
అప్ లోడ్ చేశారు.
ఈ డీప్‌ఫేక్ వీడియో ఘటనను చిత్రపరిశ్రమతో పాటు పలువురు రాజకీయప్రముఖులు ఖండించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కేంద్రప్రభుత్వం ఆదేశాలతో కేసు
నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన దిల్లీ పోలీసులు తాజాగా నలుగురు నిందితులను
అదుపులోకి తీసుకున్నారు.