దిల్లీ
సమీపంలోని గజియాబాద్ లో దారుణం జరిగింది. ఉదయం టీ తయారు చేసి అందజేయడంలో ఆలస్యం
చేసిందంటూ ఓ వ్యక్తి తన భార్యను నరికి చంపాడు.
ఉదయం
టీ తయారు చేసే సమయంలో భార్య భర్తల మధ్య వివాదం జరిగింది. టీ ఆలస్యంగా పెట్టడంపై
భార్య పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.
కోపోద్రిక్తుడైన భర్త, భార్య తలనరికి చంపాడు. ఈ ఘటన జరుగుతున్న సమయంలో వారి
సంతామైన నలుగురు పిల్లలు వేరే గదిలో నిద్రిస్తున్నారని పోలీసులు వెల్లడించారు.
బాధితురాలి
కేకలు విన్న ఇరుగుపొరుగు వారు ఇంట్లోకి వెళ్ళి చూశారు. హతురాలు రక్తపు మడుగులో పడి
ఉండటం చూసి పోలీసులకు సమాచారం అందజేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు
మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు.
52
ఏళ్ళ ధర్మవీర్, అతడి భార్య సుందరి(50) సంతానంతో కలిసి గజియాబాద్ లోని బోజ్పూర్ లో
నివాసం ఉంటున్నారు. ఉదయం టీ చేసి ఇవ్వడంలో భార్య ఆలస్యం చేయడంతో ఇద్దరి మధ్య గొడవ
జరిగింది. దీంతో పదునైన ఆయుధంతో భార్య మెడపై పొడిచాడు. తీవ్రంగా గాయపడిన బాధితురాలు
అక్కడికక్కడే చనిపోయిందని అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ జ్ఞాన్ ప్రకాశ్ రాయ్ తెలిపారు.
నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు చెప్పారు.