పార్లమెంటులో పొగబాంబులతో అలజడి సృష్టికి
ప్రయత్నించిన నిందితులను పోలీసులు విచారిస్తున్నారు. ప్రధాన సూత్రధారితో పాటు నిందితులు
ఉపయోగించి కాల్చివేసిన మొబైల్స్ తో పాటు దుస్తులు, షూలను పోలీసులు స్వాధీనం
చేసుకున్నారు.
ఘటనకు మాస్టర్
మైండ్ గా వ్యవహరించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న లలిత్ ఝా విచారణలో తెలిపిన వివరాల
ప్రకారం, రాజస్థాన్ లో సగం కాలిన దుస్తులు, మొబైల్స్, షూలను పోలీసులు స్వాధీనం
చేసుకున్నారు.
పార్లమెంటు భద్రత ఉల్లంఘన ఘటనకు సంబంధించి ఇప్పటి
వరకు ఆరుగురు నిందితులు అరెస్టయ్యారు. నిందితులకు విజిటర్ పాస్లు ఇచ్చిన బీజేపీ
ఎంపీ ప్రతాప్సింహను విచారించాలని ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ఢిల్లీ పోలీస్
స్పెషల్ సెల్ భావిస్తోంది.
నిందితులు తమ శరీరాలకు అగ్ని నిరోధక జెల్ పూసుకుని,
నిప్పు అంటించుకోవాలని ప్రణాళిక వేశారని, తర్వాత విరమించుకుని స్మోక్ బాంబులతో
అలజడి సృష్టికి యత్నించారని పోలీసులు తెలిపారు.
లలిత్ ఝా పోలీసుల ఎదుట
లొంగిపోవడానికి ముందు తన మొబైల్ ను విసిరేయడంతో పాటు సహా నిందితుల ఫోన్లను
కాల్చవేశాడు. దర్యాప్తును తప్పుదోవ పట్టించేందుకు లలిత్ అలా చేసి ఉంటాడని పోలీసులు
అనుమానిస్తున్నారు.