blast at solar
explosive company: మహారాష్ట్రలో
దారుణం జరిగింది. ఓ సోలార్ కంపెనీలో పేలుడు జరగడంతో 9 మంది మృతి చెందారు. నాగ్‌పుర్
బజార్గాన్ లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. క్యాస్ట్ బూస్టర్ ప్లాంట్ లో ప్యాకింగ్ సమయంలో పేలుడు జరిగి ఉంటుందని
పోలీసులు భావిస్తున్నారు.
ఉదయం 9 గంటల సమయంలో పేలుడు జరిగినట్లు పోలీసులు
చెబుతున్నారు.
ఘటనలో
మరికొంతమంది కార్మికులకు గాయాలయ్యాయని కంపెనీ వర్గాలు తెలిపాయి. పేలుడు జరిగిన సమాచారం అందగానే అత్యవసర సహాయ దళాలు సంఘటనా స్థలం వద్దకు చేరుకున్నాయి.
గాయపడిన కార్మికులను వెంటనే దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. సహాయ చర్యలు ముమ్మరం
చేయడంతో పాటు ప్రమాద కారణాలపై ఆరా తీస్తున్నారు.