గత కొంత కాలంగా మొబైల్ ఫోన్ల పేలుడు (mobile blast) వార్తలు పెద్దగా లేవనుకుంటోన్న సమయంలో అలాంటి వార్త ఒకటి వైరల్ అయింది. తెలంగాణలోని గద్వాల జిల్లాలో శుక్రవారం ఓ వ్యక్తి ఫ్యాంటులో పెట్టుకున్న సాధారణ మొబైల్ ఫోన్ పేలిపోయింది. గద్వాల పరిధిలోని బీసీ కాలనీకి చెందిన జయరాముడు కూరగాయల మార్కెట్కు వచ్చిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
కూరగాయల మార్కెట్కు వచ్చిన జయరాముడు అక్కడి వ్యాపారులతో మాట్లాడుతుండగా జేబులోని ఫోన్ ఒక్కసారిగా పేలి ముక్కలై పోయింది. ప్యాంటులో పొగలు వచ్చాయి. వెంటనే జయరాములు ప్యాంటు తీసేయడంతో ప్రమాదం తప్పింది. మొబైల్ చెల్లాచెదురుగా పడి కాలిపోవడం కలకలం రేపింది.అయితే జయరాముడుకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో ప్రమాదం తప్పింది.