బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కాలు జారి పడిపోయారు. వెంటనే ఆయన్ను హైదరాబాద్లోని యశోదా ఆస్పత్రిలో చేర్పించారు. ఆయన తుంటి ఎముక విరిగినట్లు వైద్యులు గుర్తించారు. ఆపరేషన్ నిర్వహించాల్సి ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు. అన్నీ పరీక్షలు పూర్తి చేసిన తరవాత వైద్యులు తుది నిర్ణయం తీసుకునే అవకాశముంది.
గజ్వేల్ సమీపంలోని ఎర్రవల్లి ఫాం హౌస్లో కేసీఆర్ గత రాత్రి జారిపడినట్లు తెలుస్తోంది. వెంటనే ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. వైద్య సేవలు అందిస్తున్నారు. ఇవాళ సాయంత్రం కేసీఆర్కు శస్త్ర చికిత్స నిర్వహించే అవకాశముందని తెలుస్తోంది.