ఉగ్రవాద
చర్యలకు పాల్పడుతున్న పలువురి ఆస్తులను జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) అటాచ్ చేస్తోంది. జమ్ము-కశ్మీర్ లోని
పుల్వామా జిల్లా అవంతిపురలోని రెండు బిల్డింగులను ఎన్ఐఏ అధికారులు అటాచ్ చేసినట్లు
బోర్డులు ఏర్పాటు చేశారు.
ఉగ్రవాద
చర్యలకు పాల్పడుతున్న ఖుర్షీద్ అహ్మద్ అతడి ఐదుగురు సోదరులకు సంబంధించిన ఓ రెండు అంతస్తుల
భవనంతో పాటు మరో నివాసాన్ని కూడా సీజ్ చేశారు.
జమ్ము-కశ్మీర్ లో మంగళవారం నాడు 8 ప్రాంతాల్లో ఎన్ఐఏ
అధికారులు సోదాలు నిర్వహించారు. పాకిస్తాన్ కు చెందిన నిషేధిత ఉగ్రవాద సంస్థలతో
కలిసి అల్లర్లు, హింసకు పాల్పడేందుకు కుట్ర చేశారనే అభియోగాల ఆధారంగా ఈ తనిఖీలు
నిర్వహించారు. వివిద సంఘాల మాటున తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడటంతో పాటు అజ్ఞాతంలో ఉంటూ ఉగ్రవాదచర్యలకు
పాల్పడుతున్న వారి నివాసాల్లో సోదాలు నిర్వహించి పలు ఎలక్ట్రానిక్ వస్తులతో పాటు
ఆస్తులు అటాచ్ చేశారు. నిషేదిత ఉగ్ర సంస్థలతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూ కుట్రల్లో
భాగస్వామ్యం అవుతున్నట్లు ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది.