గుజరాత్ రాష్ట్ర సంప్రదాయ నృత్యం గర్భాకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ఐక్యరాజ్యసమితిలోని విద్యా, సాంస్కృతిక విభాగం యునెస్కో గర్భా నృత్యాన్ని గుర్తించింది. గుజారాత్ సీఎం భూపేంద్ర పటేల్ ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు.
మానవత్వ సాంస్కృతిక వారసత్వ ప్రాతినిధ్య జాబితాలో గర్భా నృత్యాన్ని చేర్చినట్లు యునెస్కో ప్రకటించడం గుజరాత్ ప్రజలకు గర్వకారణమని సీఎం పేర్కొన్నారు. గర్భాను యునెస్కో (unesco) జాబితాలో చేర్చడంపై ప్రధాని మోదీ కూడా హర్షం వ్యక్తం చేశారు.
భారత సంస్కృతిని ప్రపంచానికి చాటేందుకు ఇదో గొప్ప అవకాశమని ఆయన అభిప్రాయపడ్డారు. వారసత్వాన్ని భవిష్యత్ తరాలకు అందించేందుకు ఇదో గొప్ప అవకాశమని ప్రధాని అభిప్రాయపడ్డారు.