రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 18వ తేదీ నుంచి కోటి 42 లక్షల కొత్త ఆరోగ్యశ్రీ కార్డులు మంజూరు చేయనున్నారు. పెద్ద మొత్తంలో ఆరోగ్యశ్రీ కార్డుల (arogyasri cm jagan review) ముద్రణ జరుగుతున్నట్లు వైద్యారోగ్యశాఖ అధికారులు తెలిపారు. ఇప్పటికే ఆరోగ్యశ్రీకి సంబంధించిన బ్రోచర్లను తయారు చేసినట్లు వెల్లడించారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం అమలు, పురోగతిపై సీఎం జగన్మోహన్రెడ్డి తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు.
ప్రతి గ్రామంలో జనవరి 1 నుంచి ప్రతి వారం ఆరోగ్య సురక్ష క్యాంపులు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. 2023 నవంబరు చివరి నాటికి 12.42 లక్షల మందికి ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా చికిత్స అందించినట్లు సీఎంకు వెల్లడించారు. చైనా నుంచి విస్తరిస్తోన్న హెచ్9ఎన్2 వైరస్, రాష్ట్రంలోకి వ్యాపించకుండా తగు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సిబ్బంది కొరత లేకుండా చూడాలని సీఎం అధికారులను ఆదేశించారు.