ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం (israel hamas war) మరింత తీవ్రమైంది. కాల్పుల విరమణ సంధి ముగియగానే ఇజ్రాయెల్ వైమానిక, భూతలదాడులను ముమ్మరం చేసింది. దాడులు మరింత విస్తరిస్తున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. గాజా వ్యాప్తంగా హమాస్ స్థావరాలే లక్ష్యంగా దాడులను విస్తరిస్తున్నారు. హమాస్ దాడులకు ప్రతిదాడులు తప్పదని ఇజ్రాయెల్ సైన్యం హెచ్చరించింది.
గాజాలోని ప్రముఖ ఆస్పత్రులను హమాస్ తీవ్రవాదులు అడ్డాలుగా మార్చుకున్నారని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. వందలాది స్థావరాలను ఇజ్రాయెల్ ధ్వంసం చేసింది. గాజా ప్రజలను హమాస్ ఉగ్రవాదులు రక్షణ కవచాలుగా వాడుకుంటున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం అనేక సాక్ష్యాలను బయట ప్రపంచానికి విడుదల చేసింది. తాజాగా గాజాలోని జబాలియా ప్రాంతంపై ఇజ్రాయెల్ సైన్యం భీకరదాడులు ప్రారంభించింది. జబాలియా ప్రాంతంలో ప్రజలు ఏ క్షణంలోనైనా ఇళ్లు ఖాళీ చేయడానికి సిద్దంగా ఉండాలని ఐడిఎఫ్ హెచ్చరించింది.