ఇటలీలోని బొలోగ్నాలో దాదాపు వెయ్యేళ్ళ చరిత్ర కలిగిన 150 అడుగుల గరిసెండా టవర్ వాలిపోతుంది. ఈ టవర్
కొనభాగంలో బరువు ఎక్కువగా ఉండటంతో 14వ
శతాబ్దకాలంలో దాదాపు నాలుగు డిగ్రీల మేర
వంగిపోయింది.
యధాస్థితికి తీసుకొచ్చేందుకు చేసిన
ప్రయత్నాలు విఫలమయ్యాయి. అప్పటి నుంచి వంగిపోయి ఉండటంతో దీనిని లీనింగ్ టవర్ అని
పిలుస్తున్నారు.ఈ టవర్ ప్రస్తుతం నాలుగు డిగ్రీల కోణంలో పక్కకు ఒరిగింది.
పునాదులు
కూడా కొంతకాలంగా బాగా బలహీనపడుతున్నాయి. దీంతో అప్రమత్తమైన నగర కౌన్సిల్ హుటాహుటిన
సమావేశమై టవరన్ కూల్చివేయాలని నిర్ణయించింది.
టవర్ చుట్టుపక్కల వారిని ఇప్పటికే ఖాళీ
చేయించారు. టవర్ చుట్టూ యుద్ధ ప్రాతిపదికన 5
మీటర్ల ఎత్తున బారియర్ నిర్మిస్తున్నారు.
టవర్ చుట్టూ రాక్ ఫాల్ వలలను ఏర్పాటు చేస్తున్నారు. తద్వారా కూలినా పరిసర
నిర్మాణాలకు ఎలాంటి నష్టం లేకుండా చూసేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు.