తెలుగు
రాష్ట్రాల మధ్య జలవివాదాలపై కేంద్రప్రభుత్వం దృష్టి సారించింది. విభజన చట్టం
నిబంధనలు ఉల్లంఘించి దుందుడుకు చర్యలకు పాల్పడటాన్ని సీరియస్ గా తీసుకున్న కేంద్రప్రభుత్వం,
మళ్ళీ ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టింది.
కేంద్రజలశక్తి
శాఖ కార్యాలయంలో జరిగిన సమావేశంలో తెలుగు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, సీఆర్పీఎఫ్,
సీఐఎస్ఎఫ్ డైరక్టర్ జనరల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. సీడబ్ల్యూసీ,
కృష్ణా బోర్డు చైర్మన్లు నేరుగా పాల్గొన్నారు.
తెలుగురాష్ట్రాల
జల వివాదాల పరిష్కారానికి కేంద్రం చర్యలు
నాగార్జునసాగర్,
శ్రీశైలం జలాశయాలు వాటికి అనుబంధంగా ఉన్న ఉమ్మడి నిర్మాణాలను కృష్ణానదీ యాజమాన్య
బోర్డుకు అప్పగించే ప్రక్రియను కేంద్ర జలశక్తి శాఖ ప్రారంభించింది. సీఆర్పీఎఫ్, సీఐఎస్ఎస్
భద్రత పరిధిలోకి జలాశయాలను తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టారు.
గురువారం తెల్లవారుజామున వందలాది మంది
ఆంధ్రప్రదేశ్ పోలీసులు నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్దకు చేరుకున్నారు. పదమూడవ
గేటు వరకు తమ పరిధిలోకే వస్తుందంటూ కంచె వేశారు. తదనంతరం ఇరిగేషన్ అధికారులు
నీటిని విడుదల చేశారు. దీంతో తెలుగు రాష్ట్రాల మధ్య ఉద్రిక్తత చోటుచేసుకుంది.