రష్యాలో మూడు దశాబ్దాలుగా జనాభా తగ్గిపోవడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ఉక్రెయిన్‌తో యుద్ధం కారణంగా మరో మూడున్నర లక్షల జనాభా తగ్గిపోయిందని అంచనా. దేశ జనాభాను పెంచేందుకు మహిళలు కనీసం 8 మంది చొప్పున పిల్లలను కనాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ పిలుపునిచ్చారు. మాస్కోలో జరిగిన వరల్డ్ రష్యన్ పీపుల్స్ కౌన్సిల్ సమావేశంలో పుతిన్ ఈ పిలుపునిచ్చారు. 1990 నుంచి రష్యాలో జనాభా తగ్గుతోందని (russia population crisis) ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ఉక్రెయిన్ యుద్ధం వల్ల భారీగా ప్రాణనష్టం జరిగిందని పుతిన్ అంగీకరించారు. పాత తరం వారికి నలుగురైదుగురు పిల్లలు ఉండేవారని గుర్తుచేశారు. పాత సంప్రదాయాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. మన అమ్మమ్మలకు, నాయనమ్మలకు కనీసం ఎనిమిది మంది పిల్లులుండేవారని పుతిన్ గుర్తుచేశారు. కుటుంబం అనేది ఆధ్యాత్మికతకు, నైతికతను నిదర్శనమని, భవిష్యత్ తరాలు రష్యా జనాభాను పెంచడమే లక్ష్యంగా పెట్టుకోవాలని పుతిన్ పిలుపునిచ్చారు. అయితే పుతిన్ పిలుపును అక్కడి ప్రజలు పట్టించుకుంటారా లేదా అనేది మాత్రం వేచి చూడాల్సిందే.