PM Modi in Dubai:
భారత్‌లో కాప్-33 సదస్సు( COP-33) నిర్వహించాలని ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపాదించారు. దుబాయిలో జరుగుతున్న
ప్రపంచ వాతావరణ సదస్సు లో ప్రారంబోపన్యాసం చేసిన ప్రధాని మోదీ, 2030 నాటికి ఉద్గారాల తీవ్రతను 45 శాతం తగ్గించడమే భారతదేశ లక్ష్యమని
ఆయన తెలిపారు.
శిలాజయేతర ఇంధనం వాటాను 50 శాతానికి పెంచాలని భారత్
నిర్ణయించుకున్నట్టు పేర్కొన్నారు.
వాతావరణ మార్పుల విషయంలో
ఐక్యరాజ్యసమితి ఫ్రేమ్‌వర్క్‌కు భారత్ కట్టుబడి ఉందన్న మోదీ, వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి అభివృద్ధి
చెందుతున్న దేశాలకు సంపన్న దేశాలు సహాయం చేయాలని కోరారు.
జీవావరణం, ఆర్థిక వ్యవస్థ
మధ్య సమతుల్యతకు ప్రపంచానికి భారత్ మంచి ఉదాహరణ అన్నారు. ప్రపంచంలోని 17శాతం జనాభాకు
భారత్ నిలయంగా ఉన్నప్పటికీ, కర్బన ఉద్గారాల విడుదలలో 4 శాతం కంటే తక్కుగా ఉందన్నారు.