శ్రీనగర్ ఎన్ఐటీ(NIT-SRINAGAR)లో మతపరమైన
అంశంపై సోషల్ మీడియాలో పెట్టిన
పోస్టుకు నిరసనగా
కొందరు విద్యార్థులు ఆందోళనకు దిగారు.
విద్యార్థులు రెండువర్గాలుగా విడిపోయిన నేపథ్యంలో
వర్సిటీ అధికారులు
సెలవులు ప్రకటించారు. నిరసనల కారణంగా
ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకునే అవకాశం ఉండటంతో శీతాకాల
సెలవులు(winter
vacation) పది రోజుల ముందే ప్రకటించి
హాస్టళ్ళు ఖాళీ చేయాలని డీన్
ఉత్తర్వులు జారీ చేశారు.
ఇతర
రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు 15 వాహనాల్లో భారీ భద్రత మధ్య తమ రాష్ట్రాలకు
ప్రయాణమయ్యారు. పరీక్షలు వాయిదా వేసి అకస్మాత్తుగా సెలవులు ప్రకటించడంతో తెలుగు
విద్యార్థులు ఇబ్బందిపడుతున్నారు. దాదాపు 300 మంది విద్యార్థులు, స్వస్థలాలకు
వెళ్లేందుకు నానా తంటాలు పడాల్సి వస్తోంది.
అత్యవసర
ప్రయాణానికి రవాణా సౌకర్యం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సోషల్
మీడియాలో వైరల్ అవుతున్న పోస్టు కారణంగా ఇతర విద్యాసంస్థల్లో కూడా నిరసనలు వ్యక్తం
అవుతున్నాయి. ది ఇస్లామియా కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ కామర్స్, తరగతులతో పాటు అంతర్గత పరీక్షలను రద్దు చేసింది.
నిట్ వెబ్‌సైట్ ను కూడా తాత్కాలికంగా మూసివేశారు.
సోషల్ మీడియాలో అభ్యంతరకర మెసేజ్ ను షేర్ చేసిన విద్యార్థి పై కేసు నమోదు చేసి
విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
హనుమంతుడు ముస్లిం, నమాజ్ చేసేవాడు: ముస్లిం ఉపాధ్యాయుడి వివాదాస్పద వ్యాఖ్యలు