ఓపెనర్లు గా రోహిత్ శర్మ, శుభమన్ గిల్
క్రీజులోకి రాగా, తొలి ఓవర్ ను స్టార్క్ కట్టుదిట్టంగా వేశాడు. తొలి
ఓవర్ లో రోహిత్ శర్మ కేవలం మూడు పరుగులు మాత్రమే చేశారు. రెండో ఓవర్ లో వరుసుగా
రెండు ఫోర్లు కోట్టిన రోహిత్ శర్మ, ఆతర్వాత ఆచితూచి ఆడాడు. దీంతో రెండో ఓవర్
ముగిసే సరికి భారత్ స్కోరు 13 పరుగులకు చేరింది.
మూడో ఓవర్ మొదటి బంతిని ఆడిన శుభమన్ గిల్ ఒక పరుగుతో ఖాతా తెరిచాడు. మూడో ఓవర్ లో 5 పరుగులు రావడంతో భారత్ స్కోరు
18 కి చేరింది. నాలుగో ఓవర్లో 12 పరుగులు
రాబట్టారు. రోహిత్ శర్మ వెంటవెంటనే సిక్స్, ఫోర్ కొట్టడంతో భారత్ స్కోరు 30కి
చేరింది.
ఐదో ఓవర్ రెండో బంతికి శుభమన్
గిల్ క్యాచ్ ఔట్ గా వెనుదిరిగాడు. ఏడు
బంతులు ఆడి నాలుగు పరుగులు చేసి మిచెల్ స్టార్క్ బౌలింగ్ లో ఆడమ్ జంపాకు క్యాచ్
ఇచ్చి పెవిలియన్ చేరాడు. 30 రన్స్ వద్ద భారత్ తొలి వికెట్ కోల్పోయింది.
ఐదు ఓవరు ఆఖరు బంతిని రోహిత్ సిక్స్ గా మల్చడంతో
స్కోర్ 37కి చేరింది. ఆరు ఓవర్లకు 40
పరుగులు, ఏడో ఓవర్ లో కోహ్లీ వరుసగా మూడు
ఫోర్లు బాదాడు. దీంతో ఏడో ఓవర్లకు గాను ఒక వికెట్ నష్టపోయి 54 పరుగులకు చేరింది. 8వ ఓవర్ ను స్పిన్నర్ మ్యాక్స్ వెల్ వేయగా
కోహ్లీ, రోహిత్ ఏడు పరుగులు రాబట్టారు. 9 వ ఓవర్ లో 5
పరుగులతోనే సరిపెట్టారు. పదో ఓవర్ లో రోహిత్ శర్మ మూడో సిక్స్ బాదాడు. వెంటనే ఫోర్
కొట్టి మూడో బంతిని ఆడబోయి క్యాచ్ ఔట్ గా పెవిలియన్ చేరాడు. మ్యాక్సివెల్ బౌలింగ్
లో ట్రావిస్ హెడ్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 76 పరుగులు వద్ద భారత్ రెండో వికెట్
కోల్పోయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన
అయ్యర్ కూడా నిరాశపరిచాడు. నాలుగు పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.
హనుమంతుడు ముస్లిం, నమాజ్ చేసేవాడు: ముస్లిం ఉపాధ్యాయుడి వివాదాస్పద వ్యాఖ్యలు