భారత క్రికెట్ దిగ్గజం బిషన్ సింగ్ బేడి (Bishan Singh Bedi) అనారోగ్యంతో కన్నుమూశారు. 77 ఏళ్ల వయసులో ఆయన ఇవాళ తుదిశ్వాస విడిచారు. బేడి ఎడమచేతి వాటం స్పిన్నర్. 22 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా కూడా వ్యవహరించారు. 1967 నుంచి 1979 వరకు 67 టెస్టుల్లో 266 వికెట్లు తీశాడు. భారత్ తరపున 10 వన్డేలు ఆడాడు. 7 వికెట్లు తీశాడు.అత్యుత్తమ స్పిన్నర్లలో బేడీ ఒకరు. 1975లో జరిగిన వరల్డ్ కప్‌లో తూర్పు ఆఫ్రికాను 120 పరుగులకే ఆలౌట్ చేయడంలో బేడి కీలక పాత్ర పోషించారు.
దేశవాళీ క్రికెట్లోనూ బేడి ఢిల్లీ జట్టుకు ఆడారు. పదవీ విరమణ తరవాత అనేక మంది క్రికెటర్లకు కోచ్‌గా, మెంటార్‌గా వ్యవహరించారు. వ్యాఖ్యాతగా కూడా బేడి సేవలు అందించారు. బిషన్ సింగ్ బేడి మృతికి బీసీసీఐ సంతాపం ప్రకటించింది. బేడి ఆత్మకు శాంతి కలగాలని, కష్టకాలంలో అతని కుటుంబానికి బీసీసీఐ ప్రగాఢ సానుభూతి తెలిపింది.