ఏకలవ్య
మోడల్ రెసిడెన్సియల్ పాఠశాలల్లో సిబ్బంది నియామకానికి దరఖాస్తుల గడువు మరోసారి
పొడిగించారు. రెండు వేర్వేరు నోటిఫికేషన్లతో మొత్తం 10,391 మంది టీచింగ్, నాన్
టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. అర్హులైన అభ్యర్థులు
అక్టోబర్ 19 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు అని నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ
ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ ఓ ప్రకటనలో తెలిపింది.
ఎన్సీటీసీ
ద్వారా గుర్తింపు పొందిన మూడేళ్ళ ఇంటిగ్రేటెడ్ బీఈడీ, ఎంఈడీ డిగ్రీ ఉన్న
అభ్యర్థులు కూడా పీజీటీ, టీజీటీ పోస్టులకు దరఖాస్తు చేసుకొనేందుకు అర్హులు అని
ప్రకటనలో పేర్కొంది.
ఈ
ఏడాది జూన్ నెలాఖరున 4,062 పోస్టులకు ఆ
తర్వాత కొద్ది రోజులకే మరో 6,329 పోస్టుల భర్తీకి మరో నోటిఫికేషన్ వెలువడ్డాయి.
ప్రిన్సిపల్, పీజీటీ, టీజీటీ, హాస్టల్ వార్డెన్, సహా పలు నాన్ టీచింగ్ పోస్టుల
భర్తీకి గిరిజన వ్యవహారాల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో నేషనల్ ఎడ్యుకేషన్ సోసైటీ ఫర్
ట్రైబల్ స్టూడెంట్స్ నోటిఫికేషన్లు జారీ చేసింది.
ఈ
ఉద్యోగాలకు ఆసక్తి కలిగిన అర్హులైన అభ్యర్థులు http://emrs.tribal.gov.in వెబ్ సైట్ ను సందర్శించి దరఖాస్తు
చేసుకోవచ్చు.