విద్యాసంస్థలకు
దసరా సెలవులను రాష్ట్రప్రభుత్వం ఖరారు చేసింది. అక్టోబర్ 13 నుంచి 25 వరకు సెలవులు ప్రకటించింది. 13 రోజుల
పాటు పండుగ సెలవులు ఉంటాయని వెల్లడించింది. అక్టోబర్ 5 నుంచి 11 వరకు ఎస్ఏ-1 పరీక్షలు
నిర్వహించనుంది. 8వ తరగతి విద్యార్థులు మినహా అన్ని తరగతుల విద్యార్థులకు ఉదయం
పూటే పరీక్షలు జరగనున్నాయి.
అక్టోబర్
26న పాఠశాలలు తిరిగి ప్రారంభం అవుతాయని విద్యాశాఖ అధికారులు షెడ్యూల్ విడుదల
చేశారు.
స్కూళ్ళకు సంబంధించిన 2023-24 అకడమిక్ క్యాలెండర్ లో ఈ సెలవులు పూర్తి
వివరాలతో పాఠశాల విద్యాశాఖ పొందు పర్చింది. క్రిస్మస్ సెలవులను ఏడు రోజుల నుంచి ఐదు
రోజులకు తగ్గించింది. జనవరి 12 నుంచి 17 వరకు సంక్రాంతి సెలువులు ఇవ్వనున్నట్లు
పేర్కొన్నారు. ప్రతీ నెలా మూడో శనివారం, తల్లిదండ్రులతో సమావేశం నిర్వహిస్తామని
వెల్లడించారు.