లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు, కాసేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. ఉదయం మార్కెట్లు ప్రారంభంలో లాభాలార్జించాయి. ప్రారంభంలో నిఫ్టీ సూచీ 78 పాయింట్లు పెరిగి 20074కు చేరి సరికొత్త రికార్డులను నెలకొల్పింది. సెన్సెక్స్ 292 పాయింట్ల లాభంతో 67419 వద్ద మొదలైంది. కాసేపటికే స్టాక్ మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ఒడిదుడుకులు, ఆందోళన కలిగిస్తోన్న ద్రవ్యోల్బనం, ముడిచమురు 90 డాలర్లు దాటిపోవడంతో దేశీయ స్టాక్ సూచీలు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. తాజాగా సెన్సెక్స్ 140 పాయింట్ల నష్టంతో 66,966 వద్ద, నిఫ్టీ 60 పాయింట్ల నష్టంతో 19,944 వద్ద ట్రేడవుతోంది.
ఎల్ అండ్ టీ, భారతీ ఎయిర్‌టెల్, ఐసీఐసీఐ బ్యాంకు, టాటా స్టీల్, అల్ట్రాటెక్ సిమెంట్స్, ఇన్ఫోసిస్, విప్రో, పవర్ గ్రిడ్, యాక్సిస్ బ్యాంక్, సన్‌ఫార్మా షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. మారుతీ, నెస్లే ఇండియా, బజాజ్ ఫిన్‌సర్వ్, టైటాన్, ఇండస్‌ఇండ్ బ్యాంక్ షేర్లు నష్టాలను చవిచూశాయి.
సోమవారం అమెరికా, ఐరోపా మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. ఈ ప్రభావం ఇవాళ ఆసియా మార్కెట్లపై చూపింది. అయితే ఇవాళ ద్రవ్యోల్బనం గణాంకాలు విడుదల కావాల్సి ఉంది. సోమవారం విదేశీ పెట్టుబడిదారులు పెద్ద ఎత్తున స్టాక్స్ కొనుగోలు చేశారు. సోమవారం విదేశీ పెట్టబడిదారులు రూ.1473 కోట్లు, దేశీయ ఇన్వెస్టర్లు రూ.366 కోట్లుతో షేర్లు కొన్నారు.