ప్రభుత్వరంగ
బ్యాంకింగ్ సంస్థ ఎస్బీఐలో భారీగా అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ
చేసింది. దేశవ్యాప్తంగా మొత్తం 6,160 ఖాళీలను భర్తీ చేసేందుకు నేటి నుంచి ఆన్లైన్
దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
అర్హులైన
ఆసక్తి కలిగిన అభ్యర్థులు నేటి నుంచి సెప్టెంబర్ 21 లోగా దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం ఖాళీలు 6,160 ఉండగా, కేటగిరీల వారీగా ఎస్సీ విభాగంలో 989, ఎస్టీ-514,
ఓబీసీ-1,389, ఈడబ్ల్యూఎస్-603, యూఆర్-2,665 చొప్పున ఖాళీలు ఉన్నట్లు ఎస్బీఐ
తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లో 515 ఖాళీలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో 390 ఖాళీలు
ఉండగా, తెలంగాణలో 125 ఉన్నాయి. డిగ్రీ అర్హత తో పాటు ఆగస్టు 1, 2023 నాటికి వయస్సు
20 నుంచి 28 ఏళ్ళ లోపు ఉండాలి.
ఆన్లైన్
రాతపరీక్ష, స్థానిక భాష పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల ఆధారంగా ఎంపిక
చేస్తారు. ఆన్లైన్
రాతపరీక్ష అక్టోబర్/నవంబర్ లో జరిగే అవకాశం ఉంది. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్
అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.300 చెల్లించాలి. ఎస్టీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు
నుంచి పూర్తిగా మినహాయింపు ఉంటుంది.