Sunday, April 14, 2024

Logo
Loading...
upload upload upload

skill case

చంద్రబాబు బెయిల్ రద్దు పిటీషన్ వాయిదా

స్కిల్ కేసులో ఏపీ హైకోర్టు టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబునాయుడుకు మంజూరు చేసిన బెయిల్‌ను, రద్దు చేయాలంటూ ప్రభుత్వం దాఖలు చేసిన పిటీషన్‌పై విచారణను సుప్రీంకోర్టు (supreme court ) వాయిదా వేసింది. జస్టిస్ పంకజ్ మిట్టల్, జస్టిస్ బేలా ఎం.త్రివేదిల సుప్రీం ధర్మాసనం ఈ విచారణను ఈ నెల 26కు వాయిదా వేసింది. చంద్రబాబు తరపు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా కేసును మూడు వారాలు వాయిదా వేయాలని కోరారు.



ఏపీ సీఐడి తరపున న్యాయవాది రంజిత్ కుమార్ స్పందిస్తూ, కౌంటర్ దాఖలు చేయడానికి ఇప్పటికే చాలా సమయం తీసుకున్నారని, మరలా సమయం కోరడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. కౌంటర్ దాఖలు చేశారని, విచారణ చేపట్టాలని కోరారు. తొలుత రెండు వారాల తరవాత విచారణ చేపట్టాలని భావించిన ధర్మాసనం, రంజిత్ కుమార్ వాదనల తరవాత కేసు విచారణను ఈ నెల 26కు వాయిదా వేసింది.

K Venkateswara Rao | 13:35 PM, Mon Feb 12, 2024
upload
upload