Sunday, April 14, 2024

Logo
Loading...
upload upload upload

crime news

బెంగళూరులోని రామేశ్వరం కెఫేలో పేలుడు : కీలక నిందితుడి అరెస్ట్

బెంగళూరు రామేశ్వరం కెఫేలో బాంబు పేలుడులో కీలక నిందితుడిని జాతీయ దర్యాప్తు సంస్థ అదుపులోకి తీసుకుంది. ముస్సావిర్ హుస్సెన్ షాజిబ్, అబ్దుల్ మతీన్ తాహాను జాతీయ దర్యాప్తు సంస్థ అదుపులోకి తీసుకుంది. పేలుడు జరిగినప్పటి నుంచి వీరిద్దరు పరారీలో ఉన్నారు. బెంగళూరులో పేలుడు ఘటనకు పాల్పడిన తరవాత ఈ నిందితులిద్దరూ అస్సాం పారిపోయారు. తరవాత పశ్చిమబెంగాల్‌కు మకాం మార్చారు.


బెంగళూరు రామేశ్వరం కెఫేలో బాంబు పేలుడు కేసును జాతీయ దర్యాప్తు సంస్థ సీరియస్‌గా తీసుకుని అనేక మంది అనుమానితులను విచారించింది. సీసీ కెమెరాలో రికార్డైన వీడియోల ఆధారంగా నిందితులను గుర్తించారు. వారి కదలికల ఆధారంగా అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

K Venkateswara Rao | 11:21 AM, Fri Apr 12, 2024

తుపాకీతో కాల్చుకుని ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ ఆత్మహత్య

విశాఖలో ఘోరం జరిగింది. ఐవోబీ బ్యాంకులో విధులు నిర్వహిస్తోన్న ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ శంకర్రావు తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉదయం 5 గంటలకు విధుల్లోకి వచ్చిన శంకర్రావు, వెంట తెచ్చుకున్న తుపాకీతో తలపై కాల్చుకుని చనిపోయాడు. శంకర్రావుకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.


ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ శంకర్రావు ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు. శంకర్రావు ఆత్మహత్యకు కుటుంబ కలహాలు కారణమై ఉండొచ్చని తెలుస్తోంది.

K Venkateswara Rao | 09:23 AM, Thu Apr 11, 2024

పంజాబ్‌లో అరాచకం : మహిళపై దాడి.. అర్థనగ్నంగా ఊరేగింపు

పంజాబ్‌లో ఘోరం వెలుగుచూసింది. మానవత్వం మంట గలిపిన సంఘటన ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చకు దారితీసింది. పంజాబ్‌లోని వాల్తొహ గ్రామంలో ఓ మహిళను వివస్త్రను చేసి, కొట్టి, ఆ తరవాత అర్థనగ్నంగా ఊరేగించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మార్చి 31న ఈ ఘటన జరిగినట్లు అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.పోలీసుల కథనం ప్రకారం. బాధితురాలి కుమారుడు ఓ మహిళతో పారిపోయాడు. ఆమె పెళ్లి చేసుకున్నాడు. తరవాత కొంత కాలానికి గ్రామానికి తిరిగి వచ్చి కాపురం పెట్టారు. తల్లితో కలసి నివాసం ఉంటున్నాడు. గత నెల 31న కొందరు గ్రామస్థులు యువకుడి తల్లిపై మూకమ్మడిగా దాడికి దిగారు. దుస్తులు చింపేశారు. గ్రామంలో అర్థనగ్నంగా ఊరేగించి, వీడియో తీశారు. ఆ వీడియో వైరల్ కావడంతో దేశ వ్యాప్త చర్చకు దారితీసింది. పోలసులు ఐదుగురు అనుమానితులను అరెస్ట్ చేశారు. కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

K Venkateswara Rao | 10:15 AM, Sun Apr 07, 2024

ఏఐతో భారత్‌లో ఎన్నికలకు విఘాతం కలిగించే కుట్రకు చైనా తెర : మైక్రోసాఫ్ట్ హెచ్చరిక

త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరకొరియా గ్రూపుల సహకారంతో చైనా విఘాతం కలిగించే ప్రమాదముందని మైక్రోసాఫ్ట్ హెచ్చరించింది. మైక్రోసాఫ్‌ సంస్థలోని ఇంటిలిజెన్స్ వ్యవస్థ ఈ విషయాన్ని పసిగట్టిందని ఆ సంస్థ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ వెల్లడించారు. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ఉపయోగించి చైనా ఇటీవల జరిగిన తైవాన్ ఎన్నికల్లోనూ కుట్ర చేసినట్లు మైక్రోసాఫ్ట్ గుర్తుచేసింది.


రాబోయే కొద్ది రోజుల్లో అమెరికా, భారత్ ఎన్నికల్లోనూ ఏఐ ఉపయోగించి తప్పుడు సమాచారం ప్రాచుర్యంలోకి తీసుకురావడం ద్వారా ప్రజలు ఓటు వేసేప్పుడు సరైన నిర్ణయం తీసుకోవడంలో విఫలమవుతారని మైక్రోసాఫ్ట్ గుర్తించింది. ఏఐ ద్వారా చైనా వ్యతిరేక ప్రభుత్వాలు నడుస్తోన్న దేశాలు, శత్రుదేశాల్లో విష ప్రచారం చేయడం ద్వారా ఓటర్లను తప్పుదారి పట్టించే ప్రమాద ముందని ఇటీవల ప్రధాని మోదీని కలసిన మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్ హెచ్చరించారు.


ఇటీవల అమెరికా అధ్యక్షుడు బైడెన్ చెప్పినట్లుగా ఒక వాయిస్ సృష్టించి, అక్కడ అధ్యక్ష అభ్యర్థి ఎన్నికల్లో ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం జరిగినట్లు మైక్రోసాఫ్ట్ గుర్తుచేసింది. ఓటింగ్ చేసే ప్రజలను తప్పుదారి పట్టించడం ద్వారా సరైన అభ్యర్థిని ఎన్నుకోవడంలో విఫలమయ్యేలా, తద్వారా ప్రయోజనం పొందాలని చైనా భావిస్తున్నట్లు మైక్రోసాప్ట్ చేసిన హెచ్చరికలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

K Venkateswara Rao | 14:16 PM, Sat Apr 06, 2024

అమెరికాలోని జీయర్ ఆలయంపై రూ.8.3 కోట్లకు దావా

అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో జీయర్ ట్రస్టుపై కేసు నమోదైంది. జీయర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో టెక్సాస్‌ రాష్ట్రంలో అష్టలక్ష్మీ దేవాలయం నడుస్తోంది. మతపరమైన కార్యక్రమంలో ఓ బాలుడికి ఎర్రగా కాల్చిన కడ్డీతో శంఖు, చక్రం ముద్రలు శరీరంపై వేయడంపై కేసు నమోదైంది. బాలుడి తండ్రి విజయ్ ఆలయ నిర్వహణ సంస్థ జీయర్ ట్రస్ట్‌పై రూ.8.3 కోట్ల పరిహారం కోరుతూ దావా వేశారు.


తన కుమారుడిని మాజీ భార్య గుడికి తీసుకు వచ్చిందని, కాల్చిన కడ్డీలతో ముద్రలు వేయడానికి తన అనుమతి తీసుకోలేదంటూ విజయ్ అనే వ్యక్తి కోర్టులో దావా వేశారు. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో బాలలకు పచ్చబొట్లు వేయడం, కాల్చడం లాంటివి నిషేధించారు. దీనిపై అష్టలక్ష్మీ ఆలయం నిర్వాహకులు జీయర్ ట్రస్టు స్పందించాల్సి ఉంది.

K Venkateswara Rao | 11:38 AM, Sat Apr 06, 2024

అమెరికాలో రోడ్డు ప్రమాదం : చిన్నారి సహా తెలుగు మహిళ మృతి

అమెరికాలో గత ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీకి చెందిన గీతాంజలి తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. చికిత్స పొందుతూ ఆమె సోమవారం రాత్రి మరణించారు. ఎన్టీఆర్ జిల్లా కొణకంచికి చెందిన కమతం గీతాంజలి చికిత్స పొందుతూ చనిపోయినట్లు కుటుంబ సభ్యులు ప్రకటించారు. గీతాంజలి కుమార్తె ప్రమాద ఘటన జరిగిన ప్రాంతంలోనే మరణించిన సంగతి తెలిసిందే.అమెరికాలోని పోర్టుల్యాండ్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నరేష్, అతని కుమారుడు బ్రమణ్‌కు గాయాలు కాగా, భార్య గీతాంజలి, కుమార్తె చనిపోయారు.
ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు చనిపోవడం, మరో ఇద్దరికి తీవ్రంగా గాయాలు కావడంతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. చనిపోయిన వారి మృతదేహాలను కొణకంచికి తీసుకువచ్చే ఏర్పాట్లు చేస్తున్నారు.

K Venkateswara Rao | 09:21 AM, Tue Apr 02, 2024

బాబా తేర్సెమ్ హత్య కేసులో పురోగతి

ఉత్తరాఖండ్‌లోని ఉధమ్‌సింగ్ నగర్ జిల్లా నానక్‌మట్టా సాహిబ్ గురుద్వారా చీఫ్ బాబా తేర్సెమ్ హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. తేర్సెమ్ హత్యకు సంబంధించిన మాజీ ఐఏఎస్ అధికారి సహా ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.బాబా టార్సెమ్ సింగ్ గురువారం గురుద్వారా ఆవరణలో ఉండగా మోటార్ బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు దగ్గర నుంచి కాల్చి చంపిన సంగతి తెలిపిందే. కాల్పులకు తెగబడ్డ వారు సరబ్‌జిత్ సింగ్, అమర్జీత్ సింగ్‌గా పోలీసులు గుర్తించారు. తాజాగా పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో నానక్‌మట్టా గురుద్వారా ప్రబంధక్ కమిటీ అధ్యక్షుడు మాజీ ఐఏఎస్ అధికారి హర్బన్స్‌సింగ్ చుగ్‌తోపాటు బాబా అనూప్ సింగ్, ప్రాంతీయ సిక్కు సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ప్రీతమ్ సింగ్ సంధు కూడా ఉన్నారని జిల్లా ఎస్పీ తెలిపారు.కాల్పులకు తెగబడిన సరబ్‌జిత్ సింగ్ పంజాబ్‌లోని తరన్ తరణ్ నివాసిగా గుర్తించారు. ఇక అరమర్జీత్ సింగ్ యూపీలోని రాంపూర్‌కు చెందిన వాడిగా పోలీసులు చెబుతున్నారు. వారిపై ఐపీసీ 302, 120బి, 34 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

K Venkateswara Rao | 15:50 PM, Sat Mar 30, 2024

మందు తాగడానికి రూ.70 ఇవ్వలేదని...

సభ్య సమాజం తలదించుకునే ఘటన విజయవాడలో చోటు చేసుకుంది. మద్యానికి బానిసైన ఓ వ్యక్తి, తాగడానికి రూ.70 ఇవ్వలేదని మందుబాటిల్‌తో పొడిచాడు. మంగళవారం విజయవాడ భానునగర్‌లో ఈ అరాచకం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.
విజయవాడ భానునగర్‌కు చెందిన పి. వంశీ, జి. దుర్గారావు స్నేహితులు. కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. మంగళవారం రాత్రి ఓ బార్ వద్ద ఇద్దరూ మందు తాగేందుకు వచ్చారు. మద్యం కొనుగోలు చేసేందుకు రూ.70 కావాలంటే వంశీ తన స్నేహితుడు దుర్గారావును అడిగాడు. అతను ఇవ్వడానికి నిరాకరించాడు. దీంతో వంశీ అక్కడే ఉన్న బీరు బాటిల్ పగులకొట్టి దాడి చేశాడు. అనేక సార్లు సీసాతో పొడవడంతో దుర్గారావు అపస్మారకస్థితిలోకి వెళ్లాడు. పోలీసులకు సమాచారం అందించడంతో వెంటనే వారు అక్కడికి చేరుకుని గాయపడ్డ దుర్గారావును ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాణాపాయం తప్పిందని డాక్టర్లు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.

K Venkateswara Rao | 10:00 AM, Thu Mar 28, 2024

ఓడ ఢీకొని కుప్పకూలిన బ్రిడ్జి

ఓడ ఢీకొని చైనాలో బ్రిడ్జి కుప్పకూలిన విషయం మరవక ముందే, అమెరికాలోనూ ఇలాంటి ఘటన జరిగింది. అమెరికాలోని బాల్టిమోర్ నగరంలో ఫ్రాన్సిస్ స్కాట్ వంతెనను ఓ భారీ ఓడ ఢీకొట్టింది. దీంతో ఆ వంతెన కుప్పకూలిపోయింది. ఓడ ఢీ కొట్టడం వల్ల ఐ 695 అనే బ్రిడ్జి కూలిపోయినట్లు అమెరికాకు చెందిన అధికారులు ప్రకటించారు.పటాష్ స్కో నదిపైన నిర్మించిన బ్రిడ్జి కూలిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి.
సోమవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగినట్లు గుర్తించారు. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని డిటెక్టివ్ నికి ఫెనోయ్ వెల్లడించారు. బ్రిడ్జి కూలిపోవడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది.ట్రాఫిక్‌ను ఇతర మార్గాల ద్వారా మళ్లించారు.

K Venkateswara Rao | 13:49 PM, Tue Mar 26, 2024

చైనా నౌకపై  క్షిపణి దాడి

హైతీలు మరోసారి రెచ్చిపోయారు. చైనాకు చెందిన ఆయిల్ ట్యాంకర్‌పై క్షిపణులతో దాడి చేశారు. శనివారం ఎర్రసముద్రంలో ఈ దాడి జరిగింది. ఈ విషయాన్ని అమెరికా కూడా ధ్రువీకరించింది. క్షిపణి దాడి తరవాత నౌకలో మంటలు చెలరేగినట్లు సమాచారం. అరగంటలోనే మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.

పనామా జెండాతో ప్రయాణిస్తోన్న ఓడపై ఈ నెల 23న హౌతీలు క్షిపణితో దాడి చేశారు. దాడికి గురైన నౌకను చైనాకు చెందిన ఆయిల్ ట్యాంకర్‌గా గుర్తించారు. శనివారం సాయంత్రం 4 గంటల తరవాత ఘటన చోటు చేసుకుంది. క్షిపణి దాడిలో నౌక దెబ్బతింది. ఇది మంగళూరు వెళుతోందని తెలుస్తోంది. యెమెన్ సమీపంలోని మోఖాకు 23 మైళ్ల దూరంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

K Venkateswara Rao | 13:43 PM, Sun Mar 24, 2024

జమ్మూ కశ్మీర్‌లో జైష్ ఏ మహమ్మద్ ఉగ్రవాదుల అరెస్ట్

జమ్మూ కశ్మీర్‌లో భద్రతా దళాలు కీలక ఉగ్రవాదులను అరెస్ట్ చేశాయి. జేకే పోలీస్ సహకారంతో భద్రతా దళాలు చేపట్టిన ఆపరేషన్‌లో జైష్ ఏ మహమ్మద్‌ ఉగ్ర ముఠాకు కీలకంగా పనిచేస్తోన్న నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.జమ్మూ కశ్మీర్ పోలీసులతో శ్రీగనర్‌లో చేపట్టిన తనిఖీల్లో కీలక ఉగ్రముఠాకు చెందిన నలుగురికి రక్షణ దళాలు అదుపులోకి తీసుకున్నాయి. వారి నుంచి ఆయుధాలు, పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి, విచారణ కొనసాగిస్తున్నారు. ఈ విషయాలను జమ్మూ పోలీస్ అధికారి ఒకరు ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

K Venkateswara Rao | 11:13 AM, Sun Mar 24, 2024

బెజవాడలో రెచ్చిపోయిన బ్లేడ్‌బ్యాచ్

గత కొంత కాలంగా ప్రశాంతంగా ఉన్న విజయవాడ ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. బెజవాడ బస్టాండ్‌లో బ్లేడ్ బ్యాచ్ వీరంగం వేసింది. తెల్లవారుజామున 4 గంటల సమయంలో నేరుగా పోలీసులు, ఆర్టీసి సిబ్బందిపైనే బ్లేడ్ బ్యాచ్ దాడికి దిగింది.బ్లేడ్ బ్యాచ్, మరికొందరు మందుబాబులు బస్టాండ్లో నిద్రించారు. ప్రయాణీకుల ఫిర్యాదులో వారిని బెంచీలు ఖాళీ చేయించే ప్రయత్నం చేసిన పోలీసులపై బ్లేడ్ బ్యాచ్ తిరగబడింది.పోలీసులపై వంద మంది దాడికి దిగారు.బ్లేడ్ బ్యాచ్ తిరుగుబాటు చేయడంతో పోలీసులు పరుగులు తీశారు. ఆర్టీసి ఉద్యోగి సాంబయ్యకు గాయాలయ్యాయి.తెల్లవారుజామున బస్టాండ్లో ప్రయాణీకులు పరుగులు తీశారు. కాసేపు అసలు ఏం జరుగుతోందో అర్థకాలేదని ప్రయాణీకులు చెపుతున్నారు. సాంబయ్యపై దాడికి దాగిన వారిలో కొందరిని పట్టుకుని స్టేషన్‌కు తరలించారు. రైల్వేస్టేషన్‌లోకి యాచకులు, బ్లేడ్ బ్యాచ్‌ను రానీయకపోవడంతో వారంతా బస్లాండ్లో నిద్రిస్తున్నారు.తెల్లవారుజామున వారిని ఖాళీ చేయించేందుకు పోలీసులు ప్రతిరోజూ నానా తంటాలు పడుతున్నారు.

K Venkateswara Rao | 10:16 AM, Sun Mar 24, 2024

పశ్చిమ బెంగాల్ సీఎం తలకు గాయం : డాక్టర్ల అనుమానాలు

పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ తూలి పడటంతో తలకు బలమైన గాయాలయ్యాయి. గురువారం రాత్రి కోలకతా కాళీఘాట్‌లోని మమతా బెనర్జీ ఇంట్లో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ఆమెకు చికిత్స అందిస్తోన్న డాక్టర్లు మాత్రం వెనక నుంచి ఎవరో నెట్టడం వల్లే ఆమె పడిపోయి ఉంటారని అనుమానం వ్యక్తం చేయడం సంచలనంగా మారింది.నుదుటి మీద గాయం కావడంతో సీఎం మమతా బెనర్జీ ఆసుపత్రికి వచ్చారని ఎస్‌ఎస్‌కేఎం డైరెక్టర్ మణిమోయ్ బందోపాధ్యాయ్ మీడియాకు వెల్లడించారు. వెనక నుంచి నెట్టడం వల్ల ఆమె కిందపడిపోయినట్లు ఆయన అనుమానించారు. అందుకే ఆమె నుదుటికి గాయం అయిందన్నారు. ముక్కుకు కూడా తీవ్ర గాయం కావడంతో రక్తస్రావం జరిగిందని గుర్తించారు. రక్తపోటులో కూడా తీవ్ర హెచ్చుతగ్గులు ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు.గురువారం రాత్రి నుంచి ఎస్‌ఎస్‌కేఎం ఆసుపత్రిలో ఆమెకి చికిత్స అందిస్తున్నారు. మమతా బెనర్జీ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు ఓ అధికారి ప్రకటించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేస్తారా? లేదా అనే విషయం వెల్లడి కావాల్సి ఉంది.

K Venkateswara Rao | 11:36 AM, Fri Mar 15, 2024

యడియూరప్పపై పోక్సో కింద కేసు నమోదు

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తోన్న వేళ కర్ణాటక బీజేపీ సీనియర్ నేత, మాజీ సీఎం యడియూరప్పపై లైంగిక వేధింపుల కింద కేసు నమోదైంది. 17 సంవత్సరాల మైనర్ బాలికపై యడియూరప్ప లైంగిక వేధింపులకు పాల్పడ్డాడనే ఫిర్యాదులు అందాయి. దీంతో పోలీసులు యడియూరప్పపై పోక్సో కింద కేసు నమోదు చేశారు.పోలీసుల కథనం ప్రకారం. మోసం వ్యవహారంలో తమకు న్యాయం చేయాలంటూ ఓ మహిళ, ఆమె కుమార్తె గత నెల 2న యడియూరప్పను కలిశారు.ఆ సమయంలో యడియూరప్ప బాలికను బలవంతంగా గదిలోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడని బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గురువారం బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు అందించగా, వారు కేసు నమోదు చేశారు.దీనిపై యడియూరప్ప స్పందించాల్సి ఉంది. ఆయన కార్యాలయం ఈ ఆరోపణలను ఖండించింది. గతంలో కూడా ఆ మహిళ ఇలాంటి ఫిర్యాదులు చాలా చేసిందని వారు గుర్తు చేశారు. ఆమె ఇలాంటి ఫిర్యాదులు గతంలో 53 చేసినట్లు చెప్పారు.కర్ణాటకలో నాలుగుసార్లు సీఎంగా చేసిన యడియూరప్ప, ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా కూడా చేశారు. నాలుగు నెలల కిందట యడియూరప్ప కుమారుడు విజయేంద్రను కర్ణాటక బీజేపీ అధ్యక్షుడిగా నియమించారు. ప్రస్తుతం యడియూరప్ప బీజేపీ పార్లమెంటరీ బోర్డు మెంబరుగా ఉన్నారు.

K Venkateswara Rao | 10:17 AM, Fri Mar 15, 2024

బంగ్లాదేశ్ నౌక హైజాక్

సముద్రపు దొంగలు రెచ్చిపోయారు. ఈసారి హిందూమహాసముద్రంలో బంగ్లాదేశ్‌కు చెందిన నౌకను హైజాక్ చేశారు. బుధవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగినట్లు నౌక యాజమాన్యం ప్రకటించింది. హైజాక్ చేసిన నౌకను దుండగులు సోమాలియా వైపు తీసుకెళుతున్నట్లు సమాచారం అందుతోంది. అబ్దుల్లా అనే కార్గో నౌక మొజాంబిక్‌లో బొగ్గు నింపుకుని యూఏఈ వైపు వెళుతుండగా హైజాక్‌కు గురైంది.అబ్దుల్లా నౌక హిందూ మహాసముద్రంలో ప్రయాణం చేస్తుండగా దుండగులు ప్రవేశించారు. మారణాయుధాలతో సిబ్బందిని బెదిరించి, నౌకను దారిమళ్లించినట్లు తెలుస్తోంది. నౌకలో 23 మంది సిబ్బంది ఉన్నారు. వారంతా ప్రస్తుతానికి సురక్షితంగా ఉన్నట్లు నౌక యాజమాన్యం ప్రకటించింది. 14 సంవత్సరాల కిందట కూడా బంగ్లాదేశ్ ఓ రవాణా నౌక హైజాక్‌కు గురైంది. అప్పట్లో వంద రోజుల తరవాత విడిచిపెట్టారు. అబ్దుల్లా నౌకను ఎవరు హైజాక్ చేశారనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది. సోమాలియాకు చెందిన పైరేట్లు హైజాక్ చేసి ఉంటారని అనుమానిస్తున్నారు.

K Venkateswara Rao | 10:03 AM, Thu Mar 14, 2024

అర్థరాత్రి ఢిల్లీలో ఎన్‌కౌంటర్ కలకలం

ఢిల్లీలో సోమవారం అర్థరాత్రి దాటాక జరిగిన ఎన్‌కౌంటర్ తీవ్ర కలకలం రేపింది. పోలీసులకు, గ్యాంగ్‌స్టర్‌లకు మధ్య చోటుచేసుకున్న ఎదురు కాల్పుల్లో ఇరువర్గాలకు గాయాలయ్యాయి.ఈశాన్య ఢిల్లీలోని అంబేద్కర్ కళాశాల సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఎదురుకాల్పుల్లో పోలీసులు సైతం గాయపడ్డారు.ఢిల్లీలోని హాశిమ్ ముఠాకు చెందిన ముగ్గురు గూండాలు మార్చి9న ఒక వ్యక్తిని కాల్చి చంపారు.ఈ ఘటనపై కేసు నమోదైంది. వారిని పట్టుకునేందుకు పోలీసులు వెళ్లగా గ్యాంగ్‌స్టర్లు ఎదురు కాల్పులు జరిపారు. ఆత్మరక్షణ కోసం పోలీసులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు గ్యాంగ్‌స్టర్ల కాళ్లకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించినట్లు డీసీపీ జాయ్ టిర్కీ వెల్లడించారు. హత్యాయత్నం, హత్య సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి విచారిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

K Venkateswara Rao | 09:47 AM, Tue Mar 12, 2024

గూఢచర్యం అనుమానంతో మజగావ్ డాక్ ఉద్యోగి అరెస్ట్

పాకిస్తాన్‌కు కీలక సమాచారం చేరవేస్తున్నాడనే అనుమానంతో ముంబైలోని మజగావ్ డాక్ యార్డులో పనిచేస్తున్న ఓ కీలక ఉద్యోగిని మహారాష్ట్ర యాంటీ టెర్రర్ స్క్వాడ్ అరెస్ట్ చేసింది. డాక్ యార్డులో స్ట్రక్చరల్ ఫ్యాబ్రికేటర్‌గా చేస్తోన్న కల్పేష్ బైకర్ పాకిస్తాన్ మహిళ హానీట్రాప్‌లో పడ్డాడు. ఆమెకు కీలక సమాచారం అందిచారనే అనుమానాలపై అరెస్ట్ చేశారు. సోషల్ మీడియా ద్వారా పరిచయమైన పాకిస్తాన్‌కు చెందిన మహిళలకు కల్పేష్ నెల రోజులుగా సంబంధాలు నెరపుతున్నట్లు గుర్తించారు. కీలక సమాచారం ఇచ్చి ఆమె నుంచి డబ్బు తీసుకున్నట్లు తెలుస్తోంది.కల్ఫేష్‌ను ఏటీఎస్ అధికారులు విచారించారు. 2021 నవంబర్ నుంచి 2023 మే వరకు ఫేస్‌బుక్, వాట్సాప్ ద్వారా పాక్ మహిళతో మాట్లాడినట్లు గుర్తించారు.అధికారిక రహస్యాల చట్టం కింద బైకర్‌ను అరెస్ట్ చేశారు. పాక్ ఏజంట్‌కు బైకర్ ఎలాంటి సమాచారం పంపించాడనే దానిపై ఏటీఎస్ అధికారులు విచారణ జరుపుతున్నారు.బైకర్‌పై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.

K Venkateswara Rao | 15:59 PM, Mon Mar 11, 2024

హైదరాబాద్ మహిళ : ఆస్ట్రేలియాలో దారుణ హత్య

తెలుగు మహిళ ఆస్ట్రేలియాలో దారుణ హత్యకు గురైంది. స్వయానా కట్టుకున్న భర్తే కాలయముడిలామారి హత్య చేశాడని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. హైదరాబాద్‌కు చెందిన శ్వేతను, అశోక్‌రాజు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆస్ట్రేలియాలో ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు. ఇటీవల వారి మధ్య విభేదాలు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో భార్య శ్వేతను హత్య చేసి ముక్కలు ముక్కలు చేసి చెత్త డబ్బాలో కుక్కేశాడు. తరవాత వారు నివాసం ఉంటే ఇంటికి దూరంగా తీసుకెళ్లి పడేశాడు. నాలుగేళ్ల కుమారుడితో కలసి అశోక్‌రాజు హైదరాబాద్ వచ్చేశాడు.మార్చి 5న దంపతుల మధ్య గొడవ జరిగింది. ఆవేశంలో అకోశ్ రాజు, శ్వేత గొంతు నొక్కడంతో ఊపిరాకడ చనిపోయినట్లు ఆస్ట్రేలియా పోలీసులు దర్యాప్తులో వెల్లడైంది. కారులో శ్వేత మృతదేహాన్ని తీసుకెళ్లి 82 కి.మీ. దూరంలో పడేశాడు. వెంటనే కుమారుడితో కలసి ఏమీ తెలియనట్లు హైదరాబాద్ వచ్చేశాడు. కుమారుడిని తల్లిదండ్రులకు అప్పగించేందుకు వచ్చానని, ఆస్ట్రేలియా వెళ్లి పోలీసులకు లొంగిపోతానని, ఆవేశంలో ఇలా జరిగిందంటూ అశోక్ రాజు చెప్పుకొచ్చాడు.

K Venkateswara Rao | 10:57 AM, Mon Mar 11, 2024

అత్యంత కరడుగట్టిన ఉగ్రవాది మృతి

అల్ ఖైదా ఉగ్రసంస్థ యెమెన్ శాఖ నాయకుడు ఖలీద్ అల్ బటర్ఫీ మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి. అతని మృతికి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఖలీద్ చనిపోయినట్లు అల్‌ఖైదా అధికారికంగా ప్రకటించింది. అల్ ఖైదా జెండా కప్పివున్న ఖలీద్ మృతదేహం వీడియోలు వైరల్ అయ్యాయి. అతని వయసు 40 సంవత్సరాలు ఉండవచ్చని తెలుస్తోంది.ఖలీద్ తలపై అమెరికా రూ.50 కోట్ల రివార్డు ప్రకటించింది. ఆ దేశంపై దాడులకు అనేకసార్లు ప్రయత్నాలు చేయడంతో భారీ రివార్డు ప్రకటించింది. ఒసామా బిన్ లాడెన్ హతమైన తరవాత, అల్ ఖైదాలో యెమెన్ శాఖ అత్యంత ప్రమాదకరంగా తయారైంది. ఖలీద్ మృతి చెందడంతో యెమెన్ శాఖ బాధ్యతలు అతేఫ్ అల్ అవ్లాకీకి అప్పగించారు.


అమెరికాలో వాణిజ్య విమానం కూల్చేందుకు 2009లో అల్ ఖైదా యెమెన్ శాఖ కుట్రపన్నిందని తేలింది. 2015లో ఫ్రాన్స్‌లో జరిగిన బాంబు దాడులు కూడా ఆ శాఖ పనిగా వెల్లడైంది. అల్ ఖైదా యెమెన్ శాఖను ప్రపంచంలో అంత్యంత ప్రమాదకరమైన శాఖల్లో ఒకటిగా అమెరికా ప్రకటించింది.

K Venkateswara Rao | 10:03 AM, Mon Mar 11, 2024

ఉపాధ్యాయ నియామకాల్లో అక్రమాలు : బెంగాల్‌లో ఈడీ దాడులు

టీచర్స్ నియామకాల్లో అక్రమాల వ్యవహారంలో మధ్యవర్తులుగా వ్యవహరించారనే అనుమానంతో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు పశ్చిమబెంగాల్‌లోని ఆరు ప్రాంతాల్లో ఏక కాలంలో దాడులు నిర్వహిస్తోంది. ఉపాధ్యాయుల నియామకాల్లో మధ్యవర్తులుగా వ్యవహరించిన ప్రసన్న కుమార్ రాయ్‌తోపాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. విద్యాశాఖ మాజీ మంత్రి పార్థ చటర్జీకి ప్రసన్న కుమార్ రాయ్ అత్యంత సన్నిహితుడుగా గుర్తించారు. ఇప్పటికే మాజీ మంత్రి పార్థ చటర్జీ జుడీషియల్ కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే.


పతార్‌ఘట్ట న్యూ సిటీ ప్రాంతంలో ఈడీ దాడులు నిర్వహించింది. ఉపాధ్యాయ పోస్టుల అక్రమ నియామకాల్లో మధ్యవర్తుల ఇళ్లు, కార్యాలయాలు లక్ష్యంగా ఈ దాడులు జరుపుతున్నారు. ఈ కేసు విచారణలో భాగంగా జనవరి నెలలో ఈడీ, బెంగాల్‌లోని ఏడు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. తాజాగా ప్రసన్నకుమార్‌కు చెందిన రెండు విలాసవంతమైన బంగ్లాల్లో సోదాలు జరుపుతున్నారు. మాజీ మంత్రి పార్థ చటర్జీ నుంచి సీబీఐ అధికారులు ఇప్పటికే రూ.21 కోట్ల అక్రమంగా దాచిన నగదు స్వాధీనం చేసుకున్న సంగతి తెలసిందే.

K Venkateswara Rao | 13:07 PM, Fri Mar 08, 2024

ప్రొ.సాయిబాబా నిర్దోషి : బాంబే హైకోర్టు

నిషేధిత మావోయిస్టు గ్రూపులతో సంబంధాలున్నాయంటూ అరెస్టైన ఢిల్లీ యూనివర్శిటీ మాజీ ప్రొఫెసర్ జి.ఎన్.సాయిబాబాకు ఊరట లభించింది. ముంబై హైకోర్టు పరిధిలోని నాగపూర్ బెంచ్ ఆయన్ని నిర్దోషిగా ప్రకటించింది. మావోయిస్టులతో సంబంధాలున్నాయనే ఆరోపణలపై 2014 నుంచి ఆయన్ను జైల్లో ఉంచారు. ఈ కేసులో సాయిబాబాకు గతంలో సెషన్స్ కోర్టు జీవిత ఖైదు విధించింది. ఆ తీర్పును హైకోర్టు బెంచ్ నిలిపేసింది.సాయిబాబాపై మోపిన ఆరోపణలు రుజువు చేయడంలో ప్రాసిక్యూషన్ విఫలమైనట్లు ధర్మాసనం అభిప్రాయపడింది. అతనిపై ఉన్న అభియోగాలు కొట్టివేస్తున్నట్లు ప్రకటించింది.ప్రొఫెసర్ సాయిబాబాతోపాటు అరెస్టైన మరో ఐదుగురికి కూడా ఊరట లభించింది. వారిని కూడా నిర్దోషులుగా ప్రకటించింది. దీనిపై స్టే ఇవ్వాలని ప్రాసిక్యూషన్ కోరలేదు. మహారాష్ట్ర ప్రభుత్వం దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం కనిపిస్తోంది.కేసు పూర్వాపరాలు..

మావోయిస్టులతో సంబంధాల నేపథ్యంలో 2014లో ప్రొఫెసర్ సాయిబాబా అరెస్టయ్యారు. ఆయనతోపాటు మరో ఐదుగురుని కూడా మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. కేసును జాతీయ దర్యాప్తు సంస్థకు బదిలీ చేశారు. 2017లో గడ్చిరోలి సెషన్స్ కోర్టు అందరికీ జీవిత ఖైదు విధించింది. సెషన్స్ కోర్టు తీర్పును నిందితులు హైకోర్టులో సవాల్ చేశారు.

K Venkateswara Rao | 12:40 PM, Tue Mar 05, 2024

క్షిపణిదాడిలో భారతీయుడు మృతి

ఇజ్రాయెల్‌పై లెబనాన్ నుంచి ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఓ భారతీయుడు చనిపోయాడు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వీరు కేరళకు చెందిన వారిగా గుర్తించారు. సోమవారం జరిగిన దాడిలో పొలంలో పనిచేస్తోన్న భారతీయుడు మృతిచెందాడు. చనిపోయిన వ్యక్తి కేరళలోని కొల్లం జిల్లాకు చెందిన పట్నిటిన్ మాక్స్‌వెల్‌గా గుర్తించారు.


లెబనాన్ నుంచి జరిపిన క్షిపణిదాడిలో ఇజ్రాయెల్ ఉత్తర సరిహద్దుల్లో పొలంలో పనిచేస్తోన్న వారు గాయపడ్డారని ఐడీఎఫ్ ప్రకటించింది. ఉగ్రదాడిలో ఒకరు అక్కడిక్కడే చనిపోయారు. మరో ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో జోసెఫ్ జార్జ్, పాల్ మెల్విన్‌ ఉన్నారు. గాయపడిన వారు కూడా భారతీయులే కావడం గమనార్హం.లెబనాన్ నుంచి హిజ్బొల్లా ఉగ్రవాదులు దాడులకు తెగబడినట్లు తెలుస్తోంది. ఈ ఉగ్ర ముఠా హమాస్‌కు అనుకూలంగా పనిచేస్తోంది. అక్టోబరు 7న ఇజ్రాయెల్‌పై హమాస్ ఉగ్రదాడికి దిగినప్పటి నుంచి హిజ్బొల్లా కూడా వారికి అనుకూలంగా దాడులకు దిగుతోంది.


గాజాలో దాడులు తీవ్రతరం చేసిన ఇజ్రాయెల్, అప్పడప్పుడు లెబనాన్‌లో ఉగ్రశిబిరాలపై కూడా దాడులకు దిగుతోంది. ఇజ్రాయెల్ సైన్యం లెబనాన్‌పై జరిపిన దాడుల్లో 229 మంది మరణించారని హిజ్బోల్లా ప్రకటించింది.

K Venkateswara Rao | 09:57 AM, Tue Mar 05, 2024

పూరి ఆలయంలోకి అక్రమంగా చొరబడ్డ బంగ్లాదేశీయులు

ఒడిషాలోని ప్రసిద్థ పుణ్యక్షేత్రం పూరీ ఆలయంలో అన్యమతస్తులు చొరబడ్డారు. బంగ్లాదేశ్ జాతీయులు కొందరిని ఒడిషాలోని పూరీ ఆలయంలో చూశామని విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇద్దరు బంగ్లాదేశీయులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.హిందూయేతరులు దేవాలయంలోకి చొరబడినట్లు తమకు ఫిర్యాదు అందినట్లు పోలీసులు తెలిపారు.ఇద్దరి అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు జిల్లా ఎస్పీ సుశీల్ మిశ్రా వెల్లడించారు. హిందువులకు మాత్రమే ఆలయంలోకి ప్రవేశం ఉందని ఆయన గుర్తు చేశారు. హిందువులు కాని వారు దేవాలయంలోకి ప్రవేశిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.అదుపులోకి తీసుకున్న వారిలో ఒకరు హిందువని, పాస్‌పోర్ట్ ద్వారా తెలుసుకున్నారు. మరో వ్యక్తి గురించి తెలియాల్సి ఉంది. మొత్తం నలుగురు ఆలయంలోకి ప్రవేశించారని అనుమానిస్తున్నారు.

K Venkateswara Rao | 13:37 PM, Mon Mar 04, 2024

చదువుకోమని చెప్పినందుకు గొంతుపిసికి చంపేశారు

చదువుకోవాలంటూ సూచించినందుకు స్టడీ అవర్ ఇంఛార్జిగా ఉన్న డిగ్రీ విద్యార్థి వెంకట్‌ను ఇంటర్మీడియట్ విద్యార్థులు దారుణంగా చంపారు. ఈ ఘటన తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా బోధన్ బీసీ హాస్టల్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.బోధన్ బీసీ హాస్టల్‌కు డిగ్రీ విద్యార్థి వెంకట్ స్టడీ అవర్ ఇంఛార్జిగా చేస్తున్నాడు. ఆదివారం కొందరు ఇంటర్ విద్యార్థులు చిట్‌చాట్ చేసుకుంటున్నారు. ముచ్చట్లు ఆపేసి చదువుకోవాలని వెంకట్ వారికి సూచించారు. అది నచ్చని ఆరుగురు విద్యార్థులు అర్థరాత్రి నిద్రిస్తోన్న వెంకట్‌పై దాడి చేశారు. ఊపిరాడకుండా చేసి చంపేశారు. పెనుగులాటలో శబ్దం రావడంతో తోటి విద్యార్థులు నిద్ర లేచారు.అనంతరం ఆరుగురు విద్యార్ధులు అక్కడ నుంచి పారిపోయారు. వెంకట్‌ను ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మరణించినట్లు వైద్యులు చెప్పారు. ఎట్టకేలకు ఆరుగురు విద్యార్థులను పోలీసులు పట్టుకుని, విచారణ జరుపుతున్నారు.

K Venkateswara Rao | 12:15 PM, Mon Mar 04, 2024

మరో పాక్ ఉగ్రవాది అనుమానాస్పద మృతి

పాకిస్థాన్‌లో కీలక ఉగ్రవాది అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తెహ్రీక్ ఉల్ ముజాహిద్దీన్ సంస్థకు చీఫ్‌గా వ్యవహరిస్తోన్న షేక్ జమీల్ ఉర్ రహ్మాన్ ఖైబర్, పాక్‌లో అబొటాబాద్‌లో అనుమానాస్పదంగా చనిపోయినట్లు ఆదేశ స్థానిక మీడియా కథనాల ద్వారా తెలుస్తోంది. హిజ్బుల్, లష్కరే సంస్థలను ఇతను సహకారం అందిస్తోన్నట్లు భారత్ గుర్తించింది.రెండేళ్ల కిందటే ఇతన్ని భారత్ ఉగ్రవాదిగా ప్రకటించింది. జమీల్ స్వస్థలం కశ్మీర్‌లోని పుల్వామా కాగా, సరిహద్దులు దాటి పాక్ పారిపోయాడు. పాక్ ఇంటెలిజెన్స్ ఐఎస్ఐ ఆదేశాల మేరకు జమీల్ పనిచేస్తున్నట్లు భారత్ గుర్తించింది. ఇతని మరణంతో ఉగ్రకార్యకలాపాలు తగ్గాయని భారత్ భావిస్తోంది.ఇటీవల కాలంలో అనేక మంది కీలక ఉగ్రవాదులు అనుమానాస్పదంగా మృతిచెందారు. ముంబై పేలుళ్ల సూత్రదారి, లష్కరే ఉగ్రవాది అజామ్ చీమా ఇటీవల మృత్యువాతపడ్డారు. గత ఏడాది డిసెంబరులో లష్కరే కమాండర్ అడ్నాన్ అహ్మద్ అకా కూడా కరాచీలో జరిగిన కాల్పుల్లో చనిపోయాడు. షహీద్ కూడా హత్యకు గురయ్యాడు.

K Venkateswara Rao | 13:14 PM, Sun Mar 03, 2024

లిక్కర్ డాన్‌కు చెందిన రూ.400 కోట్ల ఫాంహౌస్ కూల్చివేత

మద్యం మాఫియా డాన్ పాంటీ చంద్రకు చెందిన రూ.400 కోట్ల ఫాం హౌస్‌ను ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీ కూల్చి వేసింది. ప్రభుత్వ భూమిని కబ్జా చేసి, అక్రమంగా ఎలాంటి అనుమతులు లేకుండా ఫాం హౌస్ నిర్మించారని డీడీఏ అధికారులు వెల్లడించారు. లిక్కర్ డాన్‌గా పేరున్న పాంటీ చంద్ర ఆలియాస్ గుర్దీప్‌సింగ్‌కు చెందిన పది ఎకరాల్లో నిర్మించిన విలాసవంతమైన రూ.400 కోట్ల విలువైన భవనాన్ని శుక్రవారం నాడు కూల్చివేసినట్లు ఢిల్లీ పోలీసులు ప్రకటించారు.ప్రభుత్వ భూమిని కబ్జా చేసి, ఎలాంటి అనుమతులు లేకుండా ఫాం హౌస్ నిర్మించినట్లు అధికారులు ప్రకటించారు. శుక్రవారం, శనివారం రెండు రోజుల పాటు భారీ యంత్రాలతో ఫాం హౌస్‌లో నిర్మించిన భవనాలను కూల్చివేశారు. అక్రమంగా నిర్మించిన వాణిజ్య భవనాలను గత జనవరి మాసంలోనూ కూల్చివేసినట్లు అధికారులు గుర్తుచేశారు.

K Venkateswara Rao | 10:23 AM, Sun Mar 03, 2024

బెంగళూరు పేలుడు ఘటనలో నలుగురు అరెస్ట్

బెంగళూరు రామేశ్వరం కేఫ్‌లో ఇటీవల చోటు చేసుకున్న పేలుడుపై కేంద్ర దర్యాప్తు సంస్థ రంగంలోకి దిగింది. ఇప్పటికే కర్ణాటక పోలీసులు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఇడ్లీ తిని కుక్కుర్ బాంబు ఉన్న బ్యాగ్‌ను వదిలేసి వెళ్లిపోయిన వ్యక్తికి సంబంధించిన సీసీ టీవీ వీడియోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఐదు కి.మీ పరిధిలోని దాదాపు 300 సీసీటీవీల ఫుటేజీ పరిశీలించడం ద్వారా పోలీసులు అనుమానితుడి వీడియో విడుదల చేశారు.
తెల్లటోపీ, నోటికి మాస్కుతో రామేశ్వరం కేఫ్ దిశగా వెళ్లడం, వచ్చేప్పుడు బ్యాగు లేకుండా వెళ్లడంతో అతనిపైనే పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. టైమర్ బాంబు అమర్చడం ద్వారా పేలుళ్లకు పాల్పడినట్లు తెలుస్తోంది.


రామేశ్వరం కేఫ్‌లో పేలుడు తరవాత స్వాధీనం చేసుకున్న పదార్థాలను విశ్లేషించిన నిపుణులు ఆడీఎక్స్ ఉపయోగించినట్లు గుర్తించారు. కుందేనహళ్లి నుంచి బీఎంటీసీ బస్సులో ప్రయాణం చేసి రామేశ్వరం కేఫ్‌కు అనుమానితుడు చేరుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఘటన జరిగిన ప్రదేశాన్ని సీఎం సిద్దరామయ్య కూడా పరిశీలించారు. ఘటనలో గాయపడ్డ వారిని ఆసుపత్రిలో పరామర్శించారు.రెండు సంవత్సరాల కిందట కూడా కుక్కుర్ బాంబు పేలింది. ఈ రెండు ఘటనల మధ్య ఏమైనా సంబంధాలున్నాయా అనే విషయంపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.

K Venkateswara Rao | 09:57 AM, Sun Mar 03, 2024

విద్యార్ధుల విషాద యాత్ర

విద్యార్థుల విహార యాత్ర విషాద యాత్రగా మారింది. చిత్తూరు జిల్లా పలమనేరు ప్రభుత్వ కళాశాల విద్యార్థుల విహార యాత్ర విషాదంగా ముగిసింది. మహాబలిపురం వద్ద సముద్రంలో ముగ్గురు విద్యార్థులు కొట్టుకుపోయి మరణించారు. పోలీసులు అందించిన వివరాల ప్రకారం.పలమనేరు ప్రభుత్వ కాలేజీలో బీ ఒకేషనల్ డిగ్రి ద్వితీయ సంవత్సరం చదువుతోన్న విద్యార్థులు తమిళనాడులోని మహాబలిపురం యాత్రకు వెళ్లారు. బంగారుపాళ్యం మండలం కేసీ కండ్రిగ సమీపంలోని నలగాంపల్లెకు చెందిన విజయ్, మోషిష్, ప్రభు సముద్రపు అలల్లో చిక్కుకుని మరణించారు.కళాశాలలో ఉద్యోగమేళా నిర్వహిస్తున్నారు. వారం రోజులపాటు కళాశాలకు సెలవులు ప్రకటించారు. దీంతో 18 మంది విద్యార్థులు సరదాగా గడిపేందుకు విహారయాత్రకు వెళ్లారు. కళాశాల అధ్యాపకులు అధికారికంగా చేపట్టిన యాత్ర కాదని ప్రకటించారు. పేద కుటుంబాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు ప్రమాదంలో చనిపోవడంతో వారి కుటుంబాల్లో విషాదం నింపింది. మృతదేహాలను ఇంకా స్వగ్రామాలకు తరలించాల్సి ఉంది.

K Venkateswara Rao | 09:40 AM, Sun Mar 03, 2024

క్షమాపణలు చెప్పండి : వీడియో డిలీట్ చేయండి..లేదంటే

కాంగ్రెస్ సీనియర్ నేతల వీడియో పోస్ట్‌పై కేంద్ర ఉపరితల రవాణా మంత్రి గడ్కరీ సీరియస్ అయ్యారు. తాను మాట్లాడిన వీడియోను, ఎడిట్ చేసి అర్థం మారేలా చేసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి జైరాం రమేశ్‌కు లీగల్ నోటీసులు పంపించారు.దేశంలో పేదలు, కూలీలు, రైతులు సంతోషంగా లేరంటూ, గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు సరిగా లేవని, ఆసుపత్రులు, పాఠశాలలు సక్రమంగా లేవంటూ తాను మాట్లాడినట్లుగా ఓ వీడియోను ఎడిట్ చేసి, తన పరువుకు భంగం కలిగించడంతోపాటు, బీజేపీలో నాయకుల మధ్య సైద్ధాంతిక విభేదాలు సృష్టించే విధంగా వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంపై కేంద్ర మంత్రి గడ్కరీ న్యాయపరమైన చర్యలకు ఉపక్రమించారు.తాను మాట్లాడిన సందర్భాన్ని చెప్పకుండా, అర్థం మార్చి వేసి వీడియోను సోషల్ మీడియాలో పెట్టిన కాంగ్రెస్ సీనియర్ నేతలకు నోటీసులు పంపించారు. వెంటనే క్షమాపణలు చెప్పాలని గడ్కరీ కోరారు.


K Venkateswara Rao | 10:50 AM, Sat Mar 02, 2024

నావల్నీ అంత్యక్రియలకు అన్నీ ఏర్పాట్లు : ముందుకురాని వాహన డ్రైవర్లు

రష్యా ప్రతిపక్ష నేత నావల్నీ కుటుంబ సభ్యులను కష్టాలు వెంటాడుతున్నాయి. ఎట్టకేలకు నావల్నీ మృతదేహాన్ని పుతిన్ ప్రభుత్వం వారి కుటుంబ సభ్యులకు అప్పగించింది. వారు నావల్నీ మృతదేహాన్ని వాహనంలో శ్మశానానికి తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ముందుగా ఒక వేదికపై ప్రజల సందర్శనార్థం ఉంచాలని చూశారు.ప్రభుత్వానికి భయపడి చాలా మంది వేదిక ఇవ్వడానికి ముందుకు రాలేదు. ఎట్టకేలకు ఓ వేదిక లభించింది. వాహనం సిద్దం చేశారు. కానీ వాహనం నడిపేందుకు డ్రైవర్లు ముందుకు రావడం లేదు. బెదిరింపు కాల్స్ వస్తున్నాయని అందుకే ఎవరూ రావడం లేదని నావల్నీ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.ఇవాళ సాయంత్రానికి నావల్నీ అంత్యక్రియలు పూర్తి చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. మాస్కోలోని బోరిసోవ్ శ్మశాన వాటికల్లో అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు.పుతిన్ అరాచక పాలనపై ప్రతిపక్ష నేతగా నావల్నీ తీవ్ర విమర్శలు చేశారు. అతనిపై అనేకసార్లు హత్యాయత్నాలు కూడా జరిగాయి. అయినా ప్రజల గొంతుకగా నిలిచాడు. 2021లో నావల్నీపై విషప్రయోగం కూడా జరిగింది. వెంటనే చికిత్స చేయడంతో ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఇటీవల ఫిబ్రవరి 16న సైబీరియాలోని పీనల్ కాలనీలో నావల్నీ అనుమానాస్పదంగా చనిపోవడం ప్రపంచాన్ని నివ్వెరపరచింది. ఇది రష్యా అధికారపార్టీ హత్యగా అమెరికా అధ్యక్షుడు బైడెన్ తీవ్ర విమర్శలు చేశారు.

K Venkateswara Rao | 15:38 PM, Fri Mar 01, 2024

ఢిల్లీ జేఎన్‌యూలో విద్యార్థుల మధ్య ఘర్షణ : ముగ్గురికి గాయాలు

ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీలో విద్యార్ధుల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్, వామపక్ష మద్దతు గ్రూపుల మధ్య చెలరేగిన ఘర్షణల్లో ముగ్గురు విద్యార్థులు గాయపడ్దారని పోలీసులు తెలిపారు. త్వరలో విద్యార్ధుల సంఘం ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేశారు. గురువారం రాత్రి జరిగిన సమావేశంలో ఈ ఘటన చోటు చేసుకుంది. విద్యార్ధుల దాడులతో యూనివర్శిటీలో ఘర్షణ వాతావరణం నెలకొంది.యూనివర్శిటీలోని స్కూల్ ఆఫ్ లాంగ్వేజెస్‌లో ఎన్నికల కమిటీ సభ్యుల ఎంపిక జరిగే క్రమంలో విద్యార్ధుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. గాయపడిన విద్యార్థులను సమీపంలోని సప్థర్‌జంగ్ ఆసుపత్రిలో చేర్పించారు. అయితే ఘర్షణలపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.
స్కూల్ ఆఫ్ లాంగ్వేజెస్, లిటరేచర్ అండ్ కల్చరల్ స్టడీస్ విద్యార్థులపై జరిగిన దాడిని పలువురు ఏబీవీపీ నాయకులు ఖండించారు.

K Venkateswara Rao | 11:01 AM, Fri Mar 01, 2024

ముంబై రైళ్లలో బాంబుపేలుళ్ల సూత్రధారి నిర్ధోషిగా విడుదల

మూడు దశాబ్దాల కిందట ముంబై రైళ్లలో జరిగిన బాంబుపేలుళ్ల కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్న లష్కర్ ఏ తయ్యబా ఉగ్రవాది అబ్దుల్ కరీం తుండాను రాజస్థాన్‌లోని ప్రత్యేక కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. 1992లో బాబ్రి మసీదు కూల్చివేత జరిగిన ఏడాది పూర్తైన సందర్భంగా 1993లో ముంబై రైళ్లలో బాంబు పేలుళ్లకు పాల్పడినట్లు లష్కర్ ఏ తయ్యబా ప్రకటించిన సంగతి తెలిసిందే.


రైళ్లలో బాంబు పేలుళ్లకు పాల్పడిన కేసులో తుండాపై సరైన సాక్ష్యాలు లేకపోవడంతో నిర్ధోషిగా ప్రకటించింది. ఇదే కేసులో అమీనుద్దీన్, ఇర్ఫాన్‌లను రాజస్థాన్‌లోని ప్రత్యేక కోర్టు దోషులుగా తేల్చింది. వీరిద్దరికీ న్యాయమూర్తి జీవిత ఖైదు విధించారు. 84 సంవత్సరాల తుండా అనేక బాంబు పేలుళ్ల కేసుల్లో నిందితుడిగా ఉన్నారు. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంతోనూ సంబంధాలున్నాయనే ఆరోపణలున్నాయి. బాంబులు తయారు చేయడంతో ఇతను దిట్ట.ముంబై రైళ్లలో బాంబు పేలుళ్లు అప్పట్లో దేశాన్ని కుదిపేశాయి. ఆ తరవాత కోటా, కాన్పూర్, సికింద్రాబాద్, సూరత్‌లలో కూడా రైళ్లలో పేలుళ్లు చోటుచేసుకున్నాయి. ఈ కేసులను ప్రత్యేక న్యాయస్థానం విచారణ జరిపింది.

K Venkateswara Rao | 13:40 PM, Thu Feb 29, 2024

సందేశ్‌ఖాలీ దురాగతాల నిందితుడు షాజహాన్ అరెస్ట్

పశ్చిమబెంగాల్‌లోని సందేశ్‌ఖాలీలో మహిళలపై లైంగిక దాడులు, భూ కబ్జాల ఆరోపణలు ఎదుర్కొంటోన్న షాజహాన్ షేక్‌ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు ప్రకటించారు. పశ్చిమబెంగాల్‌కు చెందిన ప్రత్యేక పోలీసు బృందం నార్త్ 24 పరగణాల జిల్లాలో షాజహాన్‌ను అర్థరాత్రి అరెస్ట్ చేసినట్లు ఇవాళ ఉదయం చెప్పారు. గడచిన 55 రోజులుగా షాజహాన్ షేక్ పరారీలో ఉన్నాడు. అరెస్ట్ అనంతరం అతన్ని బసిర్‌హత్ కోర్టుకు తరలించారు.షాజహాన్‌ను అరెస్ట్ చేయలని కలకత్తా కోర్టు ఆదేశించిన మూడు రోజుల తరవాత ఎట్టకేలకు పోలీసులు ఆ పని పూర్తి చేశారు. ఈ నెల 26న షాజ్‌హాన్‌ అరెస్టును అడ్డుకోవడం లేదని కలకత్తా హైకోర్టు తేల్చి చెప్పింది.సందేశ్‌ఖాలీ కేసుపై ఎలాంటి స్టే లేదని కూడా ధర్మాసనం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.


కోర్టుల వల్లే షాజహాన్‌ను అరెస్ట్ చేయడం సాధ్యం కావడం లేదంటూ తృణమూల్ నేతలు చెప్పుకుంటూ వచ్చారు. కలకత్తా హైకోర్టుతోపాటు, గవర్నర్ కూడా ఆగ్రహం వ్యక్తం చేయడంతో షాజహాన్ అరెస్ట్ చూపారు. గత కొంత కాలంగా షాజహాన్ పోలీసుల అదుపులోనే ఉన్నాడని పశ్చిమబెంగాల్ బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.

K Venkateswara Rao | 10:43 AM, Thu Feb 29, 2024

హర్యానా ఐఎన్‌ఎల్‌డీ అధ్యక్షుడు హత్య వెనుక యూకే గ్యాంగ్‌స్టర్!

ఇండియన్ నేషనల్ లోక్‌దళ్ హర్యానా రాష్ట్ర అధ్యక్షుడు నఫే సింగ్ రాఠీ హత్య వెనుక బ్రిటన్‌కు చెందిన గ్యాంగ్‌స్టర్ హస్తం ఉందని చండీగఢ్ పోలీసులు అనుమానిస్తున్నారు. నఫే సింగ్ హత్య వెనుక ప్రమేయం ఉన్న వారిని గుర్తించేందుకు గ్యాంగ్‌స్టర్ సన్నిహితులను విచారిస్తున్నారు. నఫేసింగ్ కారులో ప్రయాణిస్తోండగా జజ్జర్ జిల్లాలో దుండగులు కాల్పులు జరిపి చంపేశారు. ఈ కేసులో 15 మందిపై కేసు నమోదైంది. ప్రముఖ రాజకీయ నాయకులతో సంబంధాలున్న వీరేంద్ర రాఠా, సందీప్ రాఠీ పేర్లను కూడా ఎఫ్ఐఆర్‌లో చేర్చారు.నషేసింగ్ హత్యలో యూకేలో నివశిస్తోన్న భారత్‌కు చెందిన ఓ గ్యాంగ్‌స్టర్ ప్రమేయం ఉందనే అనుమానాలు బలపడుతున్నాయి. గ్యాంగ్‌స్టర్ ముఠా సభ్యులతో బీజేపీ మాజీ ఎమ్మెల్యే నరేశ్ కౌశిక్‌కు కూడా సంబంధాలున్నాయని తెలుస్తోంది. అతని పేరును కూడా నఫేసింగ్ హత్య కేసులో చేర్చారు. తీహార్ జైల్లో పలు కేసుల్లో శిక్ష అనుభవిస్తోన్న కొందరు ఖైదీలను కూడా పోలీసులు విచారిస్తున్నారు. నఫేసింగ్ హత్య కేసును సీబీఐకి అప్పగిస్తామని హర్యానా సీఎం ప్రకటించారు.

K Venkateswara Rao | 12:14 PM, Tue Feb 27, 2024

అతడిని అరెస్ట్ చేయండి : కలకత్తా హైకోర్టు ఆదేశం

పశ్చిమబెంగాల్‌లోని సందేశ్‌ఖాలీలో ఓ వర్గం మహిళలపై కొందరు అరాచకవాదులు లైంగికదాడులకు దిగారనే ఆరోపణలపై కలకత్తా హైకోర్టు విచారణ జరిపింది. కేసును సుమోటాగా స్వీకరించిన హైకోర్టు, ప్రధాన నిందితుడైన షాజహాన్ షేక్‌ను అరెస్ట్ చేయకుండా ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదని చెప్పింది. అతన్ని వెంటనే అరెస్ట్ చేయాలని అధికారులను ఆదేశించింది.


ప్రధాన నిందితుడు అరెస్ట్ కాకుండా కోర్టులు, పోలీసుల చేతులు కట్టిపడేశాయంటూ స్థానిక టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ చేసిన వ్యాఖ్యలను న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. షాజహాన్ అరెస్ట్‌ను నిలుపుదల చేయలేదని కోర్టు స్పష్టం చేసింది. షాజహాన్ అరెస్ట్‌పై స్టే ఇవ్వలేదని తెలిపింది.అనేక నేరాల్లో షాజహాన్ షేక్ నిందితుడిగా ఉన్నాడని, అరెస్ట్ చేయాల్సిందేనని ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ కేసులో ఈడీ, సీబీఐ, పశ్చిమ బెంగాల్ హోం కార్యదర్శిని కూడా ఇంప్లీడ్ చేస్తున్నట్లు కోర్టు తెలిపింది. తదుపరి విచారణను మార్చి 4కు వాయిదా వేసింది.

K Venkateswara Rao | 15:45 PM, Mon Feb 26, 2024

అంతర్జాతీయ డ్రగ్స్ దందాలో డీఎంకే నేత

సినీ నిర్మాత, డీఎంకే ఎన్‌ఆర్ఐ విభాగం నేత ఏఆర్ జాఫర్ సాదిక్ అంతర్జాతీయ డ్రగ్స్ దందాలో కూరుకుపోయారు. గత వారం పూణేలో రూ.2500 కోట్ల విలువైన డ్రగ్స్‌ను పోలీసులు సీజ్ చేశారు. తీగలాగితే డొంక కదిలింది. ఈ ముఠా వెనుక తమిళనాడుకు చెందిన సినీ నిర్మాత, డీఎంకె నేత సాదిక్ హస్త ముందని తేలింది. దీంతో డీఎంకే నుంచి సాదిక్‌ను తొలగిస్తూ ఆ పార్టీ నిర్ణయం తీసుకుంది. పార్టీ పరువు దెబ్బతినేలా చేయడం, క్రమశిక్షణ ఉల్లంఘించినందుకు పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి కూడా సస్పెండ్ చేస్తున్నట్లు డీఎంకే కార్యదర్శి దురైమురుగన్ ప్రకటించారు.డ్రగ్స్ వ్యవహారం తమిళనాట సంచలనంగా మారింది. డీఎంకే నేత డ్రగ్స్ వ్యవహారంపై సీఎం స్టాలిన్ వివరణ ఇచ్చుకోవాలంటూ బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై డిమాండ్ చేశారు. ఈ డ్రగ్స్ మాఫియా నెట్‌వర్క్ న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, మలేషియాలకు కూడా విస్తరించిందని పోలీసుల విచారణలో వెల్లడైంది. ఇందులో సాదిక్ కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. సాదిక్ పరారీలో ఉన్నాడు. పోలీసులు అతనికోసం వెతుకుతున్నారు.

K Venkateswara Rao | 13:45 PM, Mon Feb 26, 2024

ఆరువారాల కాల్పుల విరమణ దిశగా ఇజ్రాయెల్

ఇజ్రాయెల్ హమాస్ ఉగ్రవాదుల మధ్య ఆరు వారాల కాల్పుల విరమణకు పారిస్ వేదికగా చర్చలు జరుగుతున్నాయి.కాల్పుల విరమణపై ఇప్పటికే ఒక ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. 300 మంది పాలస్తీనా ఖైదీల విడుదలకు బదులుగా, 40 మంది ఇజ్రాయెల్ బందీలను విడుదల చేసేందుకు ఇరువర్గాలు అంగీకరించినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన విడుదల చేయాల్సి ఉంది.పారిస్‌లో జరిగిన చర్చలపై వార్ కేబినెట్‌లో మరోసారి చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని ఇజ్రాయెల్ రాయబారులు ప్రకటించారు. ఇజ్రాయెల్ చేస్తోంది నరమేధమంటూ బ్రెజిల్ అధ్యక్షుడు లూలా ద సిల్వ తీవ్ర విమర్శలు చేశారు. చిన్నారులను,మహిళలను దారుణంగా హతమారుస్తున్నారని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఇజ్రాయెల్ నరమేధానికి తలపడతోందంటూ దక్షిణాఫ్రికా అంతర్జాతీయ న్యాయస్థానంలో ఫిర్యాదు చేసింది. గాజాలోని వెస్ట్‌బ్యాంక్‌లో 3500 ఇళ్లు నిర్మిస్తామంటూ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు చేసిన వ్యాఖ్యలపై అమెరికా అధ్యక్షుడు బైడెన్ తీవ్ర విమర్శలు చేశారు. ఇజ్రాయెల్ చర్యలను తప్పుపట్టారు.

K Venkateswara Rao | 09:55 AM, Sun Feb 25, 2024

నోటుకు ప్రశ్న కేసులో మహువాకు చుక్కెదురు

లోక్‌సభలో ప్రశ్నలు వేసేందుకు డబ్బు తీసుకున్నారనే ఆరోపణలపై ఎంపీ పదవి కోల్పోయిన తృణమూల్ కాంగ్రెస్ మాజీ ఎంపీ మహువా మొయిత్రాకు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. విదేశీ ద్రవ్య నిర్వహణ చట్టం కింద నమోదైన కేసులో, రహస్య సమాచారాన్ని ఈడీ మీడియాకు లీక్ చేస్తోందని, దాన్ని ఆపాలంటూ మహువా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. మహువా అభ్యర్థనను డిల్లీ హైకోర్టు తిరస్కరించింది.

మహువా అభ్యర్థనపై విచారించిన జస్టిస్ సుబ్రహ్మణ్యం ప్రసాద్ ధర్మాసనం కేసును కొట్టేసింది. మహువా తరపున సీనియర్ న్యాయవాది వాదనలు వినిపించారు. ఈడీ సమన్లు మహువాకు అందకముందే మీడియాకు ఎలా అందుతున్నాయని ఆయన ప్రశ్నించారు. మహువాకు ఈ నెల 15న సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే.

K Venkateswara Rao | 11:20 AM, Sat Feb 24, 2024

చైనా హ్యాకర్ల చేతికి భారత సంస్థల కీలక సమాచారం

చైనా హ్యాకింగ్ ముఠాల అరాచకాలు పెచ్చుమీరిపోతున్నాయి. తాజాగా భారత సంస్థలపై దాడి చేశారు. కీలక సమాచారం దొంగిలించారు. పలు దేశాల నుంచి కీలక సమాచారం కొల్లగొట్టినట్లు తెలుస్తోంది. దీనిపై వాషింగ్టన్ పోస్ట్ సంచలన కథనం ప్రచురించింది. చైనా ప్రభుత్వ మద్దతుతోనే హ్యాకర్లు చెలరేగిపోయినట్లు తెలుస్తోంది.


కంపెనీలు, ప్రభుత్వాల కీలక సమాచారం లక్ష్యంగా చేసుకుని చైనా హ్యాకర్లు దాడులకు తెగబడినట్లు వాషింగ్టన్ పోస్ట్ వివరించింది. సాప్ట్‌వేర్ లోపాలను ఆసరాగా చేసుకుని ఈ దాడులు జరిగాయి. చైనా వాణిజ్య రాజధాని షాంఘైలోని ఐసూన్ కంపెనీకి చెందిన హ్యాకర్లు కీలక సమాచారం తస్కరించినట్లు ఆ పత్రిక పేర్కొంది.


చైనా ప్రభుత్వానికి ఈ సంస్థ హ్యాకింగ్ సేవలు అందిస్తోంది. హ్యాకర్ల ద్వారా విదేశాలకు చెందిన కీలక సమాచారం కాజేసి చైనాకు అప్పగించడమే ఐసూన్ పనిగా పెట్టుకుంది. ఇందుకు చైనాతో ఎంఓయూలు కూడా చేసుకుంది. భారత్, తైవాన్, బ్రిటన్, మలేషియాతోపాటు మరో 20 దేశాల సమాచారం చైనా హ్యాకర్లు కాజేశారంటూ వాషింగ్టన్ పోస్ట్ ప్రచురించిన కథనం ఇప్పుడు సంచలనంగా మారింది.

K Venkateswara Rao | 10:26 AM, Sat Feb 24, 2024

నావల్నీ కుటుంబ సభ్యులను పరామర్శించిన అమెరికా అధ్యక్షుడు

రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రత్యర్థి, ప్రతిపక్ష నేత నావల్నీ హత్య సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. నావల్నీ మరణంపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో, వారి కుటుంబ సభ్యులను కాలిఫోర్నియాలో అమెరికా అధ్యక్షుడు బైడెన్ పరామర్శించారు. నావల్నీ సతీమణి యులియా, కుమార్తె దాశాలతో బైడెన్ భేటీ అయ్యారు. నావల్నీ లేని లోటు తీరనిదని, వారికి ధైర్యం చెప్పారు. నావల్నీ అనుమానాస్పదంగా చనిపోయిన తరవాత, రష్యా అధ్యక్షుడు పుతిన్ మరిన్ని ఆంక్షలు విధించే అవకాశం కనిపిస్తోంది.


తన కుమారుడు నావల్నీ మృతదేహాన్ని కూడా చూడనీయకపోవడం, సైనికులు రహస్యంగా అంత్యక్రియలు చేయడంపై అతని తల్లి లియుడ్మిలా వాపోయారు. అంత గొప్ప నాయకుడికి అంతిమయాత్ర కూడా లేకుండా, రహస్యంగా అంత్యక్రియలు చేయడంపై ఆమె తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ వీడియో పోస్ట్ చేశారు.


K Venkateswara Rao | 14:35 PM, Fri Feb 23, 2024

రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్యే మృతి

ఘోర రోడ్డు ప్రమాదంలో తెలంగాణలోని కంటోన్మెట్ ఎమ్మెల్యే లాస్య నందిత చనిపోయారు. ఎమ్మెల్యే ప్రయాణిస్తోన్న కారు పటాన్‌చెరు సమీపంలో రెయిలింగ్‌ను ఢీ కొట్టింది. ఈ దుర్ఘటనలో ఎమ్మెల్యే అక్కడికక్కడే చనిపోగా, పీఏ ఆకాశ్, డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.కొద్ది రోజుల కిందటే కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత గాయపడ్డారు. నల్గొండలో బీఆర్ఎస్ నిర్వహించిన సభ నుంచి తిరిగి ఇంటికి వెళుతుండగా నార్కట్‌పల్లి వద్ద ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో కారు ఆటోను ఢీకొట్టింది. నార్కట్‌పల్లి వద్ద పది రోజుల కిందట జరిగిన ప్రమాదంలో హోంగార్డు ప్రాణాలు కోల్పోయాడు.కంటోన్మెంట్‌ పలు దఫాలు ఎమ్మెల్యేగా సేవలు అందించిన సాయన్న కుమార్తె లాస్య నందిత. గత ఏడాది ఫిబ్రవరిలో సాయన్న మృతి చెందారు. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో లాస్య నందిత గెలుపొందారు. ఇంతలోనే ఆమె రోడ్డు ప్రమాదంలో చనిపోవడం అభిమానుల్లో విషాదం నింపింది.K Venkateswara Rao | 09:39 AM, Fri Feb 23, 2024

బైజూస్ సీఈవోకు లుక్‌అవుట్ నోటీసులు

ఎడ్ టెక్ సంస్థ బైజూస్ వ్యవస్థాపకుడు రవీంద్రన్‌‌కు ఈడీ లుక్ అవుట్ నోటీసులు (lookout notice to byjus ceo) జారీ చేసింది. ఇటీవల ఈ సంస్థ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన సంగతి తెలిసిందే. రవీంద్రన్ దేశం విడిచి వెళ్లకుండా చూడాలంటూ సంబంధిన వర్గాలను ఈడీ ఆదేశించింది. గత ఏడాది కాలంలో బైజూస్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి దిగజారిపోయింది.ఇప్పటికే ఈడీ అధికారులు బెంగళూరులోని బైజూస్ ప్రధాన కార్యాలయంతోపాటు, రవీంద్రన్ ఇంట్లో కూడా సోదాలు నిర్వహించారు. రవీంద్రన్‌పై ఆన్ ఇంటిమేషన్ లుక్‌అవుట్ సర్క్యులర్ అమల్లో ఉంది. విదేశాలకు వెళ్లేప్పుడు ఈడీకి ముందుగా సమాచారం అందించాల్సి ఉంది. తాజా నిర్ణయంతో రవీంద్రన్ విదేశాలకు వెళ్లే అవకాశం ఉండదు.


బైజూస్ సీఈవో పదవి నుంచి రవీంద్రన్‌ను తొలగించేందుకు వాటాదారులు బోర్డు సమావేశానికి పిలుపునిచ్చారు. కొత్త బోర్డును ఎన్నుకునే అవకాశముంది. రేపు బోర్డు సమావేశం జరగనుంది. వాటాదారుల నిర్ణయాన్ని సవాల్ చేస్తూ బైజూస్ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించింది.

K Venkateswara Rao | 13:15 PM, Thu Feb 22, 2024

సందేశ్‌ఖాలీ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం : డీజీపీ

పశ్చిమబెంగాల్‌లోని సందేశ్‌ఖాలీలో (sandeshkhali violence) చోటుచేసుకుంటోన్న అత్యాచారాలపై ఆ రాష్ట్ర డీజీపీ రాజీవ్ కుమార్ స్పందించారు. సందేశ్‌ఖాలీలో రాత్రంగా అక్కడే ఉండి బాధితుల పిర్యాదులు స్వీకరించిన డీజీపీ, బాధ్యులపై కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. పశ్చిమ బెంగాల్‌లోని నార్త్ 24 పరగణాల జిల్లాలోని సమస్యాత్మక ప్రాంతాల్లో ఒకటైన సందేశ్‌ఖాలీలో డీజీపీ బుధవారం రాత్రి పర్యటించారు. మహిళలను హింసించే వారిపై కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు.ప్రతి పిర్యాదును స్వీకరిస్తున్నట్లు డీజీపీ మీడియాకు తెలిపారు. ఎలాంటి హింసకు దిగినా కఠిన చర్యలుంటాయన్నారు. బుధవారం రాత్రి సితులియా, సర్ధార్‌పురా, మణిపూర్ పరిసర దీవులను కూడా డీజీపీ సందర్శించారు. అక్కడి పరిస్థితిని గమనించి చర్యలకు ఉపక్రమిస్తున్నారు. లైంగిక హింస, భూకబ్జా ఆరోపణలపై దర్యాప్తునకు జాతీయ మానవ హక్కుల కమిషన్ నియమించిన ప్రత్యేక బృందం ఇవాళ సదేశ్‌ఖాలీలో సందర్శించనున్న నేపథ్యంలో డీజీపీ ముందస్తు పర్యటన రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.

K Venkateswara Rao | 10:22 AM, Thu Feb 22, 2024

నావల్నీ శరీరంపై గాయాలు : వైద్యుడి ధృవీకరణ

రష్యా ప్రతిపక్ష నాయకుడు అలెక్సీ నావల్నీ మరణంపై మిస్టరీ వీడటం లేదు. ఆయన మృతదేహంపై గాయాల సంకేతాలున్నాయంటూ ఓ వైద్యుడు మీడియాకు చెప్పడం ఇప్పుడు సంచలనంగా మారింది. జైలులో చనిపోయిన వారి మృతదేహాలను నేరుగా ఫారిన్ మెడిసిన్ బ్యూరోకు తరలిస్తారు. అయితే నావల్నీ మృతదేహాన్ని మాత్రం కొన్ని కారణాల వల్ల క్లినికల్ ఆసుపత్రికి తీసుకెళ్లారని తెలుస్తోంది. నావల్నీ (russia opposition leader death mistery) శరీరంపై మూర్చ సమయంలో నొక్కితే వచ్చే గుర్తులున్నాయని ఓ వైద్యుడు ప్రకటించారు.నావల్నీ ఆకస్మిక మరణ సిండ్రోమ్ కారణంగా చనిపోయాడని అధికారులు అతడి తల్లి లియుడ్మిలాకు చెప్పారు. ఆమె న్యాయవాదితో సహా జైలుకు వచ్చారు. కానీ నావల్నీ మతదేహాన్ని చూడటానికి అనుమతించలేదు. విచారణ పూర్తి అయ్యే వరకు మృతదేహాన్ని కూడా అప్పగించలేమని అధికారులు చెప్పారు.నావల్నీని అధికారులే చంపారనే ఆరోపణలు వస్తున్నాయి. అందుకే నావల్నీ మృతదేహాన్ని అప్పగించడానికి కూడా నిరాకరిస్తున్నారని ఆయన కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. నావల్నీ మరణంపై ఆయన భార్య యులియా కూడా అనుమానాలు వ్యక్తం చేశారు. నావల్నీ మరణానికి పుతిన్ బాధ్యత వహించాల్సి ఉంటుందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంచలన హెచ్చరికలు చేశారు.నావల్నీ అనుమానాస్పద మృతిపై ప్రపంచ దేశాల నుంచి రష్యా అధ్యక్షుడు పుతిన్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు.

K Venkateswara Rao | 10:26 AM, Mon Feb 19, 2024

అరాచకం : గర్భిణిపై సామూహిక అత్యాచారం, ఆపై నిప్పు

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్మాదులు చెలరేగిపోయారు. మానవత్వానికి మచ్చతెచ్చేలా ప్రవర్తించారు. గర్భిణిపై సామూహిక అత్యాచారం (crime news) చేసి, ఆపై ఆమెకు నిప్పుపెట్టారు. ఈ ఘటన ఎంపీలోని మురేనా జిల్లాలో చోటుచేసుకుంది. 80 శాతం కాలిన గాయాలతో మహిళ కొనఊపిరితో ఆసుపత్రిలో కొట్టుమిట్టాడుతోంది. పోలీసుల కథనం ప్రకారం.అత్యాచారం చేశాడనే ఆరోపణలు ఎదుర్కొంటోన్న మహిళ భర్తను రాజీ పేరుతో పిలిచారు.భర్తతో పాటు బాధిత మహిళ కూడా వెళ్లింది. ఆమెపై భర్తతోపాటు, మరో ఇద్దరు కూడా అత్యాచారానికి దిగారు. అనంతరం ముగ్గురూ కలసి బాధితురాలిపై పెట్రోల్ పోసి నిప్పుపెట్టారు. బాధితురాలిని గ్వాలియర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి భర్త అత్యాచారం కేసులో జైలుకు వెళ్లి బెయిలుపై వచ్చాడు. బాధితురాలి వాంగ్మూలాన్ని న్యాయమూర్తి నమోదు చేశారని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

K Venkateswara Rao | 10:08 AM, Sun Feb 18, 2024

తమిళనాడులో భారీ పేలుడు : 9 మంది మృతి

తమిళనాడులో ఘోర దుర్ఘటన చోటుచేసుకుంది. విరుద్‌నగర్ జిల్లాలోని ఓ బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన పేలుడులో (sivakasi blasts) తొమ్మిది మంది కార్మికులు చనిపోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.వెంబకొట్టాయ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు జరిగింది. కెమికల్ మిక్సింగ్ రూములో పేలుడు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. పేలుడు ధాటికి కర్మాగారంతోపాటు, సమీపంలోని నాలుగు భవనాలు ధ్వంసం అయ్యాయి. ఘటనా స్థలంలోనే ఏడుగురు చనిపోయారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలిస్తుండగా మరో ఇద్దరు చనిపోయారని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో మరికొంత మంది గాయపడ్డారు. వారిని శివకాశిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ పేలుడు ఘటన శనివారం ఉదయం జరిగింది.

K Venkateswara Rao | 16:55 PM, Sat Feb 17, 2024

సందర్శకుడిని హతమార్చిన సింహం

తిరుపతి జూలో ఘోరం జరిగింది. లయన్ ఎన్‌క్లోజర్‌లోకి ప్రవేశించిన వ్యక్తిపై సింహం దాడి చేసి చంపేసింది. అతడి తలను పూర్తిగా తినేయడంతో గుర్తించడం కష్టంగా మారింది. దాడికి పాల్పడిన సింహాన్ని అధికారులు బంధించారు. అధికారుల కథనం ప్రకారం.ఈ ఘటన ప్రమాద వశాత్తూ జరిగిందా, సందర్శకుడు కావాలనే సింహంతో ఫోటోలు దిగేందుకు దగ్గరకు వెళ్లాడా అనేది తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. సందర్శకుడు ఎవరు అనేది కూడా తేలాల్సి ఉంది.

K Venkateswara Rao | 16:45 PM, Thu Feb 15, 2024

మహిళ దారుణ హత్య

గుంటూరు జిల్లా తెనాలిలో అరాచకం జరిగింది.తెనాలి భవనంవారి వీధిలో నిద్రిస్తోన్న మహిళ పీక కోసి (crime news) చంపేశారు. పోలీసుల కథనం ప్రకారం. భవనం వారి వీధిలో రామిశెట్టి అలేఖ్య భర్తతో కలసి నివశిస్తోంది. గురువారం ఉదయాన్నే భార్య అలేఖ్య చనిపోయి ఉండటాన్ని గుర్తించిన భర్త రమేశ్ పోలీసులకు సమాచారం అందించాడు.అన్నెం శ్రీనివాస్ కొన్నాళ్లుగా తన భార్య అలేఖ్యను వేధిస్తున్నాడని రమేశ్ తెలిపారు. శ్రీనివాస్ వేధింపులపై కేసు కూడా నమోదై ఉంది. ఆ కేసులో శిక్ష పడుతుందని తెలియడంతో, అలేఖ్య గొంతుకోసి చంపాడని రమేశ్ పోలీసులకు తెలిపాడు.గురువారం తెల్లవారుఝామున హత్య జరిగినట్లు పోలీసులు గుర్తించారు. పదునైన ఆయుధంతో అలేఖ్య గొంతుకోయడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిందని పోలీసులు తెలిపారు. తెలిసినవారే ఈ ఘాతుకానికి పాల్పడి ఉండవచ్చని ప్రాథమిక విచారణలో పోలీసులు తేల్చారు. కేసు నమోదు చేసి విచారణ సాగిస్తున్నారు. నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.

K Venkateswara Rao | 11:52 AM, Thu Feb 15, 2024

నమ్మించాడు - పీకకోసి చంపాడు

ఓ యువకుడి దారుణహత్య తెలంగాణలోని వేములవాడలో కలకలం రేపింది. స్నేహితుడే నమ్మించి తీసుకెళ్లి, తరవాత గొంతుకోసం హత్య చేశాడని తెలుస్తోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. వేములవాడ ఓల్డ్‌అర్బన్ కాలనీకి చెందిన కె.శ్రీధర్, అదేకాలనీలోని బాబు ఇద్దరూ స్నేహితులు. మూడేళ్ల కిందట వీరి మధ్య గొడవలు జరిగాయి. ఆ సమయంలో శ్రీధర్, బాబు బైక్‌కు నిప్పుపెట్టాడు. అది మనసులో పెట్టుకున్న బాబు, ఎలాగైనా పగ తీర్చుకోవాలని భావించాడు. శ్రీధర్‌తో స్నేహం నటించాడు.ఆదివారం శ్రీధర్‌ను పార్టీకి పిలిచిన బాబు, బైపాస్ రోడ్డుకు తీసుకెళ్లాడు. అక్కడే ఇద్దరూ బాగా మద్యం సేవించారు. అర్థరాత్రి తరవాత బాబు, శ్రీధర్ గొంతుకోసి (crime news) చంపాడు. సోమవారం విషయం వెలుగులోకి వచ్చింది. బాబు భార్య భాగ్యరేఖ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. శ్రీధర్‌ను హత మార్చేందుకే బాబు స్నేహంగా ఉంటున్నట్లు నటించాడని పోలీసులు తెలిపారు.

K Venkateswara Rao | 10:18 AM, Tue Feb 13, 2024

చంద్రబాబు బెయిల్ రద్దు పిటీషన్ వాయిదా

స్కిల్ కేసులో ఏపీ హైకోర్టు టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబునాయుడుకు మంజూరు చేసిన బెయిల్‌ను, రద్దు చేయాలంటూ ప్రభుత్వం దాఖలు చేసిన పిటీషన్‌పై విచారణను సుప్రీంకోర్టు (supreme court ) వాయిదా వేసింది. జస్టిస్ పంకజ్ మిట్టల్, జస్టిస్ బేలా ఎం.త్రివేదిల సుప్రీం ధర్మాసనం ఈ విచారణను ఈ నెల 26కు వాయిదా వేసింది. చంద్రబాబు తరపు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా కేసును మూడు వారాలు వాయిదా వేయాలని కోరారు.ఏపీ సీఐడి తరపున న్యాయవాది రంజిత్ కుమార్ స్పందిస్తూ, కౌంటర్ దాఖలు చేయడానికి ఇప్పటికే చాలా సమయం తీసుకున్నారని, మరలా సమయం కోరడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. కౌంటర్ దాఖలు చేశారని, విచారణ చేపట్టాలని కోరారు. తొలుత రెండు వారాల తరవాత విచారణ చేపట్టాలని భావించిన ధర్మాసనం, రంజిత్ కుమార్ వాదనల తరవాత కేసు విచారణను ఈ నెల 26కు వాయిదా వేసింది.

K Venkateswara Rao | 13:35 PM, Mon Feb 12, 2024

గంగూలీ ఫోన్ చోరీ...కీలక డేటాపై ఆందోళన

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ ఫోన్‌ను దొంగలు కాజేశారు. కోల్‌కతాలోని గంగూలీ నివాసానికి పెయింటింగ్ పనులు చేయిస్తున్నాయి. ఈ క్రమంలో కొందరు పెయింటర్లు ఆ పనిలో ఉన్నారు. ఇంట్లో ఆయన ఫోన్ కనిపించకుండా పోవడంతో.....ఆదివారంనాడు గంగూలీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.


చోరీకి గురైన ఫోన్‌లో కీలక సమాచారం ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే ఫోన్ చోరీకి గురైందని తెలియగానే గంగూలీ పోలీసులను ఆశ్రయించారు. వెంటనే ఫోన్ వెతికే పని మొదలైంది. ఇంట్లో పెయింటింగ్ పని చేస్తోన్న కూలీలను, పోలీసులు ప్రశ్నిస్తున్నారు. సీసీ కెమెరాల ఫుటేజీ కూడా స్వాధీనం చేసుకున్నారు. సాధ్యమైనంత త్వరగా తన ఫోన్ వెతికిపెట్టాలని గంగూలీ పోలీసులను కోరారు. ఫోన్ పోయిందనే గకన్నా...అందులోని కీలక డేటా అసాంఘీక శక్తుల చేతిలో పడుతుందనే భయం గంగూలీని వెంటాడుతోంది.

K Venkateswara Rao | 14:45 PM, Sun Feb 11, 2024

తమిళ జాలర్లపై లంక నేవీ దాడులు

తమిళనాడు జాలర్లపై శ్రీలంక నేవీ దాడులపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇటీవల కొంతమంది తమిళ జాలర్లను శ్రీలంక నేవీ అధికారులు అరెస్ట్ చేశారు. దీనిపై తమిళనాడు సీఎం స్టాలిన్, ప్రధాని మోదీకి లేఖ రాశారు. అరెస్టైన మత్స్యకారులను విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చొరవ చూపాలని స్టాలిన్ లేఖలో కోరారు. తమిళజాలర్లను తరచూ అరెస్ట్ చేయడం, పడవలు స్వాధీనం చేసుకోవడం ఆందోళన కలిగిస్తోందని స్టాలిన్ అన్నారు.
శ్రీలంక నేవీ అధికారులు స్వాధీనం చేసుకున్న పడవలను అక్కడి ప్రభుత్వం జాతీయం చేస్తోంది. దీంతో వాటిని విడిపించడం సాధ్యం కావడం లేదు. లక్షల విలువైన పడవలు కోల్పోతోన్న మత్స్యకార కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయి.గత సంవత్సరం శ్రీలంక నేవీ అధికారులు 243 మంది మత్స్యకారులను అరెస్ట్ చేశారు. 37 పడవలు స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల 12 పడవలు, 88 మంది మత్స్యకారులను అరెస్ట్ చేశారు. ఈ సంఖ్య పెరిగిపోతూ ఉండటం ఆందోళన కలిగిస్తోందని, వారిని విడిపించేందుకు దౌత్యపరమైన సంప్రదింపులు జరపాలని స్టాలిన్ లేఖలో కోరారు.

K Venkateswara Rao | 14:11 PM, Sat Feb 10, 2024

జమ్మూ కశ్మీర్‌లో ఎన్ఐఏ దాడులు

జాతీయ భద్రతా సంస్థ (ఎన్ఐఏ) జమ్ముకశ్మీర్‌లో మెరుపుదాడులకు దిగింది. ఉగ్రవాదుల నెట్‌వర్క్‌ను ధ్వంసం చేయడమే లక్ష్యంగా దాడులు జరుగుతున్నట్లు తెలుస్తోంది.ఉగ్రవాదులు ఏర్పాటు చేసుకున్న సదుపాయాలను నిర్వీర్యం చేసేందుకు ఈ దాడులు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. జమ్మూ, కశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో ఎన్ఐఏ అధుకారులు ఏకకాలంలో దాడులకు దిగారు.ఉగ్రవాదులకు నిధులు సమకూర్చడం, యువతను ఉగ్రవాదంలోకి ఆకర్షించడం వంటి కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే కీలక సమాచారంతో ఎన్ఐఏ ఈ దాడులకు దిగింది. జమ్మూలోని గుజ్జర్ నగర్, షహీదు చౌక్ ప్రాంతాల్లో దాడులు కొనసాగుతున్నాయి. ఓ ప్రైవేటు పాఠశాల యజమానికి ఉగ్రవాదులతో సంబంధాలున్నాయనే సమాచారంతో దాడులు కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు.నిషేధిత ఉగ్ర సంస్థ జమాత్ ఏ ఇస్లామీ జమ్ము అండ్ కశ్మిర్‌కు చెందిన ఇద్దరు మాజీ నాయకుల ఇళ్లలో కూడా సోదాలు జరుగుతున్నాయి. జమాత్ మాజీ అధ్యక్షుడు షేక్ గులామ్ హసాన్, మరో నాయకుడు సాయర్ అహ్మద్ రేషి ఇళ్లలో కూడా ఎన్ఐఏ దాడులు చేసింది.

K Venkateswara Rao | 10:53 AM, Sat Feb 10, 2024

నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

నెల్లూరు జిల్లా ముసునూరు టోల్ ప్లాజా వద్ద శుక్రవారం అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం (road accident) చోటు చేసుకుంది. బస్సు, లారీ ఢీ కొనడంతో ఆరుగురు చనిపోయారు.ఆగివున్న లారీని వెనుక నుంచి మరో లారీ వచ్చి ఢీ కొట్టిందని స్థానికులు చెబుతున్నారు. అదే సమయంలో ఎదురుగా వస్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు లారీని ఢీ కొట్టింది. దీంతో ప్రమాదం మరింత పెరిగింది. బస్సు ముందు భాగంలో ఉన్నవారు ఆరుగురు చనిపాయరు. 20 మందికిపైగా గాయపడ్డారని పోలీసుల కథనం ద్వారా తెలుస్తోంది. గాయపడిన వారిని సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రులకు (crime news) తరలించారు.మృతుల సంఖ్య పెరిగే అవకాశాలున్నాయని డాక్టర్లు చెబుతున్నారు. చెన్నై నుంచి హైదరాబాద్ వెళుతోన్న ప్రైవేటు బస్సు ప్రమాదానికి గురైందని పోలీసులు తెలిపారు.

K Venkateswara Rao | 09:45 AM, Sat Feb 10, 2024

తెలంగాణలో ఎన్ఐఏ సోదాలు

జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) హైదరాబాద్‌లోని వరవరరావు మేనల్లుడు వేణుగోపాల్ ఇంట్లో సోదాలు నిర్వహించింది. ఆయనతోపాటు మావోయిస్టు నేత నర్ల రవిశర్మ ఇళ్లలో కూడా ఎన్ఐఏ అధికారులు గురువారం తెల్లవారుజామున సోదాలు నిర్వహించారు. హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్, ఎల్‌బినగర్ ప్రాంతాల్లో దాదాపు నాలుగు బృందాలు సోదాలు నిర్వహించాయి.


మావోయిస్టు మాజీ నేత రవిశర్మ ఇంటి నుంచి ఎన్ఐఏ అధికారులు కీలక సమాచారం స్వాధీనం చేసుకున్నారు. గ్యాంగ్‌స్టర్ నయీం (gangstar nayeem)బెదిరింపులకు సంబందించి వేణుగోపాల్ తన పత్రిక వీక్షణంలో రాసిన కథనాలు, కొందరు మావోయిస్టుల ఫోటోలను ఎన్ఐఏ స్వాధీనం చేసుకుంది. మావోయిస్టుల (crime news) కదలికలపై వచ్చిన పుస్తకాన్ని, కొన్ని కరపత్రాలను కూడా అధికారులు తీసుకెళ్లారు.పట్టణ ప్రాంతాల్లో మావోయిస్టుల కదలికలు పెరగడంతో ఎన్ఐఏ (nia raids)దృష్టి సారించినట్లు తెలుస్తోంది. సంజయ్‌దీపక్‌రావు కనుసన్నల్లో కేరళ, తమిళనాడు, తెలంగాణలోని పట్టణ ప్రాంతాల్లో మావోయిస్టులు (maoists) విస్తరిస్తున్నారనే నిఘా వర్గాల సమాచారం మేరకు ఎన్ఐఏ దాడులు నిర్వహించినట్లు తెలుస్తోంది.తాజా దాడుల్లో కీలక సమాచారం స్వాధీనం చేసుకున్న ఎన్ఐఏ అధికారులు వేణుగోపాల్, రవిశర్మను పదో తేదీ విచారణకు హాజరుకావాలని కోరారు. తమను తప్పుడు కేసుల్లో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని దాడుల అనంతరం వేణుగోపాల్ మీడియాకు చెప్పారు.

K Venkateswara Rao | 09:33 AM, Fri Feb 09, 2024

ఝార్ఖండ్‌లో ఎన్‌కౌంటర్

ఝార్ఖండ్‌లో ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. ఛత్రా జిల్లా బైరియో అటవీ ప్రాంతంలో మావోయిస్టులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు భద్రతా సిబ్బంది (two crpf jawans killed) ప్రాణాలు కోల్పోయారు. బస్తర్‌నగర్, సదర్ మధ్య ఈ కాల్పులు జరిగాయి. ఝార్ఖండ్ రాజధాని రాంఛీకి 200 కి.మీ దూరంలో ఈ ఘటన జరిగింది.
నక్సల్స్ కాల్పుల్లో చనిపోయిన వారిలో గయాలోని వజీర్‌గంజ్‌కు చెందిన సికందర్ సింగ్, పాలముకు చెందిన సుకన్ రామ్ ఉన్నారని అధికారులు తెలిపారు. ఎన్‌కౌంటర్‌లో గాయపడిన ఆకాశ్ సింగ్‌ను రాంచీలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాల్పులు జరిపిన నక్సల్స్ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.మావోయిస్టుల కోసం గాలింపు జరిపి తిరిగి వస్తుండగా భద్రతా సిబ్బందిపై కాల్పుల ఘటన చోటు చేసుకుంది. తృతీయ సమ్మేళన్ ప్రస్తుతి కమిటి ఈ దాడికి దిగినట్లు గుర్తించారు.

K Venkateswara Rao | 09:37 AM, Thu Feb 08, 2024

బాణాసంచా పేలుడు: ఆరుగురి మృతి : 60 మందికి గాయాలు

మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఎంపీలోని హర్దాలో బాణాసంచా ఫ్యాక్టరీలో మంటలు (explosion broke out fire cracker factory) చెలరేగాయి. ఈ దుర్ఘటనలో ఆరుగురు చనిపోయారు. 60 మంది గాయపడ్డారు. మంటలతోపాటు పేలుళ్లు సంభవించాయి. భారీ శబ్దాలు రావడంతో సమీప ప్రాంత ప్రజలు భయంతో పరుగులు తీశారు.మంటల్లో గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని ఓ అధికారి ప్రకటించారు. పేలుడు తీవ్రతకు మాల్వా ప్రాంతంలో ప్రకంపనలు వచ్చినట్లు ప్రజలు చెబుతున్నారు.ఈ ప్రమాదంపై మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ వెంటనే స్పందించారు. అధికారులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సీనియర్ అధికారులను ఘటనా స్థలానికి పంపించారు. గాయపడిన వారిని భోపాల్, ఇండోర్‌లోని వైద్య కళాశాలలకు తరలించారు. అగ్నిమాపక యంత్రాలు మంటలను అదుపు చేశాయని అధికారులు తెలిపారు. ఘటన జరిగినప్పుడు 150 మంది ఫ్యాక్టరీలో ఉన్నట్లు ప్రమాదం నుంచి బయటపడ్డ ఓ కార్మికుడు మీడియాకు వెల్లడించాడు.

K Venkateswara Rao | 14:19 PM, Tue Feb 06, 2024

హాకీ ఆటగాడిపై రేప్ కేసు

భారత హాకీ ఆటగాడు వరుణ్ కుమార్‌పై రేప్ కేసు నమోదైంది. పెళ్లి చేసుకుంటానని మోసం చేసి, తనపై లైంగికదాడి చేశాడని ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.వరుణ్ కుమార్‌కు 2019లో ఇన్‌స్టాలో ఓ యువతి పరిచయం అయింది. అప్పడు ఆమె వయసు 17 సంవత్సరాలు. బెంగళూరులో హాకీ క్రీడలు జరిగినప్పుడు వరుణ్‌ను యువతి కలిసిందని, ఆ సమయంలో లోబరుచుకున్నాడని, పిర్యాదులో బాధితురాలు పేర్కొంది. అప్పటి నుంచి పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డాడని యువతి పిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.హాకీ ఆటగాడు వరుణ్ కుమార్ హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన వ్యక్తి. అయితే పంజాబ్‌లోని జలంధర్‌లో నివాసం ఉంటున్నాడని పోలీసులు గుర్తించారు. వరుణ్‌ను విచారించేందుకు బెంగళూరు తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. వరుణ్ కోసం గాలిస్తున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఇండియా లీగ్‌లో పంజాబ్ వారియర్స్ తరపున వరుణ్ ఆడుతున్నాడు. జాతీయ జట్టులో కూడా వరుణ్ ఆడాడు. టోక్యోలో జరిగిన ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టు కాంస్య పతకం సాధించింది. ఆ జట్టులో వరుణ్ సభ్యుడిగా ఉన్నాడని పోలీసులు వెల్లడించారు.

K Venkateswara Rao | 11:54 AM, Tue Feb 06, 2024

ఎమ్మార్వో హత్య కేసులో ప్రధాన నిందితుడి అరెస్ట్

ఎమ్మార్వో రమణయ్య హత్య కేసులో ప్రధాన నిందితుడు మురారి సుబ్రహ్మణ్యంను పోలీసులు అరెస్ట్ చేశారు. రమణయ్య హత్య తరవాత నిందితుడిని పట్టుకునేందుకు అధికారులు 12 బృందాలను ఏర్పాటు చేశారు. ఏసీపీ త్రినాథ్ నేతృత్వంలో ఓ బృందం చెన్నై వెళ్లింది. అక్కడ సుబ్రహ్మణ్యంను అదుపులోకి తీసుకుని విశాఖ తరలించారు. విశాఖ సీపీ రవిశంకర్ తెలిపిన వివరాల ప్రకారం...భూ వివాదాలే ఎమ్మార్వో రమణయ్య హత్యకు (mro murder case )  దారితీశాయని విశాఖ సీపీ రవిశంకర్ విలేకరులకు వెల్లడించారు. కన్వేయన్స్ డీడ్‌ను ఎమ్మార్వో రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంది. చాలా కాలం నుంచి వాయిదా పడుతోందని ప్రాథమిక విచారణలో వెల్లడైందని సీపీ తెలిపారు. ఎమ్మార్వో రమణయ్య హత్యకు భూ గొడవలు ఒక్కటే కాదని సుబ్రహ్మణ్యం చెబుతున్నారు. పోలీసులు చెబుతున్నదానికి, నిందితుడు చెబుతున్నదానికి పొంతన కుదరడం లేదు. మరిన్ని వివరాలు సేకరించేందుకు డీసీపీ మణికంఠ ఆధ్వర్యంలో ప్రత్యేక టీంను ఏర్పాటు చేశారు. ఎమ్మార్వో రమణయ్య హత్యలో నిందితుడు సుబ్రహ్మణ్యంపై రెండు చీటింగ్ కేసులు ఉన్నట్లు సీపీ తెలిపారు. పూర్తి విచారణ తరవాత రమణయ్య హత్యపై మరిన్ని వివరాలు అందిస్తామని రవిశంకర్ ప్రకటించారు.విశాఖలో భూముల ధరలు పెరిగిపోవడంతో రెవెన్యూ అధికారులకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయనే విషయాన్ని సీపీ గుర్తుచేశారు. కలెక్టర్‌తో చర్చించి రెవెన్యూ అధికారులకు భద్రత కల్పిస్తామన్నారు.

K Venkateswara Rao | 10:30 AM, Tue Feb 06, 2024

గుడికెళదాం రా...అంటూ భార్యను లేపేశాడు

నేరాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. భార్యతో విభేదాలతో అప్పటికే వేరుగా ఉంటోన్న భర్త, తాను మారానని గుడికి వెళదాంరా..అంటూ నటించాడు. నిజమేనని నమ్మిన భార్య అతనితో వెళ్లింది. అంతే దారిలో భార్య తలపై బండరాయితో కొట్టి లోయలో పడేశాడు. ఈ దారుణ హత్య ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. భార్యభర్తలు అదృశ్యం అయ్యారంటూ బంధువులు పెనుగంచిప్రోలు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. విచారిస్తున్న పోలీసులకు త్రివేణి భర్త పద్మాల సురేష్ కనిపించారు. పోలీసులు వారి శైలిలో విచారించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.


సురేష్, త్రివేణికి తొమ్మిదేళ్ల కిందట వివాహం అయింది. వారికి ఎనిమిదేళ్ల కుమారుడు, ఓ కుమార్తె ఉన్నారు. సురేష్ తాపీ పని, త్రివేణి వ్యవసాయ పనులకు వెళుతోంది. ఇటీవల వారి మధ్య గొడవలు మొదలయ్యాయి. వత్సవాయి మండలం, శింగవరంలో వేరుగా కాపురం పెట్టుకున్నారు. గొడవలు తగ్గడంతో మరలా సొంతూరు పెనుగంచిప్రోలు వచ్చారు.భార్యపై కసిపెంచుకున్న సురేష్ ఎలాగైనా వదిలించుకోవాలని ప్రణాళిక వేశాడు. పెనుగంచిప్రోలు మల్లిఖార్జున కొండపై దేవాలయానికి వెళదాం అంటూ తీసుకెళ్లి తలపై రాయితో కొట్టి (crime report) చంపాడు. త్రివేణి మృతదేహాన్ని లోయలో పడేశాడు. ఇద్దరూ కనిపించకపోవడంతో, సురేష్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారిస్తున్న పోలీసులకు సురేష్ కనిపించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

K Venkateswara Rao | 09:58 AM, Tue Feb 06, 2024

రాయలసీమలో కానిస్టేబుల్‌ను చంపేసిన స్మగ్లర్లు

ఎర్రచందనం స్మగ్లర్లు బరితెగించారు. అన్నమయ్య జిల్లాలో వాహనంతో ఢీకొట్టి ఓ కానిస్టేబుల్‌ను చంపేశారు. సోమవారం రాత్రి ఈ దారుణం జరిగింది. తనిఖీలు చేస్తున్న సమయంలో అడ్డుపడ్డ కానిస్టేబుల్‌ను వాహనంతో ఢీకొట్టి స్మగ్లర్లు పారిపోయినట్లు అధికారులు తెలిపారు. కేవీపల్లి మండలం చీనెపల్లె వద్ద ఎర్రచందనం అక్రమ రవాణా అవుతోన్నట్లు వచ్చిన సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు. సుండుపల్లి సరిహద్దు గొల్లపల్లి చెరువు వద్ద వాహనాలను ఆపి తనిఖీలు చేశారు.స్మగ్లర్ల వాహనాన్ని కానిస్టేబుల్ గణేశ్ ఆపే ప్రయత్నం చేశారు. తప్పించుకునే క్రమంలో ఎర్రచందనం స్మగ్లర్లు వారి వాహనంతో కానిస్టేబుల్‌ను బలంగా ఢీ కొట్టి (andhra today crime news)  పరారయ్యారు. ఈ దాడిలో కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేయగా దారిలోనే ప్రాణాలు కోల్పోయాడని పోలీసులు తెలిపారు. స్మగ్లర్ల కోసం గాలింపు చేపట్టి, ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.

K Venkateswara Rao | 09:39 AM, Tue Feb 06, 2024

హమాస్ ఇజ్రాయెల్ యుద్దంలో 220 మంది సైనికులు మృతి

ఇజ్రాయెల్ హమాస్ పోరులో ఇప్పటి వరకు 220 మంది సైనికులు మృతి చెందినట్లు ఐడీఎఫ్ అధికారులు ప్రకటించారు. తాజాగా శనివారంనాడు హమాస్ జరిపిన దాడిలో ఇజ్రాయెల్‌కు చెందిన 24 సంవత్సరాల యువ సైనికుడు ప్రాణాలు కోల్పోయాడని ఐడీఎఫ్ వెల్లడించింది. హమాస్ ఉగ్రవాదులకు, హెజ్బొల్లా ఉగ్రవాదులు కూడా తోడు కావడంతో ఇజ్రాయెల్ సైన్యం లెబనాన్ భూభాగంలో కూడా దాడులు చేయాల్సి వస్తోందని ఐడీఎఫ్ స్పష్టం చేసింది. లెబనాన్ నుంచి హెజ్బోల్లా తీవ్రవాదులు ఇజ్రాయెల్‌పై రాకెట్ దాడులు చేస్తున్నారని ఐడీఎఫ్ తెలిపింది.


అక్టోబర్ 7న హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్ పౌరులపై ఊచకోతకు దిగాక మొదలైన యుద్ధంలో ఇప్పటి వరకు 27019 మంది ప్రజలు చనిపోయారని ఐక్యరాజ్యసమితి ప్రకటించింది.66139 మంది గాయాల పాలయ్యారు. ఇజ్రాయెల్ సరిహద్దులో లెబనాన్ నుంచి హెజ్బోల్లా దాడులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. హమాస్ ఉగ్ర దాడుల్లో ఇప్పటి వరకు 1139 మంది ఇజ్రాయెల్ పౌరులు ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక మీడియా తెలిపింది.

K Venkateswara Rao | 14:10 PM, Sun Feb 04, 2024

నకిలీ యూనిఫామ్‌ల తయారీదారులపై ఉక్కుపాదం

నకిలీలు తయారుచేయడానికి కాదేదీ అనర్హం అన్నట్లు తయారైంది పరిస్థితి. చివరకు ఆర్మీ దుస్తులు కూడా నకిలీవి తయారు చేస్తున్నారు. డిజిటల్ టెక్నాలజీ సాయంతో గత ఏడాది భారత ఆర్మీకి నూతన దుస్తులను డిజైన్ చేశారు. వాటికి మేథోహక్కులు ఉన్నాయి. మరెవరూ రూపొందించడానికి అనుమతి లేదు.తాజాగా పుణె, అహ్మద్‌నగర్‌లో భింగర్ క్యాంప్ పోలీస్ స్టేషన్ పరిధిలో కొందరు నకిలీ యూనిఫామ్‌లు తయారు చేస్తున్నారనే సమాచారంతో ఆర్మీ ఇంటెలిజెన్స్ దాడులు నిర్వహించింది. 40 నకిలీ యూనిఫామ్‌లను స్వాధీనం (crime news) చేసుకుని, ఒకరిని అదుపులోకి తీసుకుంది. ఎలాంటి అనుమతులు లేకుండా యూనిఫామ్ తయారు చేస్తున్నట్లు గుర్తించారు. నిందితుడు నాసిక్ వాసిగా తేలింది.2023లో సైన్యం ఉపయోగించే దుస్తులకు కేంద్ర ప్రభుత్వం రూపకల్పన చేయించింది. తేలిగ్గా ఉండేలా, బలంగా ఉండటంతోపాటు, బాగా గాలి ఆడేలా రూపొందించారు. త్వరగా ఆరిపోవడంతోపాటు, నిర్వహణ కూడా తెలిగ్గా ఉండేలా డిజిటల్ టెక్నాలజీతో తయారు చేశారు. పదేళ్లపాటు సైన్యానికి మేథోహక్కులున్నాయి. ఇప్పటికే 50వేల జతలను సైన్యం కొనుగోలు చేసింది. బహిరంగ మార్కెట్లో సైనిక దుస్తులు తయారుచేయడం, విక్రయించడం, ఉపయోగించడం నిషేధం. అక్రమంగా తయారుచేసే వారిపై క్రిమినల్ కేసులుంటాయని సైన్యానికి చెందిన ఓ అధికారి హెచ్చరించారు.

K Venkateswara Rao | 11:35 AM, Sun Feb 04, 2024

హౌతీలే లక్ష్యంగా అమెరికా ప్రతీకార దాడులు

ఎర్రసముద్రంలో హౌతీల అరాచకాలకు అడ్డుకట్ట వేసేందుకు అమెరికా సిద్దమైంది. ఇటీవల హౌతీ తిరుగుబాటుదారుల (houti rebels attacks) దాడుల్లో ముగ్గురు అమెరికా సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ప్రతీకార దాడులు తప్పవని అమెరికా అధ్యక్షుడు హెచ్చరించిన గంటల వ్యవధిలోనే సైన్యం రంగంలోకి దిగింది. ఇరాక్, ఇరాన్, సిరియాలోని హౌతీలు, రివల్యూషనరీ గార్డుల స్థావరాలే లక్ష్యంగా అమెరికా దాడులు తీవ్రతరం చేసింది.శుక్రవారం సాయంత్రం 4 గంటల నుంచి అమెరికా సైన్యం 85 స్థావరాలపై దాడులకు దిగింది. దీర్ఘశ్రేణి వైమానిక దాడులు జరిపారు. నా ఆదేశాల మేరకు అమెరికా బలగాలు ఇరాక్, సిరియాల్లో తిరుగుబాటుదారుల శిబిరాలే లక్ష్యంగా ప్రతిదాడులు చేసుకున్నాయి. మా దాడులు మొదలయ్యాయి. ఎంచుకున్న ప్రదేశాల్లో దాడులుంటాయని అమెరికా అధ్యక్షుడు స్పష్టం చేశారు. డ్రోన్ దాడిలో చనిపోయిన సైనికుల కుటుంబాలను బైడెన్ శుక్రవారంనాడు పరామర్శించారు.

K Venkateswara Rao | 09:58 AM, Sat Feb 03, 2024

తహసిల్ధార్ దారుణ హత్య

విశాఖలో దారుణం చోటుచేసుకుంది. విశాఖలోని మధురవాడ కొమ్మాది కాలనీలో తహసీల్ధార్‌ను దారుణంగా హత్య చేశారు. కొద్ది రోజుల కిందటి వరకూ విశాఖ రూరల్ తహసీల్ధార్‌గా పనిచేసిన సనపల రమణయ్యను ఇటీవల విజయనగరం జిల్లా బంటుపల్లికి బదిలీ చేశారు. రమణయ్య ఇప్పటికీ మధురవాడలోని కొమ్మాది కాలనీలో ఓ అపార్టుమెంట్‌లో ఐదో అంతస్తులో నివాసం ఉంటున్నాడు. శుక్రవారం బంటుపల్లిలో విధులు ముగించుకుని రాత్రి పది గంటలకు కొమ్మాది చేరుకున్నారు. ఫోన్ రావడంతో అపార్టుమెంట్ నుంచి కిందకు దిగివచ్చిన సమయంలో దారుణ హత్యకు గురయ్యాడని పోలీసులు చెబుతున్నారు.భూ వివాదాలే తహసీల్ధార్ దారుణ హత్యకు కారణంగా అనుమానిస్తున్నారు. రాత్రి పది గంటలకు ఇంటి నుంచి కిందకు వచ్చిన తహసీల్ధార్‌‌తో ఓ వ్యక్తి గొడవ పడ్డట్లు తెలుస్తోంది. అక్కడే దుండగుడు తహసీల్దార్ రమణయ్యను రాడ్‌తో కొట్టిచంపినట్లు సీసీటీవీ ఫుటేజీ ద్వారా వెల్లడైంది. దాడి తరవాత స్థానికులు రమణయ్యను ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అర్థరాత్రి మృతిచెందినట్లు డాక్టర్లు ప్రకటించారు.


ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దాడికి కారణాలను ఆరా తీస్తున్నారు. తహసీల్దార్ హత్యతో రాష్ట్రం ఉలిక్కిపడింది.

K Venkateswara Rao | 09:42 AM, Sat Feb 03, 2024

విధులకు సెలవుపెట్టి గంజాయి తరలిస్తూ దొరికిపోయిన ఏపీ పోలీసులు

కంచే చేను మేసిన చందంగా ఏపీ పోలీసులు గంజాయి తరలిస్తూ అడ్డంగా దొరికిపోయారు. తెలంగాణ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. హైదారాబాద్ బాచుపల్లిలో గంజాయి సరఫరా చేస్తూ ఇద్దరు ఏపీ పోలీసులు తెలంగాణ పోలీసులకు దొరికిపోయారు. కాకినాడ మూడో బెటాలియన్‌లో విధులు నిర్వహిస్తోన్న శ్రీనివాస్, సాగర్ పట్నాయక్‌గా గుర్తించారు. వీరు విధులకు సెలవుపెట్టిమరీ గంజాయి అక్రమ రవాణాకు పాల్పడ్డారని తెలంగాణ ఎస్‌వోటీ పోలీసులు తెలిపారు.ఏపీ పోలీసులు స్వయంగా నర్సీపట్నం నుంచి బాచుపల్లికి కారులో 22 కిలోల గంజాయి తరలిస్తుండగా తెలంగాణ పోలీసులు పట్టుకున్నారు. నిందితుల వాహనం నుంచి 22 కేజీల గంజాయి సీజ్ చేశారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.

K Venkateswara Rao | 11:48 AM, Fri Feb 02, 2024

అమెరికాలో విద్యార్థి శ్రేయాస్‌రెడ్డి అనుమానాస్పద మృతి

అమెరికాలో ఉన్నత విద్యనభ్యసిస్తోన్న భారతీయ విద్యార్థి శ్రేయాస్‌రెడ్డి అనుమానాస్పదంగా చనిపోయారు. యూఎస్‌లోని ఒహాయోలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. శ్రేయాస్‌రెడ్డి మృతిపై కేసు (crime news) నమోదు చేసి,పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అతని మృతికి కారణాలు తెలియాల్సి ఉంది.శ్రేయాస్‌రెడ్డి సిన్సినాటిలోని లిండ్నర్ స్కూల్ ఆఫ్ బిజినెస్ విద్యార్థిగా గుర్తించారు. శ్రేయస్ మృతి వివరాలు అతని తల్లిదండ్రులకు అందించినట్లు పోలీసులు తెలిపారు. వారు భారత్ నుంచి అమెరికా చేరుకోవాల్సి ఉంది. అమెరికాలోని జార్జియా రాష్ట్రంలో గత వారం వివేక్ సైనీ దారుణ హత్యకు గురయ్యారు. ఆ ఘటన మరవక ముందే మరో విద్యార్థి చనిపోవడం ఆందోళన కలిగిస్తోంది.

K Venkateswara Rao | 09:45 AM, Fri Feb 02, 2024

అరాచకం : మహిళపై బాలుడి అత్యాచారం

మానవ సంబంధాలు మంటకలసిపోతున్నాయి. ఓ మహిళపై బాలుడు అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలంలో చోటు చేసుకుంది. భీమవరం రూరల్ గ్రామానికి చెందిన ఓ మహిళ బహిర్భూమికి వెళ్లగా 16 సంవత్సరాల బాలుడు అత్యాచారం (crime news) చేశాడని పోలీసులు తెలిపారు.బాధితురాలి ఫిర్యాదుతో ఘటన వెలుగులోకి వచ్చింది. అత్యాచారం చేసిన బాలుడు పాత నేరస్థుడిగా గుర్తించారు. కేసు నమోదు చేసి నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. 16 ఏళ్ల బాలుడు అత్యాచారం చేసినట్లు గుర్తించినట్లు భీమవరం పోలీస్ స్టేషన్ రైటర్ మహేశ్వరరావు వెల్లడించారు.

K Venkateswara Rao | 10:56 AM, Thu Feb 01, 2024

బీజేపీ నాయకుడి హత్య కేసులో 15 మందికి మరణశిక్ష

బీజేపీ నాయకుడు రంజిత్ శ్రీనివాసన్ దారుణ హత్య కేసులో కేరళలోని అలప్పుళ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నిషేధిత ఇస్లామిక్ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాతో సంబంధాలున్న 15 మందికి, బీజేపీ ఓబీసీ నేత రంజిత్ శ్రీనివాసన్ హత్య కేసుతో (kerala crime news)సంబంధం ఉందని తేలడంతో అలప్పుళ కోర్టు మరణశిక్ష విధించింది. అలప్పుళ న్యాయమూర్తి జస్టిస్ మవెళిక్కర అడిషనల్ జిల్లా జడ్జి వి.జి.శ్రీదేవి తీర్పు వెలువరించారు.
బీజేపీ నాయకుడి హత్యలో నిందితులందరికీ శిక్ష పడింది. వీరంతా మనుషులను చంపడంలో శిక్షణ పొందిన ముఠా అని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. బీజేపీ ఓబీసీ నేత రంజిత్ శ్రీనివాసన్‌ను ( ranjith srinevaasan murder case) ఈ కరుడుగట్టిన ముఠా ఆయన భార్య, పిల్లలు, తల్లి చూస్తుండగానే చంపివేశారు. ఇలాంటి దారుణాలు చాలా అరుదుగా మాత్రమే జరుగుతాయని న్యాయమూర్తి తీర్పు కాపీలో వ్యాఖ్యానించారు.
కేసు వివరాల్లోకి వెళితే...

2021 డిసెంబరు 19 అలప్పుళ పట్టణంలో బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి రంజిత్ శ్రీనివాసన్ హత్య జరిగింది. నిషేధిత ఎస్‌డీపీఐ, పీఎఫ్‌ఐ కార్యకర్తలు రంజిత్ ఇంట్లోకి చొరబడి అంత్యంత దారుణంగా హత్య చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు కొందిరిని అరెస్టు చేసి విచారించారు. అదనపు సెషన్స్ కోర్టులో కేసు విచారణ సాగింది. తాజాగా న్యాయమూర్తి 15 మందికి మరణ శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు.రంజిత్ హత్యకు ముందు రోజు సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా నేత కేఎస్ షాన్ హత్య జరిగింది. ఆ తరవాత రోజే రంజిత్ హత్య జరగడం అప్పట్లో తీవ్ర సంచలనం అయింది.

K Venkateswara Rao | 12:40 PM, Tue Jan 30, 2024

కనిపించకుండా పోయిన ఝార్ఖండ్ సీఎం

భూ కుంభకోణంలో మనీలాండరింగ్ కేసు ఎదుర్కొంటోన్న ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ కనిపించకుండా పోయారు. సోమవారం నాడు హేమంత్ సోరెన్‌ను విచారించేందుకు ఢిల్లీలోని ఆయన అధికారిక నివాసానికి ఈడీ అధికారులు వెళ్లారు. సీఎం అందుబాటులోకి రాలేదు. సోమవారం సాయంత్రం వరకు ఎదురు చూసినా సీఎం హేమంత్ సోరెన్ రాకపోవడంతో, అతనికి చెందిన లగ్జరీ కారును అధికారులు సీజ్ చేశారు.
తాజాగా ఝార్ఖండ్‌లో హేమంత్ సోరెన్ సతీమణికి సీఎం పగ్గాలు అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని వార్తలు గుప్పుమన్నాయి. ఇప్పటికే సంకీర్ణ కూటమిలోని జేఎంఎం, ఆర్జేడీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాంచీ చేరుకున్నారు. ఇవాళ కూటమి ఎమ్మెల్యేలందరూ సీఎం నివాసంలో సమావేశం కానున్నట్లు సమాచారం అందుతోంది. కూటమి శాసనభ్యులందరూ రాంచీలో అందుబాటులో ఉండాలని ఆదేశాలు అందినట్లు తెలుస్తోంది.ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ గత వారం ప్రత్యేక విమానంలో ఢిల్లీ వచ్చినట్లు ఈడీ అధికారుల వద్ద సమాచారం ఉంది. ఆ తరవాత ఆయన ఎక్కడికి వెళ్లారనే దానిపై సమాచారం అందాల్సి ఉంది. సోరెన్‌కు చెందిన జెట్ విమానం ఢిల్లీ విమానాశ్రయంలోనే ఉందని అధికారులు తెలిపారు. జనవరి 31న రాంచీలోని తన నివాసానికి రావాలని సోరెన్ ఈడీ అధికారులకు రెండు వారాల కిందట సమాచారం ఇచ్చారు. అయితే సోరెన్ రేపు అందుబాటులోకి వస్తారా? లేదా అనేది? తేలాల్సిఉంది.

K Venkateswara Rao | 11:16 AM, Tue Jan 30, 2024

అమెరికాలో భారత విద్యార్థి హత్య

అమెరికాలో మరో అరాచకం వెలుగుచూసింది. అమెరికాలోని లిథోనియా నగరంలో వివేక్ సైనీ అనే భారత విద్యార్థి దారుణ హత్యకు ( america crime news) గురయ్యాడు. పోలీసుల కథనం ప్రకారం... జూలియన్ సాల్క్నర్ అనే డ్రగ్గిస్ట్ ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు చెబుతున్నారు. లిథోనియా నగరంలో వివేక్ సైనీ ఓ దుకాణంలో ఉద్యోగం చేస్తున్నాడు. వీధుల వెంట తిరిగే జూలియన్ దురవస్థ చూసి జాలిపడి, అతనికి ప్రతి రోజూ ఆహారం ఇవ్వడం మొదలు పెట్టాడు. చలికి తట్టుకునేందుకు దుస్తులు కూడా అందించాడు.జనవరం 16న దుకాణం మూసివేసినాక జూలియన్ వచ్చాడు. అప్పటికే షట్టర్ మూసేయడంతో వెళ్లిపోవాలని వివేక్ సైనీ చెప్పడంతో జూలియన్ రెచ్చిపోయాడు. సమీపంలో ఉన్న సుత్తితో వివేక్ సైనీ తలపై 50 సార్లు కొట్టి చంపాడు.ఈ దారుణం సీసీటీవీల్లో రికార్డైంది. ఇటీవలే ఎంబీఏ పూర్తి చేసుకున్న వివేక్ సైనీ దారుణ హత్యతో హర్యానాలోని వారి తల్లిదండ్రుల ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది.

K Venkateswara Rao | 10:32 AM, Tue Jan 30, 2024

ఝార్ఖండ్ సీఎం ఇంటికి ఈడీ అధికారులు

మనీలాండరింగ్ కేసులో విచారించేందుకు ఈడీ అధికారులు ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ఇంటికి చేరుకున్నారు. ఢిల్లీలోని ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో హేమంత్ సోరెన్‌ను (ed case) విచారించనున్నారు. ఓ భూ కుంభకోణానికి సంబంధించి మనీలాండరింగ్ కేసును సీఎం ఎదుర్కొంటున్నారు. జనవరి 29 లేదా 31న అందుబాటులో ఉండాలని గతంలోనే ఈడీ అధికారులు సీఎంకు నోటీసులు పంపించారు.

ఈనెల 27 నుంచి 31లోపు ఎప్పుడైనా తమ కార్యాలయంలో హాజరు కావాలని ఈడీ అవకాశం కల్పించింది. అయితే దీనిపై ఇంత వరకు ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ స్పందించలేదు. దీంతో ఈడీ అధికారులే నేరుగా సోరెన్ ఇంటికి చేరుకున్నారు. ఈ కేసులో జనవరి 20న రాంచీలోని సీఎం నివాసంలో ఈడీ అధికారులు హేమంత్ సోరెన్ వాంగ్మూలం నమోదు చేశారు. దాదాపు ఏడు గంటలు ప్రశ్నించారు. ఇప్పటి వరకు ఈడీ అధికారులు సోరెన్‌కు తొమ్మిది సార్లు నోటీసులు జారీ చేశారు.

K Venkateswara Rao | 14:05 PM, Mon Jan 29, 2024

సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని దారుణ హత్య

అనుమానం పెనుభూతమైంది. పదేళ్లు ప్రేమించిన యువతిని దారుణంగా తుపాకీతో కాల్చి చంపిన ఘటన మహారాష్ట్రలోని పుణేలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. ఉత్తరప్రదేశ్‌కు చెందిన రిషబ్ నిగమ్, వందన పదేళ్లుగా (pune crime news) ప్రేమించుకుంటున్నారు. వందన పుణేలో సాఫ్ట్‌వేర్ ఇంజనీరుగా పనిచేస్తోంది. అయితే ఇటీవల వారి మధ్య విభేదాలు వచ్చాయి. దీంతో వందన రిషబ్‌ను దూరం పెట్టింది. మనస్తాపానికి గురైన రిషబ్ ఆమెపై అనుమానం పెంచుకున్నాడు. మర్డర్ చేయడానికి ప్లాన్ చేశాడు.

వందనను కలిసేందుకు రిషబ్ ఉత్తరప్రదేశ్ నుంచి పుణే వచ్చాడు. రూమ్ బుక్ చేసుకున్నాడు. ఒక్కసారి మాట్లాడాలంటూ వందనను హోటల్ గదికి పిలిపించుకున్నాడు. అప్పటికే సిద్దం చేసుకున్న తుపాకీతో దగ్గర నుంచి కాల్చి చంపేశాడు. తరవాత అక్కడ నుంచి ముంబై పారిపోయాడు. హోటల్ సిబ్బంది సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు. సీసీటీవీ పుటేజీ ఆధారంగా నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

K Venkateswara Rao | 11:56 AM, Mon Jan 29, 2024

రక్షణ వలయంలో ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యాలయం

ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యాలయానికి భద్రత పెరిగింది. మహారాష్ట్రలోని నాగపూర్ ప్రధాన కేంద్రంగా ఉన్న ఆర్‌ఎస్‌ఎస్ కార్యాలయంపై ఇక నుంచి డ్రోన్లు ఎగురవేయడాన్ని నిషేధించారు. ఆ ప్రాంతాన్ని నో డ్రోన్ జోన్‌గా ప్రకటించారు. భద్రతా కారణాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యాలయంలో ఫోటోలు, వీడియోలు తీయడం, డ్రోన్లు ఎగురవేయడాన్ని నిషేధించారు.మార్చి 28 వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని పోలీసులు తెలిపారు.

నాగపూర్ మహల్ ఏరియాలో ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యాలయం ఉంది. చుట్టూ హోటళ్లు, కోచింగ్ కేంద్రాలు, లాడ్జీలున్నాయి. నిత్యం రద్దీగా ఉంటుంది. ఇక్కడ ఫోటోలు, వీడియోలు తీసే అవకాశముండటంతో పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యాలయానికి ఇటీవల బెదిరింపు కాల్స్ రావడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు.ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యాలయం ప్రాంతంలో సీఆర్‌పీసీ సెక్షన్ 144 (1)(3) ఉత్తర్వులు అమల్లో ఉంటాయని సిటీ సంయుక్త పోలీస్ కమిషనర్ అశ్వతి డోర్జే వెల్లడించారు. ఉత్తర్వులు ఉల్లంఘిస్తే క్రిమినల్ చర్యలుంటాయని హెచ్చరించారు.

K Venkateswara Rao | 10:55 AM, Mon Jan 29, 2024

దారుణం : కాలేజీ హాస్టళ్లో బిడ్డకు జన్మనిచ్చిన విద్యార్థిని

నంద్యాల జిల్లా పాణ్యంలో అరాచకం వెలుగు చూసింది. ఓ ఇంజనీరింగ్ కాలేజీ అతిథి గృహంలో విద్యార్థిని ఆడబిడ్డను ప్రసవించింది. తల్లిబిడ్డలను నంద్యాల ఆసుపత్రికి తరలించారు. అప్పటికే తీవ్ర రక్తస్రావం (crime news ) కావడంతో విద్యార్థిని చనిపోయింది. ఈ ఘోరం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విద్యార్థిని గర్భిణిగా ఉన్నా కూడా కాలేజీ యాజమాన్యం గుర్తించకపోవడంపై అనేక అనుమానాలకు తావిస్తోంది.

విద్యార్థిని తల్లిదండ్రులకు విషయం తెలియడంతో వారు కాలేజీకి చేరుకున్నారు. గురువారం రాత్రి తొమ్మిది గంటలకు విద్యార్థిని హాస్టళ్లోని బాత్‌రూంలో ప్రసవించినట్లు గుర్తించారు. ఆమె అక్కడే పడిపోవడంతో కళాశాల సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. తీవ్రరక్తస్రావం కావడంతో ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించి, చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

K Venkateswara Rao | 11:25 AM, Sun Jan 28, 2024

లేడీస్ హాస్టల్ : విద్యార్థిని అనుమానాస్పద మృతి

ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలంలోని ఓ ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీ హాస్టల్‌లో ఓ విద్యార్థిని అనుమానాస్పదంగా మృతి చెందడం కలకలం రేపింది. ఉదయం హాస్టళ్లో విద్యార్థిని ఉరి వేసుకుని కనిపించింది. తోటి విద్యార్థులు వార్డెన్‌కు సమాచారం అందించారు. విద్యార్థిని మరణంపై ఆమె తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

తల్లిదండ్రులకంటే ముందేగానే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, వెంటనే మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. తమ కుమార్తె మృతికి కారణాలు తెలపాలంటూ ఆమె తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. శుక్రవారం అర్థరాత్రి వరకు విద్యార్థిని సోదరుడితో ఫోన్లో మాట్లాడిందని గుర్తించారు. ఘటనకు కారణాలు మాత్రం తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు.

K Venkateswara Rao | 16:33 PM, Sat Jan 27, 2024

పోయాడనుకుంటే నేరుగా అతనే ఫోన్ చేశాడు

కొన్ని వినడానికి విచిత్రంగా ఉన్నా...నమ్మాల్సిందే. ఇటీవల కరెంట్ షాక్‌తో ఓ వ్యక్తి కాలిపోయి చనిపోయాడు.బంధువులు శవాన్ని తీసుకుని ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం కోసం వెళ్లారు. అందరూ శోకసముద్రంలో ఉండగా, చనిపోయాడని అనుకుంటోన్న వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది. అంతే అందరూ ఆశ్చర్యపోయారు. ఈ వింత ఘటన రంగంపేటలో జరిగింది. వివరాల్లోకి వెళితే...

తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం వీరంపాలెంలో చనిపోయిన వ్యక్తి ఫోన్ చేశాడు.దీనికి ముందు...పొలంలోని ట్రాన్స్‌ఫార్మర్ వద్ద పూర్తిగా కాలిపోయిన స్థితిలో ఓ శవాన్ని (crime news) సమీప రైతులు గుర్తించారు. చెప్పులు చూసి పూసయ్యగా భావించారు. వారి బంధువులకు సమాచారం అందించారు. వారు పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

పోస్టుమార్టం జరుగుతుండగానే పూసయ్య నుంచి బంధువులకు ఫోన్ వచ్చింది. కాసేపు బంధువులు అయోమయంలో పడ్డారు. గాయపడిన పూసయ్యను చూసి అందరూ ప్రశ్నించారు. తాను పొలం వెళ్లిన సమయంలో ముగ్గురు దుండగులు ఓ వ్యక్తిని చంపి (crime report) పెట్రోల్ పోసి నిప్పంటించారని, తాను చూడటంతో తనపై దాడి చేశారని చెప్పాడు. తాను స్పృహతప్పి పడిపోవడంతో ఆటోలో వేసుకుని వెళ్లి రోడ్డు పక్కన పడేశారని వివరించారు.

ఆ మార్గంలో వెళుతున్న వారు గుర్తించి తనను ఆసుపత్రిలో చేర్పించారని పూసయ్య చెప్పాడు. దీంతో బంధువులు ఊపిరి పీల్చుకున్నారు. ఇంతకీ దుండగులు కాల్చి వేసింది ఎవరిని అనేదానిపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.

K Venkateswara Rao | 11:59 AM, Sat Jan 27, 2024

కన్న కూతురిపై లైంగికదాడి చేసిన తండ్రికి 150 ఏళ్లు జైలుశిక్ష

కన్న కుమార్తెపై పలుమార్లు అత్యాచారం చేసిన నీచుడికి కేరళ కోర్టు కఠిన శిక్ష విధించింది. మలప్పురం జిల్లాకు చెందిన ఒకడికి ముగ్గురు భార్యలు. వారిలో ఒక భార్య కుమార్తెపై 2022లో వరుసగా లైంగిక దాడికి దిగాడు. దీనిపై కేసు నమోదైంది. కేసును ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టుకు బదిలీ చేశారు. అత్యాచారం చేసిన నిందితుడిపై ఫోక్స్ చట్టం (kerala crimenews) కింద కేసు నమోదు చేసి వేగంగా విచారించారు. పలుమార్లు అత్యాచారం జరిపాడని నిర్థారణ కావడంతో న్యాయమూర్తి 150 సంవత్సరాలు జైలుశిక్ష విధించారు.

కూతురిపై అత్యాచారం చేసిన వ్యక్తిపై ఐపీసీ 376(3) కింద 30 సంవత్సరాలు, ఫోక్సో చట్టంలోని సెక్షన్ 4(2) కింద మరో 30 ఏళ్లు శిక్ష ఖరారు చేశారు. వరుసగా అత్యాచారానికి పాల్పడంతో మరో 40 వేళ్లు శిక్ష వేస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. ఈ శిక్షలన్నీ ఏకకాలంలో అనుభవించాలని కోర్టు ఆదేశించడంతో, అతను గరిష్ఠంగా 40 సంవత్సరాల శిక్ష అనుభవించాల్సి వస్తుందని కోర్టు ఆర్డర్ కాపీలో తెలిపింది.

K Venkateswara Rao | 10:36 AM, Fri Jan 26, 2024

ఘోరం : ఇద్దరు చిన్నారుల ప్రాణాలు తీసిన పానీపూరీ

జంగారెడ్డిగూడెంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. విషపూరిత పానీపూరీ తిని ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో విషాదం (crime news) నింపింది. పోలీసుల కథనం ప్రకారం..

జంగారెడ్డిగూడేనికి చెందిన బేలిపాటి రవి, చినజమ్మక్క దంపతులు ప్లాస్టిక్ సామాగ్రి విక్రయిస్తూ జీవినం సాగిస్తున్నారు. వారి కుమారులు రామకృష్ణ, విజయ్ బుధవారం సాయంత్రం ఏలూరు రోడ్డులో పానీపూరీ తిన్నారు. అర్థరాత్రి వారికి తీవ్ర కడుపునొప్పి రావడంతో తల్లిదండ్రులు వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. వారు పెద్దాసుపత్రికి తీసుకెళ్లాలని చెప్పడంతో రాజమండ్రి తరలిస్తుండగా దారిలోనే చనిపోయారని పోలీసులు తెలిపారు. చిన్నారుల మృతదేహాలను జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

మూడేళ్ల కిందటే ఈ దంపతుల మూడోబిడ్డ చనిపోయాడు. తాజా ఇద్దరు పిల్లలు చనిపోవడంతో వారు కన్నీరుమున్నీరయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

K Venkateswara Rao | 10:17 AM, Fri Jan 26, 2024

ఆస్ట్రేలియాలో ప్రమాదం :నలుగురు భారతీయులు దుర్మరణం

ఆస్ట్రేలియాలోని విక్టోరియా రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నలుగురు భారతీయులు బీచ్‌కు వెళ్లి నీట ముగిని ప్రాణాలు (crime news) కోల్పోయారు. ఫిలిప్ ఐలాండ్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. గడచిన రెండు దశాబ్దాల్లో ఈ ప్రాంతంలో ఇలాంటి ప్రమాదం జరగడం ఇదే మొదటిసారని ఆస్ట్రేలియా అధికారులు తెలిపారు. బుధవారంనాడు ఈ ఘటన జరిగింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఫిలిప్ ఐలాండ్ బీచ్‌లో కొట్టుకుపోతున్న వారిని గుర్తించిన సిబ్బంది, వారిని రక్షించే ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదు. సముద్రంలోనే ముగ్గురు చనిపోయారు. ఒకరిని ఆస్పత్రికి తరలించగా అక్కడ చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. చనిపోయిన వారిలో ముగ్గురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారని ఆస్ట్రేలియాలోని భారత్ హై కమిషనర్ ప్రకటించారు. మృతులకు సంబంధించిన మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.

K Venkateswara Rao | 10:59 AM, Thu Jan 25, 2024

ఐసిస్‌కు ఆర్థికసాయం చేసిన భారత ఇంజనీర్ అరెస్ట్

అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియాకు ఆర్థిక సాయం చేశాడనే అనుమానంతో మహారాష్ట్రలోని నాసిక్‌కు చెందిన ఇంజనీర్‌ను అరెస్ట్ చేశారు. ఉగ్రవాద నిరోధక దళం (ఏటీఎస్) గురువారంనాడు ఓ ఇంజనీర్‌ను అదుపులోకి తీసుకుంది.అంతర్జాతీయంగా వ్యాపారం నిర్వహించే ఈ యువ ఇంజనీర్ సిరియా కేంద్రంగా పనిచేస్తోన్న ఐసిస్ ఉగ్రసంస్థకు (isis terrorist) మూడుసార్లు నగదు పంపినట్లు గుర్తించారు.

యువ ఇంజనీర్‌తో సంబంధాలున్న వారి గురించి కూడా ఉగ్రవాద నిరోధక దళం దర్యాప్తు చేస్తోంది. భారత్ నిషేధించిన ఐసిస్ ఉగ్రవాదులతో యువ ఇంజనీర్ నిరంతరం సంప్రదింపులు జరిపినట్లు ఏటీఎస్ గుర్తించింది. యువ ఇంజనీర్ ఇంట్లో కొన్ని ఎలక్ట్రానిక్ పరికరాలు, మొబైల్ ఫోన్లు, సిమ్ కార్డులు, ల్యాప్‌ట్యాప్‌లు, కొన్ని పెన్‌డ్రైవ్‌లు స్వాధీనం చేసుకున్నారు. యువ ఇంజనీర్‌పై ఉపా చట్టం కింద కేసు నమోదు చేసి, కోర్టులో హాజరు పరిచారు. జనవరి 31 వరకు కస్టడీకీ అనుమతిస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు.

K Venkateswara Rao | 10:43 AM, Thu Jan 25, 2024

260 కోట్ల మంది డేటా లీక్

ప్రపంచ వ్యాప్తంగా, అనేక దేశాలకు చెందిన పౌరుల వ్యక్తిగత డేటా భారీగా లీక్ కావడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా 260 కోట్ల మంది ప్రజల డేటా లీకు వ్యవహారం వైరల్‌గా మారింది.చైనాకు చెందిన మేసేజింగ్ దిగ్గజ యాప్ టెన్సెంట్‌తోపాటు, వీబో వినియోగదారుల డేటా కూడా సురక్షితం (data breach is no exception) కాని పబ్లిక్ డొమైన్లో కనిపించినట్లు వార్తలు వస్తున్నాయి.

డేటా లీకుల వ్యవహారాల్లో ఇప్పటి వరకు ఇదే అతి పెద్దది కావడం గమనార్హం. డ్రాప్ బాక్స్, లింక్డ్‌ఇన్, ఎక్స్ సహా అనేక సైట్‌ల నుంచి వినియోగదారుల వ్యక్తిగత డేటా చోరీకి గురైందని పరిశోధకులు చెబుతున్నారు. లీకైన డేటా 12 టెరాబైట్స్ సైజులో ఉందని ఫోర్బ్స్ తన ఓ నివేదికలో తెలిపింది.

ఈ డేటా లీక్ ద్వారా కొందరు అధునాతన ఫిషింగ్ స్కామ్స్, సైబర్ దాడులు, బ్యాంకు ఖాతాల్లోకి చొరబడటం చేయవచ్చనే ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. చైనా మేసేజింగ్ దిగ్గజం టెన్సెంట్, వీబో, అడోబ్, కాన్వా, టెలిగ్రామ్ ద్వారా కూడా డేటా లీక్ జరిగిందని తెలుస్తోంది. సైబర్ నేరగాళ్లను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదని, ఇలాంటి డేటాతో ప్రజలను మోసం చేసే అవకాశాలున్నాయని ఈసెట్ గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ సలహాదారు జేక్ మూర్ అభిప్రాయపడ్డారు.

K Venkateswara Rao | 13:50 PM, Tue Jan 23, 2024

రెండు నిండు ప్రాణాలు బలిగొన్న రూ.500 గొడవ

చిన్న గొడవ రెండు నిండు ప్రాణాలు పోయేలా చేసింది. రూ.500 విషయంలో భార్యాభర్తల మధ్య చిన్న గొడవ కారణంగా ఇద్దరూ ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసుల కథనం ప్రకారం. గుడివాడ సమీపంలోని వాసవీనగర్‌కు చెందిన కొలుసు రాంబాబు డ్రైవర్‌గా చేస్తున్నాడు. మద్యానికి బానిసయ్యాడు. తాగడానికి డబ్బులేకపోవడంతో రూ.500 ఇవ్వాలని భార్యను అడిగాడు. డబ్బు విషయంలో వారి మధ్య గొడవ జరిగింది. గొడవ నేపథ్యంలో రాంబాబు ఉరివేసుకుని (telugu crime news ) చనిపోయాడు. చుట్టుపక్కల వారు రాంబాబును కిందకు దించి సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

రాంబాబును పరీక్షించిన వైద్యులు అప్పటికే చనిపోయినట్లు ధ్రువీకరించారు. ఈ విషయాన్ని రాంబాబు కొడుకు తల్లికి ఫోన్ చేసి చెప్పాడు. తన వల్లే భర్త ప్రాణాలుపోయాయని ఆమె కూడా ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. చిన్న గొడవతో రెండు నిండు ప్రాణాలు గాల్లో కలసిపోయాయి. వాసవీనగర్‌తో తీవ్ర విషాదం నెలకొంది. చిన్న గొడవతో ఇద్దరు ప్రాణాలు తీసుకోవడంతో కుమారుడు ఏకాకిగా మిగిలిపోయాడు.

K Venkateswara Rao | 11:09 AM, Sun Jan 21, 2024

భార్యను సముద్రంలో ముంచి చంపేశాడు : ప్రమాదవశాత్తూ అంటూ డ్రామాలు

కట్టుకున్న భార్యను వదిలించుకునేందుకు ఓ దుర్మార్గుడు నీచానికి దిగాడు. భార్యను సముద్రంలో ముంచి హత్య చేశాడు. ఈ ఘటన గోవాలో వెలుగు చూసింది. భార్యను సముద్రంలో ముంచి చంపేసి, ప్రమాదవశాత్తూ చనిపోయిందంటూ డ్రామాలు వేసిన ఓ హోటల్ మేనేజర్ పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. పోలీసుల కథనం ప్రకారం...

యూపీకి చెందిన గౌరవ్ కటియార్, దక్షిణ గోవాలోని ఓ హోటల్‌లో మేజేజర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. గత ఏడాది గంగ్వార్ అనే యువతిని వివాహం చేసుకున్నాడు. పెళ్లైన కొద్ది కాలానికే వీరి మధ్య తేడాలు వచ్చాయి. భర్తకు వివాహేతర సంబంధం ఉందని ఆమె తరచూ ఆరోపించేదని బంధువులు చెబుతున్నారు. ఇవన్నీ బయటపడకుండా ఉండాలనే భార్యను (goa crime news ) వదిలించుకోవడమే మేలని కటియార్ భావించాడు.

ముందస్తు ప్లాన్ ప్రకారం భార్యను గోవాలోని కాబో డి రామ బీచ్‌కు తీసుకెళ్లాడు. భార్యను నీటిలో ముంచి ఊపిరాడకుండా చేశాడు. చనిపోయిందని నిర్ధారించుకుని సముద్రంలో పడేశాడు. సముద్రంలోకి వెళ్లేప్పుడు జంటగా వెళ్లి, తిరిగి ఒంటరిగా రావడాన్ని పర్యాటకులు గమనించారు. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో గౌరవ్ నాటకాలు మొదలెట్టాడు. భార్య ప్రమాదవశాత్తూ సముద్రంలో పడిపోయిందని చెప్పుకొచ్చాడు. కేసు నమోదు చేసి పోలీసులు తమదైన శైలిలో విచారణ చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

K Venkateswara Rao | 10:51 AM, Sun Jan 21, 2024

ఘోర రోడ్డు ప్రమాదం :ఆరుగురి దుర్మరణం

తెలంగాణలోని గద్వాల సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బర్త్ డే వేడుకలకు హాజరై తిరిగి కారులో ఇంటికి వెళుతోన్న వాహనం ప్రమాదానికి గురైంది. గద్వాల మునిసిపాలిటీ సమీపంలోని జమ్మిచేడు వద్ద గత రాత్రి ఈ దుర్ఘటన (road accident) చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.

గద్వాలకు చెందిన ఓ డాక్టర్ కుమార్తె పుట్టినరోజు వేడుకలకు హాజరై ఆరుగురు వ్యక్తులు కారులో తిరిగి వారి స్వస్థలానికి బయలుదేరారు. తిరుగు ప్రయాణంలో ఎర్రవల్లి వెళుతుండగా జమ్మిచేడు వద్ద ప్రమాదం జరిగింది. కారులో ప్రయాణిస్తున్న వారిని నరేష్, మల్దకల్, పవన్ కుమార్, ఆంజనేయులుగా గుర్తించారు. వీరంతా గద్వాలలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో సిబ్బంది.ప్రమాదం జరిగిన ప్రాంతంలోనే ముగ్గురు చనిపోగా, మిగిలిన ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారని తెలుస్తోంది. మృతుల్లో నరేష్, పవన్ వారి కుటుంబాల్లో ఒకే సంతానం కావడం మరింత విషాదం నింపింది.

K Venkateswara Rao | 09:31 AM, Sat Jan 20, 2024

అగ్ని ప్రమాదంలో ఆరుగురి సజీవ దహనం

దేశ రాజధాని ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం (fire accident) చోటుచేసుకుంది. ఢిల్లీలోని పీతమ్‌పురా ప్రాంతంలోని ఓ అపార్టుమెంటులో జరిగిన అగ్ని ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు సజీవ దహనం అయ్యారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.గురువారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది. పీతమ్‌పురాలోని ఓ అపార్టుమెంటు మొదటి అంతస్తులో అగ్నికీలలు గుర్తించారు. తరవాత మూడు అంతస్తులకు వ్యాపించాయని అధికారులు వెల్లడించారు.

ప్రమాద సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఏడు అగ్నిమాపక శకటాలతో మంటలను అదుపులోకి తీసుకురావడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. అగ్ని ప్రమాదానికి కారణాలు వెల్లడికావాల్సి ఉంది. గ్యాస్ లీక్ వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని ప్రాధమిక అంచనాకు వచ్చారు.

K Venkateswara Rao | 10:11 AM, Fri Jan 19, 2024

మణిపూర్‌లో సరిహద్దు భద్రతా దళాలపై కొనసాగుతోన్న దాడులు

మణిపూర్‌లో హింస కొనసాగుతోంది. గత రాత్రి తౌబాల్ జిల్లాలోని సరిహద్దు భద్రతా దళాలపై (manipur riots) ఓ గంపు దాడులకు తెగబడిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి అలాంటి ఘటన చోటు చేసుకుంది. మోరెహ్ పట్టణానికి సమీపంలో జరిగిన హింసలో ఇద్దరు భద్రతా దళాల కమాండోలు చనిపోయారు. ఈ ఘటన తౌబాల్ జిల్లా కేంద్రానికి వంద కి.మీ.దూరంలో ఉంది.

పోలీసుల కథనం ప్రకారం. మొదట తౌబాల్ సమీపంలోని 3వ భారత రిజర్వు బెటాలిన్ సైనికులను లక్ష్యం చేసుకుని ఓ గుంపు దాడులకు దిగింది. భద్రతా దళాలు వారిని చెదరగొట్టారు. తరవాత ఆ గుంపులోని తిరుగుబాటుదారులు రెండుగా విడిపోయి తౌబాల్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ వైపుగా పరుగులు తీశారు.కొందరు భద్రతా దళాలపైకి కాల్పులు జరిపారు. కాల్పుల్లో ముగ్గురు బీఎస్ఎఫ్ జవాన్లకు గాయాలయ్యాయి. గౌరవ్ కుమార్, సుబ్రమ్ సింగ్, రాంజీ గాయపడ్డారని పోలీసులు తెలిపారు. గాయపడిన వారిని ఇంఫాల్‌లోని ఆసుపత్రికి తరలించారు. మణిపూర్‌లో మేలో మొదలైన హింస ఇటీవల అదుపులోకి వచ్చింది. మరలా క్రమంగా హింసాత్మక ఘటనలు జరగడం ఆందోళన కలిగిస్తోంది.

K Venkateswara Rao | 09:55 AM, Thu Jan 18, 2024
upload
upload