సిఖ్స్ ఫర్ జస్టిస్ ఉగ్రవాది పన్నూ హత్య కుట్ర కేసులో (pannun case) ఓ భారతీయుడిపై అమెరికా తీవ్ర అభియోగాలు మోపింది. దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు అమెరికా జాతీయ భద్రతా మండలి ప్రతినిధి జాన్ కిర్భీ చెప్పారు. భారత్‌తో దౌత్యసంబంధాలు మరింత మెరుగు పరుచుకునేందుకు ప్రయత్నిస్తామని ఆయన స్పష్టం చేశారు.
భారత్ తమకు వ్యూహాత్మక భాగస్వామిగా కొనసాగుతోందని కిర్భీ వెల్లడించారు. దీన్ని మరింత బలోపేతం చేసేందుకు చర్చలు కొనసాగుతాయన్నారు. పన్నూ హత్య కుట్ర కేసు దర్యాప్తును వేగవంతం చేసినట్లు ఆయన తెలిపారు. భారత్ కూడా ఈ కేసును తీవ్రంగా పరిగణించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.
పన్నూ హత్య కుట్రలో భారతీయుడిపై తీవ్ర అభియోగాలు మోపడంపై భారత్ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపై ఇంతకన్నా ఎక్కువ మాట్లాడలేమని విదేశాంగశాఖ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ఈ కేసులో అత్యున్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేసి దర్యాప్తు జరుపుతామని భారత్ ప్రకటించింది. పన్నూ హత్యకు కుట్రలో ఒక భారత అధికారి ప్రమేయం ఉందని అమెరికా చేసిన ఆరోపణలపై ఆందోళన వ్యక్తం చేసింది.