Karnataka votes to elect a new government today as stakes are high for the BJP and higher for the Congress with 2,615 candidates in the fray for 224 assembly constituencies. Polling is scheduled across 58,545 polling stations including auxiliary polling stations and a total of 42,48,028 new voters have been registered to vote for the elections.
Read Moreకుప్పకూలిన అమెరికా సైనిక విమానం: ఎనిమిది మంది సైనికుల గల్లంతు
K Venkateswara Rao | 09:52 AM, Thu Nov 30, 2023
బిలిమోరా-సూరత్ : బుల్లెట్ ట్రైన్ పట్టాలెక్కేది ఎప్పుడంటే...
T Ramesh | 17:34 PM, Wed Nov 29, 2023
భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
K Venkateswara Rao | 16:25 PM, Wed Nov 29, 2023
K Venkateswara Rao | 16:12 PM, Wed Nov 29, 2023
కేంద్రమంత్రివర్గ నిర్ణయం: మరో ఐదేళ్ళు ఉచిత రేషన్ కొనసాగింపు
T Ramesh | 16:04 PM, Wed Nov 29, 2023
BCCI: కోచ్ గా రాహుల్ పదవీకాలం పొడిగింపు
T Ramesh | 15:14 PM, Wed Nov 29, 2023
విమానంలో కొట్టుకున్న మొగుడు పెళ్లాం : ఢిల్లీలో అత్యవసర ల్యాండింగ్
K Venkateswara Rao | 14:55 PM, Wed Nov 29, 2023
ప్రభుత్వ సలహాదారు సజ్జలకు హైకోర్టు నోటీసులు
K Venkateswara Rao | 14:36 PM, Wed Nov 29, 2023
రాష్ట్రానికి క్రైస్తవుడు సీఎం కావాలి : వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి సంచలన వ్యాఖ్యలు
K Venkateswara Rao | 13:55 PM, Wed Nov 29, 2023
చైనాలో నిమోనియా కేసులు: కేంద్రం ఆదేశాలతో రాష్ట్రాలు అప్రమత్తం
T Ramesh | 13:31 PM, Wed Nov 29, 2023
గ్యాస్ లీక్ ప్రమాదం: ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
T Ramesh | 12:21 PM, Wed Nov 29, 2023
కుప్పకూలిన అమెరికా సైనిక విమానం: ఎనిమిది మంది సైనికుల గల్లంతు
K Venkateswara Rao | 09:52 AM, Thu Nov 30, 2023
బిలిమోరా-సూరత్ : బుల్లెట్ ట్రైన్ పట్టాలెక్కేది ఎప్పుడంటే...
T Ramesh | 17:34 PM, Wed Nov 29, 2023
భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
K Venkateswara Rao | 16:25 PM, Wed Nov 29, 2023
K Venkateswara Rao | 16:12 PM, Wed Nov 29, 2023
కేంద్రమంత్రివర్గ నిర్ణయం: మరో ఐదేళ్ళు ఉచిత రేషన్ కొనసాగింపు
T Ramesh | 16:04 PM, Wed Nov 29, 2023
BCCI: కోచ్ గా రాహుల్ పదవీకాలం పొడిగింపు
T Ramesh | 15:14 PM, Wed Nov 29, 2023
విమానంలో కొట్టుకున్న మొగుడు పెళ్లాం : ఢిల్లీలో అత్యవసర ల్యాండింగ్
K Venkateswara Rao | 14:55 PM, Wed Nov 29, 2023
ప్రభుత్వ సలహాదారు సజ్జలకు హైకోర్టు నోటీసులు
K Venkateswara Rao | 14:36 PM, Wed Nov 29, 2023
రాష్ట్రానికి క్రైస్తవుడు సీఎం కావాలి : వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి సంచలన వ్యాఖ్యలు
K Venkateswara Rao | 13:55 PM, Wed Nov 29, 2023
చైనాలో నిమోనియా కేసులు: కేంద్రం ఆదేశాలతో రాష్ట్రాలు అప్రమత్తం
T Ramesh | 13:31 PM, Wed Nov 29, 2023
గ్యాస్ లీక్ ప్రమాదం: ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
T Ramesh | 12:21 PM, Wed Nov 29, 2023
కుప్పకూలిన అమెరికా సైనిక విమానం: ఎనిమిది మంది సైనికుల గల్లంతు
అమెరికాకు చెందిన సైనిక విమానం (crime news) జపాన్ సముద్రంలో కుప్పకూలిన ఘటనలో ఒకరు చనిపోయారు. మరో ఏడుగురు గల్లంతయ్యారు. యకుషిమా దీవి సమీపంలో అమెరికా సైనిక విమానం కూలిపోయింది. కూలిపోయిన విమానంలో 8 మంది సైనికులు ఉన్నారని అమెరికా ప్రకటించింది. ముందుగా మంటల్లో చిక్కుకున్న విమానం సముద్రంలో కూలిపోవడాన్ని స్థానికులు గుర్తించి సమాచారం అందించారు.
సైనికుల ఆచూకీ కనుగొనేందుకు జపాన్ తీర రక్షకదళం రంగంలోకి దిగింది. ప్రమాద ప్రాంతంలో ఒకరిని రక్షించారు. ఆ తరవాత అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఇది హెలికాఫ్టర్ తరహా విమానం అని రెండు విధాలా పనిచేస్తుందని తెలుస్తోంది. అమెరికా నేవీకి చెందిన రెండు ఓస్ప్రే విమానాలు డార్విన్ నుంచి 80 కి.మీ దూరంలోని తివి ద్వీపానికి బయల్దేరిన సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ తరహా విమానాలు ఇటీవల తరచూ కూలిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది.
విమానంలో కొట్టుకున్న మొగుడు పెళ్లాం : ఢిల్లీలో అత్యవసర ల్యాండింగ్
విమానాల్లో ముఖ్యంగా అంతర్జాతీయ విమాన ప్రయాణాల్లో వికృత చేష్టలు పెరిగిపోతున్నాయి. తాజాగా మరో వింత ఘటనతో అంతర్జాతీయ విమానాన్ని (international flight) అత్యవసరంగా దించాల్సి వచ్చింది. మ్యూనిచ్ నుంచి బ్యాంకాక్ బయలు దేరిన విమానంలో ఇద్దరు దంపతులు గొడవ పడి కొట్టుకున్నారు. దీంతో విమాన సిబ్బంది అప్రమత్తమై ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాన్ని అత్యవసర ల్యాండింగ్ చేశారు.
జర్మనీకి చెందిన వ్యక్తి, థాయ్‌కు చెందిన అతని భార్యతో విమానంలో గొడవ పడ్డారు. గొడవ ముదరి కొట్టుకున్నారు. దీంతో తోటి సిబ్బంది, ప్రయాణీకులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. లుఫ్తాన్సా విమానాన్ని పాకిస్తాన్‌లో దించడానికి ప్రయత్నించినా అక్కడి విమానాశ్రయ అధికారులు అంగీకరించలేదు. దీంతో ఢిల్లీ విమానాశ్రయంలో అత్యవసర
ల్యాండింగ్ చేసి భార్యతో గొడవపడ్డ జర్మన్ వ్యక్తిని పోలీసులకు అప్పగించారు. జర్మన్ రాయబార కార్యాలయానికి సమాచారం అందించారు.
గ్యాస్ లీక్ ప్రమాదం: ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
విశాఖ మధురవాడ వాంబేకాలనీలో జరిగిన గ్యాస్ ప్రమాద ఘటనతో స్థానికంగా విషాదం అలుముకుంది. ఘటనలో గాయపడి ప్రాణాలు కోల్పోయిన వారిసంఖ్య నాలుగుకు చేరింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మరణించడంతో స్థానికంగా తీవ్ర విషాదం వాతావరణం నెలకొంది.
బాలరాజు(60), అతడి భార్య చిన్ని(55), పెద్దకుమారుడు గిరి(22) బుధవారం చనిపోగా, చిన్నకుమారుడు కార్తిక్(21) రెండురోజుల క్రితమే మృతి చెందారు. ఇంట్లో సిలిండర్ కు రెగ్యులేటర్ అమర్చే క్రమంలో ప్రమాదం జరిగింది.
బాధితులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించిగా ఒక్కొక్కరుగా ప్రాణాలు వదిలారు. దీంతో స్థానికంగా విషాదం అలుముకుంది. తోటి వారి మరణంపై కాలనీవాసులు విచారం వ్యక్తం చేస్తున్నారు. వారితో ఉన్నపరిచయాన్ని తలుచుకుని రోదిస్తున్న ఘటనలు చూస్తుంటే మనసు చలించిపోతుంది.
అమెరికాలో ముగ్గురిని కాల్చి చంపిన భారత విద్యార్థి
అమెరికాలోని భారత విద్యార్థి ఓం బ్రహ్మబట్ దారుణానికి ఒడిగట్టాడు. కుటుంబ సభ్యులను కాల్చి (crime news) చంపిన ఘటన వెలుగులోకి వచ్చింది. న్యూయార్క్‌లోని సౌత్ ప్లెయిన్ ఫీల్డ్ ట్రెడిషన్స్ కాండో కాంప్లెక్స్‌లో సోమవారం బ్రహ్మబట్, అతని తాత దిలీప్‌కుమార్ బ్రహ్మబట్, బిందు బ్రహ్మట్, యష్ కుమార్ బ్రహ్మబట్‌లను కాల్చి చంపినట్లు స్థానిక పోలీసులు తెలిపారు.కాల్పుల శబ్దం రావడంతో ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం అందించారు.
తాత, నాయనమ్మతో కలసి జీవిస్తోన్న బ్రహ్మబట్ ముగ్గురిని కాల్చి చంపినట్లు పోలీసులు గుర్తించారు. చనిపోయిన వారిలో ఇద్దరు పురుషులు కాగా, ఓ మహిళ ఉన్నారు. ఘటనా స్థలంలో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనిపై హత్యా నేరం, ఆయుధాలను కలిగి ఉన్న కేసులను నమోదు చేశారు. ఆన్‌లైన్‌లో తుపాకీ కొనుగోలు చేసి హత్యకు ఒడిగట్టినట్లు పోలీసులు తెలిపారు.
టీడీపీ కార్యకర్త హత్య కేసులో తొమ్మిది మందికి యావజ్జీవ శిక్ష
టీడీపీ కార్యకర్త హత్య కేసులో నందిగామ కోర్టు కీలక తీర్పు(crime news) వెలువరించింది. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలం ముళ్లపాడులో 2006లో వినాయక నిమజ్జనం సందర్శంగా జరిగిన గొడవల్లో కాంగ్రెస్ కార్యకర్తలు టీడీపీ కార్యకర్త నలజాల నరసింహయ్యను హత్య చేశారు. ఈ కేసులో 11 మంది నిందితులుగా కేసు నమోదు చేశారు.
గతంలో ఈ కేసు విచారణ మచిలీపట్నం కోర్టులో నడిచింది. తరవాత నందిగామ కోర్టుకు బదిలీ చేశారు. దీనిపై హైకోర్టు ఇచ్చిన స్టే ఎత్తేయడంతో వాదనలు ప్రారంభించారు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి నిన్న తుది తీర్పు వెలువరించారు. ప్రస్తుత వైసీపీకి చెందిన పగడాల సుబ్బారావు, నెల్లూరి నరసింహారావు, యండ్రాతి శ్రీనివాసరావు, గుత్తా నారాయణరావు, యండ్రాతి పూర్ణచంద్రరావు, గూడపాటి పుల్లయ్య, రమణ, హనుమయ్య, వసంతరెడ్డిలకు యావజ్జీవ శిక్ష విధించారు. అనంతరం వారిని
రాజమండ్రి కేంద్ర కారాగారానికి తరలించారు.
గుంటూరులో నకిలీ బంగారంతో బ్యాంకుకు బురిడీ
Gold loan : దొంగ బంగారంతో బ్యాంకునే బురిడీ కొట్టించిన ఘటన గుంటూరు లో వెలుగులోకి వచ్చింది. కొందరు వ్యక్తులు నకిలీ బంగారాన్ని బ్యాంకులో తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్నారు. ఈ మోసంలో బ్యాంకు అప్రైజరు ప్రమేయం కూడా ఉన్నట్లు అనుమానిస్తున్నారు.
నిజమైన బంగారం తాకట్టు పెట్టిన వారికి అప్పుకు రెండురెట్లు అధికంగా చెల్లించాలంటూ నోటీసులు పంపడంతో ఈ బాగోతం బట్టబయట పడింది. మొత్తం 107 మంది నకిలీ బంగారంతో రుణాలు పొందినట్లు తెలిసింది. నోటీసులపై ప్రశ్నించినందుకు ఖాతాదారులను కూడా ఇబ్బంది పెట్టినట్లు ఫిర్యాదులున్నాయి.
నల్లపాడు సీఐ రాంబాబు తెలిపిన వివరాల మేరకు... గుంటూరు-అమరావతి రోడ్డులోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గోరంట్ల బ్రాంచీలో ఆడిట్ నిర్వహించగా, వెండి వస్తువులకు బంగారు పూత పూసి కోట్ల రూపాయల రుణం పొందినట్లు తేలింది.
బ్యాంక్ ఇంటర్నల్ అధికారి అనిల్ డెకాబె, బ్యాంకు రీజినల్ మేనేజర్ ధనరాజ్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. 2021 జనవరి 29 నుంచి 2023 నవంబరు 16 వరకు ఆడిట్ నిర్వహించగా 107 ఖాతాలలో నకిలీ బంగారంతో రుణాలు పొందినట్లు గుర్తించారు. వీటిలో దాదాపు 100 ఖాతాలలో నకిలీ బంగారం పెట్టి రుణం పొందే సమయంలో రీ అప్రైజల్ కూడా నిర్వహించలేదని గుర్తించారు. దాదాపు రూ. 2.71 కోట్ల బ్యాంకుకు టోకరా వేసినట్లు తేలింది. లోన్ అప్లికేషన్, అప్రైజల్ తదితర పరిశీలనలు చేయకుండానే రుణాలు ఇచ్చినట్లు గుర్తించారు.
కూతురిని కీచకుడికి అప్పగించిన తల్లికి 40 ఏళ్ల జైలు శిక్ష
కన్నబిడ్డను కీచకులకు అప్పగించిన కేసులో కేరళ ఫాస్ట్ ట్రాక్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. తన భర్త మానసికంగా అనారోగ్యానికి గురి కావడంతో, ఓ మహిళ అతడిని వదిలేసి, శిశుపాలన్‌తో సహజీవనం చేసింది. ఏడేళ్ల చిన్న కుమార్తె ఆమె వద్ద ఉండేది. శిశుపాలన్ చిన్నారిపై లైంగిక దాడి చేయడంతో ఆమె గాయపడింది. ఆ బాధను తల్లికి చెప్పింది. అయినా బిడ్డ మాటలు పట్టించుకోలేదు. అలా శిశుపాలన్ లైంగిక దాడికి (crime news) ఆమె సహకరించింది.
తన వద్దకు వచ్చిన 11 ఏళ్ల అక్కకు ఆ చిన్నారి బాధను చెప్పుకుంది. వారిద్దరూ తల్లి వద్ద నుంచి తప్పించుకుని బామ్మ వద్దకు చేరారు. ఆమె సహకారంతో వారిని బాలల సంరక్షణా కేంద్రానికి తరలించారు. 2018లో వారికి జరిగిన అన్యాయాన్ని అక్కడి అధికారులకు వెల్లడించారు. దీంతో కేసు నమోదైంది. కేసు విచారణలో ఉండగానే కీచకుడు శిశుపాలన్ ఆత్మహత్య చేసుకున్నాడు. కేసును విచారించిన కేరళ ఫాస్ట్ ట్రాక్ కోర్టు బాధిత తల్లికి 40 సంవత్సరాల జైలు శిక్ష, రూ.20 వేల జరిమానా విధించింది. ఈ కేసులో 22 మంది సాక్షులను విచారించారు.
అమెరికా, కెనడా దర్యాప్తులపై స్పందించిన భారత్
ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య (nijjar murder probe) తరవాత భారత్, కెనడా దౌత్య సంబంధాలు దెబ్బతిన్న విషయం తెలిసిందే. నిజ్జర్ హత్య వెనుక భారత్ హస్తముందని కెనడా ప్రధాని ట్రూడో చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. నిజ్జర్ హత్యలో తమ ప్రమేయం ఉందనేందుకు సాక్ష్యాలు చూపాలని భారత్ స్పష్టం చేసింది. నిజ్జర్ హత్యపై కెనడా దర్యాప్తు జరుపుతోంది. అయితే ఇంత వరకు సాధించిన పురోగతి విషయాలను మాత్రం భారత్‌తో పంచుకోలేదు. ఇక అమెరికాలో ఖలిస్తాన్ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నున్ హత్య కుట్రను భగ్నం చేసినట్లు స్థానిక పోలీసులు భారత్‌కు తెలిపారు.
అమెరికా అధికారులు పన్నూన్ హత్య కుట్ర భగ్నంపై పలు అంశాలను భారత్‌తో పంచుకున్నారని కెనడాలోని భారత రాయబారి సంజయ్ కుమార్ వర్మ వెల్లడించారు. అయితే నిజ్జర్ హత్య దర్యాప్తులో మాత్రం కెనడా ఎలాంటి ఆధారాలు చూపలేదని, రెండు దేశాల మధ్య దర్యాప్తులో తేడా ఉందని ఆయన అన్నారు.
పన్నున్ హత్య కుట్రను అమెరికా పోలీసులు భగ్నం చేశారని ఫైనాన్షియల్ టైమ్స్ ప్రచురించింది. దీనిపై అమెరికా కూడా భారత్‌కు సమాచారం ఇచ్చింది.
పన్నూన్ హత్య కుట్రపై దర్యాప్తు జరుగుతున్న సమయంలో తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేనని కెనడాలో భారత రాయబారి సంజయ్ కుమార్ వెల్లడించారు. నిజ్జర్ హత్య కేసులో కెనడా చేసింది, కేవలం ఆరోపణలు మాత్రమేనని అవి వాస్తవాలు కాదని సంజయ్ కుమార్ వర్మ అభిప్రాయపడ్డారు.
ఆన్‌లైన్‌లో విషం కొనుగోలు చేసి ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య
ఓ ఇంజినిీరింగ్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన పల్నాడు జిల్లా నరసరావుపేట మండల పరిధిలో చోటుచేసుకుంది. ఓ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ రెండో ఏడాది చదువుతున్న విద్యార్థిని కోలగట్ల రేచల్ రెడ్డి(19) బలవన్మరణం చెందింది. ఆత్మహత్య కోసం కొన్ని రోజుల కిందటే ఆన్‌లైన్ లో విషాన్నిఆర్డర్ చేసినట్లుగా తేలింది. ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం మల్లవరం గ్రామానికి చెందిన రేచల్ రెడ్డి,
బాలికల వసతి గృహం లో ఉంటూ బీటెక్ చదువుతుంది. ఆదివారం రాత్రి అందరితో కలిసి నిద్రించింది. తెల్లవారు జామున పక్కగదిలో ఉన్న తమ ఊరికి చెందిన స్నేహితురాలి వద్దకు వెళ్లి విషం తాగినట్లు చెప్పి పడిపోయింది. హాస్టల్ సిబ్బంది ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్ళగా అప్పటికే మృతి చెందినట్లు వైద్య సిబ్బంది తెలిపారు.
ఆస్పత్రికి చేరుకున్న మృతురాలి తల్లిదండ్రులు, బిడ్డ మృతికి కారణాల కోసం కాలేజీ యాజమాన్యంతో పాటు సహ విద్యార్థులను విచారించారు. ఆస్పత్రి నుంచి స్వగ్రామానికి మృతదేహాన్ని తీసుకెళ్ళారు. రేచల్ రెడ్డి ఆత్మహత్యకు సంబంధించి స్పస్టమైన కారణం తెలియదని కాలేజీ సిబ్బంది చెబుతుండగా, ఘటనపై ఫిర్యాదు అందకపోవడంతో కేసు నమోదు చేయలేదని పోలీసులు చెబుతున్నారు.
ఐదు మీటర్లు తవ్వితే సొరంగం కార్మికులు బయటపడతారు : ఆర్మీ విశ్రాంత అధికారి వెల్లడి
చత్తీస్‌గఢ్ ఉత్తరకాశీ సమీపంలోని సొరంగంలో చిక్కుకుపోయిన కార్మికులను (tunnel trapped workers) వెలికితీసేందుకు అన్ని ప్రయత్నాలు వేగవంతం చేశారు. అమెరికా నుంచి తెచ్చిన డ్రిల్లింగ్ మెషీన్ మొరాయించడంతో బొగ్గుగనిలో ఎలుక బొరియలు మాదిరి తవ్వకాలు చేపట్టే కార్మికులను రంగంలోకి దించారు. ఇప్పటికే 200 మి.మీ వ్యాసం కలిగిన పైపులను 75 మీటర్లు పంపించగలిగారు. మరో ఐదు మీటర్లు పంపించ గలిగితే ఇక చిక్కుకుపోయిన 41 మంది కార్మికులను తీసుకురావడానికి మార్గం సుగమం అవుతుందని అధికారులు తెలిపారు.
సొరంగ మార్గంలో సమాంతరంగా తవ్వకాలు చేపట్టిన మిషిన్ మొరాయించడంతో పనులు నిలిచిపోయాయి. అక్కడి నుంచి బొగ్గు గని కార్మికులతో తవ్వకాలు మొదలు పెట్టారు. ఎలాంటి అవరోధాలు ఎదురుకొకపోతే రేపు ఉదయానికి తవ్వకాలు పూర్తవుతాయని భారత ఆర్మీ విశ్రాంత ఇంజినీర్ ఇన్ చీఫ్ హర్‌పాల్ సింగ్ తెలిపారు.
ప్రధాన మంత్రి ముఖ్య కార్యదర్శి పి.కె.మిశ్ర, హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా కూడా సొరంగం మార్గాన్ని పరిశీలించారు. సహాయక చర్యలను పర్యవేక్షించారు.
సొరంగం కాంట్రాక్టు పనులతో తమకు ఎలాంటి సంబంధం లేదని అదానీ గ్రూపు ప్రకటించింది. తమ అనుబంధ సంస్థలకు కూడా సొరంగం పనుల్లో ఎలాంటి ప్రమేయం లేదని తెలిపింది.
పదిహేను రోజులుగా సొరంగంలో చిక్కుకుపోయిన కార్మికుల మానసిక పరిస్థితిని అంచనా వేసేందుకు రోబోలను రంగంలోకి దింపుతున్నారు. ఈ రోబోలు కార్మికుల ఆరోగ్య పరిస్థితులను అంచనా వేసి, వారికి ఇంటర్నెట్ సేవలు అందించనున్నాయి.
కొచ్చిన్ వర్సిటీలో విషాదం: తొక్కిసలాటలో నలుగురు విద్యార్థులు మృతి
కేరళలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. కొచ్చిన్ విశ్వవిద్యాలయం(kochi varsity) వార్షికోత్సవం సందర్భంగా చోటుచేసుకున్న తొక్కిసలాటలో నలుగురు విద్యార్థులు దుర్మరణం( students dead) చెందారు. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉండగా 60 మందికి గాయాలయ్యాయి.
కొచ్చిన్ వర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ క్యాంపస్ లో వార్సికోత్సవ సంబరాలు నిర్వహించారు. వేడుకలో భాగంగా నికితా గాంధీ సంగీత కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా, పెద్ద సంఖ్యలో విద్యార్థులతో పాటు స్థానికులు హాజరయ్యారు. అయితే ఒక్కసారిగా వాన కురవడంతో విద్యార్థులు పరుగులు తీశారు.
ఈ సందర్భంగా తొక్కిసలాట చోటుచేసుకుని నలుగురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ తెలిపారు.
ఆస్తి వివాదంలో బెదిరింపులు, ఆత్మహత్య చేసుకున్న వైద్యుడు
భూ వివాదం కారణంగా ఓ యువ వైద్యుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన కాకినాడలో చోటుచేసుకుంది. ఆస్తి విషయంలో మోసపోవడంతోనే గడ్డి మందు తాగి బలవన్మరణం చెందాడని మృతుడి కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
నున్న శ్రీకిరణ్ చౌదరి(32) కాకినాడలోని అశోక్‌నగర్ నివాసి. ఓ భూ వివాద పరిష్కారం కోసం వైసీపీ నేతలను సంప్రదించాడని వారు మోసం చేయడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి తల్లి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
భూ వివాద పరిస్కారం కోసం వైసీపీ నేతలను ఆశ్రయిస్తే, భూమికి సంబంధించి డాక్యుమెంట్స్ తీసుకుని డబ్బురాదని చెప్పారని, వారి బెదిరింపులతో తీవ్రంగా కలత చెంది ఆత్మహత్య చేసుకున్నాడని చెబుతున్నారు. ఎమ్మెల్యే కన్నబాబు సోదరుడు, సినీ దర్శకుడు కళ్యాణ్ కృష్ణ, మరో అనుచరుడు పెదబాబు తమ కుమారుడిని మోసం చేశారని శ్రీకరణ్ తల్లి రత్నం ఆరోపిస్తున్నారు.
మద్యం మత్తులో సిగిరెట్ విసరడంతోనే ఫిషింగ్ హార్బర్ ప్రమాదం
విశాఖ ఫిషింగ్ హార్బర్ అగ్రిప్రమాదానికి కారణమైన నిందితులు ు వాసుపల్లి నాని, అతని మామ సత్యంగా తేలినట్లు సీపీ రవిశంకర్ అయ్యర్ తెలిపారు. మద్యం మత్తులో నిందితులు చేసిన తప్పిదం కారణంగానే మంటలు అలుముకున్నట్లు తమ దర్యాప్తులో తేలినట్లు వెల్లడించారు.
ఓ బోటులో మద్యం తాగుతున్న నిందితులు మత్తులో సిగిరెట్ ను పక్కబోటులో విసిరేశారని బోటు ఇంజిన్ పై అది పడటంతో మంటలు చెలరేగి ప్రమాదం సంభవించిందన్నారు. బోట్లలో నైలాన్ వలలు ఉండటంతో ప్రమాద తీవ్రత పెరిగిందన్నారు. ఈ ఘటనలో 30 బోట్లు కాలి బూడిద అయ్యాయన్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, వాసుపల్లి నాని, అతని మామ సత్యం, అల్లిపల్లి వేంకటేష్ కు చెందిన బోటులో ఈ నెల 19 తేదీ సాయంత్రం మద్యం తాగారు. మద్యం తాగి ఫిష్ ఫ్రై చేసుకున్నారు. అనంతరం సిగిరెట్ తాగి పక్కన ఉన్న బోటులో వేశారు. మంటలు చెలరేగిన తర్వాత అక్కడ నుంచి జారుకున్నారని పోలీసులు వెల్లడించారు.
కేసు దర్యాప్తులో భాగంగా చాలా మంది అనుమానితులను విచారించామని పేర్కొన్న సీపీ , అనుమానితుల్లో ముగ్గురు నానిలు ఉన్నారన్నారు. దర్యాప్తులో భాగంగానే యూట్యూబర్ నానిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించామన్నారు.
విశాఖ ఫిషింగ్ హార్బర్ ప్రమాదంపై ముమ్మర దర్యాప్తు
విశాఖపట్టణం ఫిషింగ్ హార్బర్ ఘటనపై ముమ్మర దర్యాప్తు జరుగుతోంది. దీనికి సంబంధించి పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. దర్యాప్తులో భాగంగా ఫిషింగ్ హార్బర్ సమీపంలోని పెట్రోలు బంక్ సీసీటీవీ రికార్డింగ్ స్వాధీనం చేసుకున్న పోలీసులు, ప్రమాదానికి ముందు దృశ్యాలను పరిశీలించారు.
ఘటన జరగడానికి కొన్ని నిమిషాల ముందు బోటు నుంచి ఇద్దరు వ్యక్తులు బయటకు రావడం అందులో రికార్డు అయింది. ఈ ఘటనతో వారికి ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు.
ప్రమాదం జరిగిన నవంబర్ 19న రాత్రి 10.48 గంటలకు బోటు నుంచి ఇద్దరు వ్యక్తులు బయటకు రాగా, రాత్రి 10.50 గంటలకు మంటలు చెలరేగినట్లు సీసీటీవీ రికార్డింగ్ ద్వారా తేలింది. దీంతో ఆ సమయంలో బయటకు వస్తున్న వారిని ప్రశ్నించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ఈ కేసులో యూట్యూబర్ నాని సహా పలువురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు.
బిర్యానీకి డబ్బులివ్వలేదని 55 సార్లు పొడిచిన మైనర్
దేశ రాజధాని ఢిల్లీలో రోజుకొక అరాచకం వెలుగులోకి వస్తోంది. రూ.350 కోసం యువకుడిని ఓ బాలుడు దారుణంగా హత్య (crime news) చేసిన ఉదంతం మరవక ముందే మరో ఘటన సంచలనంగా మారింది. బిర్యానీ కొనుక్కోవడానికి నగదు ఇవ్వలేదనే కోపంతో 17 ఏళ్ల బాలుడిని, 16 ఏళ్ల బాలుడు విచక్షణారహితంగా పొడిచాడు. ఏకంగా 55 కత్తిపోట్లు పొడిచాడు. చివరకు గొంతు కోశాడు. తరవాత ఈడ్చుకుంటూ వెళ్లి పైశాచిక ఆనందం పొందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, బాధితుడిని ఆస్పత్రికి తరలించినా అతని ప్రాణం దక్కలేదు.
ఉత్తర ఢిల్లీలోని వెల్‌కమ్ కాలనీలో రాత్రి 11 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. దారిన వెళుతోన్న బాలుడిని, మరో మైనర్ అడ్డగించాడు. బిర్యానీ కొనుక్కోవడానికి డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అతను నిరాకరించడంతో దారుణంగా పొడిచి చంపాడు. ఈ దారుణ హత్యపై కేసు నమోదు చేసి, విచారణ ప్రారంభించినట్లు పోలీసులు వెల్లడించారు.
ఎన్‌కౌంటర్ లో పాకిస్తాన్ కు చెందిన కీలక ఉగ్రవాది హతం
పాకిస్తాన్ కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులను భారత రక్షణ దళాలు మట్టుబెట్టాయి. జమ్ము-కశ్మీర్ రాష్ట్రం రాజౌరిలో భారత ఆర్మీ, పాకిస్తాన్ ఉగ్రవాదుల మధ్య 24 గంటల పాటు జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ముష్కరులు హతమయ్యారు. కాలాకోట్ లో నిన్న జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురు ఆర్మీ జవాన్లు అమరులు కాగా, తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న మరో సైనికులు నేడు ప్రాణాలు విడిచాడు.
మృతి చెందిన తీవ్రవాదుల్లో ఒకరు పాకిస్తాన్ దేశీయుడైన ఉగ్రవాది క్వారిగా తేలింది. ఐఈడీ బాంబుల తయారీలో నిష్ణాతుడైన క్వారి.. స్నైపర్‌గా కూడా శిక్షణ తీసుకున్నాడని, పాకిస్తాన్-ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో ఉగ్రవాదం వ్యాప్తికి పనిచేస్తున్నాడని భద్రత దళాల అధికారులు చెబుతున్నారు.
డాంగ్రీ, కాండీ దాడుల వెనుక సూత్రధారి అతడేనని, రాజౌరీ-పూంచ్ ప్రాంతంలో ఉగ్రవాదాని కి మళ్ళీ జీవం పోసే పనిని అతడికి ఉగ్రసంస్థలు అప్పగించాయని రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి.
జబిమాల్ గ్రామంలో ఉగ్రవాదులకు ఆహారం సరఫరా చేసేందుకు గుజ్జర్ వ్యక్తి నిరాకరించాడు. దాంతో అతడిపై విచక్షణా రహితంగా దాడిచేశారు. ఈ విషయాన్ని గ్రామస్తులు భద్రతా దళాలకు చేరవేశాయి.
వెంటనే రంగంలోకి దిగిన భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాయి. భద్రతా బలగాలపై ముష్కరులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో సైన్యం ఐదుగురు వీరులను కోల్పోయింది.
2003 తర్వాత పీర్ పంజాల్ అటవీ ప్రాంతంలో తీవ్రవాద సమస్య పూర్తిగా తగ్గుముఖం పట్టింది. 2021 తర్వాత మళ్ళీ మొదలయ్యాయి. ఈ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో దాదాపు 30 మంది ఆర్మీ జవాన్లు వీరమరణం పొందారు. దట్టమైన అటవీ ప్రాంతాలు, గుహలు ఉగ్రవాదులకు స్థావరాలుగా ఉపయోగపడుతున్నాయి.
విద్యార్థినిపై ఉపాధ్యాయుడు లైంగికదాడి
విద్యార్థినిపై ఓ ఉపాధ్యాయుడు దారుణానికి పాల్పడ్డాడు. మాయమాటలతో విద్యార్థినికి తాళి కట్టి ఆపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లాలో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, భీమవరం గ్రామీణ మండలానికి చెందిన పురెళ్ళ సోమరాజు, జిల్లాలోని ఓ పాఠశాలలో హిందీ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. ఆ పాఠశాలలో చదువుకుంటున్న ఓ విద్యార్థినిని పెళ్ళి చేసుకుంటానని చెప్పి బైక్ పై ఎక్కించుకుని సొంతూరుకు తీసుకెళ్లాడు. అక్కడ ఆమెకు తాళి కట్టి అనంతరం లైంగికదాడికి పాల్పడ్డాడు.
బాధితురాలి ఫిర్యాదు మేరకు సోమరాజుపై అత్యాచారం, ఫోక్సో, బాల్య వివాహ నిరోధక చట్టాల ప్రకారం కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
డీప్‌ఫేక్ వీడియోలపై కేంద్రం కీలక నిర్ణయం
డీప్‌ఫేక్ వీడియోల కట్టడికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వీటి నియంత్రణకు త్వరలో కొత్త నిబంధనలు తీసుకురానున్నట్లు కేంద్ర ఐటీశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించారు. డీప్‌ఫేక్ వీడియోలు (deepfake) తయారు చేసే వారికి, ఆ వీడియోల వ్యాప్తికి కారణం అయ్యే సామాజిక మాధ్యమాలకు భారీ జరిమానా విధించే ఆలోచనలో ఉన్నట్లు కేంద్రం ప్రకటించింది.
డీప్‌ఫేక్ వీడియోల కట్టడిపై గురువారం కేంద్రం కీలక సమావేశం నిర్వహించింది. సామాజిక మాధ్యమాల సంస్థలు, నాస్కామ్, ఏఐ నిపుణులతో చర్చించి తుది నిర్ణయం ప్రకటించనున్నారు. ప్రజాస్వామ్యానికి డీప్‌ఫేక్ వీడియోలు పెనుముప్పుగా పరిణమించే ప్రమాదముందని కేంద్ర ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఆందోళన వ్యక్తం చేశారు. వీటిని కట్టడి చేయడానికి తక్షణ చర్యల అవసరం ఉందన్నారు.
రూ.350 కోసం 60 సార్లు పొడిచి చంపాడు
ఢిల్లీలో ఘోరం జరిగింది. కేవలం రూ.350 కోసం యువకుడిని, ఓ కిరాతకుడు దారుణంగా పొడిచి చంపాడు. ఉత్తర ఢిల్లీ వెల్‌కమ్ ప్రాంతంలో ఈ అరాచకం చోటు చేసుకుంది. దారిన వెళుతోన్న బాలుడు ఓ యువకుడిపై కత్తితో దాడి (crime news) చేశాడు. అతనికి ఊపిరాడకుండా చేశాడు. అతడు స్పృహ కోల్పోయాడు. ఆ తరవాత 60 సార్లు దారుణంగా పొడిచాడు. అతను చనిపోయిన తరవాత, అతని వద్ద ఉన్న రూ.350 తీసుకున్న బాలుడు, కాసేపు అక్కడ డాన్స్ చేశాడు.హత్య చేసి పైశాచిక ఆనందం పొందాడు. ఇవన్నీ అక్కడ ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.
హత్య విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలం పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కేసు దర్యాప్తులో భాగంగా సీసీ టీవీ ఫుటేజీ పరిశీలించిన పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. గతంలో వారికి పరిచయం లేదని కేవలం డబ్బు కోసమే హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
ఒకే కుటుంబంలో ముగ్గురి దారుణ హత్య
పల్నాడు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. పిడుగురాళ్లలో ఒకే కుటుంబంలో ముగ్గురు దారుణ హత్యకు (crime news) గురయ్యారు.పిడుగురాళ్ల సమీపంలోని కోనంగి గ్రామంలో ఈ ఘోరం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురుని సమీప బంధువులు కత్తులతో పొడిచి చంపారు. గురువారం అర్థరాత్రి ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు.
మృతులు సాంబశివరావు, ఆయన భార్య ఆదిలక్ష్మి, కుమారుడు నరేష్‌గా గుర్తించారు. స్థానికుల కథనం ప్రకారం. కుటుంబ కలహాల నేపథ్యంలో ఈ హత్యలు జరిగినట్లు తెలుస్తోంది. ఈ హత్యకు సంబంధించి సాంబశివరావు కోడలు మాధురి, మరికొందరు ముప్పాళ్ల పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయినట్లు తెలుస్తోంది. ఈ హత్యలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
నటి త్రిషపై అనుచిత వ్యాఖ్యలు: మన్సూర్ పై కేసు
నటుడు మన్సూర్ అలీఖాన్ పై తమిళనాడులో కేసు నమోదైంది. హీరోయిన్ త్రిష పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
అలీఖాన్ వ్యాఖ్యలను జాతీయ మహిళా కమిషన్ తీవ్రంగా పరిగణించడంతో పాటు సుమోటోగా విచారణ చేపట్టింది. మన్సూర్ అలీఖాన్ పై కేసు నమోదు చేసి తగిన చర్యలు తీసుకోవాలని తమిళనాడు పోలీసులను ఆదేశించింది. దీంతో ఐపీసీలోని పలు సెక్షన్ల కింద ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
పలు సినిమాల్లో విలన్ వేషాలు వేసిన మన్సూర్ అలీఖాన్, ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ గతంలో తాను ఎన్నో రేప్ సీన్లలో నటించినట్లు తెలిపారు. లియో సినిమాలో కూడా త్రిషతో అలాంటి సన్నివేశం ఉండాలని ఆశించినట్లు చెప్పారు. కానీ అలాంటి సన్నివేశం లేకపోవడం బాధించిందంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు.
దీనిపై త్రిష కూడా తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఇలాంటి మనస్తత్వం ఉన్న వారి వల్లే పరిశ్రమలోని అందరికీ చెడ్డపేరు వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వివాదం పై వివరణ ఇచ్చే ప్రయత్నం చేసిన మన్సూర్ అలీఖాన్, త్రిషకు క్షమాపణలు చెప్పే ఉద్దేశం లేదన్నారు. తాను తప్పుగా మాట్లాడలేదని సమర్థించుకున్నారు. తానేంటో తమిళ ప్రజలకు తెలుసని, వారి మద్దతు తనకు ఉందన్నారు. ‘సినిమాల్లో హత్య చేస్తే నిజంగానే చేసినట్లా? సినిమాల్లో రేప్ చేస్తే నిజంగానే చేసినట్లా?’ అని ఎదురు ప్రశ్నలు వేస్తున్నారు.
దక్షిణ భారత చలన చిత్ర నటీనటుల అసోసియేషన్ (నడిగర్ సంఘం) కూడా మన్సూర్ పై క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. అతడిపై పాక్షిక నిషేధం విధించింది.
సీఎం జగన్‌మోహన్‌రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో పిటీషన్
అక్రమాస్తుల కేసులో పదేళ్లుగా బెయిల్‌పై ఉన్న ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి (ap cm ys jaganmohanreddy) బెయిల్ రద్దు చేయాలంటూ వైసీపీ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు సుప్రీంకోర్టులో పిటీషన్ వేశారు. రఘురామరాజు పిటీషన్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం నాడు విచారించనుంది. వచ్చే శుక్రవారం జస్టిస్ అభయ్ ఓకా, జస్టిస్ పంకజ్ మిట్టల్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును విచారించనుంది.
సీఎం జగన్‌మోహన్‌రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ ఎంపీ రఘురామకృష్ణం రాజు గతంలో తెలంగాణ హైకోర్టులో వేసిన పిటీషన్ కొట్టివేశారు. దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రాజకీయ నాయకులపై ఉన్న క్రిమినల్, అక్రమాస్తుల కేసులను త్వరితగతిన విచారణ జరిపాలంటూ ఇటీవల సుప్రీంకోర్టు కింది కోర్టులను ఆదేశించిన నేపథ్యంలో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి బెయిల్ రద్దు పిటీషన్ మరోసారి సంచలనంగా మారింది.
వీధి రౌడీల్లా కొట్టుకున్న వైద్య విద్యార్థులు
ఒంగోలు మెడికల్ కాలేజీ స్టూడెంట్స్‌కి చెందిన ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కొందరు విద్యార్థులు వీధి రౌడీల్లా కొట్టుకున్నారు. క్లాస్ రూమ్ వేదికగా కొట్లాటకు దిగి సినిమా ఫైట్ రేంజ్ లో గుంపులుగా విడిపోయి పరస్పర దాడులు చేసుకున్నారు.
కాలేజీ ఆవరణతో పాటు హాస్టల్ లో కూడా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. హాస్టల్ లో మద్యం, సిగిరెట్లు, హుక్కాలు పీలుస్తూ మత్తులో తేలుతున్నారని ఎవరైనా అభ్యంతరం తెలిపితే దాడులకు తెగబడుతున్నారనే వాదన కూడా ఉంది.
ఆగస్టులో కొందరు విద్యార్థులపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారు. హాస్టల్ నుంచి సస్పెండ్ చేశారు. వారంతా డే స్కాలర్స్ గా తరగతులకు హాజరయ్యారు. కొన్ని రోజుల కిందట మళ్ళీ హాస్టల్ లోకి అనుమతించారు. తమ సస్పెన్షన్ కు కారణమయ్యారంటూ తొటి విద్యార్థులతో వీరంతా కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. దీంతో మాటామాటా పెరిగి ఆఖరికి క్లాస్ రూమ్ లోనే కొట్టుకునే స్థాయికి దిగజారారు.
పాత వివాదాలు, హాస్టల్ నిర్వహణలో తలెత్తిన విభేదాల కారణంగానే ఘర్షణ జరిగిందని ఒంగోలు డీఎస్పీ నారాయణస్వామి తెలిపారు. గంజాయి కారణంగా గొడవలు జరిగాయనే ఆరోపణలు అర్థరహితమని ప్రిన్సిపాల్ ఏడుకొండలు అన్నారు. కొట్లాట ఘటనపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సామాజికవర్గాల వారీగా వీడిపోయి కొట్టుకున్నారనే వార్తల్లో కూడా నిజంలేదన్నారు.
నిషేధిత సిక్కు గ్రూపులపై ఎన్ఐఏ దాడులు
అనుమానిత సిక్కు గ్రూపులపై జాతీయ భద్రతా దళం (NIA Raids) పంజాబ్‌లో దాడులకు దిగింది.సిక్ ఫర్ జస్టిస్ సంస్థ కార్యాలయాల్లో ఎన్ఐఏ సోదాలు కొనసాగుతున్నాయి. పంజాబ్ పోలీసులు కూడా ఈ దాడుల్లో పాల్గొన్నారు. ఎస్ఎఫ్‌జేతో సంబంధాలున్న సంస్థలపై కూడా ఎన్ఐఏ దాడులు కొనసాగిస్తోంది.
ఎయిర్‌ఇండియా ప్రయాణీకులను భయపెడుతూ ఎస్ఎఫ్‌జే ఉగ్రవాది గుర్‌పత్‌వంత్ సింగ్ పనున్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈ దాడులు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
సిక్కులు ఎయిర్‌ఇండియా విమానాల్లో ప్రయాణం చేయవద్దంటూ నవంబరు 19న సోషల్ మీడియాలో ఎస్ఎఫ్‌జే పేరుతో ఓ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఎయిర్‌ఇండియాలో ప్రయాణం చేస్తే చంపేస్తామంటూ బెదిరింపులకు దిగారు. పనున్ కూడా బెదిరింపులకు దిగాడని తేలింది.
ఎయిర్‌ఇండియా ప్రపంచ వ్యాప్తంగా విమానాలు నడపడానికి వీల్లేదంటూ పనున్ హెచ్చరించడం సంలచనంగా మారింది. అతని బెదిరింపుల తరవాత రక్షణ దళాలు అప్రమత్తం అయ్యాయి. కెనడాలోని ఉగ్ర సంస్థలతో పనున్ సంబంధాలపై కూడా విచారణ జరుగుతోంది.
పతంజలి ఆయుర్వేద కంపెనీని హెచ్చరించిన సుప్రీంకోర్టు
యోగా గురువు రామ్‌దేవ్ బాబా సహ వ్యవస్థాపకుడిగా నెలకొల్పిన ఆయుర్వేద సంస్థ పతంజలి ప్రకటనలపై (patanjali ayuveda) సుప్రీంకోర్టు సీరియస్ అయింది.తమ ఉత్పత్తులు ఉపయోగించడం ద్వారా అనేక వ్యాధులు నయం అవుతాయంటూ తప్పుడు, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటనలు వెంటనే నిలిపేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆదేశాలు ఉల్లంఘిస్తే తీవ్ర పరిణామాలుంటాయని కూడా సర్వోన్నత న్యాయస్థానం హెచ్చరించింది. పతంజలి తప్పుడు ప్రకటనలు చేస్తోందంటూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సుప్రీంకోర్టులో పిటీషన్ వేసింది. దీనిపై విచారించిన అహ్సానుద్దీన్ అమానుల్లా, ప్రశాంత్ కుమార్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది.
కరోనా కాలంలో వ్యాక్సినేషన్ డ్రైవ్, ఆధునిక ఔషధాలకు వ్యతిరేకంగా రామ్‌దేవ్ బాబా చేసిన దుష్ప్రచారాన్ని ఐఎంఏ పిటీషన్లో ప్రస్తావించింది. ఆధునిక వైద్య విధానాలకు వ్యతిరేకంగా తప్పుదారి పట్టించే ప్రకటనలు వెంటనే ఆపాలని సుప్రీంకోర్టు పంతజలి ఆయుర్వేద కంపెనీని ఆదేశించింది. తప్పుడు ప్రకటనలు చేస్తే ప్రతి ఉత్పత్తిపై
కోటి జరిమానా ఉంటుందని సుప్రీంకోర్టు హెచ్చరించింది.
వైద్యులందరూ హంతకులంటూ రామ్‌దేవ్ బాబా విమర్శలు చేస్తూ ప్రకటనలు ఇస్తున్నారంటూ గతంలోనే సుప్రీంకోర్టుకు విన్నవించారు. అల్లోపతి వైద్యులను తక్కువ చేస్తూ ఇచ్చే ప్రకటనలను ఐఎంఏ తరపు న్యాయవాదులు కోర్టులో ప్రస్తావించారు. ఆధునిక మందులు వాడుతున్న వైద్యులు కూడా చనిపోతున్నారంటూ పతంజలి ఇస్తున్న ప్రకటనలు ఐఎంఏ తప్పుపట్టింది.
కోవిడ్ సమయంలోనూ టీకాలను పతంజలి కంపెనీ వ్యతిరేకిస్తూ ప్రకటనలు గుప్పించడంపై కూడా ఐఎంఏ కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. పతంజలి ప్రకటనలపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. వెంటనే ప్రకటనలు నిలిపేయాలని ఆదేశించింది.
లారీ ఢీకొట్టడంతో మూడు పల్టీలు కొట్టిన స్కూలు
ఆటో స్కూలు విద్యార్థులతో వెళుతున్న ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ఘటన విశాఖపట్నం సంగం శరత్ థియేటర్ కూడలి వద్ద చోటుచేసుకుంది. ప్రమాదంలో పలువురు విద్యార్థులు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
రైల్వే స్టేషన్ నుంచి సిరిపురం వైపు విద్యార్థులతో వెళుతున్న ఆటోను లారీ ఢీకొట్టి దూసుకెళ్ళింది. ఆటో మూడు పల్టీలు కొట్టి ఎగిరిపడింది. ఆటోలోని ఏడుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడగా వారిని స్థానికంగా ఉన్న ప్రైవేటు ఆస్పత్రికి తరిలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని స్థానికులు చెబుతున్నారు.
లారీ డ్రైవర్, క్లీనర్ పారిపోయే ప్రయత్నం చేయగా అక్కడ ఉన్న ఆటో డ్రైవర్లు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఇదే తరహా ప్రమాదం మరొకటి కూడా చోటుచేసుకుంది. మధురవాడ-నగరపాలెం రోడ్డులో ఆటో బోల్తా పడి విద్యార్థులు గాయపడ్డారు. నగరపాలెం వైపు వస్తున్న ఆటో అదుపు తప్పి బోల్తా కొట్టడంతో 8 మంది విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి.
బెయిల్‌పై విడుదల కాగానే అత్యాచార బాధిత యువతి దారుణ హత్య
ఉత్తరప్రదేశ్‌లో అరాచకం చోటు చేసుకుంది. నడిరోడ్డుపై ఓ యువతిని దారుణంగా నరికి చంపిన ఘటన సంచలనంగా (crime news) మారింది. కొద్ది రోజుల కిందటే బెయిల్‌పై విడుదలైన పవన్ నిషద్, అశోక్ నిషద్ ఈ దారుణానికి ఒడిగట్టారు. ఉత్తరప్రదేశ్‌లోని కౌశాంబి జిల్లాలో ఈ ఘోరం వెలుగు చూసింది.
పోలీసుల కథనం ప్రకారం. మూడేళ్ల కిందట పవన్ నిషద్ ఓ యువతిపై అత్యాచారం చేశాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఈ కేసులో పవన్ జైలు కెళ్లాడు. కేసు వెనక్కు తీసుకోవాలని పవన్ కుటుంబీకులు యువతి కుటుంబీకులను బెదిరిస్తూ వస్తున్నారు. అయినా బాధిత యువతి కుటుంబీకులు లొంగలేదు. మరో కేసులో జైల్లో ఉన్న అశోక్ కూడా ఇటీవల విడుదలయ్యాడు. పవన్‌కు కూడా బెయిల్ వచ్చింది.
అత్యాచారం కేసు వెనక్కుతీసుకోవాలంటూ యవతి కుటుంబీకులతో పవన్ మరోసారి గొడవ పడ్డారు. వారు అంగీకరించలేదు. యువతిని చంపేందుకు ప్రణాళిక రచించారు. పశువులు కాసుకొని ఇంటికి తిరిగివస్తోన్న యువతిని పవన్, అశోక్ గొడ్డలితో నరికి చంపారు. నిందితులు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. నిందితులను అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు కౌశాంబి జిల్లా ఎస్పీ చెప్పారు.
ఇన్నర్ రింగ్‌రోడ్డు కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ విచారణ వాయిదా
అమరావతి ఇన్నర్ రింగ్‌రోడ్డు కేసులో ( amaravati inner ringroad case )టీడీపీ అధినేత చంద్రబాబు తరపు న్యాయవాదులు వేసిన ముందస్తు బెయిల్ పిటీషన్‌పై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. అమరావతి ఇన్నర్‌రింగ్‌రోడ్డు అలైన్మెంట్‌లో అవకతవకలు జరిగాయంటూ సీఐడీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై చంద్రబాబు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు.తమకు కొంత సమయం కావాలని సీఐడీ కోరడంతో కేసు విచారణను ధర్మాసనం ఈ నెల 23కి వాయిదా వేసింది.
చంద్రబాబు అరెస్ట్ తరవాత కొందరు వ్యక్తులు హైకోర్టు న్యాయమూర్తులను దూషించారంటూ దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిగింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేయాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా పడింది.
స్కిల్ కేసులో చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ మంజూరు
స్కిల్ స్కాంలో (skill scam) మాజీ సీఎం చంద్రబాబునాయుడుకు ఏపీ హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో నవంబరు 17న వాదనలు ముగిశాయి.న్యాయస్థానం తీర్పును రిజర్వు చేసింది. ఇవాళ తీర్పును వెలువరించింది. చంద్రబాబు తరపున సీనియర్ న్యాయవాదులు సిద్దార్థ్ లూధ్రా, దమ్మాలపాటి శ్రీనివాస్, సీఐడీ పక్షాన ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించిన సంగతి తెలిసిందే.
కొందరు రాజకీయ పెద్దల ఆదేశాల ప్రకారం సీఐడీ నడుస్తోందని చంద్రబాబు తరపు న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. పోలీసులు చట్టాలకు విధేయులై ఉండాలని, కొందరు రాజకీయ నేతలకు కాదని వాదించారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ప్రతిపక్షాలపై సీఐడీ దురుద్దేశపూర్వకంగా, తప్పుడు కేసులు నమోదు చేసిందని, స్కిల్ కేసులో పూర్తి స్థాయి బెయిల్ మంజూరు చేయాలని చంద్రబాబు తరపు న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం ఇవాళ తీర్పు వెలువరించింది. చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది.
ఇంఫాల్ విమానాశ్రయం వద్ద అనుమానిత వస్తువు : రఫేల్ యుద్ధ విమానాలతో గాలింపు
మణిపుర్‌లోని ఇంఫాల్ అంతర్జాతీయ విమానాశ్రయం (Imphal International Airport) వద్ద గాల్లో ఎగిరిన గుర్తు తెలియని వస్తువుపై సైన్యం అప్రమత్తమైంది. ఆదివారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది. గుర్తు తెలియని వస్తువు గాల్లో ఎగురుతోందని విమానాశ్రయ వర్గాలు ఏటీసీకి సమాచారం ఇచ్చాయి. అప్రమత్తమైన ఏటీసీ, విమానాశ్రయంలో విమానాల రాకపోకలు నిలిపేసింది.
వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం చేరవేయడంతో సమీపంలోని ఎయిర్‌బేస్ నుంచి రెండు రఫేల్ యుద్ధ విమానాలను రంగంలోకి దింపారు. అత్యాధునిక సెన్సార్ వ్యవస్థ కలిగిన రఫేల్ యుద్ద విమానంతో గాలించినా ప్రయోజనం దక్కలేదు. ఎలాంటి అనుమానిత వస్తువు ఆనవాళ్లు లభించలేదని అధికారులు తెలిపారు.
ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఇంఫాల్ విమానాశ్రయం పరిసర ప్రాంతాల్లో ఎయిర్ డిఫెన్స్ రెస్పాన్స్ మెకానిజమ్‌ను యాక్టివేట్ చేశారు. ఆ తరవాత నుంచే ఆ అనుమానిత వస్తువు కనిపించకుండా పోయిందని తెలుస్తోంది. ఈ ఘటన జరిగిన సమయంలో మూడు గంటల పాటు విమానాల రాకపోకలు నిలిపేశారు.
అల్ షిఫా సొరంగాల్లో బందీలను దాచిన వీడియో విడుదల చేసి ఐడీఎఫ్
హమాస్ ఉగ్రవాదులు అల్ షిఫా ఆసుపత్రి కింద సొరంగాల్లో బందీలను దాచారంటూ ఇజ్రాయెల్ చేస్తోన్న ఆరోపణలకు బలం చేకూరింది. ఐడీఎఫ్ అల్ షిఫా ఆస్పత్రిని స్వాధీనం చేసుకుంది. ఆస్పత్రి కింద సొరంగాల్లో హమాస్ ఉగ్రవాదులు కిడ్నాప్ చేసిన బందీలకు చెందిన వీడియోను ఐడీఎఫ్ విడుదల చేసింది. ఇప్పటి వరకు హమాస్ ఉగ్రవాదులు పాఠశాలలు, ఆస్పత్రుల కింద సొరంగాలు ఏర్పాటు చేసుకుని దాడులకు తెగబడుతున్నారంటూ ఐడీఎఫ్ చేస్తోన్న వాదనలకు ఈ వీడియో సాక్ష్యంగా నిలిచింది.
అక్టోబరు 7న హమాస్ ఉగ్రవాదులు, ఇజ్రాయెల్‌పై (Israel hamas war) మెరుపు దాడులకు దిగిన సమయంలో అల్ షిఫా ఆస్పత్రి సీసీ కెమెరాల్లో రికార్డైన వీడియోలను ఐడీఎఫ్ విడుదల చేసింది. ఓ వ్యక్తిని హమాస్ ఉగ్రవాదులు బలవంతంగా లోపలికి లాక్కొస్తున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. తీవ్రంగా గాయపడిన బందీని ఆస్పత్రిలోని ఆపరేషన్ థియేటర్‌లోకి లాక్కెళుతోన్న దృశ్యాలు వీడియోలో స్పష్టంగా కనిపించాయి.
హమాస్ చెరలోని బందీలు నేపాల్, థాయ్‌లాండ్ దేశస్థులని ఐడీఎఫ్ ప్రకటించింది. ప్రస్తుతం హమాస్ చెరలోని బందీల పరిస్థితి ఎలా ఉంది? వారు ఎక్కడ ఉన్నారనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. ఇజ్రాయెల్‌పై అక్టోబరు 7న దాడి చేసిన సమయంలో హమాస్ ఉగ్రవాదులు అల్ షిఫా ఆస్పత్రిని ఉపయోగించుకున్నారని ఐడీఎఫ్ స్పష్టం చేసింది.
అల్ షిఫా ఆస్పత్రి కింద 10 మీటర్ల లోతులో 55 మీటర్ల భారీ సొరంగాలను ఐడీఎఫ్ గుర్తించింది.అయితే సొరంగంలో ఏముంది అనే విషయం ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించలేదు.
హౌతీ రెబల్స్ దుశ్చర్య: భారత్‌కు రావాల్సిన నౌక హైజాక్
యెమెన్‌కు చెందిన హౌతీ రెబల్స్ తమ దేశం నుంచి వెళుతున్న నౌకను హైజాక్ చేశారని ఇజ్రాయెల్ ఆరోపించింది. ఎర్ర సముద్రం వేదికగా ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని ఇజ్రాయెల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటన కారణంగా హమాస్‌తో సాగుతున్న వైరం మరింత పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.
బల్గేరియా, ఫిలిప్పీన్స్, మెక్సికో, ఉక్రెయిన్‌కు చెందిన 25 మంది సిబ్బందితో తుర్కియే నుంచి భారత్‌కు వస్తున్న ఈ కార్గో నౌకను హౌతీ రెబల్స్ హైజాక్ చేశారని ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం ప్రకటించింది. హైజాక్‌కు గురైన నౌకలో భారతీయులు, ఇజ్రాయెలీలెవరూ లేరని పేర్కొంది. బ్రిటీష్ కంపెనీకి చెందిన ఈ నౌకను జపాన్ సంస్థ నిర్వహిస్తోందని, ఇరాన్ మార్గదర్శకత్వంతో హౌతీ తిరుగుబాటుదారులు హైజాక్ చేశారని తెలిపింది.
కార్గోషిప్‌ను యెమెన్ తీరానికి తీసుకెళ్లామని హౌతీ రెబల్స్ అంగీకరించినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. నౌక ఇజ్రాయెల్‌కు చెందింది కాకపోయినప్పటికీ ఆ దేశ వ్యాపారవేత్త అబ్రహం ఉంగార్‌కు తాత్కాలిక యజమానిగా ఉన్నారు.
రాజస్థాన్‌లో ఘోరం: రోడ్డు ప్రమాదంలో ఐదుగురు పోలీసులు దుర్మరణం
రాజస్థాన్ లోని ఛూరు పరిధిలో ఘోరం జరిగింది. విధి నిర్వహణలో ఉన్న ఐదుగురు పోలీసులను రోడ్డు ప్రమాదం పొట్టనబెట్టుకుంది. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. నాగౌరు నుంచి జుంజును వెళుతున్న పోలీసు వాహనం ప్రమాదానికి గురి కావడంతో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఎన్నికల విధుల బందోబస్తు కోసం వీరంతా వెళుతుండగా సుజన్‌గర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణం జరిగింది. ఖిన్వ్‌సర్ పోలీస్ స్టేషన్ నుండి ఏడుగురు పోలీసు అధికారులు జుంజునులో ప్రధాని మోడీ హాజరవుతున్న ర్యాలీలో బందోబస్తు విధుల కోసం వెళుతుండగా, కనుటాకు సమీపంలో అతివేగంతో వచ్చిన ట్రక్కు వారి వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో పోలీసు వాహనం నుజ్జునుజ్జుకావడంతో పాటు అందులోని ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. ఉదయం 5:30 – 6 గంటల మధ్య ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు.
అత్యాచారానికి ప్రయత్నించిన యువకుడు : ...కోసేసిన మహిళ
ఒంటరి మహిళలపై ఉన్మాదులు తెగబడుతున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో కౌశాంబి జిల్లాలో ఓ మహిళపై యువకుడు అత్యాచారయత్నం (Rape Attempt) చేశాడు. బాధిత మహిళ భర్త సౌదీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఒంటరిగా ఉంటోన్న మహిళ వద్ద పనిచేస్తోన్న యువకుడు ఆమెపై అత్యాచారానికి దిగబోయాడు. ఒక్క నిమిషం ఆగాలంటూ అతన్ని మాటల్లో పెట్టి ఆ మహిళ వంటగదిలోని కూరగాయలు కోసే కత్తి తీసుకుని వచ్చింది. అత్యాచారయత్నం చేసిన నిందితుడి మర్మాంగాన్ని కోసి పడేసింది.
కోసేసిన మర్మాంగాన్ని ఓ సంచిలో పెట్టుకుని ఆ మహిళ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. ఘటనా స్థలం నుంచి పారిపోయిన యువకుడు కుటుంబ సభ్యుల సాయంతో ప్రైవేటు ఆసుపత్రిలో చేరాడు. తన నోట్లో గుడ్డలు కుక్కి తన మర్మాంగాన్ని కోసేసిందని బాధితుడు తెలిపాడు. అత్యాచారం ఆరోపణలను ఖండించాడు.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
సినీ నటి నమిత భర్తకు సమన్లు
ప్రముఖ సినీ నటి నమిత భర్త, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల కౌన్సిల్ తమిళనాడు విభాగం అధ్యక్ష పదవిలో జరిగిన మోసం కేసులో చౌదరి సహా మరో ఇద్దరికి
సేలం సెంట్రల్ క్రైం బ్రాంచి సమన్లు జారీ చేసింది. చిన్నతరహా పరిశ్రమల కౌన్సిల్ అధ్యక్ష పదవి ఇప్పిస్తానంటూ నమిత (namita) భర్త చౌదరి, గోపాల్‌స్వామి అనే వ్యక్తి వద్ద రూ.50 లక్షలు తీసుకుని మోసం చేశాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఆ పదవికి ఇటీవల నమిత భర్త చౌదరి నియమితుడయ్యాడు. తాను మోసపోయాయని గోపాల్‌స్వామి కేసు పెట్టారు.
ఈ కేసులో ముత్తురామన్‌తో పాటు కౌన్సిల్ జాతీయ కార్యదర్శి దుశ్వంత్ యాదవ్‌ను గత నెల అరెస్ట్ చేశారు. తాజాగా కౌన్సిల్ అధ్యక్షుడు చౌదరి, తమిళనాడు బీజేపీ మీడియా విభాగ ఉపాధ్యక్షుడు మంజునాధ్, చౌదరి సహాయకుడు ముత్తురామన్ విచారణకు హాజరు కావాలని గతంలొనే సమన్లు జారీ చేశారు. అయితే చౌదరి, మంజునాథ్ హాజరు కాలేదు. విచారణను సేలం నగర సెంట్రల్ క్రైం బ్రాంచికి బదిలీ చేశారు.
పాకిస్థాన్‌లో జైషే తీవ్రవాది హతం
పాకిస్థాన్‌లో ఉగ్రవాదులు (terrorist shotdead) వరుసగా హతమవుతున్నారు. తాజాగా జైషే మహ్మద్ అధినేత మౌలానా మసూద్ అజార్‌కు అత్యంత సన్నిహితుడు రహీమ్ ఉల్లా తారిఖ్‌ను గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపారు. పాకిస్థాన్‌లోని కరాచీలో ప్రార్థనలకు హాజరయ్యేందుకు వెళుతుండగా తారిఖ్‌ను కొందరు వ్యక్తులు దగ్గర నుంచి కాల్చి చంపారు. వరుసగా ఉగ్రవాదులు హతమవడంపై పాక్ ఆందోళన వ్యక్తం చేస్తోంది.
జైషే ఉగ్రవాదుల ముఠాల మధ్య అంతర్గత పోరు కారణంగానే తారిఖ్ హత్య జరిగిందని సమాచారం అందుతోంది. పాక్ ఉగ్రవాదులే ఈ చర్యకు పాల్పడ్డారని స్థానిక మీడియా వెల్లడించింది. కరాచీలో అతిపెద్ద మురికివాడ ఓరంగి టౌన్‌లో తారిఖ్‌ను కాల్చి చంపారు. ఘటనా స్థలంలోనే తారిఖ్ ప్రాణాలు కోల్పోయాడు. భారత్‌కు మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల లిస్ట్‌లో అగ్రభాగాన ఉన్న జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్‌కు తారిఖ్ అంత్యంత సన్నిహితుడు.
పాక్‌లో గడచిన నాలుగు మాసాల కాలంలో 16 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. నెలలోనే ఇది మూడో ఘటన. తారిఖ్ హత్యను పోలీసులు ఖండించారు. ఇది టార్గెట్ హత్యని నిర్థారించారు. వరుస హత్యలతో చాలా మంది ఉగ్రవాదులు రహస్య ప్రదేశాల్లో తలదాచుకుంటున్నారని తెలుస్తోంది.
బాకీ డబ్బులు అడిగాడని కత్తితో పొడిచి చంపేశాడు
మానవ సంబంధాలు నానాటికీ దిగజారిపోతున్నాయి. ఇచ్చిన అప్పు తిరిగి ఇవ్వాలని అడిగిన వ్యక్తిని హత్య (crime news) చేసిన ఘటన కడప చిన్నచౌకు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. కడప జిల్లా ఒంటిమిట్ట మండలం మటంపల్లెకు చెందిన పి. సాయికిరణ్ అనే యువకుడు, నగరానికి చెందిన మహేంద్రకు రూ.50 వేలు అప్పుగా ఇచ్చారు. మూడు నెలలు గడువు పెట్టుకున్నారు. గడువు తీరినా బాకీ డబ్బులు చెల్లించకపోవడంతో సాయికిరణ్, మహేంద్రను గట్టిగా నిలదీశాడు.
ఆదివారం రాత్రి కడపలోని ఓ టీ దుకాణం వద్ద ఇద్దరూ కలసి మాట్లాడుకున్నారు. మాటామాటా పెరిగింది. వాగ్వాదానికి దిగారు. అప్పిచ్చిన సాయికిరణ్ దుర్భాషలాడారు. కోపంతో రగిలిపోయిన మహేంద్ర తన వద్ద నున్న కత్తితో సాయికిరణ్‌పై దాడి చేశారు. వెంటనే తన కారులోనే సాయికిరణ్‌ను కడపలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించాడు. పరీక్షించిన వైద్యులు సాయికిరణ్ చనిపోయినట్లు చెప్పారు. వెంటనే అదే కారులో మృతదేహాన్ని చిన్నచౌకు పోలీస్ స్టేషన్‌కు తీసుకు వచ్చి, మహేంద్ర లొంగిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఎన్టీఆర్ జిల్లాలో విషాదం, ఈతకు వెళ్లి ముగ్గురు యువకులు మృతి
ఎన్టీఆర్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. సరదగా ఈతకు వెళ్ళిన యువకులు ప్రమాదవశాత్తు నీట మునిగి చనిపోయారు. కంచికచర్ల మండలంలోని కీసర వద్ద మున్నేరులో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది.
ఐదుగురు స్నేహితులు నీళ్ళలోకి దిగారు. లోతు తెలియక నీటిలో మునిగిపోయారు. వారి కేకలు విని అక్కడికి చేరుకున్న స్థానికులు రక్షించే ప్రయత్నం చేశారు. అప్పటికే ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
మృతులు నందిగామ మండలం ఐతవరం గ్రామానికి చెందిన చేజర్ల దినేశ్, యడవల్లి గణేశ్, గాలి సంతోష్ గా గుర్తించారు. యువకుల మరణంతో వారి గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. మృతుల కుటుంబ సభ్యులు తల్లడిల్లుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి ప్రమాద ఘటనపై విచారణ చేపట్టారు.
బైకును ఢీకొట్టి, 20 కిలోమీటర్లు ఈడ్చుకెళ్ళిన లారీ
ఏలూరు జిల్లా కొయ్యలగూడెంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ బైకును డీకొట్టిన లారీ దాదాపు 20 కిలోమీటర్లు ఈడ్చుకెళ్ళింది. లారీ కింద ఇరుక్కున్న బైక్ తీవ్రంగా ధ్వంసమైంది.
కొంతమంది తమ బైకులను జాతీయరహదారి పక్కనున్న ఓ హోటల్ దగ్గర పార్క్ చేశారు. అదే సమయంలో అటుగా వచ్చిన లారీ వాటిపై దూసుకెళ్ళింది. ఓ బైకును సుమారుగా 20 కిలోమీటర్లు ఈడ్చుకుపోయింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి స్వల్పగాయాలతో బయటపడ్డాడు.
కొయ్యలగూడెం పోలీసులు ఇచ్చిన సమాచారంతో తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి పోలీసులు అప్రమత్తమయ్యారు. కొయ్యలగూడెం నుంచి దాదాపు 20కి.మీ దూరంలోని దేవరపల్లి డైమండ్ జంక్షన్ వద్ద లారీని అడ్డగించి డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం...ఆరుగురు మృతి
హైదరాబాద్ లోని నాంపల్లిలో దారుణం జరిగింది. ఓ నివాస భవనంలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో ఆరుగురు కార్మికులు మంటల్లో చిక్కుకుని ప్రాణాలు విడిచారు. బజార్ ఘాట్ లోని ఓ నివాసంలో మెకానిక్ గ్యారేజీ నిర్వహిస్తున్నారు. అక్కడ నిల్వ ఉంచిన డీజిల్ డ్రమ్ములకు మంటలు అంటుకుని, నాలుగు అంతస్తులకు వ్యాపించాయి.
దీంతో మంటల ధాటికి బిల్డింగ్ లో నివాసం ఉంటున్న వారిలో ఆరుగురు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. చుట్టుపక్కల ప్రాంతాల వారిని కూడా నివాసాల నుంచి ఖాళీ చేయిస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక, పోలీసు సిబ్బంది సహాయ చర్యలు చేపట్టారు.
మూడు ఫైరింజన్ల ద్వారా మంటలు అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రమాద స్థలం వద్ద పార్క్ చేసిన కార్లతో పాటు ద్విచక్ర వాహనాలు కూడా కాలి బూడిదయ్యాయి. ప్రమాద స్థలం భయానకంగా ఉండటంతో స్థానికులు తీవ్ర కలతచెందుతున్నారు.
NewsClick FIR : విదేశాల నుంచి అక్రమంగా నిధులు : న్యూస్‌క్లిక్ ఎఫ్‌ఐఆర్‌లో ఏముంది?
న్యూస్‌క్లిక్ పోర్టల్‌కు విదేశాల నుంచి అక్రమ మార్గంలో నిధులు అందాయా? భారత సార్వభౌమాధికారాన్ని, ప్రాదేశిక సమగ్రతకు భంగం కలిగించే కుట్ర జరిగిందా? అసలు న్యూస్‌క్లిక్‌పై పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో ఏముంది అనే విషయాలు ఆసక్తిగా మారాయి.
న్యూస్‌క్లిక్ పోర్టల్‌లోకి విదేశాల నుంచి అక్రమంగా నిధులు వచ్చాయంటూ 2021లోనే ఈడీ కేసులు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించింది. గత వారం న్యూస్‌క్లిక్ ఎడిటర్ ఇన్ చీఫ్ ప్రబీర్ పురకాయస్థ, ఆ సంస్థ మానవ వనరుల విభాగం అధిపతి అమిత్ చక్రవర్తితోపాటు పలువురు విలేకరులు, పౌర సమాజ కార్యకర్తల పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. వీరంతా భారతదేశ ఐక్యత, సమగ్రతను దెబ్బతీసేలా, దేశంలో అసంతృప్తిని రగిలించేలా ప్రయత్నిస్తున్నారని, ఇది దేశ భద్రతకు ముప్పు తెచ్చేలా ఉందని ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేశారు.
విదేశీ సంస్థల ద్వారా దేశానికి హాని చేసే విధంగా అక్రమంగా 2018 ఏప్రిల్ నుంచి న్యూస్‌క్లిక్ పోర్టల్‌లోకి కోట్ల రూపాయల నిధులు వచ్చాయని ఈడీ కేసులో పేర్కొంది.
చైనా ప్రభుత్వ మీడియాతో సన్నిహిత సంబంధాలు కలిగిన అమెరికన్ కుబేరుడు నెవిల్లే రాయ్ సింఘమ్ ద్వారా న్యూస్‌క్లిక్ పోర్టల్‌లోకి విదేశాల నుంచి అక్రమంగా నిధులు వచ్చాయని ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేశారు.
చైనా అనుకూల ప్రచారానికి మద్దతు పలికే ఆర్థిక నెట్‌వర్క్‌కు సింఘమ్ సంబంధాలు కలిగి ఉన్నాడని న్యూయార్క్ టైమ్స్ తన నివేదికలో వెల్లడించింది. ప్రస్తుతం అతను చైనాలోని షాంఘైలో నివాసం ఉంటున్నట్టు టైమ్స్ నివేదిక ద్వారా తెలుస్తోంది.
న్యూస్‌క్లిక్ ఎడిటర్ ఇన్ చీఫ్ పురకాయస్థ, మరికొందరు దేశ ఐక్యత, ప్రాదేశిక సమగ్రతను దెబ్బతీసేలా వ్వవహరిస్తున్నారని, 2020-21 ఢిల్లీలో రైతుల నిరసనల ప్రచారం వెనుక కూడా న్యూస్‌క్లిక్ పోర్టల్ సిబ్బంది హస్త ముందని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.
కశ్మీర్, అరుణాచల్‌ప్రదేశ్ వివాదాస్పద భూభాగాలంటూ కుట్ర పన్నినట్లు కేసు రిపోర్టులో తెలిపారు.కోవిడ్-19 అదుపు చేయడంలో భారత ప్రభుత్వ ప్రయత్నాలను కించపరిచేలా తప్పుడు కథనాలు ప్రచురించారు. ఉగ్రవాద నిరోధక చట్టం (UAPA)లోని పలు సెక్షన్ల కింద అరెస్టైన న్యూస్‌క్లిక్ ఎడిటర్ ఇన్ చీఫ్ పురకాయస్థ, చక్రవర్తి ఎఫ్‌ఐఆర్ కాపీలు పొందడానికి ఢిల్లీ కోర్టు గురువారం అంగీకరించింది.వారి అభ్యర్థనను ఢిల్లీ పోలీసులు వ్యతిరేకించారు. ఇప్పటికే వారి అరెస్టుకు ఆధారాలు అందించామని ఢిల్లీ పోలీసులు కోర్టుకు తెలిపారు.
విదేశాల నుంచి అక్రమ మార్గాల ద్వారా న్యూస్‌క్లిక్ పోర్టల్‌కు రూ.38 కోట్ల నిధులు అందాయనే కేసులో ఇద్దరు కీలక వ్యక్తులను మంగళవారం అరెస్టు చేయగా, వందలాది మంది విలేకరులను ప్రశ్నించి వదిలేశారు. న్యూస్‌క్లిక్‌కు అక్రమ మార్గాల్లో అందిన నిధులను సామాజిక కార్యకర్తలు తీస్తా సెతల్వాద్, గౌతమ్ నవ్లాఖాతో పంచుకున్నట్లు ఎఫ్ఐఆర్‌లో పొందుపరిచారు.
Crime News : తిరుపతిలో అక్కాతమ్ముడి దారుణ హత్య
తిరుపతిలో ఘోరం జరిగింది. కపిలతీర్థం సమీపంలోని ఓ లాడ్జిలో అక్కాతమ్ముడు దారుణ హత్యకు గురయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మహారాష్ట్ర నాందేడ్‌కు చెందిన యువరాజ్, భార్య, ఇద్దరు పిల్లలు, బావమరిదితో కలిసి తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చారు. కపిలితీర్థం సమీపంలోని ఓ లాడ్జిలో గది అద్దెకు తీసుకున్నారు. శుక్రవారం తెల్లవారుజామున యువరాజ్, తన భార్య మనీషా, బావమరిది హర్షవర్థన్‌ను దారుణంగా హత్య చేశాడని పోలీసులు వెల్లడించారు. హత్య తరవాత ఇద్దరు పిల్లలను తీసుకుని సమీపంలోని అలిపిరి పోలీస్ స్టేషన్లో యువరాజ్ లొంగిపోయాడు. ఈ హత్యలకు కారణాలు తెలియాల్సి ఉంది.
యువరాజ్‌పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కుటుంబ కలహాల కారణంగానే హత్యలు జరిగినట్టు ప్రాధమిక దర్యాప్తులో వెల్లడైంది. ఈ హత్యలపై పోలీసులు యువరాజ్‌ను విచారిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Mahadev Gaming App : బెట్టింగ్ యాప్ ఉచ్చులో బాలీవుడ్ నటులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్ వ్యవహారం బాలీవుడ్‌కు చుట్టుకుంది. తాజాగా ఈ కేసులో ప్రముఖ నటి శ్రద్ధా కపూర్‌కు ఈడీ సమన్లు జారీ చేసింది. శుక్రవారం ఢిల్లీలోని తమ కార్యాలయంలో హాజరు కావాలని ఈడీ కోరినట్లు తెలుస్తోంది. అయితే శ్రద్ధా కపూర్ విచారణకు హాజరవుతారా లేదా అనేది తెలియాల్సి ఉంది.
మహాదేశ్ బెట్టింగ్ యాప్ కేసులో ఇప్పటికే బాలీవుడ్ నటుడు రణ్‌బీర్ కపూర్, హాస్యనటుడు కపిల్ శర్మ, నటీమణులు హ్యూమా ఖురేషి, హీనా ఖాన్‌లకు ఈడీ సమన్లు జారీ చేసింది. రణ్‌బీర్ కపూర్ రాయపూర్‌లోని ఈడీ ప్రాంతీయ కార్యాలయంలో ఇవాళ హాజరు కావాల్సి ఉండగా, రెండు వారాల సమయం కోరినట్లు తెలుస్తోంది.
మహాదేవ్ బెట్టింగ్ యాప్ నిర్వాహకులు సౌరభ్ చంద్రకర్, రవి ఉప్పల్ భారత్‌లో 4 వేల మందిని నియమించుకున్నారు. ఒక్కొక్కరి వద్ద 200 మంది వినియోగదారులున్నారు. రోజుకు రూ.200 కోట్ల నగదు చేతులు మారినట్లు ఈడీ గుర్తించింది. యూఏఈ ప్రధాన కేంద్రంగా ఈ ముఠా బెట్టింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తోన్నట్లు తెలుస్తోంది.
బాలీవుడ్ నటులు మహాదేవ్ బెట్టింగ్ యాప్‌కు ప్రచారం నిర్వహించారు. ప్రమోటర్ల నుంచి పెద్ద ఎత్తున డబ్బు అందుకున్నట్లు ఈడీ అభియోగాలు మోపింది. ఈ కేసులో 15 మంది సెలబ్రిటీలు ఉన్నట్లు గుర్తించారు. మిగిలిన వారికి కూడా త్వరలో సమన్లు జారీ చేయనున్నట్లు ఈడీ తెలిపింది. హవాలా మార్గంలో బాలీవుడ్ నటులకు చెల్లింపులు జరిగాయనే కోణంలో దర్యాప్తు సాగుతోంది.
Fire Accident : ఘోర అగ్ని ప్రమాదం ఏడుగురు మృతి : 40 మందికి గాయాలు
ముంబయిలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ముంబయిలోని గోరిగోన్ ప్రాంతంలో ఏడంతస్తుల భవనంలో శుక్రవారం జరిగిన ప్రమాదంలో ఏడుగురు చనిపోయారు. 40 మంది గాయపడ్డారు. చనిపోయిన వారిలో ఇద్దరు పురుషులు, ఐదుగురు మహిళలు ఉన్నారు. గాయపడిన వారిలో 12 మంది పురుషులు, 28 మంది మహిళలు ఉన్నట్టు పోలీసులు తెలిపారు. గాయపడిన వారిని సమీపంలోని హెచ్‌బిటి, కోపర్ ఆసుపత్రులకు తరలించారు.
ఇవాళ తెల్లవారుజామున 3 గంటలకు అగ్ని ప్రమాదం జరిగినట్టు గుర్తించారు. గోర్‌గాన్ వెస్ట్ ఆజాద్ నగర్ కాలనీలో ఈ ప్రమాదం జరిగిన ముంబయి నగర పాలక సంస్థ తెలిపింది. ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ప్రమాద కారణాలు తెలియాల్సి ఉంది.
Khalistan Terrorist Arrest : లండన్‌లో ఖలిస్థాన్ సానుభూతిపరుడి అరెస్ట్
లండన్‌లోని భారత రాయబార కార్యాలయంపై గత మార్చి 19న జరిగిన దాడిలో పాల్గొన్నట్టు అనుమానిస్తోన్న ఖలిస్థాన్ ఉగ్రవాదిని స్కాట్‌లాండ్ యార్డ్ పోలీసులు అరెస్ట్ చేశారు. గత మార్చి 19న లండన్‌లోని భారత రాయబార కార్యాలయం ముందు జరిగిన నిరసనలో పొల్గొన్న వ్యక్తిని బ్రిటన్ పోలీసులు అరెస్ట్ చేసి విచారించారు. తరవాత బెయిల్‌పై విడుదలయ్యాడని పోలీసులు తెలిపారు.
మోస్ట్ వాంటెడ్ ఖలిస్థాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య తరవాత కెనడా ప్రధాని ట్రూడో చేసిన ఆరోపణపై బ్రిటన్ జోక్యం చేసుకోవాలంటూ కొందరు సోమవారం నాడు నిరసనకు దిగారు. నిరసన సమయంలో ఖలిస్థాన్ సానుభూతిపరుడిని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు.
గత మార్చి 19న లండన్‌లోని భారత రాయబార కార్యాలయంపై దాడి చేసిన 12 మందిలో, తాజాగా అరెస్ట్ చేసిన వ్యక్తి ఒకరని అనుమానిస్తున్నారు. మార్చి 19న ఖలిస్థాన్ నిరసనకారులు భారత రాయబార కార్యాలయం భవనంపైకి ఎక్కి భారత జెండాను లాగే ప్రయత్నం చేశారు. అందుబాటులో ఉన్న వస్తువులను భవనం కిటికీలపైకి విసరడంతో ఓ అధికారి కూడా గాయపడ్డారు. ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వ ఏజన్సీ ఎన్‌ఐఏ అనుమానితుల ఫోటోలను విడుదల చేసింది.
బ్రిటన్‌లోని భారత హైకమిషనర్ విక్రమ్ దొరైస్వామి, గ్లాస్గోలోని గురుద్వారాలో ప్రవేశించకుండా అడ్డుకోవడంలో కుట్ర కోణం లేదని స్కాట్‌లాండ్ పోలీసులు వెల్లడించారు.
Crime News : లైంగిక వేధింపుల కేసుల్లో 690 ఏళ్ల జైలు శిక్ష
అమెరికాలో 16 మంది బాలురను లైంగికంగా వేధించిన కేసుల్లో మాథ్యూ జక్రజెవ్‌స్కీ అనే వ్యక్తికి 690 సంవత్సరాల జైలు శిక్ష ఖరారు కానుంది. ఇతను కోస్టా మెసా ప్రాంతంలో ఇళ్లల్లో పిల్లలను ఆడించే వాడిగా పనిచేశాడు. ఇతన్ని సిట్టర్ బడ్డీ అని కూడా పిలిచేవారు. 16 మంది బాలురను లైంగికంగా వేధించడం, అందులో ఒకరికి అశ్లీల చిత్రాలను చూపించిన కేసులో ఆరెంజ్ కౌంటీ డిస్ట్రిక్ట్ కోర్టు మాథ్యూను నిందితుడుగా తేల్చింది.
మాథ్యూ 34 నేరాల్లో దోషిగా తేలింది. 14 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న వారిపై అసభ్యంగా ప్రవర్తించాడని, పదేళ్ల కంటే తక్కువ వయసున్న బాలురతో నోటితో సంభోగించాడని నిర్థారణ అయింది. అతని వద్ద నుంచి పిల్లల అశ్లీల చిత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. లైంగిక చర్యల కోసం పిల్లలను ఉపయోగించి నీలి చిత్రాలు రికార్డు చేసినట్టు రుజువైంది.
ఇలాంటి మొత్తం 34 నేరాల్లో మాథ్యూను దోషిగా తేల్చారు. తల్లిదండ్రులు ఉద్యోగాలకు వెళ్లిన సమయంలో, పార్టీలకు వెళ్లినప్పుడు పిల్లల ఆలనా పాలనా చూసేందుకు మాథ్యూను నియమించుకున్నారు. ఇంట్లో పెద్దలు లేని సమయంలో పిల్లలకు తోడుగా ఉంచడంతో మాథ్యూ ఈ దురాగతాలకు పాల్పడినట్టు తేలింది.
2014 నుంచి 2019 మధ్య కాలంలో మాథ్యూ ఈ లైంగిక దాడులకు పాల్పడ్డాడు. నేరాలు రుజువు కావడంతో నవంబర్ 17న సీ30లోని శాంటా అనాలోని సెంట్రల్ జస్టిస్ సెంటర్ శిక్షలను ప్రకటించనుంది. మాథ్యూ చేసిన నేరాలకు 690 సంవత్సరాల జైలు శిక్ష పడనుంది.
Crime News : భార్య పిల్లల్ని కాల్చి చంపి ఆత్మహత్య చేసుకున్న కానిస్టేబుల్
కడపలో ఘోరం చోటుచేసుకుంది. వెంకటేశ్వర్లు అనే హెడ్ కానిస్టేబుల్ భార్య ఇద్దరు పిల్లలను పిస్టల్‌తో కాల్చి చంపాడు. తరువాత తను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కడప కో ఆపరేటివ్ కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు కడప రెండో పట్టణ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. బుధవారం స్టేషన్ నుంచి పిస్టల్ ఇంటికి తెచ్చుకున్నట్టు తెలుస్తోంది. అర్థరాత్రి తరవాత ఈ దారుణానికి ఒడిగట్టినట్టు అనుమానిస్తున్నారు.
ఘటనా స్థలాన్ని కడప ఎస్పీ సిద్ధార్థ కౌశల్ పరిశీలించారు. కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు ఇంత దారుణానికి దిగడానికి గల కారణాలను పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వ్యక్తిగత ఇబ్బందుల వల్లే హెడ్ కానిస్టేబుల్ ఈ దారుణానికి ఒడిగట్టాడని కడప డీఎస్పీ షరీఫ్ చెప్పారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు.
Sanjay Singh Arrest: ఢిల్లీ లిక్కర్ కేసులోఆప్ ఎంపీ సంజయ్‌సింగ్ అరెస్ట్
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో బోలెడంత అప్రతిష్ట మూటగట్టుకున్న ఆమ్ ఆద్మీ పార్టీకి మరో దెబ్బ తగిలింది. అదే కేసుకు సంబంధించి, ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది.
లిక్కర్ స్కామ్‌కు అనుబంధంగా ఉన్న మనీ లాండరింగ్ కేసులో సంజయ్ సింగ్ ప్రమేయం ఉందన్నఆరోపణలపై ఈడీ ఈ ఉదయం ఆయన ఇంటిలో సోదాలు చేపట్టింది. లిక్కర్ స్కామ్ కేసులో నిందితుడిగా ఉండి అప్రూవర్‌గా మారిన వ్యాపారవేత్త దినేష్ అరోరా, సంజయ్ సింగ్ పేరును ఈడీ ముందు వెల్లడించారు. ఢిల్లీ మాజీ ఎక్సైజ్ మంత్రి మనీష్ సిసోడియాను తనకు పరిచయం చేసింది సంజయ్ సింగే అని దినేష్ ఈడీకి చెప్పారు.
ఈ కేసులో ఇప్పటికి ముగ్గురు ఆప్ నేతలు అరెస్ట్ అయ్యారు. తొలుత గతేడాది మే నెలలో ఆరోగ్యమంత్రి సత్యేంద్ర జైన్‌ను అరెస్ట్ చేసారు. నాలుగు కంపెనీల ద్వారా మనీ లాండరింగ్ చేసారన్న ఆరోపణలపై సత్యేంద్రజైన్ అరెస్ట్ అయ్యారు. ఈ యేడాది ఫిబ్రవరిలో ఢిల్లీ ఉపముఖ్యమంత్రి, కేజ్రీవాల్‌కు అత్యంత సన్నిహితుడూ అయిన మనీష్ సిసోడియాను సీబీఐ అరెస్ట్ చేసింది. సిసోడియా అరెస్ట్ పార్టీకి, కేజ్రీవాల్‌కు అతిపెద్ద దెబ్బ. వారిద్దరి తర్వాత, ఇవాళ ఎంపీ సంజయ్ సింగ్ కటకటాల పాలయ్యారు.
సంజయ్ సింగ్‌ను తొలుత ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కార్యాలయానికి తీసుకువెడతారు. అక్కడ ఆయన వాంగ్మూలం నమోదు చేస్తారు. ఎంపీని రేపు మధ్యాహ్నం కోర్టులో హాజరుపరిచే అవకాశముంది. కోర్టులో ఎంపీని తమ కస్టడీకి అప్పగించమని ఈడీ అడుగుతుంది.
ED summons Ranbir Kapoor: రణబీర్ కపూర్‌కు ఈడీ సమన్లు, ఎందుకంటే....
బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది. ఒక గేమింగ్ యాప్‌కు సంబంధించిన కేసులో శుక్రవారం నాడు ఈడీ కార్యాలయంలో హాజరు కావాలని ఆదేశించింది.
మహాదేవ్ ఆన్‌లైన్ బుక్ యాప్ అనే గేమింగ్ యాప్‌కు రణబీర్ కపూర్ ప్రచారకర్తగా ఉన్నాడు. ఆ యాప్‌కు సంబంధించిన ప్రకటనల్లో నటించాడు. దానికి గాను అతనికి పెద్దమొత్తంలో పారితోషికం చెల్లించారు. అయితే ఆ సంస్థ నేరపూరితంగా ఆర్జించిన డబ్బులను నటుడికి చెల్లించినట్లు ఈడీ ఆరోపిస్తోంది.
ఈడీ కథనం ప్రకారం మహాదేవ్ ఆన్‌లైన్ బుక్ యాప్ అనేది
ఒక అంబరిల్లా సిండికేట్. చట్టవిరుద్ధమైన బెట్టింగ్ వెబ్‌సైట్లకు ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లను
ఏర్పాటు చేస్తుంది. కొత్త వినియోగదారులను ఎన్‌రోల్ చేయడం, వారికి యూజర్ ఐడీలు
క్రియేట్ చేయడం, బినామీ బ్యాంకు ఖాతాల ద్వారా అక్రమ మనీలాండరింగ్ కార్యకలాపాలకు
పాల్పడడం వంటి చట్టవిరుద్ధమైన పనులు చేస్తోందని ఈడీ ఆరోపిస్తోంది.
ఆన్‌లైన్ గేమింగ్‌కు సంబంధించి కొత్త
నియమనిబంధనల ప్రకారం బెట్టింగ్, వేగరింగ్ ప్రమేయమున్న గేమ్స్‌ను ప్రభుత్వం
నిషేధించింది.
ఈ కేసుకు సంబంధించి రణబీర్ కపూర్ మాత్రమే కాదు,
కనీసం మరో డజను మంది నటులు, సెలబ్రిటీలు ఈడీ పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది.
వారందరికీ త్వరలో సమన్లు జారీ అవుతాయని సమాచారం.
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసుకు సంబంధించి ఈడీ గత నెల
రూ.417 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసింది. మహాదేవ్ ఆన్‌లైన్ యాప్
నిర్వాహకులు మరో నాలుగైదు యాప్‌లను కూడా నిర్వహిస్తున్నారనీ, ఒక్కో యాప్ ద్వారా
రోజుకు కనీసం 200 కోట్ల లాభం కళ్ళచూస్తున్నారని వెల్లడించింది.
ఈ యాప్ నిర్వాహకులు
ఛత్తీస్‌గఢ్ భిలాయ్‌కి చెందినవారనీ, ఈ యాప్ ప్రధాన కార్యాలయం యూఏఈలో ఉందనీ ఈడీ
దర్యాప్తులో వెల్లడయింది. శ్రీలంక, నేపాల్ దేశాల్లో కాల్‌సెంటర్ల ద్వారా వ్యవహారం
నడిపిస్తున్నారని ఈడీ కనుగొంది.
Skill Scam : చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్ల విచారణ వాయిదా
స్కిల్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌పై విజయవాడ ఏసీబీ న్యాయస్థానం ఇవాళ విచారణ చేపట్టింది. చంద్రబాబు తరపు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ప్రమోద్ కుమార్ దుబే వాదనలు వినిపించారు. సీఐడి తరపున ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి తదుపరి విచారణను రేపటికి వాయిదా వేశారు. చంద్రబాబు కస్టడీ పిటిషన్‌పై విచారణను కూడా రేపటికి వాయిదా వేశారు.
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఆధారాలు చూపించాలని ప్రభుత్వ ఏఏజీని న్యాయమూర్తి కోరారు. ప్రభుత్వ ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి గతంలో చెప్పిందే మరలా చెపుతున్నారని జడ్జి అసహనం వ్యక్తం చేశారు. ఆర్థిక నేరాల్లో బెయిల్ ఇవ్వొద్దని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి న్యాయమూర్తి దృష్టికి తీసుకువచ్చారు. ఇరు వర్గాల వాదలను విని, తదుపరి విచారణ రేపటికి వాయిదా వేశారు.
స్కిల్ కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. తదుపరి విచారణను ఈ నెల 12కు న్యాయస్థానం వాయిదా వేసింది. అప్పటి వరకు లోకేశ్‌ను అరెస్టు చేయవద్దని సీఐడీని ఆదేశించింది. స్కిల్ కేసులో లోకేశ్ పేరు చేర్చలేదని గత వారం సీఐడి తెలిపింది. స్కిల్ కేసులో చంద్రబాబు కుటుంబ సభ్యులు లబ్దిపొందారని పేర్కొనడంతో లోకేశ్ ముందస్తు బెయిల్‌కు పిటిషన్ పెట్టుకున్నారని ఆయన తరపు న్యాయవాదులు వాదించారు. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి తదుపరి విచారణను ఈనెల 12కు వాయిదా వేశారు.
Tirupati : బాలుడి కిడ్నాప్ మిస్టరీ వీడింది
తిరుమలలో కిడ్నాప్‌కు గురైన బాలుడి ఆచూకీ లభించింది. తిరుపతి అవిలాలకు చెందిన సుధాకర్ అనే వ్యక్తి చిన్నారిని కిడ్నాప్ చేశాడని జిల్లా ఎస్పీ పరమేశ్వరరెడ్డి వెల్లడించారు. కిడ్నాపర్ అక్క ధనమ్మకు పిల్లలు లేకపోవడంతో చిన్నారిని కిడ్నాప్ చేసినట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. కిడ్నాప్ చేసిన బాలుడుని ఏర్పేడు తీసుకెళ్లి సుధాకర్ అక్క ధనమ్మను అప్పగించినట్లు ఎస్పీ తెలిపారు.
తిరుపతి బస్టాండ్ లో కిడ్నాప్ కు గురైన తమిళనాడు చెన్నై కు చెందిన మురుగన్ ను తల్లిదండ్రులకు అప్పగించారు.తిరుపతి, తిరుమల పుణ్యక్షేత్రాల సందర్శనకు వచ్చే భక్తులు వారి పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని జిల్లా ఎస్పీ కోరారు. చిన్నపిల్లలతో తిరుమలకు వచ్చే భక్తులు చాలా అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.
నాంధేడ్ ప్రభుత్వ ఆసుపత్రి డీన్‌తో టాయిలెట్లు శుభ్రం చేయించిన ఎంపీ
Nanded Government Hospital Dean Clening Toilets
Amaravati IRR Case : అమరావతి రింగురోడ్డు కేసు విచారణ వాయిదా
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ సీఐడీ విచారణను ఈ నెల 10వ తేదీకి వాయిదా వేయాలని హైకోర్టు ఆదేశించింది. లోకేశ్ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్‌పై ఇవాళ హైకోర్టులో వాదనలు జరిగాయి. సీఐడి తనకు ఇచ్చిన 41ఏ నోటీసులో పొందుపరచిన కొన్ని పదాలు అభ్యంతరకరంగా ఉన్నాయంటూ లోకేశ్ లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. లోకేశ్ తరపున పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు.హెరిటేజ్ కంపెనీలో లోకేశ్ భాగస్వామిగా ఉన్నారని, కంపెనీ తీర్మానాలు ఇవ్వాలంటే ప్రొసీజర్ ఉంటుందని న్యాయవాది పోసాని కోర్టుకు తెలిపారు.
హెరిటేజ్ లెక్కల కోసం తాము పట్టుబట్టడం లేదని బుధవారం విచారణకు లోకేశ్ హాజరు కావాలని సీఐడి తరపు న్యాయవాదులు కోరారు. ఇరు వర్గాల వాదనలు విన్న ధర్మాసనం అక్టోబరు 10న సీఐడి విచారణకు లోకేశ్ హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది.
Crime News : ఉజ్జయిని సమీపంలో అత్యాచార నిందితుడి ఇల్లు కూల్చివేత
మధ్యప్రదేశ్‌లో ఉజ్జయిని సమీపంలో ఓ బాలిక అత్యాచారానికి గురైన సంగతి తెలిసిందే. ఈ కేసులో భరత్ సోనీ అనే ఆటో డ్రైవర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతను నివసిస్తోన్న ఇల్లు ప్రభుత్వ స్థలంలో అక్రమంగా నిర్మించినట్టు అధికారులు గుర్తించారు. అతని ఇంటిని బుధవారం కూల్చివేయనున్నట్టు అధికారులు ప్రకటించారు.
బాలికపై అత్యాచారం కేసులోని నిందితుడు భరత్ సోనీ జైల్లో ఉన్నాడు. కేసు విచారణ ఇంకా ప్రారంభం కాలేదు. అతని కుటుంబం కొన్నేళ్లుగా ప్రభుత్వ భూమిలో నివాస ముంటోందని ఉజ్జయిని మున్సిపల్ కార్పొరేషన్ ప్రకటించింది. అతని ఇల్లు కూల్చి వేయాలని నిర్ణయించారు. భరత్ సోనీ నివసించే స్థలం ప్రభుత్వానికి కావడంతో అతనికి ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదని ఉజ్జయిని కార్పొరేషన్ కమిషనర్ రోషన్ సింగ్ తెలిపారు.
బాలికపై అత్యాచార కేసును పోలీసులు సీరియస్‌గా తీసుకుని నిందితుడిని పట్టుకున్నారు. దాదాపు 35 మంది పోలీసులు 700 సీసీ కెమెరాల ఫుటేజీ పరిశీలించి, వందలాది మందిని విచారించిన తరవాత నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేసినట్టు పోలీస్ ఉన్నతాధికారి అజయ్ వర్మ తెలిపారు.
ఉజ్జయినికి 15 కి.మీ దూరంలోని బద్‌నగర్‌లో బాలికపై ఘోరం జరిగింది. బాలిక నోట్లో గుడ్డలు కుక్కి అత్యాచారానికి పాల్పిడినట్టు వెల్లడైంది. బాలిక రక్తమోడుతూ సహాయం కోసం ప్రతి ఇంటి తలుపు తట్టినట్టు వచ్చిన వీడియో వైరల్‌గా మారింది. బాలిక సహాయం కోసం కనిపించిన ప్రతి ఒక్కరినీ వేడుకుంటూ చివరకు ఒక ఆశ్రమం వద్దకు చేరుకుంది. అందులోని పూజారి బాలికకు టవల్ కప్పి, వెంటనే సమీపంలో ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల తరవాత ఆమె అత్యాచారానికి గురైనట్టు తెలిసింది. మెరుగైన వైద్యం కోసం బాలికను ఇండోర్‌కు తరలించారు.
‘‘నా కొడుకు నేరం చేశాడు, అతన్ని ఉరి తీయండి, అతని తరపున కోర్టులో ఎవరూ వాదించవద్దని భరత్ సోనీ తండ్రి’’ కోరారు. బాధిత కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకునేందుకు సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ హామీ ఇచ్చారు.
Tirumala Kidnap : తిరుపతిలో బాలుడి కిడ్నాప్ కలకలం
తిరుపతి బస్టాండ్‌లో రెండేళ్ల బాలుడి కిడ్నాప్ తీవ్ర కలకలం రేపింది. తిరుపతి బస్టాండ్‌లోని టికెట్ కౌంటర్ వద్ద తల్లిదండ్రులతో నిద్రిస్తోన్న బాలుడుని గుర్తు తెలియని దుండగులు ఎత్తు కెళ్లారు. అర్థరాత్రి 2 గంటలకు ఈ ఘటన జరిగినట్టు సీసీటీవీ వీడియోల ద్వారా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్టు పోలీసులు తెలిపారు.
కిడ్నాప్‌నకు గురైన బాలుడు అరుల్ మురగన్‌గా పోలీసులు గుర్తించారు. తిరుపతిలో కిడ్నాప్ ఘటనలు తరచూ చోటు చేసుకుంటున్నాయి. అనేక ప్రాంతాల్లో సీసీటీవీలు పెట్టినా దుండగులు వెనక్కు తగ్గడం లేదు. పిల్లలను అపహరించి అమ్ముకునే ముఠాల పనిగా పోలీసులు అనుమానిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా కిడ్నాపర్‌ను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
ED Raids : జర్నలిస్టుల ఇళ్లు కార్యాలయాలపై ఈడీ దాడులు
న్యూస్‌క్లిక్ న్యూస్ పోర్టల్‌లో పనిచేస్తోన్న విలేకరుల ఇళ్లు, కార్యాలయాలపై ఢిల్లీలో ఈడీ సోదాలు నిర్వహించింది. చైనా నుంచి నిధులు అందాయనే ఆరోపణలపై ఈ సోదాలు జరిగినట్టు తెలుస్తోంది. ఉగ్రవాద నిరోధక చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై న్యూస్‌క్లిక్ కార్యాలయం, అందులో పనిచేస్తోన్న విలేకరుల ఇళ్లలో ఈడీ సోదాలు నిర్వహించింది. అయితే ఇప్పటి వరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదని తెలుస్తోంది. కొంత మంది విలేకరులను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తీసుకెళ్లి విచారణ చేస్తున్నట్టు సమాచారం అందుతోంది.
న్యూస్‌క్లిక్ పోర్టల్‌పై గతంలోనే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కేసు నమోదు చేసింది. కొన్ని ఆస్తులను కూడా జప్తు చేసింది. తాజా దాడులపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. చైనా ప్రచారాలను ప్రోత్సహించే అమెరికా మిలియనీర్ నెవిల్లే రాయ్ సింఘమ్ ద్వారా న్యూస్‌క్లిక్‌కు నిధులు సమకూరాయని, వారితో సంబంధాలున్నాయని ఆగస్ట్‌లో న్యూయార్క్ టైమ్స్ కూడా ఓ కథనాన్ని ప్రచురించింది. న్యూస్‌క్లిక్‌పై 2021లో ఆర్థిక నేరాల విభాగం కేసు నమోదు చేసింది. ఢిల్లీ హైకోర్టు నుంచి న్యూస్‌క్లిక్ ప్రమోటర్లు ముందస్తు బెయిల్ పొందారు.
పన్ను ఎగవేత కేసులో 2021లో న్యూస్‌క్లిక్ కార్యాలయాల్లో సోదాలు జరిగాయి. తమపై ప్రభుత్వం అణచివేతకు పాల్పడుతోందని అప్పట్లో న్యూస్‌క్లిక్ ఎడిటర్ ప్రబీర్ పురకాయస్థ విరుచుకుపడ్డారు.స్వేచ్ఛా జర్నలిజాన్ని అణచివేస్తున్నారని ఆరోపణలు చేశారు. రాజ్యాంగం 19(1)(ఎ) ప్రకరణ ప్రకారం కల్పించిన వాక్, భావప్రకటనా స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్నారని ఆయన ఆరోపించారు. అక్రమంగా నిధులు చైనా నుంచి అందాయని వస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు. ఈ వ్యవహారం కోర్టు పరిధిలో ఉన్నందున తగిన సమయంలో స్పందిస్తామని న్యూస్‌క్లిక్ ఎడిటర్ తెలిపారు.
Dolphins Found Dead : వందకుపైగా డాల్ఫిన్ల మృత్యువాత
బ్రెజిల్ టెఫ్ సరసులో ఘోరం జరిగింది. ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ దాటిపోవడంతో వేడి తట్టుకోలేక వందకుపైగా డాల్ఫిన్లు మృత్యువాత పడ్డాయి. బ్రెజిల్ అమెజాన్ నదీ పరివాహక ప్రాంతంలో తీవ్రమైన కరవు పరిస్థితులు నెలకొన్నాయి. ఆ ప్రాంతంలో 102 డిగ్రీల ఫారెన్‌హీట్ నమోదవుతోందని అంతర్జాతీయ మీడియా తెలిపింది. ఇంత భారీగా డాల్ఫిన్లు చనిపోవడం చాలా అసాధారణమైన విషయమని బ్రెజిలియన్ మినిస్ట్రీ ఆఫ్ సైన్స్, మామిరావా ఇనిస్టిట్యూట్ శాస్త్రవేత్తలు వెల్లడించారు.
ప్రపంచంలోనే అతి పెద్ద వర్షపాత ప్రాంత అరణ్యమైన అమెజాన్ ప్రాంతంలో తీవ్రమైన కరవు పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. టెఫ్ సరసు నీరు వేడెక్కడంతో అక్కడి డాల్ఫిన్లను చల్లని ప్రదేశాలకు తరలించే ప్రయత్నాలు చేస్తున్నట్లు బ్రెజిల్ ప్రకటించింది.
అయితే ఈ నిర్ణయంపై జంతు ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డాల్ఫిన్లను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మార్చడం అంత శ్రేయస్కరం కాదని వారు అభిప్రాయపడుతున్నారు. డాల్ఫిన్లకు వైరస్‌లు ఏమైనా ఉన్నాయా పరిశీలించాలని మామిరావా ఇనిస్టిట్యూట్‌లోని పరిశోధకుడు ఆండ్రీ కోయెల్డో కోరారు.
Police Dead : యువకుడి దాడిలో పోలీస్ మృతి
వినాయక నిమజ్జనం సందర్భంగా ఏలూరు జిల్లా ఆగిరిపల్లిలో జరిగిన గొడవలో కానిస్టేబుల్ గంధం నరేంద్రపై ఓ యువకుడి దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. అతన్ని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. అయినా ఫలితం దక్కలేదు. చికిత్స పొందుతూ కానిస్టేబుల్ నరేంద్ర ఇవాళ మృతి చెందారు. పోస్ట్ మార్టమ్ కోసం నరేంద్ర మృతదేహాన్ని నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఏలూరు జిల్లా ఆగిరిపల్లిలో వినాయక నిమజ్జనంలో డీజే ఆపాలని కానిస్టేబుల్ కోరారు. దీంతో ఓ యువకుడు కానిస్టేబుల్‌పై దాడికి దిగాడు. విషయం తెలియడంతో అక్కడికి చేరుకున్న ఆగిరిపల్లి ఎస్ఐ, గాయపడ్డ కానిస్టేబుల్‌ను ఆసుపత్రికి తరలించాడు. కర్రతో దాడికి దిగడంతో కానిస్టేబుల్ అపస్మారక స్థితిలోకి చేరుకున్నట్టు గుర్తించిన డాక్టర్లు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ అపోలో ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు. అపోలోకు తీసుకెళ్లినా నరేంద్ర ప్రాణాలు దక్కలేదు.
ISIS Terrorist Arrest : ఢిల్లీలో మోస్ట్ వాంటెడ్ ఐసిస్ ఉగ్రవాది అరెస్ట్
ఢిల్లీలో మోస్ట్ వాంటెడ్ ఐసిస్ ఉగ్రవాదిని ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. షానవాజ్ అలియాస్ షఫీ ఉజ్జామా అనే ఉగ్రవాదిని అరెస్టు చేసి, రహస్య ప్రాంతంలో విచారిస్తున్నట్టు తెలుస్తోంది. తాజాగా అరెస్టైన షానవాజ్ ఐసిస్ పూణె మాడ్యూల్ కేసులో నిందితుడు. ఇతన్ని గతంలోనే పోలీసులు ఒకసారి అరెస్టు చేయగా, తప్పించుకుని ఢిల్లీ చేరుకున్నాడు. నిఘా వర్గాల సమాచారంతో ఎన్ఐఏ దాడి చేసి అరెస్ట్ చేసింది.
షానవాజ్‌తో పాటు మరో ముగ్గురు ఉగ్రవాదులు రిజ్వాన్ అబ్దుల్ హాజీ అలీ, అబ్దుల్లా ఫయాజ్ షేక్ అలియాస్ డయాపర్‌వాలా, తల్హా లియాకత్ ఖాన్‌పై ఎన్ఐఏ ఒక్కొక్కరిపై రూ.3 లక్షల రివార్డు కూడా ప్రకటించింది. పూణేలో ఐసిస్ ఉగ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలపై యాంటీ టెర్రర్ ఏజెన్సీ గత నెలలో పలువురిని అరెస్ట్ చేసింది.
మోస్ట్ వాంటెడ్ లిస్టులో ఉన్న నిందితులంతా ఐసిస్ ఉగ్రవాదులని ఎన్ఐఏ అధికారులు తెలిపారు. భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఐసిస్ ఎజెండాను కొనసాగిస్తూ దేశంలో ఇస్లామిక్ స్టేట్‌ను స్థాపించడానికి వీరంతా ప్రయత్నాలు చేస్తున్నారని ఎన్ఐఏ తెలిపింది.
Jammu Kashmir : జమ్మూ కశ్మీర్‌లో రూ.300 కోట్ల డ్రగ్స్ స్వాధీనం
జమ్మూ కశ్మీర్‌లో భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. రాంబన్ జిల్లాలో రూ.300 కోట్ల విలువైన డ్రగ్స్ తరలిస్తోన్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి పెద్ద ఎత్తున కొకైన్ సీజ్ చేశారు. ముఠా వద్ద 30 కిలోల కొకైన్ పట్టుబడింది. దీని విలువ అంతర్జాతీయ మార్కెట్లో రూ.300 కోట్లు ఉంటుందని అంచనా. డ్రగ్స్ తరలిస్తోన్న ఇద్దరు పంజాబీలను పోలీసులు అరెస్ట్ చేశారు.
జేకేలో డ్రగ్స్ అక్రమ రవాణాపై పోలీసులు కొన్నాళ్లుగా నిఘా పెంచారు. జమ్మూ కశ్మీర్ జాతీయ రహదారిలోని బేనీహాల్ వద్ద శనివారం రాత్రి పదిన్నరకు ఓ వాహనాన్ని తనిఖీ చేయగా 30 కేజీల డ్రగ్స్ గుర్తించారు. చాలా హైగ్రేడ్ కొకైన్‌గా పోలీసులు తెలిపారు. ఈ కేసులో ఇద్దరిని అదుపులోకి తీసుకుని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. దీనిపై మరింత లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నట్టు జమ్మూ జోన్ ఏడీజీపీ ముకేశ్ సింగ్ చెప్పారు.
Biggest Jewellery Heist : రూ.100 సుత్తి, రూ.1300 కట్టర్‌తో రూ.25 కోట్ల బంగారం దోపిడీ
ఢిల్లీలో గతవారం చోటుచేసుకున్న రూ.25 కోట్ల బంగారు ఆభరణాల చోరీ కేసు మిస్టరీ వీడింది. చత్తీస్‌గఢ్‌కు చెందిన లోకేశ్ శ్రీవాస్ అనే వ్యక్తి ఈ భారీ చోరీకి పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు.ముందుగా ఢిల్లీ చాందినీ చౌక్‌లో రూ.100తో ఒక సుత్తి, రూ.1300తో కట్టర్ కొనుగోలు చేసిన శ్రీవాస్ జంగ్‌పురా చేరుకుని నగల దుకాణానికి కన్నం వేశాడని పోలీసులు వెల్లడించారు. ఢిల్లీ చరిత్రలో ఇది అతిపెద్ద దొంగతనం అని పోలీసు అధికారులు తెలిపారు.
దొంగతనానికి పాల్పడిన శ్రీవాస్ తెలివితేటలకు పోలీసులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కేవలం ఒక చిన్న సుత్తి, ఒక చిన్న కట్టర్‌తోపాటు, శ్రావణం, స్కూడ్రైవర్‌తో ఇంత పెద్ద దొంగతనం చేయడం ఎన్నడూ చూడలేదని పోలీసు అధికారులు వ్యాఖ్యానించారు. భారీ దొంగతనం కావడంతో దొంగల ముఠాల పనిగా అనుమానించారు. చివరకు ఒకే వ్యక్తి రూ.25 కోట్ల బంగారం దోచాడని తెలియడంతో పోలీసులు షాకయ్యారు.
గత ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో దొంగ శ్రీవాస్ ఢిల్లీ భోగల్‌లోని ఉమ్రావ్ జ్యుయలరీ భవనంపైకి చేరుకున్నారు. రాత్రంతా అక్కడే ఉండి బంగారం దాచే స్ట్రాంగ్ రూంకు కన్నం వేశాడు. ముందుగా సీసీటీవీల కేబుళ్లను తొలగించాడు. ముందస్తు ప్రణాళిక ప్రకారం శ్రీవాస్ ఈ దొంగతనానికి పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు.
దొంగతనానికి పాల్పడిన శ్రీవాస్ నాలుగంతస్తుల భవనం టెర్రస్‌పైకి ఎక్కి, అక్కడ నుంచి గ్రౌండ్ ఫ్లోర్‌లోని స్ట్రాంగ్ రూంకు చేరుకున్నట్టు విచారణలో తేలింది.
డ్రిల్లింగ్ మెషిన్‌తో స్ట్రాంగ్ రూం గోడకు కన్నం వేసి అక్కడ ఆభరణాలతోపాటు దుకాణంలోని బంగారం కూడా ఎత్తుకెళ్లాడు. శుక్రవారం శ్రీవాస్‌ను చత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌లో అరెస్టు చేసిన పోలీసులు అతని వద్ద నుంచి దోచుకెళ్లిన ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.
Pakistan Comments : బలూచిస్థాన్ పేలుడు వెనుక భారత హస్తం
పాకిస్థాన్‌లో బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో శుక్రవారం చోటు చేసుకున్న ఆత్మాహుతి దాడి వెనుక భారత ఇంటెలిజెన్స్ సంస్థ రా హస్తం ఉందని పాకిస్థాన్ తీవ్ర ఆరోపణలు చేసింది. మస్తాంగ్ ఆత్మాహుతి దాడి వెనుక ఉన్న శక్తులను దేశంలోని పౌర, సైనిక శక్తులన్నీ కలసి ఎదుర్కొంటున్నాయని పాకిస్థాన్ మంత్రి సర్ఫరాజ్ బుగిటి మరోసారి ఆరోపణలు చేశారు. ఈ ఆత్మాహుతి దాడి వెను భారత రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ రా హస్తం ఉందని ఆయన విమర్శించారు. ఎలంటి ఆధారాలతో ఆరోపణలు చేస్తున్నారనే విషయం మాత్రం ఆయన చెప్పలేదు.
బలూచిస్థాన్ ఆత్మాహుతి దాడికి కేసులో కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకుని పాక్ పోలీసులు ప్రశ్నిస్తున్నారు. బలూచిస్థాన్ పేలుళ్లలో ఇప్పటి వరకు చనిపోయిన వారి సంఖ్య 60కు చేరింది. మిలాద్ ఉన్ నబీ పురస్కరించుకుని మసీదులో ప్రార్థనలు జరిగాల్సిన కొద్ది సమయం ముందు ఆత్మాహుతి దాడి జరిగిన సంగతి తెలిసిందే. కొన్నేళ్లుగా పాక్‌లో తెహ్రీకీ తాలిబన్ భారీ దాడులకు దిగుతోంది. ఈ దాడి ఘటనకు ఏ తీవ్రవాద సంస్థ కూడా బాధ్యత తీసుకోలేదు.
Bus Accident : తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం : 8 మంది మృతి
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కునూర్‌లోని మరపాలెం సమీపంలో పర్యాటక బస్సు లోయలో పడిపోయింది. 8 మంది చనిపోగా, 35 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రమాదం నుంచి వెలికి తీసిన క్షతగాత్రులను సమీపంలోని కునూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
55 మంది ఉన్న పర్యాటకుల బస్సు ఊటీ నుంచి మెట్టుపాళయం వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని కోయంబత్తూరు డీఐజి శరవణ సుందర్ తెలిపారు. బస్సు లోతైన లోయలో పడిపోవడంతో క్షతగాత్రులను వెలికి తీయడం కష్టంగా మారింది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. చనిపోయిన వారిలో కొందరు తెలుగువారు ఉన్నట్టుగా తెలుస్తోంది. మరింత సమాచారం అందాల్సి ఉంది.
MP Minor Rape Issue: నా కొడుకుని ఉరి తీసేయండి
మధ్యప్రదేశ్ ఉజ్జయినిలో 12ఏళ్ళ బాలిక అత్యాచారం కేసులో నిందితుడిగా అరెస్టయిన భరత్ సోనీని ఉరి తీసేయమని అతని తండ్రి డిమాండ్ చేసాడు. మరోవైపు, నిందితుడి తరఫున ఎవరూ వాదించవద్దంటూ స్థానిక బార్ అసోసియేషన్ న్యాయవాదులకు విజ్ఞప్తిచేసింది.
12ఏళ్ళ బాలిక అత్యాచారం కేసులో ఉజ్జయిని మహాకాళ్ పీఎస్ పోలీసులు ఆటోడ్రైవర్ భరత్ సోనీని గురువారం అరెస్టు చేసారు. సీసీటీవీ ఫుటేజ్ పరిశీలనలో బాలిక ఆఖరిసారి అతని ఆటోలో కనిపించింది. ఆటోను పరిశీలించినపుడు అందులో రక్తపు మరకలు కనిపించాయి.
భరత్ సోనీ తండ్రి ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు. ‘‘ఇది చాలా సిగ్గుచేటు. నా కొడుకుని కలవడానికి నేను ఆస్పత్రికి వెళ్ళలేదు. పోలీస్ స్టేషన్‌కీ, కోర్టుకూ కూడా వెళ్ళను. నా కొడుకు నేరం చేసాడు. అతన్ని ఉరి తీసేయాలి’’ అన్నారు. బాధిత బాలిక తన కుమార్తె లాంటిదేనని ఆవేదన చెందారు.
మహాకాళుడి పవిత్రక్షేత్రంగా ఉజ్జయిని నగరానికి ఉన్న గొప్ప పేరును ఈ దుర్ఘటన దెబ్బతీసిందని ఉజ్జయిని బార్ కౌన్సిల్ అధ్యక్షుడు అశోక్ యాదవ్ అన్నారు. నిందితుడి తరఫున ఎవరూ వాదించవద్దని కౌన్సిల్ సభ్యులైన న్యాయవాదులకు ఆయన విజ్ఞప్తి చేసారు.
పన్నెండేళ్ళ బాలిక సరైన దుస్తులు లేకుండా రక్తమోడుతూ నగర వీధుల్లో తిరుగుతుంటే ఒక పూజారి ఆమెను చేరదీసారు. ఆమెకు దుస్తులు కప్పి, ఆస్పత్రిలో చేర్పించారు. పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటన జరిగిన మూడవ రోజులకు పోలీసులు నిందితుణ్ణి అరెస్ట్ చేసారు. వైద్యపరీక్షల్లో, బాధిత బాలికపై అత్యాచారం జరిగినట్లు నిర్ధారణ అయింది.
పోలీసుల దర్యాప్తులో భాగంగా గురువారం నిందితుణ్ణి ఘటనా స్థలానికి తీసుకువెళ్ళే సమయంలో అతను పారిపోయే ప్రయత్నం చేసాడు. ఆ క్రమంలో అతను గాయపడ్డాడని పోలీసులు వివరించారు.
బాధిత బాలికకు బుధవారం నాడు ఇండోర్‌లోని ప్రభుత్వ మహిళా ఆస్పత్రిలో మేజర్ సర్జరీ చేసారు. బాలిక ఇప్పటికీ సరిగ్గా మాట్లాడలేకపోతోంది. ఆమెది సత్నా జిల్లా అని మాత్రం తెలిసింది. సత్నా జిల్లాలో అదే వయసు గల బాలిక ఒకరు కనిపించకుండా పోయినట్లు కేసు నమోదయింది. అయితే ఆ బాలిక, ఈ బాలిక ఒక్కరో కాదో ఇంకా నిర్ధారణ కాలేదు.
అసెంబ్లీ ఎన్నికల ముంగిట్లో ఉన్న మధ్యప్రదేశ్‌లో ఈ దుర్ఘటన రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. బీజేపీ పాలనలో శాంతిభద్రతల పరిస్థితి దిగజారిపోయిందని కాంగ్రెస్ మండిపడింది. ‘‘మైనర్లపై అత్యాచార కేసుల విషయంలో మధ్యప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. 18ఏళ్ళ శివరాజ్ సింగ్ చౌహాన్ పాలనలో 58వేల రేప్ కేసులు, 68వేల కిడ్నాప్ కేసులూ నమోదయ్యాయి. అయినా దేశ ప్రధాని, హోంమంత్రి, బీజేపీ నాయకులు ఎవ్వరూ నోరు మెదపడం లేదు’’ అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనాతే దుయ్యబట్టారు.
MP girl case: అత్యాచారానికి గురైన బాలికను గుర్తించిన తండ్రి, పోలీసుల ఉదార హృదయం
మధ్యప్రదేశ్ ఉజ్జయినిలో 12ఏళ్ళ బాలికపై జరిగిన అత్యాచారం, ఆమెకు సాయం చేయడానికి స్థానికులెవరూ ముందుకు రాకపోవడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఒక ఆశ్రమ పూజారి ఆమెను కాపాడి, ఆస్పత్రిలో చేర్చి, పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదయింది.
బాధిత బాలిక నిస్సహాయంగా దుస్తులు లేకుండా రక్తమోడుతూ 8 కిలోమీటర్ల పాటు వీధుల్లో తిరిగిన ఘటన విస్తృతంగా చర్చకు దారితీసింది. ఆ సమయంలో కొందరు తీసిన వీడియో వైరల్ అవడంతో పాటు, ఆమెను గుర్తించడానికి కారణమైంది. బాధిత బాలిక తన వివరాలేవీ చెప్పలేకపోవడంతో ఆమెను గుర్తించడం కష్టమయింది. అయితే బాధితురాలి వీడియోను ఆమె బంధువు ఒకరు చూసి, ఆమె తండ్రికి వెల్లడించారు. అలా ఆయన తన కూతురిని చేరుకోగలిగారు.
బాధితురాలిది మధ్యప్రదేశ్‌లోని సత్నా జిల్లా. సెప్టెంబర్ 24న రోజూలాగే బడికి నడుచుకుంటూ వెళ్ళిందని, కానీ సాయంత్రం తిరిగి రాలేదనీ ఆమె తండ్రి చెప్పారు. ఆ రోజంతా వెతికినా బాలిక ఆచూకీ తెలియలేదన్నారు. దాంతో సెప్టెంబర్ 25న పోలీసులకు ఫిర్యాదు చేసామన్నారు. ఉజ్జయినిలో దారుణ సంఘటన వీడియోను ఒక బంధువు చూపించడంతో, ఆ బాధితురాలు తన కుమార్తేనని గుర్తించినట్టు చెప్పారు.
ఉజ్జయినిలో బాలిక ఒక ఆటో ఎక్కినట్టు సీసీటీవీలో నమోదయింది. ఆ ఆటోలో రక్తపు మరకలను గుర్తించినట్టు పోలీసులు వెల్లడించారు. వాటిని ఫోరెన్సిక్ పరీక్ష చేయిస్తున్నట్టు చెప్పారు. ఆటో డ్రైవర్‌తో పాటు మరో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఒకవైపు స్థానిక ప్రజలు బాధితురాలికి సహాయం చేయకపోవడం విమర్శలకు దారితీస్తే, అదే సమయంలో పోలీసుల మానవత్వం ప్రశంసల పాలయింది. బాలికకు ఇద్దరు పోలీసులు రక్తదానం చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఉజ్జయిని మహాకాళ్ పోలీస్ స్టేషన్ ఇనస్పెక్టర్ అజయ్ వర్మ, బాధిత బాలికను దత్తత తీసుకోడానికి సిద్ధమయ్యారు. ఆమె తల్లిదండ్రుల ఆచూకీ తెలియకపోతే, ఆమెను చట్టబద్ధంగా దత్తత తీసుకోడానికి సిద్ధమైనట్టు ఆయన చెప్పారు. ఆస్పత్రిలో చికిత్స సమయంలో ఆ చిన్నారి ఆవేదన తనను కలచివేసిందన్నారు. బాలిక ఆస్పత్రి ఖర్చులు తానే పెట్టుకుంటానన్నారు. అలాగే ఆమెను తానే చదివిస్తానని చెప్పారు.
ఈ కేసులో నేరస్తులను
మామూలుగా వదిలిపెట్టబోమనీ, కఠినంగా శిక్షిస్తామని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్
సింగ్ చౌహాన్ చెప్పారు.
టీవీ డిబేట్ లైవ్ షోలోనే కుమ్ముకున్న పాకిస్థాన్ రాజకీయ నాయకులు
పాక్ రాజకీయ నాయకులు ఎలా కుమ్ముకున్నారో చూడండి
Pakistan Mosque Blast : పాకిస్థాన్లో భారీ పేలుడు : 52 మంది మృతి
పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ ప్రావిన్స్‌లోని ఓ మసీదు సమీపంలో ఇవాళ జరిగిన ఆత్మాహుతి దాడిలో 52 మంది చనిపోయారు. 130 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. మహమ్మద్ ప్రవక్త జన్మదిన వేడుకల ర్యాలీకి ప్రజలు సిద్దమవుతున్న సమయంలో ఓ దుండగుడు ఆత్మాహుతికి పాల్పడినట్టు జియో న్యూస్ వెల్లడించింది.
ఈ పేలుడులో ర్యాలీ విధులు నిర్వహిస్తోన్న డీఎస్పీ నవాజ్ గష్కోరి కూడా చనిపోయారు. మహమ్మద్ ప్రవక్త జయంతి ఈద్ మిలాదున్ నబీని పురస్కరించుకుని ప్రజలు ర్యాలీకి సిద్దమవుతున్న సమయంలో భారీ పేలుడు సంభవించింది. డీఎస్పీ కారు పక్కనే ఓ వ్యక్తి ఆత్మాహుతి దాడికి దిగినట్టు సిటీ స్టేషన్ హౌస్ అధికారి మహ్మద్ జావేద్ లెహ్రీ తెలిపారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. పేలుడు కుట్ర కారణాలు తెలియరావాల్సి ఉంది.
Crime News : రూ.25 కోట్ల బంగారం కొట్టేసిన దొంగలు దొరికారు
ఢిల్లీలోని ఉమ్రావ్ జ్యుయలరీ దుకాణంలో రూ.25 కోట్ల విలువైన బంగారు నగలు కాజేసిన దొంగలను పోలీసులు పట్టుకున్నారు. ఈ చోరీతో సంబంధం ఉన్న ఇద్దరు అనుమానితులను ఛత్తీస్‌ఘడ్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు. సొత్తును స్వాధీనం చేసుకునేందుకు సోదాలు నిర్వహిస్తున్నట్టు పోలీసు అధికారులు తెలిపారు.
ఆదివారం సాయంత్రం నుంచి మంగళవారం మధ్యకాలంలో ఢిల్లీలోని భోగాల్ ప్రాంతంలోని ఉమ్రావ్ జ్యుయలరీ దుకాణంలో భారీ చోరీ జరిగినట్టు సిబ్బంది గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై పోలీసులు బృందాలు రంగంలోకి దిగి ముమ్మరంగా సోదాలు నిర్వహిస్తున్నాయి.
నాలుగంతస్తుల ఉమ్రావ్ జ్యుయలరీ భవనం టెర్రాస్ ఎక్కి అక్కడి నుంచి కింది అంతస్తులకు దొంగలు చేరుకున్నట్టు సీసీ టీవీ వీడియోల్లో గుర్తించారు. జ్యుయలరీ దుకాణంలోని లాకర్ గదికి డ్రిల్లింగ్ మిషన్‌తో కన్నం వేసి దొంగతనం చేసినట్టు పోలీసుల ప్రాధమిక దర్యాప్తులో తేలింది. లాకర్‌లో దాచిన బంగారు నగలతోపాటు, ప్రదర్శనగా ఉంచిన నగలు కూడా దొంగలు దోచుకెళ్లారు. మొత్తం రూ.25 కోట్ల విలువైన బంగారం చోరీ అయినట్టు దుకాణ యజమాని ప్రకటించారు. ఇప్పటికే కేసు నమోదు చేసిన పోలీసులు ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.
NIA on Fake Notes Case: దేశాన్ని ఆర్థికంగా దెబ్బతీయడానికి దొంగనోట్లు చెలామణీ చేసిన ఉగ్రవాది
ఆ ఉగ్రవాదిని అంకుల్ అని పిలుస్తారు. అతని అసలు పేరు జావేద్ పటేల్. అతని లక్ష్యం భారతదేశాన్ని ఆర్థికంగా దెబ్బతీయడం. దానికి అతను ఎంచుకున్న పద్ధతి దొంగనోట్ల చెలామణీ. అత్యుత్తమ నాణ్యత కలిగిన నకిలీ కరెన్సీ నోట్లను తన సహచరుల ద్వారా దేశంలో చెలామణీ చేసేవాడు.
ఈ వివరాలన్నీ చెప్పింది జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ. థానే నకిలీ కరెన్సీ కేసులో ఆ సంస్థ తాజాగా బుధవారం నాడు ముంబై ప్రత్యేక న్యాయస్థానంలో జావేద్ పటేల్ సహా నలుగురి మీద అదనపు చార్జిషీట్ దాఖలు చేసింది. ఆ చార్జిషీట్‌లో ఈ వివరాలన్నీ వెల్లడించింది.
జావేద్ పటేల్ అలియాస్ జావేద్ చిక్నా అలియాస్ అంకుల్, రియాజ్ షికిల్కర్, మహ్మద్ ఫయాజ్ షికిల్సకర్, నాసిర్ చౌధురి అనే నలుగురి మీద భారత శిక్షా స్మృతి, చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా) సెక్షన్ల ప్రకారం ఎన్ఐఏ కేసు నమోదు చేసింది. ఫయాజ్ మీద ఆయుధాల చట్టం ప్రొవిజన్ల ప్రకారం కూడా కేసు నమోదయింది.
గత ఏప్రిల్ నెలలో రెండువేల రూపాయల భారత కరెన్సీకి చెందిన 149 నకిలీనోట్లను రియాజ్ షికిల్కర్ దగ్గరనుంచి థానే పోలీసులు సీజ్ చేసారు. ఆ కేసులో ముగ్గురు నిందితుల మీద చార్జిషీటు దాఖలు చేసారు. తర్వాత ఆ కేసు ఎన్ఐఏ చేతికి వచ్చింది, దర్యాప్తు చేస్తున్న క్రమంలో మే 2023లో అక్రమ ఆయుధాలు కలిగి ఉన్న నేరానికి ఫయాజ్‌ను అరెస్ట్ చేసారు,
‘‘ఈ కేసు దర్యాప్తులో ఫయాజ్ భారతదేశంలో చట్టవ్యతిరేక కార్యకలాపాలకు కుట్ర పన్నాడని, అందులో భాగంగా అంకుల్ అలియాస్ జావేద్ పటేల్‌తో కాంటాక్ట్‌లో ఉన్నాడనీ తెలిసింది. ఉగ్రవాది అయిన జావేద్ పటేల్, తన అనుచరుడైన ‘భాయ్’ అనేవాడి ద్వారా ఫయాజ్‌కు నిధులు సమకూర్చాడనీ తేలింది.’’ అని ఎన్ఐఏ తన చార్జిషీట్‌లో పేర్కొంది.
జావేద్ పటేల్ భారత ఆర్థిక స్థిరత్వాన్ని
దెబ్బతీయడమే లక్ష్యంగా అత్యుత్తమ నాణ్యత కలిగిన నకిలీ భారతీయ కరెన్సీని తన అనుచరుల
ద్వారా దేశంలో చెలామణీలోకి తెస్తున్నాడనీ, తద్వారా ఉగ్రవాద కార్యకలాపాలకు
పాల్పడుతున్నాడనీ ఎన్ఐఏ తన ఛార్జిషీట్‌లో స్పష్టం చేసింది.
SOCIAL MEDIA CASE ARRESTS: న్యాయవ్యవస్థపై అనుచిత వ్యాఖ్యల కేసులో కొనసాగుతున్న అరెస్టులు
నైపుణ్యాభివృద్ధి కేసును విచారణ చేసిన ఏసీబీ కోర్టు జడ్జి హిమబిందును అవమానించేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిపై పోలీసులు కేసులు నమోదు చేసి అరెస్టు చేస్తున్నారు. టీడీపీ నేత ముల్లా ఖాజా హుస్సేన్ ను నంద్యాల పోలీసులు అరెస్టు చేశారు. ముల్లా ఖాజా హుస్సేన్ ఓ ప్రైవేటు కాలేజీలో లెక్చరర్ గా పనిచేస్తున్నారు.
కృష్ణా జిల్లాకు చెందిన టీడీపీ నేత బుర్రా వెంకట్‌ను కూడా కంకిపాడు పోలీసులు అదుపులోకి తీసుకుని స్పెషల్ బ్రాంచ్ పోలీసులకు అప్పగించారు. స్కిల్ కేసులో చంద్రబాబుకు రిమాండ్ విధించిన న్యాయమూర్తిని అవమానించేలా పోస్టులు పెట్టాడని ఇతనిపై అభియోగం ఉంది.
స్కిల్ కేసులో చంద్రబాబుకు జుడీషియల్ రిమాండ్ విధించిన జడ్జితో పాటు హైకోర్టులో క్వాష్ పిటిషన్ ను కొట్టివేసిన న్యాయమూర్తికి వ్యతిరేకంగా కొందరు సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. జడ్జిలపై అనుచిత పోస్టులు, ట్రోలింగ్ వ్యవహారంపై రాష్ట్రప్రభుత్వం, హైకోర్టులో క్రిమినల్ కంటెంప్ట్ పిటిషన్ వేసింది. కొందరు కావాలనే అనుచిత పోస్టులు చేశారని అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ కోర్టుకు తెలిపారు.
సోషల్ మీడియాలో పోస్టులు చేసిన 26 మంది అకౌంట్లు పరిశీలించి నోటీసులు జారీ చేయాలని డీజీపీకి ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. అంతకు ముందు రాష్ట్రపతి భవన్ కూడా ఈ అంశంపై స్పందించింది. తమకు అందిన ఫిర్యాదును ఏపీ సీఎస్ కు పంపి తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది.
చిన్నారి ప్రాణాలు కాపాడిన వృద్ధుడి సాహసం
చిన్నారి ప్రాణాలు కాపాడిన వృద్ధుడి సమయస్ఫూర్తి
MP Rape: రక్తమోడుతూ రక్షించమని ఇల్లిల్లూ తిరిగిన 12ఏళ్ళ అత్యాచార బాధితురాలు
మధ్యప్రదేశ్‌లో మహాఘోరం జరిగింది. పన్నెండేళ్ళ చిన్నారి బాలిక అత్యాచారానికి గురయింది. రక్తమోడుతున్న ఒంటి మీద సరైన దుస్తులే లేని దుస్థితిలో సహాయం కోసం ఇంటింటికీ తిరిగి ప్రతీ తలుపూ తట్టింది. ఎవ్వరూ ఆమెకు అండగా నిలవలేదు. ఒక వ్యక్తి ఆమెను తరిమేసిన దృశ్యాలు సీసీటీవీలో నమోదయ్యాయి కూడా. ఈ దుర్ఘటన ఉజ్జయిని నగరానికి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో బాడ్‌నగర్ రోడ్డు మీద చోటు చేసుకుంది.
అత్యాచార ఘటనతో భయభ్రాంతురాలైపోయిన చిన్నారి బాలిక ఒంటిమీద సరైన దుస్తులయినా లేని నిస్సహాయ పరిస్థితిలో వీధులన్నీ తిరిగి తిరిగి చివరికి ఒక ఆశ్రమం చేరింది. అక్కడ ఒక సాధువు ఆ బాలికను చూసి చలించిపోయారు. లైంగిక అత్యాచారానికి గురయిందని అర్ధం చేసుకున్నారు. వెంటనే ఆమెను ఒక శాలువాతో కప్పి, జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్ళారు. అక్కడ ఆ బాలికను పరీక్షించిన వైద్యులు అత్యాచారం జరిగిందని ధ్రువీకరించారు.
బాలికకు అయిన గాయాలు తీవ్రమైనవి కావడంతో ఆమెను హుటాహుటిన ఇండోర్‌కు తరలించారు. ఆమెకు రక్తం అవసరమైతే స్థానిక పోలీసులు సహకరించారు. ఇప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి నిలకడగా ఉంది. సీనియర్ పోలీసు అధికారి దీపికా షిండే ఆ బాలిక వివరాలు తెలుసుకోడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఆ బాలిక సరైన జవాబులు చెప్పే పరిస్థితిలో లేదు. దాంతో పోలీసులు, గుర్తు తెలియని బాలికపై అత్యాచారం జరిగినట్లు కేసు నమోదు చేసారు. పోక్సో చట్టం సెక్షన్ల ప్రకారం కేసు పెట్టారు.
ఈ కేసులో నేరస్తులను గుర్తించేందుకు, వారిని వీలైనంత త్వరగా పట్టుకునేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్టు ఉజ్జయిని పోలీస్ అధికారి సచిన్ శర్మ చెప్పారు. ‘‘వైద్య పరీక్షల్లో అత్యాచారం జరిగినట్టు నిర్ధారణ అయింది. ఈ కేసును త్వరగా విచారించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసాం. ఈ ఘటన గురించి ఎవరికైనా తెలిసి ఉంటే, ఎలాంటి సమాచారాన్నయినా మాకు చెప్పాలని ప్రజలను కోరుతున్నాం’’ అన్నారు సచిన్ శర్మ. నేరం ఎక్కడ జరిగిందన్న సంగతిని ఆయన ధ్రువీకరించలేదు. ‘‘ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోంది. త్వరలోనే వివరాలు తెలుస్తాయని భావిస్తున్నాం’’ అని మాత్రం చెప్పారు.
‘‘బాధిత బాలిక తన గురించి ఎలాంటి వివరాలూ చెప్పలేకపోతోంది. ఆమె మాట్లాడుతున్న యాసను బట్టి ఆమె ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ ప్రాంతానికి చెందినది అయి ఉండవచ్చు’’ అని అభిప్రాయపడ్డారు.
మహిళల పట్ల హింసలో మధ్యప్రదేశ్ రికార్డు దారుణంగా ఉంది. 2019 నుంచి 2021 మధ్యలో మహిళలు, బాలికల అదృశ్యం కేసులు దేశంలో ఎక్కువగా మధ్యప్రదేశ్, మహారాష్ట్రల్లోనే నమోదయ్యాయి. 2021లో దేశంలోనే అత్యధిక సంఖ్యలో అత్యాచార ఘటనలు నమోదైనది మధ్యప్రదేశ్‌లోనే. 6462 కేసుల్లో సగానికి పైగా అత్యాచారాలు జరిగింది మైనర్ బాలికల పైనే కావడం గమనార్హం.
NIA Raids : ఖలిస్తాన్ ఉగ్రవాదులు లక్ష్యంగా ఆరు రాష్ట్రాల్లో ఎన్‌ఐఏ దాడులు
ఖలిస్తాన్ ఉగ్రవాదులు లక్ష్యంగా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజన్సీ ఆరు రాష్ట్రాల్లోని 51 ప్రాంతాల్లో బుధవారం నాడు ఏకకాలంలో దాడులు నిర్వహించింది. ఖలిస్తాన్ ఉగ్రవాదులు లారెన్స్, బాంబిహా, ఆర్ష్ దల్లా గ్యాంగులను లక్ష్యంగా చేసుకుని ఎన్ఐఏ ఈ దాడులు నిర్వహించిట్లు తెలుస్తోంది.
బుధవారం తెల్లవారుజామున పంజాబ్‌లోని మోగా జిల్లా తత్కాపురా గ్రామానికి చెందిన సారా వ్యాపారి ఇంటిపై ఎన్ఐఏ దాడులు జరిపింది. సారా వ్యాపారి నుంచి ఖలిస్తాన్ గ్యాంగ్‌స్టర్ ఆర్ష్ దాలా భారీ మొత్తం డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది. అందులో కొంత మొత్తం సారా వ్యాపారి చెల్లించినట్టు సమాచారం అందుతోంది. ఈ నేపథ్యంలో ఎన్‌ఐఏ దాడులు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఉద్దమ్‌సింగ్ నగర్ ప్రాంతంలోని ఆయుధాగారంపై కూడా ఎన్‌ఐఏ దాడి చేసింది. డెహ్రాడూన్ జిల్లా క్లెమెన్‌టౌన్ ప్రాంతంలోనూ ఎన్ఐఏ దాడులు నిర్వహించింది. గన్ హౌస్‌లో ఎన్ఐఏ బృందాలు ఆయుధాలు తనిఖీ చేస్తున్నట్టు ఉత్తరాఖండ్ పోలీసులు వెల్లడించారు. ఈ ఖలిస్తాన్ ముఠాలతో 43 మంది సంబంధాలు కలిగి ఉన్నట్టు ఎన్ఐఏ గుర్తించింది. వారికి కెనడాలోని ఖలిస్థాన్ ఉగ్రవాదులతో లింకులు ఉన్నట్టు అనుమానిస్తున్నారు.ఖలిస్తాన్ ఉగ్రవాదులతో సంబంధాలున్న ముఠాల ఆస్తుల వివరాలు తమకు అందించాలని ఎన్ఐఏ, ఉత్తరాఖండ్ పోలీసులను కోరారు. ఎన్ఐఏ ఇప్పటికే ఖలిస్తాన్ ఉగ్రవాదులతో సంబంధం ఉన్న ముఠా సభ్యుల ఫోటోలను విడుదల చేసింది.
చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న గుర్‌పత్‌వంత్ సింగ్ పానున్‌కు చెందిన చండీఘర్, అమృత్‌సర్ ప్రాంతాల్లోని ఆస్తులను జప్తు చేశారు. సెప్టెంబరు 21న పంజాబ్‌లోని దాదాపు వెయ్యికిపైగా ప్రాంతాల్లో ఎన్ఐఏ సోదాలు నిర్వహించింది. గోల్డీ బ్రార్‌ను ఎన్ఐఏ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల జాబితాలో చేర్చింది. ఇటీవల కెనడాలోని విన్నింగ్‌పెగ్‌లో హత్యకు గురైన సుఖా దునికే హత్యలోనూ ఇతనికి ప్రమేయం ఉందని అనుమానిస్తున్నారు.
Iraq Fire Accident : భారీ అగ్ని ప్రమాదం : 113 మంది సజీవ దహనం
ఇరాక్‌లో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో 113 మంది చనిపోయారు. మరో 150 మంది తీవ్రంగా గాయపడ్డారని అంతర్జాతీయ మీడియా ద్వారా తెలుస్తోంది. ఓ పెళ్లి వేడుకలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఈ ఘోరం చోటు చేసుకున్నట్టు ఇరాక్ స్థానిక మీడియా కూడా వెల్లడించింది. మంగళవారం రాత్రి 8 గంటలకు ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు ఇరాక్‌లోని నినీవాహ్ ప్రాంత గవర్నర్ హసాన్ అల్ అల్లాహ్ స్పష్టం చేశారు. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 113 మంది చనిపోయినట్టు గుర్తించారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశ ముందని అధికార వర్గాలు తెలిపాయి.
ఈ ఘటన చాలా దురదృష్టకరమని, బాధితులను ఆదుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు ఇరాక్ వైద్య శాఖ అధికార ప్రతినిధి సైఫ్ అల్ బదర్ చెప్పారు. మోసుల్ నగరానికి సమీపంలో, బాగ్దాద్ నగరానికి 400 కి.మీ ఉత్తర ప్రాంతంలోని హమ్‌దాయుయహ్ జిల్లాలో ఈ అగ్ని ప్రమాదం జరిగింది.
పెళ్లి వేడుకలు జరిగే మందిరంలో టపాసులు కాల్చడం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు ప్రాధమిక దర్యాప్తులో తేలిందని పౌర రక్షణ అధికారులు తెలిపారు.
ప్రమాదం జరిగిన సమయంలో పెళ్లి మండపంలో 1000 మంది ఉన్నట్టు తెలుస్తోంది. వీరిలో 113 మంది చనిపోయారు. 150 మందికిపైగా తీవ్రంగా గాయపడినట్టు అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఇరాక్ వైద్య శాఖ అధికార ప్రతినిధి ప్రకటించారు.
కిటికీలో ఇరుక్కుపోయిన కొండచిలువ...తరవాత ఏం జరిగిందంటే
కిటికీలో ఇరుక్కుపోయిన కొండచిలువు
Crime News : రూ.25 కోట్ల విలువైన బంగారం చోరీ
దేశ రాజధాని దిల్లీలో భారీ చోరీ జరిగింది. ఓ నగల దుకాణంలో రూ.25 కోట్ల విలువైన బంగారాన్ని దొంగలు కాజేశారు. ముందస్తు ప్రణాళికతోనే చోరీకి పాల్పడినట్టు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... దిల్లీలోని భోగాల్ ప్రాంతంలోని ఉమ్రావ్ జ్యూయలరీ దుకాణంలోని, స్ట్రాంగ్ రూంకు దొంగలు కన్నం వేశారు. ఆదివారం వ్యాపారం ముగిశాక సిబ్బంది తాళాలు వేసి వెళ్లిపోయారు. సోమవారం సెలవు ఉండటంతో మంగళవారం నాడు దుకాణం తెరిచారు. చోరీ జరిగినట్టు గుర్తించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
ఉమ్రావ్ దుకాణం నాలుగు అంతస్థుల భవనంలో ఉంది. సీసీటీవీ కెమెరాలను నిలిపివేసి దొంగతనానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న స్ట్రాంగ్ రూమ్‌కు డ్రిల్లింగ్ మెషిన్‌తో కన్నం వేసి, నగలు దోచుకున్నారని పోలీసు అధికారి చెప్పారు. స్ట్రాంగ్ రూమ్‌లో దాచిన నగలతోపాటు, దుకాణంలోని నగలు కూడా చోరీ అయినట్టు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇదే తరహా చోరీ అంబాలాలోని కో ఆపరేటివ్ బ్యాంక్‌లో కూడా చోటు చేసుకుంది. దీంతో ఈ రెండు దొంగతనాలకు పాల్పడింది ఒకే ముఠానా అనే దానిపై కూడా పోలీసులు అనుమానిస్తున్నారు.
Skill Scam : చంద్రబాబు పిటిషన్‌పై సుప్రీంకోర్టులో రేపు విచారణ
స్కిల్ స్కామ్ కేసులో మాజీ సీఎం చంద్రబాబునాయుడు తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ రేపు విచారణకు రానుంది. చంద్రబాబు తరపు న్యాయవాదులు దాఖలు చేసిన మెన్షన్ మెమోపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ ఇవాళ నిర్ణయం తీసుకున్నారు. ఈ కేసు రేపు విచారణ చేపట్టేందుకు సీజే అంగీకరించారు. చంద్రబాబు కేసు ఏ బెంచ్ ముందు విచారణకు వస్తుందనే విషయం సాయంత్రానికి తేలనుంది.
అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఏ కింద ప్రజాప్రతినిధులను అరెస్టు చేసే ముందు గవర్నర్ అనుమతి తీసుకోవాలని, ఈ సెక్షన్ చంద్రబాబు కేసుకు కూడా వర్తిస్తుందంటూ ఆయన తరపు న్యాయవాదులు ఎస్ఎల్‌పి వేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా కేసు నమోదు చేశారని, కేసు కొట్టివేయాలంటూ చంద్రబాబు తరపు న్యాయవాదులు సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబునాయుడు పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌పై ఏసీబీ కోర్టులో ఇవాళ విచారణ జరగాల్సి ఉంది. న్యాయమూర్తి సెలవుపై వెళ్లడంతో ఈ కేసు విచారణ రేపటికి వాయిదా పడింది. మరోవైపు చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై ఇవాళ హైకోర్టులో కేసు విచారణ జరగనుంది.
బిహార్‌లో ఘోరం.... దళిత మహిళ దుస్తులు వలిచేసి, ముఖంపై మూత్రం పోసి...
బిహార్‌లో ఓ దళిత మహిళకు ఘోర అవమానం జరిగింది. ఆమెను దారుణంగా చితకబాది, దుస్తులు ఊడదీసారు. ఆమె ముఖంపై మూత్రం పోసారు. అప్పు తీర్చేసి, అదనపు వడ్డీ కట్టడానికి నిరాకరించినందుకు ఆమెకు ఈ అవమానం జరిగింది.
పోలీసుల కథనం ప్రకారం... పట్నా జిల్లాలోని మోసింపూర్ గ్రామానికి చెందిన ఒక వ్యక్తి, అదే గ్రామానికి చెందిన ప్రమోద్ సింగ్ వద్ద రూ.1500 అప్పుగా తీసుకున్నాడు. ఆ వ్యక్తి, అతని భార్య ఎలాగోలా కష్టపడి అప్పు తీర్చేసారు. అయితే ప్రమోద్ సింగ్ అదనపు వడ్డీ కోసం వారిని పీడించసాగాడు. దానికి ఆ దంపతులు నిరాకరించారు. అదనపు వడ్డీ కట్టబోమని స్పష్టంగా చెప్పేసారు. దాంతో ఆగ్రహించిన ప్రమోద్ సింగ్, అతని కొడుకు, అతని అనుచరులు... ఆ దంపతులపై దాడి చేసారు.
బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం... శనివారం రాత్రి ప్రమోద్ సింగ్, అతని కొడుకు అన్షు, మరో నలుగురు వ్యక్తులు వారింటికి వెళ్ళారు. ఆ సమయంలో ఆమె ఇంటిముందు పంపునుంచి నీళ్ళు పట్టుకుంటోంది. వారు ఆమెను కట్టెలతో చితకబాది తమతో లాక్కువెళ్ళారు. ఆమె దుస్తులు విప్పేసారు. ఆమె నోట్లో మూత్ర విసర్జన చేయమని ప్రమోద్ సింగ్ తన కొడుకు అన్షుకు చెప్పాడు. తండ్రి చెప్పినట్టే చేసాడా కొడుకు.
బాధితురాలి కుటుంబసభ్యులు ఆమెకోసం వెతకసాగారు.
అప్పటికే అర్ధరాత్రి దాటింది. అంతలో బాధితురాలు ఎలాగోలా వారినుంచి తప్పించుకుని,
తన ఇంటివైపు పరుగెత్తసాగింది. ఆమెను వెతుకుతున్న కుటుంబసభ్యులు ఆమెను గుర్తించి
ఇంటికి తీసుకువెళ్ళారు.
బాధితురాలికి తలపై తీవ్రమైన గాయాలయ్యాయి. ఆమె
ఇప్పుడు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నట్లు పోలీసులు
చెప్పారు. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదయింది. ఆరుగురు నిందితుల కోసం గాలిస్తున్నట్లు
పోలీసులు చెప్పారు.
‘‘మేం ఐదు బృందాలు ఏర్పాటు చేసాం. నిందితుల కోసం
అన్వేషణ కొనసాగుతోంది. ఇప్పటికే కేసు నమోదు చేసాం. దర్యాప్తు చేస్తున్నాం’’ అని
పట్నా ఎస్ఎస్‌పీ రాజీవ్ మిశ్రా వెల్లడించారు.
Crime : కోడికత్తి సమకూర్చింది బొత్స మేనల్లుడే : న్యాయవాది సలీం
ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిపక్షంలో ఉండగా విశాఖ విమానాశ్రయంలో దాడి ఘటన కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో సాక్షిగా ఉన్న దినేష్ కుమార్ అనే వ్యక్తికి కోడికత్తిని అందించింది మంత్రి బొత్స సత్యనారాయణ మేనల్లుడు, విజయనగరం వైసీపీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు అంటూ న్యాయవాది సలీం సంచలన విషయాలు చెప్పారు. కోడి కత్తి కేసులో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి విచారణకు హాజరైతే అసలు విషయాలు వెలుగులోకి వస్తాయనే ఉద్దేశంతోనే కోర్టుకు రావడం లేదని ఆయన ఆరోపించారు. ఈ కేసులో రాజకీయ ప్రయోజనాలు పొందాలనే కుట్ర కోణం దాగి ఉందని కోడికత్తి శ్రీను తరపున కేసు వాదిస్తోన్న న్యాయవాది సలీం స్పష్టం చేశారు.
విశాఖ ఎన్‌ఐఏ న్యాయస్థానంలో మంగళవారం కోడికత్తి కేసు విచారణకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ కేసును కావాలనే సాగదీస్తున్నారని, రావాలి జగన్, చెప్పాలి వాదన, ఇవ్వాలి ఎన్‌వోసీ అంటూ సలీం డిమాండ్ చేశారు.
కోడికత్తి కేసు నాలుగేళ్లుగా విజయవాడలోని ఎన్‌ఐఏ కోర్టులో విచారణ జరిగింది. ఇటీవల ఈ కేసును విశాఖలోని ఎన్ఐఏ కోర్టుకు బదిలీ చేశారు. కేసు విశాఖ కోర్టుకు బదిలీ అయ్యాక మంగళవారం తొలిసారిగా విచారణకు వచ్చింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న జనపల్లి శ్రీనివాసరావును రాజమండ్రి కేంద్ర కారాగారం నుంచి విశాఖ కోర్టుకు తీసుకువచ్చారు. కేసు విచారించిన న్యాయమూర్తి తదుపరి విచారణను సెప్టెంబరు 6వ తేదీకి వాయిదా వేశారు. విజయవాడ కోర్టులో సమర్పించిన రికార్డులు మొత్తం పరిశీలించి, విచారణను ముందుకు తీసుకెళ్లడానికి తమకు సెప్టెంబరు 18 వరకు సమయం ఇవ్వాలని ప్రభుత్వం తరపు ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోరినా కోర్టు అనుమతించలేదు.
రికార్డుల పరిశీలనకు అంత సమయం అవసరం లేదని న్యాయమూర్తి జస్టిస్ మురళీకృష్ణ కేసును వచ్చే నెల 6వ తేదీకి వాయిదా వేశారు. సెప్టెంబరు 6న జనపల్లి శ్రీనివాసరావు పెట్టుకున్న బెయిల్ పిటీషన్‌పై కోర్టు వాదనలు వినే అవకాశముంది. మంగళవారం కేసు విచారణ తరవాత కోడికత్తి శ్రీనును విశాఖ జైలుకు తరలిస్తారని అందరూ భావించారు. అయితే అతన్ని మరలా రాజమండ్రికి జైలుకు తీసుకెళ్లారు.
కోడి కత్తి కేసులో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి కోర్టుకు హాజరై ఎన్‌వోసీ ఇవ్వాలంటూ దళిత సంఘాల నేతలు విశాఖ జీవీఎంసీ సమీపంలో ఆందోళనకు దిగడానికి సన్నద్దం అయ్యారు. నిరసనకు అనుమతి లేదంటూ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. దళిత సంఘాల నాయకులను ముందస్తుగా గృహ నిర్భందం చేశారు. నేతలను గృహ నిర్భందం చేయడాన్ని దళిత సంఘాల సమాఖ్య కన్వీనర్ డాక్టర్ బూసి వెంకటరావు తప్పుపట్టారు.
న్యాయం చేయండి
ఐదేళ్లుగా కోర్టుల చుట్టూ తిప్పుతున్నారు కానీ న్యాయం చేయడం లేదని శ్రీను తల్లి సావిత్రి ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం ఒక్కసారి కోర్టుకు వచ్చి తన కొడుకు పొడిచాడనో, పొడవలేదనో చెప్పాలని ఆమె కన్నీటి పర్యంతం అయ్యారు. కోర్టులు మారుస్తున్నారు కానీ న్యాయం జరగడం లేదని ఆమె వాపోయారు. సీఎం కోర్టుకు హాజరైతేనే కేసు పరిష్కారం అవుతుందని శ్రీను సోదరుడు సుబ్బరాజు మీడియాతో చెప్పారు. దళిత సంఘాల నాయకులు తమకు మద్దతు పలకాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
Imran Khan : పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌పై మరో కేసు
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ను కేసులు వెంటాడుతున్నాయి. తోషఖానా అవినీతి కేసులో జైలు శిక్ష అనుభవిస్తోన్న ఇమ్రాన్‌కు ఇస్లామాబాద్ హైకోర్టులో ఇవాళ ఊరట లభించింది. అయితే తోషఖానా కేసులో జైలు నుంచి విడుదల కాకముందే ఆయనపై మరో కేసు నమోదైంది. అధికారిక రహస్యాలను దుర్వినియోగం చేశాడంటూ పోలీసులు కేసు పెట్టారు. ఈ కేసులో బుధవారం నాడు ఇమ్రాన్ మరోసారి కోర్టు ముందు హాజరుకావాల్సి ఉంది.
తోషఖానా కేసులో ట్రయల్ కోర్టు ఇమ్రాన్‌ఖాన్‌కు మూడేళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. దీనిపై ఇమ్రాన్‌ఖాన్ ఇస్లామాబాద్‌లోని హైకోర్టును ఆశ్రయించారు. కింది కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు నిలిపివేసింది. తోషఖానా అవినీతి కేసులో జైలు శిక్ష అనుభవిస్తోన్న ఇమ్రాన్ ఖాన్ విడుదల కాకముందే పాక్ పోలీసులు మరో కేసు నమోదు చేశారు. పాక్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ పార్టీ కార్యకర్తలు తమ నేత జైలు నుంచి విడుదల కాబోతున్నారని సంబరాలు చేసుకున్న కాసేపటికే ఇమ్రాన్‌పై మరో కేసు నమోదు కావడం విశేషం.
Imrankhan : పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు భారీ ఊరట
తోషాఖానా కేసులో జైలు శిక్ష అనుభవిస్తోన్న పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు హైకోర్టులో ఊరట లభించింది. తోషాఖానా కేసులో ట్రయల్ కోర్టు విధించిన మూడేళ్ల జైలు శిక్షను ఇస్లామాబాద్ హైకోర్టు నిలిపేసింది. తోషాఖానా అవినీతి కేసులో ట్రయల్ కోర్టు విధించిన శిక్ష రద్దు చేయాలంటూ ఇమ్రాన్ ఖాన్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై సోమవారం విచారణ జరిపిన కోర్టు, ఇవాళ తీర్పును వెలువరించింది.
ఇమ్రాన్‌ఖాన్ ప్రధానిగా చేసినప్పుడు వచ్చిన బహుమతులను తోషాఖానా నుంచి అతి తక్కువ ధరకు కొనుగోలు చేసి, తరవాత ఎక్కువ ధరకు అమ్ముకున్నాడనే ఆరోపణలు వచ్చాయి. దీంతో అతనిపై గతంలోనే కేసు నమోదైంది. దీనిపై విచారించిన ఇస్లామాబాద్‌లోని సెషన్స్ కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. ఐదేళ్లపాటు ఎన్నికల్లో
పాల్గొనకుండా అనర్హత వేటు కూడా వేసింది. తీర్పు రాగానే ఇమ్రాన్‌ఖాన్‌ను అరెస్టు చేసి అటక్ జిల్లా జైలులో ఉంచారు. సెషన్స్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఇమ్రాన్ ఖాన్ హైకోర్టును ఆశ్రయించడంతో ఆయనకు ఊరట లభించింది.
Roja Selvamani : మంత్రి రోజా భర్త సెల్వమణిపై నాన్‌బెయిలబుల్ అరెస్ట్ వారెంట్
వైసీపీ మంత్రి రోజా భర్త సెల్వమణిపై నాన్‌బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ అయింది. పరువు నష్టం కేసులో కోర్టుకు హాజరు కాకపోవడంతో రోజా భర్త, డైరెక్టర్ ఆర్‌కె.సెల్వమణిపై చెన్నైలోని జార్జ్‌టౌన్ కోర్టు నాన్‌బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. రోజా భర్త పలు సినిమాలకు డైరెక్టర్‌గా వ్యవహరించారు. ఆర్థిక వ్యవహారాల్లో ముకుంద్‌చంద్ అనే ఫైనాన్షియర్ 2016లో అరెస్టయ్యారు. ముకుంద్‌చంద్ కారణంగా తాను కూడా ఇబ్బందులకు గురయ్యానంటూ సెల్వమణి ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
సెల్వమణి చేసిన వ్యాఖ్యలపై ముకుంద్‌చంద్ కోర్టులో పరువు నష్టం కేసు వేశారు. కేసు విచారణలో ఉండగానే ముకుంద్‌చంద్ చనిపోయారు. ఆ కేసును ఆయన కుమారుడు
గగన్‌బోత్రా కొనసాగించారు. కేసు విచారణ సమయంలో సెల్వమణి హాజరుకాకపోవడంతో చెన్నైలోని జార్జిటౌన్ కోర్టు న్యాయమూర్తి సోమవారంనాడు నాన్‌బెయిలబుల్ అరెస్ట్ వారెంటు జారీ చేశారు.
Tirumala : బోనులో చిక్కిన మరో చిరుత
తిరుమలలో చిరుతల కలకలం తగ్గడం లేదు. తాజాగా అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేసిన బోనులో మరో చిరుతపులి చిక్కింది. అలిపిరి కాలి నడక మార్గంలో ఏడో మైలురాయి దగ్గర ఏర్పాటు చేసిన బోనులో తాజాగా ఒక చిరుతపులి చిక్కిందని టీటీడీ అధికారులు తెలిపారు. గతంలో మూడు చిరుత పులులు పట్టుబడ్డాయి, ఇప్పుడు నాలుగో చిరుతపులి చిక్కిందని అటవీ అధికారులు వెల్లడించారు. నాలుగో చిరుత సుమారు వారం రోజులుగా బోను దగ్గరకు వస్తున్నట్టు సీసీ టీవీ ఫుటేజీ ద్వారా గుర్తించారు. ఎట్టకేలకు ఆదివారం రాత్రి నాలుగో చిరుత బోనులో చిక్కిందని అధికారులు చెప్పారు. తాజాగా చిక్కిన చిరుతను తిరుపతిలోని జూ పార్కుకు తరలించినట్టు అటవీ శాఖ అధికారులు వెల్లడించారు.
ఇటీవల అలిపిరి కాలినడక మార్గంలో స్వామివారి దర్శనానికి వెళుతోన్న నెల్లూరుకు చెందిన లక్షిత అనే బాలికపై చిరుత దాడి చేసింది. ఆ దాడిలో లక్షిత చనిపోయిన సంగతి తెలిసిందే. అయితే లక్షితపై దాడి చేసిన చిరుతను గుర్తించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే చిక్కిన చిరుతల నుంచి రక్తం శాంపిల్స్ తీసుకుని
పరీక్షలకు పంపారు. వాటి ఫలితాలు వస్తే లక్షితపై దాడి చేసిన చిరుతను గుర్తించే అవకాశం లభిస్తుంది.
కాలినడక మార్గం ఇరువైపులా అటవీ శాఖ అధికారులు వందలాది సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి చిరుతల కదలికలను గమనిస్తున్నారు. ఆ తరవాత చిరుతలు సంచరించే ప్రదేశాలను గుర్తించి అక్కడ బోన్లు ఏర్పాటు చేస్తున్నారు. చిరుతలకు అడవిలో ఆహారం లభించకుండా చేసి బోన్లలో ఆహారం పెట్టి ఎర వేస్తున్నట్టు అటవీ శాఖ అధికారులు తెలిపారు. గడచిన రెండు నెలల్లో నాలుగు చిరుతలు చిక్కడంతో తిరుమలకు కాలినడకన వెళ్లే భక్తులు ఊపిరి పీల్చుకుంటున్నారు.
West Bengal : టపాసుల ఫ్యాక్టరీలో ఘోర ప్రమాదం : 8 మంది మృతి
పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో ఓ టపాసుల ఫ్యాక్టరీలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పశ్చిమబెంగాల్‌లోని ఉత్తర 24 పరగణాల జిల్లా, దత్తాప్రకార్‌లో అనధికారికంగా నిర్వహిస్తోన్న ఓ టపాసుల ఫ్యాక్టరీలో ఈ ఉదయం భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో 8 మంది చనిపోగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు ధాటికి టపాసులు తయారు చేస్తోన్న కర్మాగారం కుప్పకూలిపోయింది. పేలుడు శబ్దాలు మూడు కిలోమీటర్ల వరకు వినిపించాయని స్థానికులు తెలిపారు.
ఈ ప్రమాదం ఆదివారం ఉదయం 10 గంటలకు చోటు చేసుకుందని తెలుస్తోంది. నిల్‌గంజ్ మోష్‌పోల్ ఫ్యాక్టరీలో కార్మికులంతా పనిలో నిమగ్నమై ఉండగా ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.
ఈ ఘోర ప్రమాదంలో 8 మంది అక్కడికక్కడే చనిపోగా, ఐదుగురు గాయపడ్డారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
Gold Sieze : కస్టమ్స్ అధికారుల ఆపరేషన్ : భారీగా బంగారం స్వాధీనం
కస్టమ్స్ అధికారులు చేపట్టిన తనిఖీల్లో అక్రమంగా తరలిస్తోన్న బంగారాన్ని పెద్దఎత్తున స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్, శ్రీలంక నుంచి బంగారం అక్రమంగా విజయవాడకు తరలిస్తుండగా కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. విదేశాల నుంచి చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా బంగారం స్మగ్లింగ్ చేస్తోన్న ముఠాను కస్టమ్స్ అధికారుల ప్రత్యేక బృందాలు, నిఘావేసి అదుపులోకి తీసుకున్నాయి. చెన్నై విమానాశ్రయం నుంచి విజయవాడ తరలిస్తుండగా బొల్లాపల్లి టోల్‌ప్లాజా వద్ద కస్టమ్స్ అధికారులు జరిపిన సోదాల్లో 4.3 కేజీల బంగారం, 6.8 కిలోల బంగారు ఆభరణాలు, రూ.1.5 లక్షల నగదు పట్టుబడింది. పట్టుబడ్డ బంగారం విలువ రూ.7 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు.
బంగారం స్మగ్లింగ్ చేస్తోన్న ముఠాపై కేసు నమోదు చేసి, విశాఖలోని కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి వారికి రిమాండ్ విధించారు. గడచిన రెండేళ్లలోనే విజయవాడ కస్టమ్స్ కమిషనరేట్ పరిధిలో రూ.42 కోట్ల విలువైన 70 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు వెల్లడించారు.
Odisha Train Tragedy: ఆమోదించని పనులే రైలు ప్రమాదానికి కారణం: సీబీఐ
ఒడిషా బాలాసోర్ ఘోర రైలు ప్రమాద ఘటన కేసులో అరెస్టై జైల్లో ఉన్న ఇంజనీర్లు పెట్టుకున్న బెయిల్ పిటీషన్‌ను సీబీఐ ప్రత్యేక కోర్టు తిరస్కరించింది. ఎలాంటి అనుమతులూ లేకుండా 94వ నెంబర్ లెవల్ క్రాసింగ్ గేటు వద్ద పనులు చేయడమే ప్రమాదానికి దారి తీసిందని ఈ కేసు దర్యాప్తు చేస్తోన్న సీబీఐ, ప్రత్యేక కోర్టుకు తెలిపింది. ఒడిషాలోని బాలాసోర్ వద్ద జూన్ 2న జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 295 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. రైలు దుర్ఘటన కేసులో సీనియర్ సిగ్నల్ సెక్షన్ ఇంఛార్జి అరుణ్ కుమార్ మహంత సహా మరో ముగ్గురు అధికారులను పోలీసులు అరెస్టు చేశారు. వీరు పెట్టుకున్న బెయిల్ పిటీషన్‌ను భువనేశ్వర్‌లోని ప్రత్యేక సీబీఐ కోర్టు ఇవాళ తిరస్కరించింది.
సీనియర్ డివిజనల్ సిగ్నల్, టెలికమ్యూనికేషన్ ఇంజనీర్ ఆమోదం తెలపని సర్క్యూట్ డయాగ్రామ్‌తో బాలాసోర్ సమీపంలోని బహనాగ బజార్ స్టేషన్ వద్ద 94వ లెవల్ క్రాసింగ్ గేటు సమీపంలో సిగ్నల్ పనులు చేపట్టారని సీబీఐ తెలిపింది. 79వ నెంబర్ లెవల్ క్రాసింగ్ గేటు వద్ద ఉపయోగించిన టిపికల్ సర్క్యూట్ డయాగ్రమ్‌తోనే 94వ నెంబర్ గేటు వద్ద కూడా, ఎలాంటి ఆమోదమూ లేకుండా పనులు చేసినట్టు సీబీఐ అధికారులు కోర్టుకు తెలిపారు.
మహంత పర్యవేక్షణలోనే 94వ గేటు వద్ద పనులు జరిగాయని ప్రత్యేక కోర్టుకు సీబీఐ వివరించింది. 94వ నెంబర్ గేటు కొంతకాలంగా సక్రమంగా పనిచేయడం లేదని ఉన్నతాధికారులకు చెప్పినా సరైన చర్యలు తీసుకోలేదని మహంత తరపు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. 94వ గేటు వద్ద జరిగిన పనుల పర్యవేక్షణను ఇతరులకు అప్పగించారని, ఆ పనులు జరిగిన సమయంలో తాను అక్కడ లేనని మహంత కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
ఇంటర్ లాకింగ్ వ్యవస్థ ఏర్పాటు, సిగ్నలింగ్ పనులు... ఆమోదం పొందిన ప్రణాళిక ప్రకారం జరగలేదన్న సీబీఐ వాదనలతో కోర్టు ఏకీభవించింది. మహంత, మరో ముగ్గురు అధికారులు పెట్టుకున్న బెయిల్ పిటీషన్‌ను సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తిరస్కరించింది.
జూన్ 2న బాలాసోర్ వద్ద జరిగిన ఘోర ప్రమాదంలో 295 మంది ప్రయాణీకులు చనిపోయారు. మరో 1000 మందికి పైగా గాయపడ్డ సంగతి తెలిసిందే.
Putin on Prigozhin: ప్రిగోజిన్ చాలా తప్పులు చేశాడు: పుతిన్
ప్రైవేటు సైన్యం వాగ్నర్ గ్రూపు అధినేత ప్రిగోజిన్ తప్పులు చేసి అయినా అనుకున్నవి సాధించాడని రష్యా అధ్యక్షుడు పుతిన్ వ్యాఖ్యానించారు. విమాన ప్రమాదంలో ప్రిగోజిన్ చనిపోవడం వెనుక పుతిన్ హస్తం ఉందనే విమర్శలు వస్తున్న వేళ ఆయన ఓ వీడియో విడుదల చేశారు. ప్రిగోజిన్ మృతిపట్ల తీవ్ర సంతాపం ప్రకటించారు. ప్రిగోజిన్ ప్రతిభగల వ్యక్తే కానీ, ఎన్నో తప్పులు చేశాడని పుతిన్ అన్నారు. ప్రిగోజిన్ విమాన ప్రమాదంలో చనిపోవడంపై ఆయన సంతాపం ప్రకటించారు.
వాగ్నర్ గ్రూపు అధినేత ప్రిగోజిన్ తనకు మూడు దశాబ్దాలుగా తెలుసని, జీవితంలో ఎన్నో కష్టసుఖాలు చూశాడని పుతిన్ వ్యాఖ్యానించారు. ఈ ప్రమాదం జరిగే ముందు రోజే ప్రిగోజిన్ ఆఫ్రికా నుంచి రష్యాకు వచ్చాడని గుర్తుచేశారు. ప్రిగోజిన్ మృతిపై దర్యాప్తుకు ఆదేశించారు. పూర్తిస్థాయి విచారణ తరవాతే ఒక నిర్ధారణకు వస్తామన్నారు. ప్రిగోజిన్‌తోపాటు విమాన ప్రమాదంలో మరణించిన వారు ఉక్రెయిన్‌పై యుద్ధంలో ప్రముఖ పాత్ర పోషించినట్టు పుతిన్ చెప్పారు.
ప్రిగోజిన్ ఓ ప్రైవేటు విమానంలో రష్యా రాజధాని మాస్కో నుంచి సెయింట్‌పీటర్స్‌బర్గ్ వెళుతుండగా విమాన ప్రమాదంలో చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ప్రిగోజిన్ సహా 10 మంది మరణించారు. వీరిలో వాగ్నర్ గ్రూపు సెకండ్ ఇన్ కమాండర్ దిమిత్రీ ఉత్కిన్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు వ్యతిరేకంగా ప్రిగోజిన్ గత నెలలో తిరుగుబాటు మొదలు పెట్టి తరవాత విరమించుకున్నారు. ఆ సమయంలో రష్యా అధ్యక్షుడు పుతిన్, ప్రిగోజిన్ పెద్ద ద్రోహి అంటూ తీవ్ర విమర్శలు చేశారు. ఆ నేపథ్యంలో విమాన ప్రమాదంపై ప్రపంచ దేశాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి.
వాగ్నర్ గ్రూపు అధినేత ప్రిగోజిన్ మరణం తనను ఆశ్చర్యానికి గురిచేయలేదని అమెరికా అధ్యక్షుడు బైడెన్ వ్యాఖ్యానించారు. తాము ముందునుంచీ ఊహించినదే జరిగిందన్నారు. ప్రిగోజిన్ ప్రయాణిస్తోన్న విమానంలో బాంబు పేలి ఉండవచ్చని అమెరికా ఇంటెలిజెన్స్ అనుమానిస్తోంది. క్షిపణిని ఉపయోగించి ప్రిగోజిన్ ప్రయాణిస్తోన్న విమానాన్ని కూల్చివేసి ఉండొచ్చన్న అంచనాలను అమెరికా ఇంటెలిజెన్స్ సంస్థలు కొట్టిపారేశాయి. ప్రిగోజిన్ ప్రయాణిస్తున్న విమానంలో కూలిపోవడానికి ముందే పెద్ద పేలుడు సంభవించి ఉండ వచ్చని అమెరికా అనుమానిస్తోంది. పెంటగాన్ ప్రతినిధి రైడర్ కూడా విమానంలో పేలుడు వల్లే ప్రిగోజిన్ మరణించి ఉంటారని అభిప్రాయపడ్డారు.
Yevgeny Prigozhin : విమాన ప్రమాదంలో వాగ్నర్ గ్రూప్ అధినేత యెవ్‌గనీ ప్రిగోజిన్ మృతి
రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై తిరుగుబాటు జెండా ఎగురవేసిన ప్రైవేటు సైన్యం వాగ్నర్ గ్రూపు అధినేత యెవ్‌గనీ ప్రిగోజిన్ విమాన ప్రమాదంలో మరణించారు. అతని మరణంపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. యెవ్‌గనీ ప్రిగోజిన్ ప్రయాణించిన జెట్ బుధవారం కుప్పకూలిన సంగతి తెలిసిందే. ప్రమాదానికి ముందు వరకు విమానంలో ఎలాంటి సాంకేతిక లోపాలు గమనించలేదని తెలుస్తోంది. ఎవరూ ఊహించని విధంగా యెవ్‌గనీ ప్రిగోజిన్ ప్రయాణిస్తున్న విమానం కుప్పకూలిపోవడంపై అనేక మంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
రష్యాకు చెందిన ఫైట్‌రాడార్ సమాచారం ప్రకారం బుధవారం సాయంత్రం 6గంటల 11 నిమిషాల సమయంలో యెవ్‌గనీ ప్రిగోజిన్ జెట్ నుంచి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు
సమాచారం ఆగిపోయిందని తెలుస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో విమానం 28 వేల అడుగుల ఎత్తులో ఉంది. అక్కడి నుంచి విమాన వేగం క్షణాల్లో అనూహ్యంగా మారిపోయింది. అర నిమిషంలో 28 వేల అడుగుల నుంచి 8 వేల అడుగుల ఎత్తుకు పడిపోయింది. ఆ తరవాత విమానం కుప్పకూలిపోయింది. పొగలు కక్కుతూ విమానం కూలిపోయిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఈ విమాన ప్రమాదంలో యెవ్‌గనీ ప్రిగోజిన్ సహా మొత్తం 10 మంది చనిపోయారని రష్యాకు చెందిన ఫెడరల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ ఏజన్సీ ప్రకటించింది. ప్రమాద సమయంలో విమానంలో ఏడుగురు ప్రయాణీకులు, ముగ్గురు సిబ్బంది ఉన్నారు. యెవ్‌గనీ ప్రిగోజిన్‌తోపాటు వాగ్నర్ గ్రూపు సెకండ్ ఇన్ కమాండ్ దిమిత్ర ఉత్కిన్ కూడా ఈ ప్రమాదంలో చనిపోయారు. ఈ ప్రైవేటు జెట్ మాస్కో నుంచి సెయింట్ పీటర్స్‌బర్గ్ వెళుతుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ఇప్పటి వరకు 8 మృతదేశాలను గుర్తించారు. ఈ ఘటనపై రష్యా దర్యాప్తునకు ఆదేశించింది.
ఈ విమాన ప్రమాదం రష్యా అధ్యక్షుడు పుతిన్ పనేనని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆరోపించారు. పుతిన్ ఎవరినీ క్షమించడని ఈ ప్రమాదం ద్వారా తేలిపోయిందన్నారు. పుతిన్‌పై నమ్మకంతో యెవ్‌గనీ ప్రిగోజిన్ రాజీ ఒప్పదంపై సంతకం చేశారు. అదే ఇప్పుడు అతని మరణానికి దారితీసిందని జెలెన్‌స్కీ అభిప్రాయపడ్డారు.
Crime News : వరుడు తాళికట్టే సమయంలో పెళ్లి ఆపేసిన వధువు
వివాహం స్వర్గంలో నిశ్చయం అవుతుందంటారు పెద్దలు. కానీ అనేక పెళ్లిళ్లు పీటల మీద కూడా ఆగిపోవడం చూస్తుంటాం. ఇలాంటి అరుదైన ఘటన తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం. రామనాథపురం జిల్లా తిరువాడానై సమీపంలోని ఓ గ్రామానికి చెందిన యువకుడు విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నాడు. ఇటీవల సెలవుపై గ్రామానికి వచ్చాడు. తల్లిదండ్రులు వివాహం చేయాలని నిశ్చయించారు. పొరుగు గ్రామంలో ఓ యువతి తల్లిదండ్రులతో మాట్లాడుకున్నారు. అందరూ పెళ్లికి అంగీకరించారు. ఇక వెంటనే పెళ్లి ఏర్పాట్లు చేసుకున్నారు.
పెళ్లి తిరువాడానైలోని ఓ ఆలయంలో చేయాలని నిర్ణయించుకున్నారు. ఆలయంలో పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఇక తాళి కట్టే సమయం కూడా వచ్చేసింది. పంతులుగారు మంత్రాలు చదువుతూ వరుడితో తాళికట్టించే ప్రయత్నం చేశాడు. వెంటనే వధువు ఆ వరుడి చేతిలోని తాళిని గుంజుకుని హుండీలో వేసే ప్రయత్నం చేసింది. బంధువులు అడ్డుకున్నారు. సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అయినా వధువు ఎవరి మాటా వినలేదు.దీంతో పీటల మీద పెళ్లి ఆగిపోయింది. వరుడు తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
పెద్దలు బలవంతం చేయడంతో ఈ పెళ్లికి అంగీకరించినట్టు వధువు చెప్పింది. ఈ పెళ్లి తనకు ఇష్టం లేదని కూడా పోలీసులకు తెలిపింది. అయితే వరుడు గ్రామంలో పెళ్లి సమయానికి కొంచెం ముందుగా విందు ఏర్పాట్లు చేశారు. విందుకు వచ్చిన వారికి అసలు విషయం తెలిసే సరికే వంటకాలు ఆరగించి చదివింపులు కూడా ఇచ్చేసి వెళ్లిపోయారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్
రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు : భరత్‌పుర్ సభలో ప్రధాని ప్రసంగం
చిన్నారులతో ప్రధాని మోదీ సరదా సన్నివేశం వైరల్ వీడియో
చత్తీస్‌గఢ్ ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్
రైల్, విద్యుత్ ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని మోదీ, బంగ్లా ప్రధాని హసీనా
37వ జాతీయ క్రీడల ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్
మహారాష్ట్రలో ప్రధాని పర్యటన... షిరిడివాసుడి సన్నిధిలో ప్రత్యేక పూజలు
రాముడికి వచ్చే యేడాది పుట్టినరోజు వేడుకలు అయోధ్యలోనే: మోదీ
Namo Bharat : నమో భారత్ రైలు సేవలు ప్రారంభించిన ప్రధాని మోదీ
Namo Bharat Trains : నమో భారత్ రైల్లో ప్రయాణించిన ప్రధాని మోదీ
PM Launches RRT System : నమో భారత్ రైలు సేవలు ప్రారంభించిన ప్రధాని
Shiv Sena UBT MP Controversy : బీజేపీ కూడా హమాస్ లాంటిదే
Exports Policy : చక్కెర ఎగుమతులపై నిషేధం : బియ్యంపై సడలింపు
Pm modi on Gaza HOSPITAL Tragedy: గాజా ఆస్పత్రి విషాదంపై ప్రధాని మోదీ దిగ్బ్రాంతి
Ferry Service Launch : భారత్ శ్రీలంక మధ్య ఫెర్రీ సేవలు
PM MESSAGE TO G-20 SPEAKERS: ఏ రూపంలో ఉన్నా ఉగ్రవాదం సమర్థనీయం కాదు
Ram Mandir Trust Request: ప్రాణప్రతిష్ఠ సందర్భంగా వీఐపీలకు వినతి...
Modi@Uttarakhand: ఉత్తరాఖండ్ పితోరాగఢ్‌లో మోదీ పర్యటన, బహిరంగ సభ
Modi – Khadi: ఒక్క పిలుపుతో ఒక్కరోజులో ఒక్క ఖాదీ దుకాణంలో కోటిన్నర అమ్మకాలు
PM Modi LIve : రాజస్థాన్ జోథ్‌పూర్‌లో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్
Central Cabinet : కృష్ణా జలాల పంపిణీపై కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయం
PM MODI Live : నిజామాబాద్‌లో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్
PM MODI@PALAMURU: తెలంగాణకు మోదీ వరాలు.. పసుపు బోర్డు, సమ్మక్క-సారక్క గిరిజన వర్సిటీ
PM Modi Swatchh Bharat : చీపురు పట్టి చెత్తను ఊడ్చిన ప్రధాని మోదీ
PM MODI: తెలంగాణలో ప్రధాని పర్యటన... కేసీఆర్ మళ్ళీ గైర్హాజరు..!
Cleanliness Drive: గాంధీ జయంతి సందేశం... శ్రమదానం చేయాలని ప్రజలకు ప్రధాని పిలుపు
రోజ్‌గార్ మేళాలో కొత్తగా ఉద్యోగాలు పొందిన వారికి ప్రధాని దిశానిర్దేశం
Bharat Canada Row : టెర్రరిస్టులకు కెనడా స్వర్గధామం : శ్రీలంక
TN CM Stalin : తనయుడి వ్యాఖ్యలను సమర్థించుకున్న సీఎం స్టాలిన్
Purandeswari : రాష్ట్రపతి భవన్‌ను కూడా రాజకీయాల్లోకి లాగారు : పురందరేశ్వరి
Elon Musk X : ఫోన్ నెంబరుతో పనిలేదు కాల్స్ చేసుకోవచ్చు