Sunday, April 14, 2024

Logo
Loading...
google-add

అమ్మవార్ల వనప్రవేశంతో ముగిసిన మేడారం మహాజాతర

T Ramesh | 10:23 AM, Sun Feb 25, 2024

మేడారం వనజాతర ముగిసింది. ఫిబ్రవరి 21న ప్రారంభమైన మేడారం జాతర శనివారం రాత్రి పున్నమి వెలుగుల్లో వనప్రవేశం చేయడంతో ముగిసింది. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన పండుగగా గుర్తింపు పొందిన మేడారం జాతరకు భక్తులు గతం కంటే పెద్దఎత్తున తరలివచ్చారు.

జాతర జరిగిన నాలుగురోజుల్లోనే కోటి నలబై లక్షల మంది దర్శించుకున్నారు. శనివారం రాత్రి నిండు పౌర్ణమి వెలుగుల్లో అమ్మవారి విశ్వాసానికి ప్రతీకగా చిరుజల్లులు కురుస్తుండగా అమ్మవార్లు వనప్రవేశం చేశారు. అమ్మవార్లకు తీవ్రభావోద్వేగాల మధ్య భక్తులు వీడ్కోలు పలికారు. రాత్రి 6.45 గంటలకు సమ్మక్క గద్దెపైకి చేరుకున్న పూజారులు, విద్యుత్ దీపాలు ఆర్పివేసి రహస్యంగా పూజలు నిర్వహించారు. 7.06 గంటలకు చిలకలగుట్ట వైపు బయలు దేరారు. రాత్రి 8.10 గంటలకు వనప్రవేశ క్రతువు ముగిసింది. రాత్రి6.47 సారలమ్మ గద్దెపైకి చేరుకున్న పూజారులు 7.07 గంటలకు అమ్మవారిని తీసుకుని బయలుదేరారు. రాత్రి 9 గంటలకు కన్నెపల్లి ఆలయానికి చేరుకున్నారు.

రాత్రి 6.50 గంటలకు పగిడిద్ద రాజు కు ప్రత్యేక పూజలు చేసిన ఆదివాసీ పూజారులు, మహబూబాబాద్ జిల్లా పూనుగొండ్లు బయలుదేరారు. ఆ తర్వాత గోవిందరాజు గద్దెపై పూజల  క్రతువు ముగించి రాత్రి 11.30 గంటలకు కొండాయిలోని గుడికి చేరుకున్నారు.

google-add
google-add
google-add

క్రైమ్ న్యూస్

ఆధ్యాత్మికం

google-add
google-add
google-add

రాజకీయం

google-add
google-add