Sunday, April 14, 2024

Logo
Loading...
google-add

రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో భారతీయుడి మృతి

K Venkateswara Rao | 12:03 PM, Sun Feb 25, 2024

రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ఓ భారతీయుడు చనిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. దొనెట్క్స్ ప్రాంతంపై జరిగిన క్షిపణి దాడిలో భారతీయుడు చనిపోయినట్లు అంతర్జాతీయ మీడియా ద్వారా సమాచారం అందుతోంది. మరొక భారతీయుడు తప్పించుకున్నాడు. చనిపోయిన భారతీయుడు గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన హేమిల్ అశ్విన్‌భాయ్ ముంగుకియాగా గుర్తించారు. 2023 డిసెంబరులో హేమిల్ రష్యా వెళ్లాడు. రష్యా సైన్యానికి సహాయకారిగా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది.


దాదాపు వంద మంది భారతీయులను అక్రమంగా రష్యాకు తరలించినట్లు వార్తలు వస్తున్నాయి. రష్యా సైన్యానికి సహాయకారులుగా భారతీయ యువకులను ఏజంట్లు అక్రమంగా తరలిస్తున్నట్లు విదేశాంగ శాఖకు ఫిర్యాదులు అందాయి. దీనిపై కేంద్రం చర్యలకు ఉపక్రమించింది. ఏజంట్ల మాయమాటలు నమ్మవద్దని హెచ్చరించింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన కొందరు యువకులు కూడా ఏజంట్ల ద్వారా రష్యా వెళ్లినట్లు తెలుస్తోంది. దీనిపై విదేశాంగశాఖ అధికారులు, రష్యా రాయబారులతో సంప్రదింపులు ప్రారంభించారు.

google-add
google-add
google-add

క్రైమ్ న్యూస్

ఆధ్యాత్మికం

google-add
google-add
google-add

రాజకీయం

google-add
google-add