Friday, March 01, 2024

Logo
Loading...
google-add

అండర్ 19 క్రికెట్: ఐదోసారి ఫైనల్ కు భారత్,  సెమీఫైనల్ లో దక్షిణాఫ్రికాపై విజయం

T Ramesh | 10:34 AM, Wed Feb 07, 2024

అండర్ -19 వరల్డ్‌కప్  సెమీఫైనల్లో భారత్ విజయం సాధించి ఫైనల్ లోకి అడుగుపెట్టింది. రెండు వికెట్ల తేడాతో ఆతిథ్య జట్టు దక్షిణాఫ్రికాను ఓడించించి ఐదోసారి ఫైనల్ లోకి వెళ్ళింది.  దక్షిణాఫ్రికా విధించిన 245 పరుగుల లక్ష్యాన్ని 48.5 ఓవర్లలో 8 వికెట్ల నష్టపోయి ఛేదించింది.

దక్షిణాఫ్రికాలోని బెనోనీలో జరిగిన  సెమీఫైనల్-1 పోరులో  టాస్ గెలిచిన భారత కుర్రాళ్ళ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. ట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కొల్పోయి 244 పరుగులు చేసింది. 245 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు భారత్ తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. 32 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి  పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది.  

సచిన్ దాస్, కెప్టెన్ ఉదయ్ సహారన్ జోడీ నేర్పుగా ఆడి జట్టువిజయానికి బాటలు వేశారు. సచిన్ దాస్ 95 బంతుల్లో  96 పరుగులు చేయగా, కెప్టెన్ ఉదయ్ సహారన్ 81 పరుగులు చేశాడు. ఈ జోడి  ఐదో వికెట్ కు 171 పరుగులు జోడించి జట్టును ఆదుకున్నారు.

చివర్లో కూడా భారత్ వెంటవెంటనే వికెట్లు కోల్పోయింది. రాజ్ లింబానీ, 13 పరుగులు చేసి జట్టును గెలిపించాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో క్వెనా మఫాకా , ట్రిస్టాన్ లూస్ చెరో మూడు వికెట్లు తీశారు.  రెండో సెమీఫైనల్-2 పాకిస్తాన్, ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ లో విజేతతో భారత్ జట్టు ఫిబ్రవరి 11న ఫైనల్  ఆడనుంది.

google-add
google-add
google-add

ముఖ్యాంశాలు

Badi Baat

google-add

అంతర్జాతీయం

google-add
google-add

రాజకీయం

google-add
google-add