Sunday, April 28, 2024

Logo
Loading...
google-add

IPL 2024 Match3: KKR Vs SRH :కోల్‌కతా చేతిలో హైదరాబాద్ ఓటమి

T Ramesh | 11:16 AM, Sun Mar 24, 2024

ఐపీఎల్ 17వ సీజన్ లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మ్యాచ్ లో  సన్‌రైజర్స్ హైదరాబాద్ పై కోల్‌కతా నైట్ రైడర్స్ విజయం సాధించింది. సన్‌రైజర్స్‌పై కోల్‌కతా చివరి బంతికి విజయాన్ని అందుకుంది.

209 పరుగుల లక్ష్య ఛేదనలో సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 204 పరుగులు మాత్రమే చేయగలిగింది. 145 పరుగలకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన హైదరాబాద్ కు ఓటమి తప్పదని అందరూ భావించారు. కాన హెన్రిచ్ క్లాసెస్ వీరబాదుడుతో మ్యాచ్ హోరాహోరీగా సాగింది. 29 బంతుల్లో 63 పరుగులు సాధించాడు.  ఏకంగా 8 సిక్సర్లతో విధ్వంసం సృష్టించి స్కోర్ బోర్డును పరిగెత్తించాడు.

చివరి 2 ఓవర్లలో విజయానికి 39 పరుగులు అవసరమయ్యాయి.  19వ ఓవర్లో క్లాసెన్‌ 3 సిక్సర్లు, షాబాజ్‌ 1 సిక్స్‌ కొట్టడంతో 26 పరుగులు వచ్చాయి. దీంతో చివరి ఓవర్‌లో విజయానికి 13 పరుగులు అవసరం కాగా  క్లాసెన్ తొలి బంతికే సిక్స్‌ కొట్టాడు. 3వ బంతికి షాబాజ్‌ ఖాన్ ఔట్‌ కావడంతో మ్యాచ్‌ ఉత్కంఠ భరితంగా సాగింది.  

భారీ షాట్‌‌తో మ్యాచ్‌ను ముగించాలని ప్రయత్నించిన క్లాసెన్‌ 5వ బంతికి ఔట్ అయ్యాడు. చివరి బంతికి 5 పరుగులు అవసరం కాగా  హైదరాబద్ కెప్టెన్ పాట్ కమిన్స్‌ విఫలమయ్యాడు. దీంతో  కోల్‌కతా విజయం సాధించింది.

కోల్‌కతా బౌలర్లలో హర్షిత్‌ రాణా 3  వికెట్లు తీయగా, ఆండ్య్రూ రస్సెల్‌  రెండు, వరుణ్‌ చక్రవర్తి, సునీల్‌ నరైన్‌ చెరో వికెట్‌ తీశారు.

తొలుత కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 208 పరుగులు చేసింది. ఆ జట్టు స్టార్ బ్యాటర్ ఆండ్య్రూ రస్సెల్స్ 25 బంతుల్లో 64 పరుగులు బాదాడు. ఫిల్ సాల్ట్‌ (54), రమణ్‌దీప్‌ సింగ్‌ (35), రింకూ సింగ్‌ (23) తమ వంతు సహకారం అందించారు.

సన్‌రైజర్స్ హైదరాబాద్‌ బౌలర్లలో నటరాజన్‌ మూడు,  మార్కండే రెండు వికెట్లు తీయగా  పాట్ కమ్మిన్స్ ఒక వికెట్ పడగొట్టాడు.

google-add
google-add
google-add

ముఖ్యాంశాలు

Badi Baat

google-add

అంతర్జాతీయం

google-add
google-add