Thursday, April 18, 2024

Logo
Loading...
google-add

బీజేపీ ఎంపీ అభ్యర్థి మైసూరు మహారాజు ఆస్తులు ఎంతంటే?

K Venkateswara Rao | 10:49 AM, Tue Apr 02, 2024

మైసూర్ మహారాజు అనగానే వేల కోట్ల ఆస్తులుంటాయని అందరూ భావిస్తారు. కానీ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ మైసూరు ఎంపీ అభ్యర్థి, మహారాజ సంస్థానం వంశస్తుడైన యదువీర్ కృష్ణదత్త చామరాజ ఒడయార్ ఆస్తులు గురించి తెలుసుకుంటే నోరెళ్ల బెట్టాల్సిందే. యదువీర్ ఎంపీగా నామినేషన్ వేసే సమయంలో ఆయన ఆస్తులను వెల్లడించారు. ఆ వివరాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.



యదువీర్ వడయార్ ఆస్తులు రూ.5 కోట్లుగా ప్రకటించారు. ఇల్లు లేదని అఫిడవిట్‌లో చూపారు. తన ఆస్తి మొత్తం రూ.4.99 కోట్లుగా ఎన్నికల అధికారికి తెలియజేశారు.
యదువీర్ వడయార్ భార్య త్రిషిక ఆస్తి కూడా ప్రకటించారు. ఆమె వద్ద 75 వేల నగదు, బ్యాంకులో లక్ష నగదు నిల్వ, వంద గ్రాముల బంగారు ఆభరణాలు, 2 కేజీల బంగారం, పది కిలోల వెండి ఉందని ఆమె అఫిడవిట్లో చూపారు. త్రిషిక మొత్తం ఆస్తి విలువ రూ.1.04 కోట్లుగా ప్రకటించారు. యదువీర్ వడయార్ బ్యాంకు ఖాతాలో రూ.1.36 కోట్ల క్యాష్, 4 కిలోల బంగారం, 20 కిలోల వెండి ఆభరణాలు ఉన్నాయని ఎన్నికల అఫిడవిట్లో వెల్లడించారు.

google-add
google-add
google-add

ముఖ్యాంశాలు

Badi Baat

google-add

వీడియోలు

తేజస్‌లో మోదీ

P Phaneendra | 15:40 PM, Sat Nov 25, 2023
google-add
google-add

బ్లాగ్

google-add
google-add