Thursday, April 18, 2024

Logo
Loading...
google-add

శ్రీగిరిపై బ్రహ్మోత్సవ శోభ.. సాయంత్రం ధ్వజారోహణం

T Ramesh | 10:21 AM, Fri Mar 01, 2024

జ్యోతిర్లింగ క్షేత్రం, శక్తిపీఠమైన శ్రీశైల శ్రీగిరిపై మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. పండితులు, ఆలయ అధికారులు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఉదయం 8.10 గంటలకు యాగశాల ప్రవేశంతో బ్రహ్మోత్సవ క్రతువు నిర్వహించారు. సాయంత్రం సకల దేవతాహ్వాన పూర్వక ధ్వజారోహణం, ధ్వజపటావిష్కరణ నిర్వహించి అంకురార్పరణ చేస్తారు.

బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రతీరోజు భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామివారికి వాహన సేవలు నిర్వహించనున్నారు. రేపు (మార్చి2)న స్వామి అమ్మవార్లకు భృంగి వాహనసేవ నిర్వహిస్తారు. మహాశివరాత్రి నాడు జరిగే పాగాలంకరణను 11 వేల మంది భక్తులు చూసేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి.

బ్రహ్మోత్సవాల సందర్భంగా అటవీమార్గంలో రాత్రి సమయంలో కూడా వాహనాల రాకపోకలకు అనుమతించినట్లు అటవీఅధికారులు తెలిపారు. పెద్దదోర్నాల-శ్రీశైలం నల్లమల రహదారి పులుల అభయారణ్యం పరిధిలో ఉన్నందున  రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకూ అటవీమార్గంలో రాకపోకలు నిలిపివేస్తారు.   బ్రహ్మోత్సవాలు కావడంతో పాటు భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉండటంతో  నిబంధనను తాత్కాలికంగా సడలించారు. వాహనదారులు వన్యప్రాణులకు హాని చేయకుండా రాకపోకలు సాగించాలని అటవీఅధికారులు సూచించారు.

google-add
google-add
google-add

Badi Baat

లేటెస్ట్ అప్‌డేట్

google-add

వీడియోలు

తేజస్‌లో మోదీ

P Phaneendra | 15:40 PM, Sat Nov 25, 2023
google-add
google-add

బ్లాగ్

google-add
google-add