Thursday, April 18, 2024

Logo
Loading...
google-add

తెలుగు ప్రజలకు శుభవార్త: హైదరాబాద్ నుంచి అయోధ్యకు నేరుగా విమానాలు

P Phaneendra | 09:52 AM, Mon Apr 01, 2024

Hyderabad to Ayodhya Direct Flight Services

తెలుగు రాష్ట్రాల ప్రజలకు కేంద్ర విమానయాన శాఖ శుభవార్త చెప్పింది. జన్మభూమిలో నూతనంగా ప్రతిష్ఠితుడైన బాలరాముడి దర్శనం చేసుకోవాలనుకునే భక్తులకు ప్రయాణం మరింత సులభం కానుంది.

హైదరాబాద్ నుంచి అయోధ్యకు నేరుగా విమాన సేవలు అందుబాటులోకి వస్తున్నాయని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆదివారం తెలియజేసారు. విమాన సర్వీసు ప్రారంభించాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు ఫిబ్రవరి 26న లేఖ రాసినట్లు చెప్పారు. దానికి మంత్రి సానుకూలంగా స్పందించారని వివరించారు.

కేంద్రమంత్రి సింధియా.. వాణిజ్య విమానయాన సంస్థలతో మాట్లాడారని కిషన్ రెడ్డి తెలిపారు. ఏప్రిల్ 2 నుంచి వారానికి మూడు రోజుల పాటు, అంటే మంగళవారం, గురువారం, శనివారాల్లో విమాన సేవలు అందుబాటులోకి రానున్నాయని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు.

దీంతో అయోధ్య బాలరాముడి దర్శనం కోసం వేచి చూస్తున్న తెలుగు వారికి మరింత సౌకర్యవంతమైన ప్రయాణం చేసేలా కేంద్రం వెసులుబాటు కల్పించినట్లయింది.

google-add
google-add
google-add

ముఖ్యాంశాలు

Badi Baat

google-add

అంతర్జాతీయం

google-add
google-add

రాజకీయం

google-add
google-add