Sunday, April 14, 2024

Logo
Loading...
google-add

శ్రీరామనవమి ఊరేగింపుపై దాడి కేసు: 16 మంది అరెస్ట్

T Ramesh | 10:59 AM, Tue Feb 27, 2024

శ్రీరామనవమి వేడుక సందర్భంగా అలజడి సృష్టించేందుకు కుట్ర పన్ని, హిందువులపై దాడికి పాల్పడిన కేసులో 16 మందిని జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) అధికారులు అరెస్టు చేశారు. ఈ విషయాన్ని ఎన్ఐఏ వెల్లడించింది. గత ఏడాది శ్రీరామ నవమి ఊరేగింపు సందర్భంగా పలువురు దాడికి పాల్పడ్డారు. ఆ ఘటన పశ్చిమబెంగాల్ రాష్ట్రం ఉత్తర్ దినాజ్‌పూర్ జిల్లా దాల్‌ఖోలా లో చోటుచేసుకుంది.

NIA అరెస్టు చేసిన వారిలో  అఫ్రోజ్ ఆలమ్, అష్రాఫ్, ఇంతియాజ్ ఆలమ్, ఇర్ఫాన్ ఆలమ్, ఫరూఖ్ ఆలమ్, మహమ్మద్ పప్పూ, సులేమాన్, సర్జన్, నూరుల్ హూడా, వాసిమ్ ఆర్య, సలాహుద్దిన్, జన్నత్,  వాసిమ్ అక్రమ్, తన్వీర్ లు స్థానిక హిందువులపై దాడికి పాల్పడ్డారు. విచారణ అనంతరం నిందితులను అరెస్టు చేసినట్లు ఎన్ఐఏ తాజాగా విడుదల చేసిన ప్రకటనలో వివరించింది.

దాడి ఘటన అనంతరం స్వాధీనం చేసుకున్న వీడియో ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించినట్లు దర్యాప్తు అధికారులు తెలిపారు. విచారణ సందర్భంగా ఈ వీడియో ఫుటేజీని న్యాయస్థానానికి కూడా అందజేశారు. దాల్‌ఖోలా లో స్థానిక హిందువులు అంతా కలిసి శ్రీరామనవమి వేడుక జరుపుకున్న అనంతరం స్వామివారి ఊరేగింపు జరుపుతుండగా పలువురు గుంపుగా దాడికి పాల్పడ్డారు. 2023 మార్చి30న ఈ ఘటన  జరిగింది.

ఈ అల్లర్లపై  పశ్చిమ బెంగాల్ పోలీసులు, 162 మందిపై  కేసు నమోదు చేశారు. ఈ కేసును విచారించిన కలకత్తా హైకోర్టు, గత ఏడాది ఏప్రిల్ 27న జాతీయ దర్యాప్తు సంస్థకు(NIA) బదిలీ చేసింది. హైకోర్టు ఆదేశాలతో కేసు విచారణ చేపట్టిన ఎన్ఐఏ ఇదే తరహాకు చెందిన మరో ఆరు కేసులను కూడా విచారించింది.

పశ్చిమ బెంగాల్ రాష్ట్రం లో గత ఏడాది జరిగిన ఈ దారుణంలో ఓ వ్యక్తి ప్రాణాలు కొల్పోగా,  ఆరుగురు పోలీసులు గాయపడ్డారు. దాడి జరిగిన ప్రాంతంలో ముస్లింల జనాభా ఎక్కువ. గుండెపోటు కారణంగా వ్యక్తి చనిపోయాడని, అల్లర్లకు అతడి మరణానికి సంబంధ లేదని పోలీసులు అప్పట్లో తేల్చారు. హిందు పండుగలు, ఊరేగింపులే లక్ష్యంగా గత ఏడాది దేశవ్యాప్తంగా 29 భారీ దాడులు జరిగినట్లు పలు నివేదికల ద్వారా తెలుస్తోంది.

google-add
google-add
google-add

క్రైమ్ న్యూస్

ఆధ్యాత్మికం

google-add
google-add
google-add

రాజకీయం

google-add
google-add