Friday, May 9, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home రాజకీయం

Yuvagalam@200 Days : 200 రోజుల మైలురాయిని తాకిన లోకేశ్ యువగళం

param by param
May 11, 2024, 04:54 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

వేయి మైళ్ల ప్రయాణమైనా ఒక్క అడుగుతో మొదలవుతుందంటారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన పాదయాత్ర కూడా చిన్నగా మొదలై ప్రభంజనంలా మారింది. ఒక్కో చినుకు తోడై వరదలా మారినట్టు యువగళం, ప్రజాగళమైంది. లోకేశ్ పాదయాత్ర చేయలేడు, మధ్యలోనే ఆపేస్తాడని విమర్శించిన వారి నోళ్లు మూయించాడు. ఒక్కో అడుగు వేసుకుంటూ బడుగు బలహీన పేద వర్గాల కష్టాలను వింటూ, వారి కన్నీళ్లు తుడుస్తూ మీకు నేనున్నానంటూ సాగిన యువగళం పాదయాత్ర పోలవరం నియోజకవర్గంలో ప్రవేశించి, 200 రోజుల మైలు రాయిని చేరింది.

యువగళం సాగిందిలా…

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం గురువారం నాటికి 200 రోజుల మైలురాయిని చేరుకుంది. చిత్తూరు జిల్లా కుప్పం నుంచి ప్రారంభమైన యువగళం ప్రజాగళంగా మారి 77 నియోజకవర్గాల్లో, 2710 కిలోమీటర్లను పూర్తిచేసుకుంది. యువగళం పాదయాత్రలో 185 మండలాలు, 65 మున్సిపాలిటీలు, 1675 గ్రామాల మీదగా నారా లోకేశ్ యాత్ర చేశారు. రాయలసీమ జిల్లాల్లోనే 124 రోజులు, 44 నియోజకవర్గాల్లో 1587 కి.మీ పాదయాత్రను విజయవంతంగా పూర్తి చేశారు. 200 రోజుల్లో 64 ప్రాంతాల్లో భారీ బహిరంగ సభలు నిర్వహించారు. 132 చోట్ల ప్రజలతో మమేకం అవుతూ ముఖాముఖి కార్యక్రమాలు నిర్వహించారు. 8 రచ్చబండ కార్యక్రమాలు, 10 ప్రత్యేక కార్యక్రమాలు చేశారు. ప్రజల నుంచి 3813 వినతులు స్వీకరించారు. సగటున రోజుకు 12.5 కి.మీ పాదయాత్ర చేశారు.

ఏ జిల్లాలో ఎన్ని రోజులు

కుప్పంలో మొదలైన పాదయాత్ర ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 14 నియోజకవర్గాల్లో సాగింది. 45 రోజులు 577 కి.మీ పాదయాత్ర చేశారు. అక్కడ నుంచి నారా లోకేశ్ చేపట్టిన యువగళం అనంతపురంలో ప్రవేశించింది. జిల్లాలో 9 నియోజకవర్గాల్లో 23 రోజులు, 3030 కి.మీ పాదయాత్ర చేశారు. కర్నూలు జిల్లాలో 14 నియోజకవర్గాలు, 40 రోజులపాటు 507 కి.మీ నడిచారు. ఇక కడప జిల్లాలో 7 నియోజకవర్గాల్లో యాత్ర సాగింది. 16 రోజుల పాటు 200 కి.మీ పాదయాత్ర చేశారు. నెల్లూరు జిల్లాలో 10 నియోజకవర్గాల్లో పాదయాత్ర చేశారు. లోకేశ్ నెల్లూరు జిల్లాలో 31 రోజులు 459 కి.మీ పాదయాత్ర చేశారు. గుంటూరు జిల్లాలో 7 రోజులు,
కృష్ణాలో 8 రోజులు పాదయాత్ర చేసి పశ్చిమలో ప్రవేశించారు. గత నాలుగు రోజులుగా పశ్చిమగోదావరి జిల్లాలో 80 కి.మీ పాదయాత్ర పూర్తి చేసి పోలవరం నియోజకవర్గంలో ప్రవేశించారు.

ప్రజల అవసరాలే హామీలుగా…

సుదీర్ఘ పాదయాత్రలో ప్రజల కష్టాలు తెలుసుకుంటోన్న నారా లోకేష్, ప్రతి వంద కిలోమీటర్లకు ఒక హామీ ఇస్తున్నారు. ఆ హామీకి సంబంధించిన శిలా ఫలకాన్ని ఆవిష్కరిస్తున్నారు. ప్రజల అవసరాలే హామీలుగా మారుతున్నాయి. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో హామీలను అమలు చేస్తానని లోకేశ్ ప్రజలకు భరోసా కల్పించారు. పాదయాత్రలో హంద్రీనీవా రైతుల సమస్యలు, చింతలపూడి ఎత్తిపోతల, మిడతూరు, వరికశపూడిశెల ఎత్తిపోతల పథకాలు, గుండాల ప్రాజెక్టు, ఆక్వా రైతుల కష్టాలు, ఉద్యాన రైతుల సమస్యలు, చేనేతల ఇబ్బందులు తెలుసుకుని వారికి పలు హామీలిచ్చారు.

వృత్తుల వారీగా హామీలు

ఏ వృత్తి చేసే వారికి ఆయా సమస్యలుంటాయి. అవన్నీ ప్రజల నుంచి తెలుసుకుని వాటి పరిష్కారానికి లోకేశ్ హామీలిచ్చారు. కులాల వారీగా, వృత్తుల వారీగా ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా రైతులు, చేనేతలు, యువత, మహిళలు, దళితులు, ముస్లిం, బీసీ, గిరిజనుల సమస్యలను తెలుసుకున్నారు. భవన నిర్మాణ కార్మికులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వారి సమస్యల పరిష్కారానికి భరోసా కల్పించారు. ప్రజలు అడుగుతున్న సమస్యలను తాము అధికారంలోకి వచ్చాక ఎలా పరిష్కరిస్తామో లోకేశ్ వివరించే ప్రయత్నం చేశారు.

అమరావతి రాజధానికి భూములిచ్చిన రైతులకు భరోసా

తాము అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతి రాజధాని నిర్మాణం మొదలవుతుందని నారా లోకేశ్ భూములిచ్చిన రైతులకు భరోసా కల్పించారు. మొదటి వంద రోజుల్లోనే విశాఖకు ఐటీ పరిశ్రమలు తీసుకువస్తామని నిరుద్యోగులకు హామీ ఇచ్చారు. కడపలో రాయలసీమ డిక్లరేషన్ ప్రకటించారు. వెనుకబడిన కులాలైన బీసీలకు అండగా ఉండేందుకు రక్షణ చట్టం తెస్తామని హామీ ఇచ్చారు.

రైతులకు సాగునీరు, గిట్టుబాటు ధరలు, రాయితీ పరికరాలు, రుణాలపై వడ్డీ రాయితీ హామీ ఇచ్చారు. చేనేతను ఆదుకునేందుకు జీఎస్టీ రద్దు హామీ ఇచ్చారు. తన పాలనలో పూర్తి చేసిన ప్రాజెక్టులు, తెచ్చిన పరిశ్రమలు, యువతకు కల్పించిన ఉద్యోగాలను ప్రజలకు గుర్తుచేశారు. ప్రతి రోజూ తనను చూడాలని వచ్చిన లక్షలాది మందితో సెల్ఫీలు దిగారు. అదే సమయంలో ప్రభుత్వం వదిలేసిన ప్రాజెక్టుల వద్ద ఫోటోలు దిగి సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు.

సాగనిస్తే పాదయాత్ర, అడ్డుకుంటే దండయాత్రే…

టీడీపీ యువనేత నారా లోకేశ్ పాదయాత్ర మొదలైనప్పటి నుంచి అనేక అడ్డంకులు, గొడవలు సృష్టించారు. అధికార వైసీపీ నేతల అరాచకాలను అడ్డుకుంటూ లోకేశ్ ముందడుగు వేశారు. ఇప్పటికే లోకేశ్‌పై 23 కేసులు బనాయించారు. కొన్ని చోట్ల రాళ్లు రువ్వారు, కోడిగుడ్లు విసిరారు, ఫ్లెక్సీలు చింపారు, పాదయాత్రను అడ్డుకోవడానికి వైసీపీ నేతలు చేయని ప్రయత్నం లేదు. అయినా ఎక్కడా వెరవకుండా లోకేశ్ ముందుకు సాగి 200 రోజులు పూర్తి చేసుకున్నారు. లోకేశ్ పాదయాత్ర టీడీపీ బలోపేతానికి, ప్రజల కష్టాల పరిష్కారానికి ఉపయోగపడుతుందా? లేదా? అనే విషయాన్ని ఎన్నికల ఫలితాలు తేల్చనున్నాయి.

ShareTweetSendShare

Related News

ఉగ్రవాద శిబిరాలపై దాడులు : భారత్‌కు అండగా నిలిచిన పలు దేశాలు
general

ఉగ్రవాద శిబిరాలపై దాడులు : భారత్‌కు అండగా నిలిచిన పలు దేశాలు

ఆపరేషన్ సిందూర్ : అర్థరాత్రి పాక్ ఉగ్రశిబిరాలపై విరుచుకుపడ్డ భారత వాయుసేన
general

ఆపరేషన్ సిందూర్ : అర్థరాత్రి పాక్ ఉగ్రశిబిరాలపై విరుచుకుపడ్డ భారత వాయుసేన

ప్రధాని మోదీతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ భేటీ
general

ప్రధాని మోదీతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ భేటీ

వైసీపీ నేత వల్లభనేని వంశీకి అస్వస్థత
general

వైసీపీ నేత వల్లభనేని వంశీకి అస్వస్థత

మానవాళికి ఉగ్రవాదం అతిపెద్ద ముప్పు : ప్రధాని నరేంద్ర మోదీ
general

మానవాళికి ఉగ్రవాదం అతిపెద్ద ముప్పు : ప్రధాని నరేంద్ర మోదీ

Latest News

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

భారత్ పాక్ వ్యవహారాల్లో మేం జోక్యం చేసుకోం : అమెరికా

భారత్ పాక్ వ్యవహారాల్లో మేం జోక్యం చేసుకోం : అమెరికా

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.