Friday, May 9, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home ఆధ్యాత్మికం

VHP VJA Meet: ఉదయనిధిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విశ్వహిందూ పరిషత్ డిమాండ్

param by param
May 11, 2024, 05:06 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

తమిళనాడు రాష్ట్ర మంత్రి, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి
కుమారుడు అయిన ఉదయనిధి స్టాలిన్, సనాతన ధర్మాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేయడాన్ని
విశ్వహిందూ పరిషత్ తీవ్రంగా ఖండించింది. ఉదయనిధిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని
డిమాండ్ చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో మతమార్పిడులు పెద్దసంఖ్యలో జరుగుతున్నాయని
విశ్వహిందూ పరిషత్ ఆందోళన వ్యక్తం చేసింది. వాటిని అరికట్టడం కోసం
రాష్ట్రప్రభుత్వం తక్షణమే యాంటీ కన్వర్షన్ బిల్లు తీసుకురావాలని డిమాండ్ చేసింది.

విశ్వహిందూ పరిషత్ జాతీయ నాయకులు, సెంట్రల్
సెక్రెటరీ జనరల్ మిలింద్ పరాండే విజయవాడలో మంగళవారం నాడు మీడియాతో సమావేశమయ్యారు. సమీప
భవిష్యత్తులో సంస్థ చేయబోయే కార్యక్రమాల గురించి వివరించారు.

అయోధ్యలో రామమందిర నిర్మాణం పూర్తవుతోందని, 2024 సంక్రాంతి
పండుగ తర్వాత, అంటే జనవరి 16-24 మధ్య, మూలవిరాట్టుల ప్రతిష్టాపన మహోత్సవం
జరుగుతుందని మిలింద్‌జీ చెప్పారు. ప్రపంచంలోని హిందువులంతా గర్వించే విధంగా
ప్రతిష్టాపన కార్యక్రమం కన్నుల పండువగా జరుగుతుందని వివరించారు.

దేశ యువతలో దేశభక్తి, దైవభక్తి పెంపొందించడానికి
విశ్వహిందూ పరిషత్ దేశవ్యాప్తంగా బజరంగ్‌దళ్ శౌర్య జాగరణ యాత్ర చేపట్టనుంది. యువతను
వ్యసనాలకు లోనుకాకుండా ప్రేరణ కలిగించడం, స్వతంత్ర సమర పోరాటంలో అమర వీరుల
త్యాగాలను స్మరించుకోవడం, వారి శౌర్యాన్ని, ధైర్య స్థైర్యాలనూ అలవరచుకునేలా యువతను
ప్రోత్సహించడమే లక్ష్యంగా ఆ యాత్ర జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో 80శాతం గ్రామాలకు ఆ
యాత్ర చేరేలా యోజన రూపొందించినట్టు మిలింద్‌జీ చెప్పారు.

విశ్వహిందూ పరిషత్ సంస్థను స్థాపించి 60 సంవత్సరాలు
పూర్తవుతున్న సందర్భంగా దేశమంతటా షష్ట్యబ్ది మహోత్సవాలు నిర్వహిస్తామని మిలింద్‌జీ
చెప్పారు. ప్రస్తుతం 76వేలు ఉన్న కమిటీలను లక్షకు పెంచడం, 72లక్షల మంది సభ్యుల
సంఖ్యను కోటికి చేర్చడం, దేశవ్యాప్తంగా ఉన్న 4500 సేవా ప్రకల్పాల సంఖ్యను, 400
సేవాయుక్త జిల్లాల సంఖ్యను రెట్టింపు చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నారు.

వచ్చే దీపావళికి ముందు దేశవ్యాప్తంగా ధర్మాచార్య
యాత్రలు నిర్వహించనున్నట్లు మిలింద్‌జీ వెల్లడించారు. హిందూ జాగరణ, సమరసతా భావనను
సాధించడం, కుటుంబ ప్రబోధం, మత మార్పిడుల పట్ల జాగరణ కలిగించే ఉద్దేశంతో
ధర్మాచార్యులు ఈ యాత్రలు నిర్వహిస్తారు.

తిరుమల తిరుపతి దేవస్థానాల చైర్మన్‌గా
నాస్తికుడినని చెప్పుకునే క్రైస్తవ మతావలంబి భూమన కరుణాకర రెడ్డిని నియమించడం
ఇటీవలి కాలంలో రాష్ట్రంలో చర్చనీయాంశమైంది. అలాగే టీటీడీ ట్రస్ట్ బోర్డ్‌లో సభ్యుల
ఎంపిక కూడా వివాదాస్పదమైంది. ఆ నేపథ్యంలో ఆలయ కమిటీల నియామకాలపై విహెచ్‌పీ
స్పందించింది. ఆర్థిక కుంభకోణాల్లో ఉన్నవారిని, అవినీతి ఆరోపణలు ఉన్నవారిని,
నేరచరిత్ర కలిగిన వారిని కమిటీల్లో నియమించరాదని డిమాండ్ చేసింది. దైవమంటే
భక్తిభావం, సమాజమంటే శ్రద్ధాసక్తులు కలిగిన వారిని మాత్రమే కమిటీలలో నియమించాలని
విశ్వహిందూ పరిషత్ కోరింది.

భక్తుల భద్రత విషయంలో టీటీడీ సమర్ధమైన చర్యలు
తీసుకోవాలని పరిషత్ కోరింది. భక్తుల దర్శనాలకు ఆటంకం కలిగించకుండా, లేదా దర్శనాలను
నిలువరించకుండా వారికి భద్రత కల్పించే విధంగా టీటీడీ సరైన నిర్ణయాలు తీసుకోవాలని
విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేసింది.

ఇక హిందూ దేవాలయాల విషయంలో అతి ప్రధానమైన నిర్వహణ
అంశం గురించి కూడా విశ్వహిందూ పరిషత్ స్పందించింది. దేవాలయాలకు పూర్తిస్థాయిలో స్వయంప్రతిపత్తి
కలిగించాలని, వాటి నిర్వహణ బాధ్యతలను పూర్తిగా హిందువులకు అప్పగించాలని డిమాండ్
చేసింది. అంతవరకూ దేవాలయాల ఆస్తులు, ఆదాయాలను కేవలం హిందువుల కోసం, హిందూ ధర్మ
ప్రచారం కోసమే ఖర్చు పెట్టాలని కోరింది. దేవాలయ ఉద్యోగాలు, దేవాలయాల్లో దుకాణాల
నిర్వహణ బాధ్యతలు హిందువులకు మాత్రమే కేటాయించాలని విశ్వహిందూ పరిషత్ డిమాండ్
చేసింది.

ఈ కార్యక్రమంలో
విశ్వహిందూ పరిషత్ ఆంధ్రప్రదేశ్ నేతలు వై. రాఘవులు, వి, శ్రీవెంకటేశ్వర్లు, టి,ఎస్
రవికుమార్, దుర్గాప్రసాద్ రాజు, సుబ్బరాజు, సానా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
 
ShareTweetSendShare

Related News

ఉగ్రవాద శిబిరాలపై దాడులు : భారత్‌కు అండగా నిలిచిన పలు దేశాలు
general

ఉగ్రవాద శిబిరాలపై దాడులు : భారత్‌కు అండగా నిలిచిన పలు దేశాలు

ఆపరేషన్ సిందూర్ : అర్థరాత్రి పాక్ ఉగ్రశిబిరాలపై విరుచుకుపడ్డ భారత వాయుసేన
general

ఆపరేషన్ సిందూర్ : అర్థరాత్రి పాక్ ఉగ్రశిబిరాలపై విరుచుకుపడ్డ భారత వాయుసేన

ప్రధాని మోదీతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ భేటీ
general

ప్రధాని మోదీతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ భేటీ

వైసీపీ నేత వల్లభనేని వంశీకి అస్వస్థత
general

వైసీపీ నేత వల్లభనేని వంశీకి అస్వస్థత

మానవాళికి ఉగ్రవాదం అతిపెద్ద ముప్పు : ప్రధాని నరేంద్ర మోదీ
general

మానవాళికి ఉగ్రవాదం అతిపెద్ద ముప్పు : ప్రధాని నరేంద్ర మోదీ

Latest News

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

భారత్ పాక్ వ్యవహారాల్లో మేం జోక్యం చేసుకోం : అమెరికా

భారత్ పాక్ వ్యవహారాల్లో మేం జోక్యం చేసుకోం : అమెరికా

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.