ప్రముఖ రచయితలకు ఏటా ఇచ్చే బుకర్ ప్రైజ్(booker prize) ఈ ఏడాది ఐర్లాండ్ రచయిత పాల్ లించ్‌ను వరించింది. ఆయన రాసిన నవల ప్రాఫెట్ సాంగ్‌కు ఈ గౌరవం దక్కింది. ఐర్లాండ్ నిరంకుశత్వంలోకి జారిపోతోన్న వేళ, రహస్య పోలీసుల బారి నుంచి తప్పించుకునేందుకు ఓ కుటుంబం పడిన కష్టాలు, బాధలు ఈ పుస్తకంలో పాల్ లించ్ ప్రముఖంగా వివరించారు.
బుకర్ మెక్ కాన్నెల్ 1968లో బుకర్ ప్రైజ్ నెలకొల్పారు. ఐర్లాండ్, కామన్వెల్త్ దేశాల నుంచి ఆంగ్ల భాషా రచయితలకు ఈ అవార్డును అందిస్తుంటారు. 2013 నుంచి ప్రపంచ వ్యాప్తంగా ఆంగ్ల భాషా రచయితలకు ఈ బహుమతిని అందిస్తున్నారు. 1984లో మిడ్ నైట్ చిల్డ్రన్ రచయిత సల్మాన్ రష్డీకి ఈ అవార్డు దక్కింది. సల్మాన్ రష్డీ రచించిన మిడ్ నైట్ చిల్డ్రన్ పుస్తకానికి బుకర్ ప్రైజ్ ప్రకటించడం అప్పట్లో వివాదాస్పదమైంది.