Thursday, April 18, 2024

Logo
Loading...
google-add

ఉజ్జయినిలో వేదగడియారం: గ్రహాల స్థితిగతులు, ముహూర్తం ప్రదర్శన

T Ramesh | 12:07 PM, Fri Mar 01, 2024

మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో ‘విక్రమాదిత్య వేద గడియారం’ ఏర్పాటు చేశారు. పురాతన భారతీయ సంప్రదాయ పంచాంగాన్ని అనుసరించి సమయాన్ని ఈ గడియారం ప్రదర్శిస్తుంది. జంతర్‌మంతర్ ప్రాంతంలో 85 అడుగుల ఎత్తున్న టవర్‌పై ఈ గడియారాన్ని ఏర్పాటు చేశారు. గ్రహాల స్థితిగతులు, ముహూర్తం, జ్యోతిష గణనలు స్క్రీన్ పై చూపటం ఈ గడియారం ప్రత్యేకత.

భారత ప్రామాణిక కాలం (IST), జీఎంటీ (GMT)లను కూడా సూచిస్తుంది. సంవత్సరం, నెల, చంద్రుడి స్థానం, శుభ సమయం, నక్షత్రం, సూర్య, చంద్ర గ్రహణాల వివరాలు కూడా ఈ గడియారం ద్వారా తెలుసుకోవచ్చు. సూర్యోదయం నుంచి మరుసటి రోజు సూర్యోదయం ఆధారంగా సమయాన్ని లెక్కిస్తారు.

భారతీయ కాల గణన విధానం అత్యంత సూక్ష్మమైనది కావడంతో పాటు,  దోషరహితమైనదని టవర్ నిర్వాహకులు తెలిపారు. పురాతన భారతీయ కాల గణన సంప్రదాయాన్ని ఈ వేద గడియారం ద్వారా పునరుద్ధరించే ప్రయత్నం చేస్తున్నామన్నారు.

google-add
google-add
google-add

క్రైమ్ న్యూస్

ఆధ్యాత్మికం

google-add
google-add
google-add

రాజకీయం

google-add
google-add